Twin girls
-
Stolen children: పొత్తిళ్లలో విడిపోయి 19 ఏళ్లకు కలిశారు
కన్న తల్లి ఒడిలో పెరిగి జంటగా ఆడుకోవాల్సిన కవల అమ్మాయిలు వీరు. కానీ విధి వారితో వింత నాటకం ఆడింది. ఆస్పత్రుల్లో పుట్టిన పసికందులను దొంగలించి పిల్లల్లేని జంటలకు అమ్మేసే ముఠా బారిన పడి కన్నతల్లి ప్రేమకు దూరమయ్యారు. ఎందరో చిన్నారులను మొబైల్‌ఫోన్‌కు అతుక్కుపోయేలా చేసే టిక్‌టాక్ వీడియో ఒకటి వీరిద్దరినీ మళ్లీ కలిపింది. అందుకు ఏకంగా 19 సంవత్సరాల సమయం పట్టింది. అచ్చం తనలా ఉన్న అమ్మాయిని చూసి ఎవరీమె? ఎందుకు నాలాగే ఉంది? అంటూ ఒకరిని వేధించిన ప్రశ్నలు చివరకు తన కవల సోదరి చెంతకు చేర్చాయి. ఈ గాథ ఐరోపాలోని జార్జియాలో జరిగింది... ఈ కథ 2002 ఏడాదిలో జార్జియాలోని కీర్ట్స్కీ ప్రసూతి ఆస్పత్రిలో మొదలైంది. గోచా ఘకారియా దంపతులకు కవల అమ్మాయిలు పుట్టారు. వెంటనే తల్లి అజా షోనీకి తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లింది. తను చనిపోతే పసికందులను పెంచడం తన వల్ల కాదని గోచా భావించాడు. ఇదే అదనుగా అక్కడున్న పిల్లల్ని దొంగలించే ముఠా అతనికి డబ్బులు ఎరవేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయింది. అచ్చం తనలా ఉండటంతో అవాక్కై.. పిల్లలను ఆ దొంగల ముఠా వేర్వేరు ప్రాంతాల్లోని వేర్వేరు కుటుంబాలకు పెద్ద మొత్తాలకు అమ్మేసింది. పెంపుడు తల్లిదండ్రులు ఆ చిన్నారులకు అమీ ఖవీటియా, అనో సర్టానియా అని పేర్లు పెట్టారు. చూస్తుండగానే పుష్కరకాలం గడిచిపోయింది. 12 వయసు ఉన్నపుడు అమీ 2014 సంవత్సరంలో ఓ రోజు టీవీలో తనకిష్టమైన ప్రోగ్రాంలో అచ్చం తనలా ఉన్న ఓ 12 ఏళ్ల అమ్మాయి డ్యాన్స్ చేయడం చూసి అవాక్కైంది. కలిపిన టిక్‌టాక్ అమీకి కూడా డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్ నేర్చుకుంది. ఏడేళ్ల తర్వాత అమీ ఒక టిక్‌టాక్ వీడియో తీసి అప్లోడ్ చేసింది. అది తెగ వైరల్ అయింది. దానిని అమీ సొంతూరుకు 320 కిలోమీటర్ల దూరంలోని టిబిలిసీ నగరంలోని కవల సోదరి అనో సర్టానియా స్నేహితురాలు చూసింది. ఆ వీడియో సర్టానియోది అనుకుని భ్రమపడింది. సర్టానియోకు షేర్ చేసి విషయం కనుక్కోమని చెప్పింది. తనలాగా ఉన్న అమీ వీడియో చూసి సర్టానియోకు అనుమానం వచ్చింది. ఈమె నాకు బంధువు అవుతుందా? అసలు ఈ టీనేజర్ ఎవరు? అంటూ తను చదువుకునే విశ్వవిద్యాలయం వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులుపెట్టేది. ఈ గ్రూప్‌లో అమీకి తెల్సిన వ్యక్తి ద్వారా ఒకరి ఫోన్ నంబర్ ఒకరికి అందింది. అందజేశారు. దీంతో అమీ, అనో మొట్టమొదటిసారిగా మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకోవడం మొదలైంది. ఎన్నెన్నో పోలికలు వేర్వేరు కుటుంబ వాతావరణాల్లో పెరిగినా ఇద్దరి అభిరుచులూ ఒకటే. డ్యాన్స్ ఇష్టం. హెయిర్ స్టైల్ ఒక్కటే. ఇద్దరికీ ఒకే జన్యు సంబంధమైన వ్యాధి ఉంది. సరి్టఫికెట్లలో పుట్టిన తేదీ కూడా చిన్న తేడాతో దాదాపు ఒకేలా చూపిస్తోంది. ఒకే వయసు ఉన్నారు. సరి్టఫికెట్లలో ఆస్పత్రి పేరు కూడా ఒక్కటే. ఇన్ని కలవడంతో తాము కవలలమేమో అని అనుమానం బలపడింది. కానీ ఇరు కుటుంబాల్లో ‘నువ్వు మా బిడ్డవే’ అని చెప్పారుగానీ కొనుక్కున్నాం అనే నిజం బయటపెట్టలేదు. వీళ్ల మొండిపట్టు చూసి నిజం చెప్పేశారు. కానీ వీళ్లు కవలలు అనే విషయం వారికి కూడా తెలీదు. ఎందుకంటే వీరికి అమ్మిన ముఠా సభ్యులు వేర్వేరు. దీంతో తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేది మిస్టరీగా ఉండిపోయింది. పెంచలేక వదిలేశారని అనో ఆగ్రహంతో రగిలిపోయింది. కన్న వారిని ఎలాగైనా కనిపెట్టాలని అమీ మాత్రం పలు వెబ్సైట్లు, గ్రూప్‌లలో అన్వేషణ ఉధృతం చేసింది. ఇందుకోసం సొంతంగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించింది. మూడో తోబుట్టువు! ఆ నోటా ఈనోట విన్న ఒక టీనేజర్.. అమీకి ఫోన్ చేసింది. తన తల్లి 2002లో ఒక మెటరి్నటీ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచి్చందని, వారు పుట్టగానే చనిపోయారని తల్లి ఓసారి తనతో చెప్పిందని అమీకి వివరించింది. వెంటనే అమీ అక్కడికి వెళ్లి ఆ టీనేజర్, ఆమె కన్నతల్లి డీఎన్ఏ టెస్ట్‌లు చేయించింది. అవి తమ డీఎన్ఏలతో సరిపోలాయి. అలా ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులో లీపెగ్ నగరంలో కవలలు కన్నతల్లిని కలిసి తనివి తీరా కౌగిలించుకున్నారు. దాంతో ఆమెకు నోట మాట రాలేదు. కోమా నుంచి కోలుకున్నాక మీరు చనిపోయారని భర్త చెప్పాడని కన్నీరుమున్నీరైంది. ఈ మొత్తం ఉదంతం తాజాగా వెలుగు చూసింది. లక్షల శిశు విక్రయాలు ట్యాక్సీ డ్రైవర్లు మొదలు ఆస్పత్రి సిబ్బంది, అవినీతి అధికారులదాకా ఎందరో ఇలా జార్జియాలో పెద్ద వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి లక్షల మంది పసికందులను ఆస్పత్రుల్లో మాయం చేశారని అక్కడి మీడియాలో సంచలనాత్మక కథనాలు వెల్లడయ్యాయి. దీనిపై ప్రస్తుతం జార్జియా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎయిమ్స్ వైద్యుల ఘనత
న్యూఢిల్లీ : నడుము భాగంలో అతుక్కొని పుట్టిన అవిభక్త కవల పిల్లలను దాదాపు 24 గంటల శస్త్రచికిత్స అనంతరం ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా వేరుచేశారు. 64 మంది వైద్య సిబ్బంది పాల్గొన్న ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాకు చెందిన ఈ కవల పిల్లలు దాదాపు రెండు నెలల వయసున్నప్పటి నుంచి వీరు ఎయిమ్స్ పీడియాట్రిక్స్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మిను బాజ్‌పాయ్ నేతృత్వంలోని వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ప్రస్తుతం ఈ చిన్నారుల వయసు రెండు సంవత్సరాలు. దీంతో శస్త్రచికిత్సకు శరీరం అనుకూలంగా ఉండటంతో ఆపరేషన్‌ను ప్రారంభించారు. వైద్యరంగంలో ఇలాంటి కేసు చాలా అరుదని కవలల దిగువ శరీర భాగాలు అతుక్కొని ఉండటమే కాక ఇద్దరి గుండెలో రంధ్రం ఉండటంతో సమస్య మరింత కఠినం అయిందని, అయిన్పప్పటికీ దాదాపు 24 గంటల సుధీర్ఘ ఆపరేషన్‌తో ఇద్దరిని విజయవంతంగా వేరు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. (ఐదు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్) "ఇద్దరి శిశువుల వెన్నముక, దగ్గర తగినంత చర్మం లేకపోవడంతో గుండె, ప్రధాన రక్తనాళాలకి సరిగ్గా రక్త ప్రసరణ జరగలేదు. దీంతో ఆపరేషన్ సమయంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. చాలా డీప్‌గా కేసు స్టడీ చేశాక ఈ కేసులో క్లిష్టమైన అంశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. దీంతో ఆపరేషన్ కోసం చాలా మంది ప్రముఖులతో సమావేశం అయ్యి వారి సలహాలు, సూచనలు తీసుకున్నాం "అని ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ వైద్యుడు వెల్లడించారు. అనస్థీషియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సి.టి.వి.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియోడయాగ్నోసిస్, న్యూరోఫిజియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ఓ జట్టులా ఏర్పడి 24 గంటలపాటు సుధీర్ఘంగా కష్టపడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలిపారు. కరోనా సమయంలోనూ ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రణదీప్ గులేరియా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారని, ఆపరేషన్‌ను విజయవంతం కావడం పట్ల కవల పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. (మాల్స్‌లో విదేశీ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్) -
‘పది’లో 10/10
సాధించిన కవలలు సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ లోటస్‌లాప్ పాఠశాలలో చదివే కవల బాలికలు బుధవారం విడుదల చేసిన ఎస్ఎస్సీ ఫలితాల్లో 10/10 గ్రేడ్ మార్కులు సాధించారు. శాంతినగర్‌లో నివసించే సామాజిక కార్యకర్త పూజారి శ్రీనివాస్, కిరణ్‌జ్యోతి దంపతులకు కవల పిల్లలైన సాత్విక, సంహితలు పది పరీక్ష ఫలితాల్లో ఇద్దరు 10/10 మార్కులు సాధించి ఎవరూ తక్కువ కాదు అని నిరూపించుకున్నారు. ఈ మేరకు స్కూల్ కరస్పాండెంట్ కె.గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపల్ వారికి అభినందనలు తెలిపారు. ఇద్దరు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నట్లు తండ్రి శ్రీనివాసులు ‘సాక్షి’కి తెలిపారు. -
'యాహూ' కవలలు పుట్టేశారోచ్...
కాలిఫోర్నియా: నిన్న ఫేస్బుస్ సీఈవో...తాజాగా యాహూ మహిళా సీఈవో మరిస్సా మేయర్ కూడా మాతృత్వపు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మరిస్సా ఈసారి డబుల్ ప్రమోషన్ కొట్టేశారు. గురువారం ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె టుంబర్ల్లో వెల్లడించారు. కుటుంబ సభ్యులతో పాటు, తనకు సహకరించినవారికి ధన్యవాదాలు అంటూ మరిస్సా ఈ సందర్భంగా ఆమె ట్విట్ చేశారు. మరోవైపు మరిస్సా భర్త బోగ్ 'డూయింగ్ గ్రేట్' అంటూ ట్విట్ చేయగా, కుటుంబమంతా థ్రిల్లింగ్ లో మునిగితేలుతోంది. కాగా మరిస్సా మేయర్ జూలై 2012 లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా యాహూ చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఫైనాన్షియర్ బోగ్ వివాహం చేసుకున్న ఆమె 2012లో తొలిసారి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 16 వారాలు ఉద్యోగానికి మెటర్నటీ లీవు పెట్టిన ఆమె కేవలం నాలుగు వారాలకే ఉద్యోగానికి వెళ్లిపోయారు. అయితే ఈసారి కూడా మరిస్సా కేవలం రెండు వారాలు మాత్రమే మెటర్నిటీ సెలవు తీసుకున్నారు. కాగా చైనీస్ కామర్స్ దిగ్గజం ఆలీబాబా కంపెనీ నుంచి యాహూ తన పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని బుధవారం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తన ముద్దుల కూతురు కోసం రెండు నెలల పెటర్నిటీ లీవ్ తీసుకున్న విషయం తెలిసిందే -
మగబిడ్డ ఖరీదు రూ.60వేలు
కన్నకొడుకును విక్రయించిన తండ్రి గజపతినగరం, న్యూస్‌లైన్: వ్యసనాలకు బానిసై న ఓ తండ్రి తన పొట్ట నింపుకోవడం కోసం కన్నకొడుకునే రూ.60 వేలకు విక్రయించాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని వాత్సర్ల కామేష్, అరుణలకు నెలన్నర కిందట కొడుకు పుట్టాడు. వీరికి అంతకు ముందే ఇద్దరు కొడుకులు, ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల నెపంతో ఏడాది కిందట ఒక కొడుకును స్థానికంగానే రూ.20 వేలకు అమ్మినట్లు సమాచారం. ఇటీవల పుట్టిన కొడుకును కూడా రూ.60 వేలకు విక్రయించాడు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు కామేష్‌ను నిలదీయగా, తన కొడుకును తాను అమ్ముకుంటానని తెగేసి చెప్పడంతో వారు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో అధికారులు బాబును స్వాధీనం చేసుకుని విజయనగరంలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ వ్యవహారంలో పాత్ర వున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.