మగబిడ్డ ఖరీదు రూ.60వేలు | 60 thousand cost to sale of Male child | Sakshi
Sakshi News home page

మగబిడ్డ ఖరీదు రూ.60వేలు

Published Thu, Oct 24 2013 3:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

మగబిడ్డ ఖరీదు రూ.60వేలు

మగబిడ్డ ఖరీదు రూ.60వేలు

కన్నకొడుకును విక్రయించిన తండ్రి
 గజపతినగరం, న్యూస్‌లైన్: వ్యసనాలకు బానిసై న ఓ తండ్రి తన పొట్ట నింపుకోవడం కోసం కన్నకొడుకునే రూ.60 వేలకు విక్రయించాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని వాత్సర్ల  కామేష్, అరుణలకు నెలన్నర కిందట కొడుకు పుట్టాడు. వీరికి అంతకు ముందే ఇద్దరు కొడుకులు, ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల నెపంతో ఏడాది కిందట ఒక కొడుకును స్థానికంగానే రూ.20 వేలకు అమ్మినట్లు సమాచారం. ఇటీవల పుట్టిన కొడుకును కూడా రూ.60 వేలకు విక్రయించాడు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు కామేష్‌ను నిలదీయగా, తన కొడుకును తాను అమ్ముకుంటానని తెగేసి చెప్పడంతో వారు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో అధికారులు బాబును స్వాధీనం చేసుకుని విజయనగరంలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ వ్యవహారంలో పాత్ర వున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement