13 ఏళ్ల తరువాత : పిల్లల ముందు సన్నీలియోన్‌ జంట మళ్లీ అలా! | After 13 Years Sunny Leone And Daniel Renew Their Wedding Vows In Front Of Kids | Sakshi
Sakshi News home page

13 ఏళ్ల తరువాత : పిల్లల ముందు సన్నీలియోన్‌ జంట మళ్లీ అలా!

Published Mon, Nov 4 2024 3:24 PM | Last Updated on Mon, Nov 4 2024 3:40 PM

After 13 Years Sunny Leone And Daniel Renew Their Wedding Vows In Front Of Kids

మోడల్‌, నటి సన్నీ లియోన్‌ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.  పోర్న్ స్టార్‌గా  కెరీర్‌ను స్టార్ట్ చేసి బాలీవుడ్‌ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. సన్నీ లియోన్‌.  2011లో  ప్రియుడు డేనియల్ వెబర్‌ను వివాహమాడింది.  ప్రస్తుతం ముగ్గురు పిల్లలు హాయిగా జీవిస్తోంది ఈ జంట. అయితే వీరికి పెళ్లికి సంబంధించి ఒక వార్త వైరల్‌గా మారింది.  

టైమ్స్  కథనం ప్రకారం పదమూడేళ్ల వివాహ బంధం తరువాత   తన ముగ్గురు పిల్లలు నిషా, నోహ్ ఆషెర్‌ల ముందు  మళ్లీ పెళ్లి ప్రమాణాలు  చేసుకున్నారట. మాల్దీవుల్లో వీరిద్దరూ మళ్లీ వధూవరుల్లా ముస్తాబై  వేడుక చేసుకున్నారు. సన్నీ తెల్లటి గౌనులో నెక్‌లైన్‌తో యువరాణిలా కనిపించింది.  పూల కిరీటం, అందమైన చెవిపోగులు, బ్రాస్‌లెట్, ఉంగరం,  డ్యూ మేకప్‌తో అందంగా కనిపిస్తే, మరోవైపు, డేనియల్ స్ఫుటమైన తెల్లటి చొక్కా జీన్స్‌లో హుందాగా కనిపించాడు. అలాగే కూతురు నిషా  తెల్లటి గౌనులో క్యూట్ గా కనిపించి బొకే పట్టుకుంది. నోహ్, ఆషేర్ కూడా అందంగా కనిపించారు. కుటుంబం, ప్రేమ, బంధాలు, విలువను తమ పిల్లలు అర్థం చేసుకోవాలని దంపతులు  అభిలాష అని నివేదిక పేర్కొంది. దీంతో ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

సన్నీ లియోన్ పెళ్లికి అతిథులు 50 మంది కంటే తక్కువే!
సన్నీ లియోన్ తన 11వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సన్నీ కొన్ని విషయాలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది.   ‘‘పెళ్లయి 11 ఏళ్లు.  చేతిలో  పెద్దగా డబ్బుల్లేని రోజులవి. కేవలం 50మంది అతిథులు. రిసెప్షన్‌ కోసం వెడ్డింగ్‌ కోసం వచ్చిన బహుమతుల కోసం వెదికాం. డెకరేషన్‌లో మిస్టేక్‌, కొంతమంది తాగి పిచ్చిగా మాట్లాడారు,  వెడ్డింగ్ కేక్  కూడా ఏమంత బాగాలేదు. అయినా అక్కడ నుండి ఇక్కడ దాకా చేరుకున్నాం. నీ ప్రేమ లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు.’’   ఏప్రిల్ 9, 2022న తన భర్తకు విషెస్‌ తెలిపింది.

సన్నీ లియోన్ డేనియల్ వెబర్‌ ప్రేమ ఎలా మొదలైంది?
వేగాస్‌లోని ఒక క్లబ్‌లో అతని బ్యాండ్‌మేట్ ద్వారా అమెరికాకు చెందిన మ్యూజిషియన్, యాక్టర్ అయిన డ్యానియల్ వెబర్‌ను కలిసింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది.  2011 ఏప్రిల్ 9న వీరి వివాహం జరిగింది .2017లో నిషా అనే ఓ అమ్మాయిని దత్తత తీసుకుందీ జంట. 2018లో సరోగసీ ద్వారా వీరికి కుమారులు నోహ్ , ఆషేర్ జన్మించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement