మనుషుల విపరీత ధోరణులు, వికారాలు ఎంత హేయంగా వుంటాయనే దానికి నిదర్శనం యాహూ ఉద్యోగి మాజీ ఇంజనీర్ రీస్ డేనియల్ రూయిజ్ (34). లైంగిక ఫోటోలు, వీడియోల కోసం ఏకంగా 6,000 ఖాతాలను హ్యాక్ చేశాడు. అదీ తనకు తెలిసిన మహిళలు, తన తోటి మహిళా ఉద్యోగుల ఖాతాలనుంచే వీటిని చోరీ చేశాడు.
ఎన్‌గాడ్జెట్ అందించిన కథనం ప్రకారం సంస్థలోని అంతర్గత నెట్‌వర్క్‌కు తన కున్న యాక్సెస్‌ను ఉపయోగించుకొని ఈ దురాగతానికి పాల్పడ్డాడు. తద్వారా వేలాది వినియోగదారుల పాస్‌వర్డ్స్‌ను హ్యాక్ చేశాడు. వారి ఖాతాల్లోని వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను తన పర్సనల్ హార్డ్ డ్రైవ్‌కు డౌన్‌లోడ్ చేశాడు.ప్రధానంగా మహిళలు,చిన్నపిల్లల సోషల్ మీడియా ఖాతాలే అతడి టార్గెట్. అంతేకాదు వీరిలో తన స్నేహితులు, మహిళా సహోద్యోగులు కూడా ఉన్నారని స్వయంగా రూయిజ్ వెల్లడించాడు. థర్డ్ పార్టీ సైట్స్ ద్వారా యాపిల్ ఐక్లౌడ్, ఫేస్‌బుక్, జీమెయిల్, డ్రాప్‌బాక్స్ తదితర ఖాతాల పాస్‌వర్డ్ రీసెట్ చేసి, తనకు కావాల్సిన డాటాను చోరీ చేసేవాడు. తాజాగా రూయిజ్ తన నేరాన్ని అంగింకరించాడు. ఇందుకు రూయిజ్ ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment