వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో.. ఇన్ఫోసిస్ (Infosys) మాజీ ఉద్యోగి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇందులో ఇన్ఫోసిస్ కంపెనీకి, ఇతర పెద్ద టెక్ సంస్థలకు.. పని సంస్కృతిలో, ఇతర విషయాలలో ఉన్న తేడాను వివరించారు. ఐటీ కార్పొరేట్ సంస్కృతి నిలువు దోపిడీ అంటూ అభివర్ణించాడు.
న్యాయమైన పరిహారం అందేలా, కార్మిక విధానాలను సంస్కరించాలని చెబుతూ.. నా 9 సంవత్సరాల అనుభవం అనే శీర్షికతో, తన వ్యక్తిగత ప్రయాణంలో ముఖ్యమైన విషయాలను షేర్ చేశారు.
నేను 2008లో ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్‌గా నా ప్రయాణాన్ని ప్రారంభించాను. 2017లో సంస్థను విడిచి మరో కంపెనీలో చేరాను. ఇన్ఫోసిస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నా జీతం రూ. 35,000 మాత్రమే. నేను ఇప్పుడు రూ. 1.7 లక్షలు సంపాదిస్తున్నాను. అంటే ఇన్ఫోసిస్ జీతానికి 400 శాతం ఎక్కువని చెప్పాడు.
ఇన్ఫోసిస్‌లో.. ఉద్యోగి రవాణా కోసం నెలకు రూ. 3,200 చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుత కంపెనీలో అది పూర్తిగా ఉచితం. అంతే కాకుండా నేను ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో వెహికల్ పార్కింగ్ ఉచితం. అయితే ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల నుంచి వారి వాహనాల పార్కింగ్ కోసం కూడా డబ్బు వసూలు చేసిందని ఆయన ఆరోపించాడు.
ప్రస్తుతం నేను పనిచేస్తున్న కంపెనీలో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ధర రూ. 15 నుంచి రూ. 20 మాత్రమే. కానీ ఇన్ఫోసిస్‌లో దీని విలువ రూ. 40.
ఇన్ఫోసిస్ పురోగతి వ్యవస్థను అనుసరించింది. ఇందులో ఉద్యోగులకు పదోన్నట్లు ఉంటాయి. కానీ జీతాల పెరుగుదల లేదా బాధ్యతలలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుత సంస్థలో పదోన్నతులతో పాటు ఉద్యోగులకు నిజమైన బాధ్యతలను అందిస్తూ.. 15-25 శాతం జీతాల పెరుగుదల అందిస్తుంది.
ఇన్ఫోసిస్‌లో 9 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా.. నేను సింగిల్ డిజిట్ వార్షిక పెంపుదల (Single-Digit Salary Hikes) అందుకున్నాను. ఈ కారణంగా నా జీతం రూ. 35000 వద్దనే ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తుంటే.. చాలా సమయం వృధా చేసినట్లు అర్థమవుతుందని అన్నాడు.
ఇదీ చదవండి: మొన్న టీసీఎస్.. నేడు విప్రో: ఫ్రెషర్లకు పండగే..
ఇన్ఫోసిస్.. ఉద్యోగుల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు. కానీ తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాల గురించి తరచుగా మాట్లాడుతుందని ఆయన ఆరోపించారు. ఉద్యోగి శ్రామికశక్తికి మెరుగైన జీతాలు, సంక్షేమం ద్వారా ఉదారతను చూపించాలని వాదించాడు. ఉద్యోగ భద్రత అనేది ఒక అపోహ మాత్రమే. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ భద్రత (Job Security) ఎక్కువగా ఉందని ఆయన నొక్కి చెప్పారు.
Infosys - My 9 years experience of 'unchained' slavery
byu/GoatTop607 inbangalore
Comments
Please login to add a commentAdd a comment