'యాహూ' కవలలు పుట్టేశారోచ్... | Yahoo Inc Chief Executive Marissa Mayer gave birth to identical twin girls early on Thursday | Sakshi
Sakshi News home page

'యాహూ' కవలలు పుట్టేశారోచ్...

Published Fri, Dec 11 2015 10:56 AM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM

'యాహూ' కవలలు పుట్టేశారోచ్...

'యాహూ' కవలలు పుట్టేశారోచ్...

కాలిఫోర్నియా: నిన్న ఫేస్బుస్ సీఈవో...తాజాగా యాహూ మహిళా సీఈవో మరిస్సా మేయర్ కూడా మాతృత్వపు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మరిస్సా ఈసారి డబుల్ ప్రమోషన్ కొట్టేశారు. గురువారం ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె టుంబర్ల్లో వెల్లడించారు.  కుటుంబ సభ్యులతో పాటు, తనకు సహకరించినవారికి ధన్యవాదాలు అంటూ మరిస్సా ఈ సందర్భంగా ఆమె ట్విట్ చేశారు. మరోవైపు మరిస్సా  భర్త బోగ్ 'డూయింగ్ గ్రేట్' అంటూ ట్విట్ చేయగా, కుటుంబమంతా థ్రిల్లింగ్ లో మునిగితేలుతోంది.


కాగా మరిస్సా మేయర్ జూలై 2012 లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా యాహూ చేరిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆమెకు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.  ఫైనాన్షియర్  బోగ్ వివాహం చేసుకున్న ఆమె 2012లో తొలిసారి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా 16 వారాలు ఉద్యోగానికి మెటర్నటీ లీవు పెట్టిన ఆమె కేవలం నాలుగు వారాలకే ఉద్యోగానికి వెళ్లిపోయారు.

 

అయితే ఈసారి కూడా మరిస్సా కేవలం రెండు వారాలు మాత్రమే మెటర్నిటీ సెలవు తీసుకున్నారు. కాగా చైనీస్ కామర్స్ దిగ్గజం ఆలీబాబా కంపెనీ నుంచి యాహూ తన పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని బుధవారం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్  తన ముద్దుల కూతురు కోసం రెండు నెలల పెటర్నిటీ లీవ్ తీసుకున్న విషయం తెలిసిందే

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement