Marissa Mayer
-
యాహూ సీఈవో మరిస్సా బోనస్ కట్
శాన్ ఫ్రాన్సిస్కో: హ్యాకింగ్ ఉదంతం నేపథ్యంలో ఇంటర్నెట్ దిగ్గజం యాహూ సీఈవో మరిస్సా మేయర్ వార్షిక బోనస్‌కు కోతపడింది. సంస్థ జనరల్ కౌన్సిల్ రోనాల్డ్ బెల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన హయాంలో హ్యాకింగ్ ఉదంతం చోటుచేసుకున్నందున ఈ ఏడాది తన వార్షిక బోనస్, వార్షిక ఈక్విటీ గ్రాంట్లను వదులుకునేందుకు తాను అంగీకరించినట్లు మరిస్సా స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియచేశారు. తనకు రావాల్సిన బోనస్‌ను కష్టపడి పనిచేసే మిగతా ఉద్యోగులకు పంచాలని కంపెనీని కోరినట్లు ఆమె వివరించారు. 2014లో యూజర్ల ఖాతాల హ్యాకింగ్ జరిగినప్పుడు తమ సెక్యూరిటీ బృందానికి అంతా తెలుసంటూ స్వతంత్ర కమిటీ నిర్ధారించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు యాహూ తెలిపింది. అయితే ఉదంతం తర్వాత భద్రతపరమైన చర్యలు అదనంగా అనేకం తీసుకున్నప్పటికీ.. కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ వ్యవహారంపై సరిగ్గా విచారణ జరిపినట్లు కనిపించలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
యాహూ పేరు మారుతోంది.. కొత్త పేరేమిటంటే!
-
యాహూ పేరు మారుతోంది.. కొత్త పేరేమిటంటే!
ఇంటర్నెట దిగ్గజ సంస్థగా పేరొందిన యాహూ ఇంక్ తన పేరును మార్చుకోబోతున్నట్టు సోమవారం ప్రకటించింది. కొత్త పేరుగా ఆల్టబా ఇంక్గా నామకరణం చేయనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా వెరిజోన్ కమ్యూనికేషన్ ఇంక్‌తో కుదుర్చుకున్న డీల్ ముగిసిన అనంతరం కంపెనీ బోర్డు నుంచి యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెరిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నట్టు వెల్లడించింది. యాహూ తన కోర్ ఇంటర్నెట్ బిజినెస్‌లు డిజిటల్ అడ్వర్టైజింగ్, మీడియా ఆస్తులు, ఈమెయిల్ వంటి వాటిని ప్రముఖ వైర్లెస్ దిగ్గజం వెరిజోన్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే. 4.83 బిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ.32,491.41 కోట్లకు యాహు ఇంటర్నెట్ ఆస్తులను వెరిజోన్ కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ డీల్ సమయంలోనే యాహూ సీఈవో మెరిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తాను మాత్రం కంపెనీలోనే ఉండదలుచుకున్నట్టు పేర్కొన్నారు. కానీ డీల్ ముగిసిన అనంతరం ఆమె రాజీనామా చేయనున్నట్టు యాహూ సంస్థనే సోమవారం తెలిపింది. వెరిజోన్, యాహూతో ఈ డీల్ కుదుర్చుకున్న తర్వాత ఆ కంపెనీలో రెండుసార్లు అతిభారీ మొత్తంలో డేటా చోరి జరిగినట్టు వెల్లడైంది. మొదటిసారి 500 మిలియన్ కస్టమర్ అకౌంట్లు, రెండోసారి 100 కోట్లకు పైగా అకౌంట్లు చోరికి గురైనట్టు తెలిసింది. దీంతో వెరిజోన్ యాహూతో కుదుర్చుకున్న డీల్‌లో మార్పులు చేయనున్నట్టు లేదా ఆ లావాదేవీలను ఆపివేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే యాహూతో తాము బలమైన వ్యూహాత్మక సంబంధాలు కలిగి ఉంచుకోవడానికే చూస్తున్నామని, డేటా ఉల్లంఘనల గురించి ప్రస్తుతం యాహూ విచారణ చేపట్టిందని వెరిజోన్ ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. ఈ డీల్ పూర్తయిన అనంతరం ఐదుగురు యాహూ డైరెక్టర్లు రాజీనామా చేయనున్నట్టు కూడా యాహూ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మిగతా డైరెక్టర్లు అల్టాబాను పాలించనున్నారని, కొత్త కంపెనీ బోర్డు చైర్మన్‌గా ఎరిక్ బ్రాండ్ట్ నియమించామని యాహు వెల్లడించింది. -
'యాహూ' కవలలు పుట్టేశారోచ్...
కాలిఫోర్నియా: నిన్న ఫేస్బుస్ సీఈవో...తాజాగా యాహూ మహిళా సీఈవో మరిస్సా మేయర్ కూడా మాతృత్వపు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మరిస్సా ఈసారి డబుల్ ప్రమోషన్ కొట్టేశారు. గురువారం ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె టుంబర్ల్లో వెల్లడించారు. కుటుంబ సభ్యులతో పాటు, తనకు సహకరించినవారికి ధన్యవాదాలు అంటూ మరిస్సా ఈ సందర్భంగా ఆమె ట్విట్ చేశారు. మరోవైపు మరిస్సా భర్త బోగ్ 'డూయింగ్ గ్రేట్' అంటూ ట్విట్ చేయగా, కుటుంబమంతా థ్రిల్లింగ్ లో మునిగితేలుతోంది. కాగా మరిస్సా మేయర్ జూలై 2012 లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా యాహూ చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఫైనాన్షియర్ బోగ్ వివాహం చేసుకున్న ఆమె 2012లో తొలిసారి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 16 వారాలు ఉద్యోగానికి మెటర్నటీ లీవు పెట్టిన ఆమె కేవలం నాలుగు వారాలకే ఉద్యోగానికి వెళ్లిపోయారు. అయితే ఈసారి కూడా మరిస్సా కేవలం రెండు వారాలు మాత్రమే మెటర్నిటీ సెలవు తీసుకున్నారు. కాగా చైనీస్ కామర్స్ దిగ్గజం ఆలీబాబా కంపెనీ నుంచి యాహూ తన పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని బుధవారం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తన ముద్దుల కూతురు కోసం రెండు నెలల పెటర్నిటీ లీవ్ తీసుకున్న విషయం తెలిసిందే