Child Care Center
-
చిల్డ్రన్ కేర్: పనిచోటే లాలిపాట
‘ఎంతైనా తల్లి మనసు’ అనేది మనం తరచుగా వినే మాట. తల్లి ఎక్కడ ఉన్నా మనసు మాత్రం పిల్లలపైనే ఉంటుంది. ఆ పిల్లలు పసి పిల్లలు అయితే? ఆ బాధ తల్లికే తెలుస్తుంది. పసిపిల్లలను ఇంట్లో ఎవరికో ఒకరికి అప్పగించి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు చాలామంది మహిళా ఉద్యోగులకు లేదు. ఈ పరిస్థితుల్లో పసిబిడ్డలను తమతోపాటు తమ పని ప్రదేశానికి తీసుకువస్తారు. అలా అని వారు అక్కడ నిశ్చింతగా... సంతోషంగా ఉంటున్నారా... అంటే అదీ లేదు. ఇలాంటి పరిస్థితిని గమనించిన కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ అందుకు ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించారు. ‘చైల్డ్ కేర్ సెంటర్’ ద్వారా తల్లీబిడ్డలిద్దరూ సంతోషంగా ఉండే ఏర్పాటు చేశారు.పసిబిడ్డలను తీసుకుని ఉద్యోగ విధులకు హాజరు అవుతున్న మహిళా ఉద్యోగులుపాలివ్వడం నుంచి అన్ని పనులు దగ్గర ఉండి చూసుకోవాల్సిందే. ఆఫీసులో పిల్లలు ఏడిస్తే తోటి ఉద్యోగులు చిరాకు పడతారు. కొందరైతే ముఖం మీదే ‘పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలి రావచ్చుగా’ అని గట్టిగా మాట్లాడతారు. కామారెడ్డి జిల్లాపోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఏఆర్ కానిస్టేబుల్స్ కు తమ వెంట పిల్లలను తీసుకువచ్చి వాళ్ల ఆలనాపాలనా చూసుకుంటూ ఉద్యోగ విధులు నిర్వర్తించడం పెద్ద సవాలుగా మారింది.ఆఫీసులో వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన జిల్లా ఎస్పీ సింధుశర్మ పిల్లల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. కార్యాలయం మొదటి అంతస్తులో ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’ ఏర్పాటు చేయించారు. పిల్లలకుపాలు ఇవ్వడం నుంచి వారిని ఆడించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’లో ఏర్పాటు చేశారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలను సెలవులు ఉన్న రోజుల్లో ఇంటి దగ్గర చూసుకునేవారు ఎవరూ లేక చాలా మంది ఉద్యోగులు వారిని తీసుకొని ఆఫీసుకు వస్తుంటారు. అలాంటి పిల్లలు కూడా ‘చైల్డ్ కేర్ సెంటర్’లో సంతోషంగా గడుపుతున్నారు.ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు గార్డ్ డ్యూటీ ఉంటుంది. షిఫ్టుల వారీగా వారికి బాధ్యతలు కేటాయిస్తారు. అలాంటి సందర్భంలో పిల్లల్ని చూసుకోవడానికి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’ఎంతో ఊరట ఇస్తోంది. ‘పిల్లల కంటే ఉద్యోగం ముఖ్యమా? ఉద్యోగం మానేయ్’లాంటి కరుకు మాటలు...‘నువ్వు హాయిగా డ్యూటీకి వెళ్లిపోతే పిల్లాడిని పట్టుకొని నేను నానా చావులు చావాలా!’లాంటి ఈసడింపులు ఇక ముందు వినిపించకపోవచ్చు. ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవాలంటారు. అయితే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎన్నో సమస్యలు అడ్డుగోడగా ఉండవచ్చు. ఇలాంటి సందర్భాలలో ‘చైల్డ్ కేర్ సెంటర్’ అనేది తల్లీబిడ్డల కన్నుల్లో సంతోషాన్ని నింపే ఇంద్రధనుస్సు అవుతుంది. నిశ్చింతగా ఉద్యోగం చేసుకోవడానికి అసరమైన ఆసరాను, ధైర్యాన్నీ ఇస్తుంది. – సేపూరి వేణుగోపాలాచారి ,సాక్షి, కామారెడ్డిఅందుకే... చైల్డ్ కేర్ సెంటర్మహిళాపోలీసులు పిల్లలతో డ్యూటీకి వచ్చిన సమయంలో వారు పడుతున్న ఇబ్బందులను గమనించాను. ఏ కుటుంబంలోనైనా సరే పిల్లలు తల్లిదగ్గరే ఉండగలుగుతారు. తల్లే వారిని చూసుకుంటుంది.పోలీసు శాఖలో సాధారణ కానిస్టేబుల్ళ్లుగా 33 శాతం, ఏఆర్ విభాగంలో 10 శాతం ఉద్యోగాలు మహిళలకు రిజర్వు అవడంతో ఆయా విభాగాల్లో మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య పెరిగింది. ఏఆర్ కానిస్టేబుల్స్ హెడ్ క్వార్టర్లో ఉండి పనిచేస్తుంటారు. వారు గార్డు డ్యూటీతో సహా అన్నిరకాల విధులకు హాజరు కావలసిందే. అలాంటి సందర్భంలో పిల్లలను చూసుకోవడానికి ఇబ్బందులు ఉండకూడదనే చైల్డ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాను. – సింధుశర్మ, కామారెడ్డి జిల్లా ఎస్పీఇబ్బందులు తీరాయిఏఆర్ విభాగంలో దాదాపు అందరు మహిళా కానిస్టేబుళ్లకు చిన్న చిన్న పిల్లలున్నారు. పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి రాలేని పరిస్థితి ఉంటుంది. వెంట తీసుకుని వస్తాం. అయితే పిల్లలతో డ్యూటీ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉండేది. పిల్లలు ఏడుస్తుండడాన్ని చూసిన ఎస్పీ మేడం పిల్లల కోసం చైల్డ్‌కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. అందులో అన్ని రకాల ఆటవస్తువులు అందుబాటులో ఉంచారు. – ఏ.మానస, మహిళా కానిస్టేబుల్, ఏఆర్ విభాగంపిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు...జిల్లాపోలీసు కార్యాలయంలో డ్యూటీ చేసేవారితోపాటు పనుల మీద వచ్చే మహిళా కానిస్టేబుళ్లు తమ వెంట ఉండే చిన్న పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్లో వదిలేస్తే అక్కడ ఆడుకుంటున్నారు. బెడ్‌పై నిద్రపోతున్నారు. తీరిక సమయంలో మేం కూడా వారితో కాసేపు గడపడానికి చైల్డ్‌కేర్ సెంటర్ అనుకూలంగా ఉంది. – వై.భార్గవి, మహిళా కానిస్టేబుల్, దేవునిపల్లి పీఎస్ -
రక్తమోడిన శిశు సంరక్షణాలయం
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో మాజీ పోలీసు జరిపిన కాల్పులతో శిశు సంరక్షణాలయం రక్తసిక్తమైంది. ఈశాన్య థాయ్‌లాండ్‌లోని నోంగ్బూ లాంఫూ నగరంలోని డే కేర్ సెంటర్‌పై పన్యా కామ్రాప్(34) విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో అభంశుభం తెలియని 24 మంది చిన్నారులు సహా మొత్తంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజన విరామం సమయంలో అతను డే కేర్ సెంటర్‌కి వచ్చి మొదట ఐదుగురు సిబ్బందిని హతమార్చాడు. తర్వాత ఒక గదిలో నిద్రిస్తున్న చిన్నారులపైకి బుల్లెట్ల వర్షం కురిపించాడు. దాంతో పరుపులన్నీ రక్తంతో నిండి ఘటనాస్థలి భీతావహంగా మారింది. డే కేర్ సెంటర్లో ఎనిమిది నెలల గర్భిణిని సైతం అతడు చంపేశాడు. ఆ తర్వాత కారులో అక్కడి నుంచి పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ రహదారి వెంట ఉన్న వారిపైనా తూటాల వర్షం కురిపించాడు. దీంతో ఒక చిన్నారిసహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న అతను తన కొడుకును, భార్యను సైతం చంపేసి చివరకు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. శిశు సంరక్షణాలయంలో చిన్నారుల తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది. దాడికి అతను పిస్టల్, షాట్‌గన్‌తోపాటు పదునైన కత్తిని వాడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఏడాది తొలినాళ్లలో ఒక మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అతడిని పోలీసు విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. థాయ్‌లాండ్ చరిత్రలో పాఠశాలలో కాల్పుల ఘటనలో ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. వాస్తవానికి థాయ్‌లాండ్‌లో ఆయుధాలతో దాడి ఘటనలు అరుదు. ఆయుధాలతో దాడి ఘటనల్లో బ్రెజిల్లో ప్రతి లక్షలమందికి 23 మంది చనిపోతే థాయ్‌లాండ్‌లో నలుగురే మరణించారు. ఇదీ చదవండి: 650 కోరికలు.. యూఎస్ ప్రో రెజ్లర్ జాన్ సేనా గిన్నిస్ రికార్డు -
ప్రేమ్ ఇల్లమ్.. వీల్చెయిర్తోనే నడిపిస్తోంది
వైకల్యంతో వీల్ చెయిర్‌కు పరిమితమైన ఇందిర ను చైల్డ్‌కేర్ హోమ్‌లో చేర్చారు తల్లిదండ్రులు. వారానికి ఒకసారి మాత్రమే ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చి ఇందిరను కలిసేవారు. ఇందిరకేమో వాళ్లను పదేపదే చూడాలనిపించేది. ఎంతో ఇష్టమైన తన వాళ్లకు దూరంగా ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షం గా అనుభవించిన ఇందిర తనలాంటి వాళ్లకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ‘ప్రేమ్ ఇల్లమ్’ పేరుతో షెల్టర్ హోమ్ ను నడుపుతూ.. 30 మంది పిల్లలను అమ్మలా ఆదరిస్తున్నారు. ఇందిరకు ఐదేళ్లు ఉన్నప్పుడు పోలియో వచ్చి తొంభైశాతం వైకల్యానికి గురైంది. నడవడానికి రెండు కాళ్లు సహకరించనప్పటికీ ‘ఏదోఒకరోజు నేను నడవగలుగుతాను’ అన్న ధైర్యంతో ఉండేది. తల్లిదండ్రులు చెన్నైలోని ఓ షెల్టర్ హోంలో ఇందిరను చేర్చారు. హోమ్‌లో ఉన్న పిల్లలంతా బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడితే ఇందిర మాత్రం చదువుకునేందుకు ఆసక్తి చూపించేది. అన్నయ్య ప్రోత్సాహంతో.. షెల్టర్ హోమ్‌లో సైకాలజిస్టుగా పనిచేస్తోన్న అన్నయ్య సెల్విన్ ఇందిర ఆసక్తిని గమనించి తల్లిదండ్రులతో మాట్లాడి ఇందిర డైలీ స్కూలుకు వెళ్లి చదువుకునేందుకు ప్రోత్సహించాడు. ఇందిర ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందోనని తల్లిదండ్రులు భయపడ్డప్పటికీ, అన్న అండతో‡ధైర్యం గా ముందుకు సాగింది. కానీ చాలా స్కూళ్లు ఇందిర వైకల్యాన్ని సాకుగా చూపించి అడ్మిషన్ ఇవ్వడానికి వెనకాడాయి. ఎట్టకేలకు ఒక స్కూలు ఇందిరకు ఎనిమిదో తరగతిలో చేరేందుకు అడ్మిషన్ ఇచ్చింది. స్కూల్లో చేరిన ఇందిర అనేక భయాలు, ఆత్మనూన్యతకు లోనైనప్పటికీ అంకిత భావంతో ఎంతో కష్టపడి చదివి ఎస్ఎస్ఎల్సీ మంచి మార్కులతో పాసైంది. అలాగే డిగ్రీ, ఎంసీఏ కూడా పూర్తి చేసింది. ప్రేమ్ ఇల్లమ్.. ఇందిర లాంటి వాళ్లను మరింత మందిని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో సెల్విన్ 1999లో ‘ప్రేమ్ ఇల్లమ్’ను స్థాపించి వైకల్యం గలిగిన పిల్లలకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఇందిర ఎంసీఏ అయ్యాక ఉద్యోగం చేసే అవకాశం వచ్చినప్పటికీ ప్రేమ్ ఇల్లమ్‌లో చేరి సేవ చేయాలని నిర్ణయించుకుంది. 2017 నుంచి ప్రేమ్ ఇల్లమ్ సంస్థకు సేవలందిస్తోంది. ప్రస్తుతం ప్రేమ్ ఇల్లమ్‌లో 30 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో ఐదుగురు స్కూలుకెళ్తుండగా మిగతా వారంతా హోమ్‌లోనే ఉంటున్నారు. ఈ పిల్లలకు చదువు చెప్పడం కోసం ఇందిర స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బిఈడీ చేసి వారికి పాఠాలు చెబుతోంది. అంతేగాక 2019 నుంచి సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తూ, ఆ పంటలతోనే షెల్టర్ హోమ్ పిల్లలకు భోజనం పెడుతుండడం విశేషం. కరోనా కష్టకాలంలో గ్రామంలోని పాజిటివ్ పేషంట్లకు భోజనాన్ని పంపిణీ చేసింది. ‘‘నా చిన్నప్పటినుంచి పన్నెండేళ్ల వరకు షెల్టర్ హోంలో గడిపాను. దీంతో బయట సమాజంలో ఎలా ఉంటుందో తెలిసేది కాదు. శారీరక, మానసిక వైకల్యం లేని పిల్లల్ని ఎప్పుడూ కలవలేదు. ఎనిమిదో తరగతిలో చేరి కొత్తకొత్త పాఠ్యాంశాలను నేర్చుకోవడం, తోటి విద్యార్థులతో కలవడం కష్టంగా ఉండేది. రోజూ స్కూలు అవగానే అన్నయ్య దగ్గర బాధపడేదాన్ని. ‘‘నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు నిన్ను నువ్వు గట్టిగా నమ్ము’’ అని వెన్ను తట్టి చెప్పేవారు. అ ప్రోత్సాహంతోనే ఎంసీఏ వరకు చదివాను. నాకు ఒకరు ఏవిధంగా చెయ్యందించారో అలానే నేను నాలాంటి వాళ్లకు సాయం చేయాలని ప్రేమ్ ఇల్లమ్‌లో పని చేస్తున్నాను. మేము సేంద్రియ పద్ధతిలో ఒక్కో పంటకు 25 బస్తాల ధాన్యాన్ని పండిస్తాము. అవి హోమ్‌లో ఉన్న పిల్లలకు సరిపోతాయి. కూరగాయలు, పండ్ల చెట్లు కూడా పెంచి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం’’ అని ఇందిర చెప్పింది. పట్టుదలకు వైకల్యం అడ్డురాదని, ఎంతటి పనినైనా సాధించవచ్చని ఇందిర ‘ప్రేమ్ ఇల్లమ్’ నిరూపిస్తుంది. -
ఆడపిల్ల వద్దంట..!
వారసుడి కోసం ఆ దంపతులు ఆడశిశువును వద్దకున్నారు.. మగ బిడ్డే ముద్దు.. ఆడబిడ్డ వద్దంటూ పేగుబంధాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు.శిశువును అప్పగించేందుకు శిశుగృహకు చేరుకున్నారు. కానీ ఆ శిశువు పుట్టి మూడు నెలలు మాత్రమే కావడం, ఆరు నెలల పాటు తల్లి పాలనే పట్టించాలని అధికారుల కౌన్సిలింగ్‌తో వెనక్కు తగ్గారు. ఈ ఘటన తిరుమలగిరి మండలంలో మంగళవారం వెలుగుచూసింది. తిరుమలగిరి(నాగార్జునసాగర్) : మండలంలోని నెల్లికల్ గ్రామపంచాయతీ పరిధి జాల్ తండాకు చెందిన జటావత్ అంజి, లక్ష్మి వ్యవసాయంతో పాటు కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి మొదటి కాన్పులో ఆడ శిశువు జన్మించింది. రెండో కాన్పులో కూడా ఆడపిల్లనే పుట్టడంతో తాము ఆ శిశువును సాకలేమంటూ ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని శిశుగృహకు తీసుకెళ్లారు. చిన్నారికి 3 నెలలు మాత్రమే ఉన్నాయని, కనీసం ఆరు నెలల వరకైన తల్లి పాలను పట్టించాలని అధికారులు సూచించడంతో నిరాశతో వెనుదిరిగారు. ఉన్నతాధికారుల సూచన మేరకు సీడీపీవో గంధం పద్మావతి మంగళవారం గ్రామానికి చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రభుత్వ పథకాలపై ఆవగాహన కల్పించారు. ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి చదువు, పెండ్లి వరకు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఆడపిల్ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలకు వేల ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అన్ని సౌకర్యాలతో ప్రసవాలు చేస్తారన్నారు. దీంతో పాటు కేసీఆర్ కిట్టుతో పాటు ఆడపిల్ల పుడితే రూ. 13వేలు, మగ పిల్లాడు పుడితే రూ. 12వేలు అందిస్తుందని తెలిపారు. గిరిజనులకు ఆడపిల్ల భారం కాకుడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా గిరిపుత్రిక పేరుతో ప్రతి గిరిజన బాలికకు రూ.లక్ష డిపాజిట్ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం బాలికల సంక్షేమానికి సుకన్యాయోజన పథకం, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో పేద విద్యార్థులకు చదువులు, సన్నబియ్యంతో పాటు, నాణ్యతతో కూడిన మెనూ అందిస్తుందని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు ఉన్నారు. మారని గిరిజన సంప్రదాయం అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా గిరిజనుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. గిరిజన సంప్రదాయాల ప్రకారం పెళ్లయిన దంపతులు మగబిడ్డకు జన్మనివ్వాల్సిందే నట... ఆ దంపతుల సంతానంలో మగపిల్లాడు పుట్టకుండా, ఆడపిల్లలే పుట్టినట్లయితే ఆ తల్లిని గొడ్రాలిగా భావించి హీనంగా చూడడం, శుభకార్యాలకు దూరంగా ఉంచడంతో పాటు, వారసుడి కోసం అత్తామామలు భర్తకు మరో యువతితో వివాహంం జరిపించటానికి వెనుకాడని పరిస్థితి.. తొమ్మిదినెలలు మోసిన తన బిడ్డను శిశుగృహకు అప్పగించటానికి ఆ తల్లులకు బాధగా ఉన్నా మగబిడ్డ కోసం తప్పడం లేదంటూ వాపోతున్నారు. -
పాపం.. పసివాడు
నవమాసాలు పెంచి పురిటినొప్పులు భరించి జన్మిచ్చిన అమ్మా ఇలా వదిలేశావేమమ్మా ఏమి ముంచుకొచ్చింది ముప్పు ఏమి చేశావ్ అంత తప్పు చూశావు కదా నా రూపం అనిపించలేదా అయ్యో పాపం.. చీరాల: ఏ తల్లి కన్నబిడ్డో తెలియదు.. తెల్లగా, బొద్దుగా, అందంగా ఉన్నాడు. తల జుత్తు నల్లగా నిగనిగలాడిపోతోంది. చూస్తేనే ముద్దాడాలనిపిస్తోంది. కానీ మహరాజులా ఉన్న పండంటి బిడ్డ చీరాల బస్టాండు వద్దనున్న గార్డెన్ పక్కన మూత్ర విసర్జన చేసే ప్రాంతంలో శుక్రవారం ఏడుస్తూ కనిపించాడు. గార్డెన్ సిబ్బంది పరుగుపరుగున అక్కడకు వెళ్లారు. కన్నతల్లి కనిపిస్తుందేమో.. నాన్న వచ్చి బిడ్డను చేతుల్లోకి తీసుకుంటాడేమోనని గమనించారు. కానీ ఎంత సేపటికీ ఆ మగ బిడ్డకోసం ఎవరూ రాలేదు. ఇక విషయం అర్థం అరుుంది. ఎవరో కావాలనే బాబును అక్కడ వదిలి వెళ్లారని. బుజ్జారుుకి కనీసం బొడ్డు తాడు కూడా ఊడలేదు. ఈ దృశ్యం చూసిన కొంతమంది కళ్లలో నీళ్లు తిరిగారుు. మానవత్వం ఉన్నవారు మౌనంగా రోదించారు. పుట్టిన మూడు రోజులకే ఆ పసివాడు పడుతున్న కష్టాలకు చలించారు. చలికి వణుకుతున్న బాబును స్థానికులు అక్కున చేర్చుకొని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందించి బాబు అరోగ్యంగా ఉన్నాడని పేర్కొన్నారు. ఆ బిడ్డను పెంచుకుంటామంటూ చాలా మంది ముందుకొచ్చినా.. వైద్యులు నిరాకరించారు. ఐసీడీఎస్ ద్వారా ఒంగోలులోని చైల్డ్ సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. -
గిరిజన చిన్నారులకు వరం
శిశు సంరక్షణ కేంద్రాలతో మంచి ఫలితాలు రెండు వారాల్లో సంపూర్ణ ఆరోగ్యం రోజుకు రూ. 100 నగదు పంపిణీ 183 మంది చిన్నారులకు మేలు పాడేరు, న్యూస్‌లైన్ : అనారోగ్యం, అవిద్య, అవగాహన లోపం.. మన్యాన్ని వెంటాడుతున్న సమస్యలకు మూలకారణాలివి. ఈ మూడు కారణాల వల్ల మన్యంలో ప్రధానంగా శిశు మరణాలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. తల్లులను వెంటాడుతున్న పౌష్టికాహార లోపం, రుగ్మతలు శిశువులకు వ్యాధుల రూపంలో ఇబ్బందులు పెడుతున్నాయి. అయితే అవగాహనలోపంతో చిన్నారుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ సమస్యల నివారణకు ఏజెన్సీలో ఏర్పాటైన పౌష్టికాహార పునరావాస, శిశు సంరక్షణ కేంద్రాలు ఎంతో మేలు చేస్తున్నాయి. పాడేరులో ఏర్పాటైన ఈ కేంద్రాల వల్ల స్వల్పకాలంలో అత్యుత్తమ ఫలితాలు చేకూరుతున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికాహర సమస్యతో బలహీనంగా ఉంటే ఈ కేంద్రాలలో చేరిన కొద్ది రోజులకే ఆరోగ్య వంతులవుతున్నారు. పుట్టిన శిశువులు అనారోగ్యంతో సతమతమవుతూ ఉంటే ఉన్నత స్థాయి వైద్యసేవలు కల్పించి ప్రాణాలను కాపాడుతున్నారు. తమ బిడ్డలను ఈ కేంద్రాలలో ఉంచిన తల్లులు ఉపాధి కోల్పోకుండా వారికి రోజుకు రూ. 100 వంతున ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తున్నారు. సత్వరమే ఆరోగ్యం పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో 2012 డిసెంబర్లో వైద్య ఆరోగ్యశాఖ పౌష్టికాహర పునరావాస, శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పౌష్టికాహర లోపంతో బక్కచిక్కిన బిడ్డలను కాపాడుకోవాలనే తాపత్రాయంతో అనేక మంది తల్లులు ఈ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఇప్పటికి 183 మంది చిన్నారులు పౌష్టికాహర పునరావాస కేంద్రం కారణంగా ఆరోగ్యవంతులయ్యారు. పునరావాస కేంద్రాల్లో చేరిన మొదటి రోజు నుంచే చిన్నారులకు నాణ్యమైన ఆహరాన్ని ఆందిస్తున్నారు. చిన్న పిల్లల వైద్యనిపుణుడు, న్యూట్రిషన్ అధికారి సమక్షంలో ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారిస్తున్నారు. వివిధ ఆహార పదార్ధాలతో చేసిన పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. దాంతో కేవలం రెండు వారాల వ్యవధిలో శిశువులు పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతులవుతున్నారు. అప్పుడే పుట్టిన శిశువులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వారి ప్రాణాలు కాపాడడానికి ఫోటోథెరపీ,ఆటోమేటిక్ వార్మర్స్,ఆక్సిజన్ మోనటరింగ్ వంటి అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఇలా ఇప్పటికి 107 మంది శిశువుల ప్రాణాలను కాపాడారు. అత్యవసర పరిస్థితులలో విశాఖపట్నంలోని చిన్నపిల్లల వైద్యనిపుణుల వద్దకు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. ఉన్నతస్థాయి సౌకర్యాలు పౌష్టికాహర పునరావాస, శిశుసంరక్షణ కేంద్రాలలో ఉన్నత స్థాయి వైద్య సేవలు కల్పిస్తున్నాం.14 రోజులలో శిశువులను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దుతున్నాం. - డాక్టర్ వి.శ్రీనివాసరావు, చిన్నపిల్లల వైద్యనిపుణులు, పాడేరు ప్రాంతీయ ఆస్పత్రి. -
మగబిడ్డ ఖరీదు రూ.60వేలు
కన్నకొడుకును విక్రయించిన తండ్రి గజపతినగరం, న్యూస్‌లైన్: వ్యసనాలకు బానిసై న ఓ తండ్రి తన పొట్ట నింపుకోవడం కోసం కన్నకొడుకునే రూ.60 వేలకు విక్రయించాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని వాత్సర్ల కామేష్, అరుణలకు నెలన్నర కిందట కొడుకు పుట్టాడు. వీరికి అంతకు ముందే ఇద్దరు కొడుకులు, ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల నెపంతో ఏడాది కిందట ఒక కొడుకును స్థానికంగానే రూ.20 వేలకు అమ్మినట్లు సమాచారం. ఇటీవల పుట్టిన కొడుకును కూడా రూ.60 వేలకు విక్రయించాడు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు కామేష్‌ను నిలదీయగా, తన కొడుకును తాను అమ్ముకుంటానని తెగేసి చెప్పడంతో వారు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో అధికారులు బాబును స్వాధీనం చేసుకుని విజయనగరంలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ వ్యవహారంలో పాత్ర వున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.