
ముంబై :
2017 సంవత్సరంలో యాహూలో ఎక్కువగా వెదికిన భారతీయ నటుల్లో మళ్లీ టాప్ ప్లేస్ దక్కించుకుంది సన్నీలియోన్. దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కత్రినా కైఫ్‌లాంటి స్టార్ హీరోయిన్‌లను దాటుకొని యాహూ మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీ జాబితాలో మరోసారి టాప్‌లో నిలిచింది. రెండో స్థానంలో ప్రియాంకా చోప్రా, మూడో స్థానంలో ఐశ్వర్యారాయ్ నిలిచారు.
ఇక నటుల జాబితాలో ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా టాప్ ప్లేస్‌లో నిలిచారు. వినోద్ ఖన్నా మృతి చెందిన సమయంలో నెటిజన్లు ఎక్కువగా ఆయన కోసం యాహూలో సెర్చ్ చేశారు. కాగా, ఆ తర్వాతి స్థానంలో అనూహ్యంగా కపిల్ శర్మ నిలిచారు. సల్మాన్ ఖాన్, రజినీ కాంత్ లాంటి వారిని దాటుకుని కపిల్ శర్మ రెండో స్థానంలో నిలవడం విశేషం.
2017 యాహూ మోస్ట్ సెర్చ్‌డ్ హీరోయిన్ల జాబితా
సన్నీలియోన్
ప్రియాంకా చోప్రా
ఐశ్వర్య రాయ్
కత్రినా కైఫ్
దీపికా పదుకునే
కరీనా కపూర్
మమతా కులకర్ణి
దిశాపటాని
కావ్యా మాధవన్
ఇషా గుప్తా
Comments
Please login to add a commentAdd a comment