
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ శనివారం నాడు తన పెళ్లినాటి ఫొటోను షేర్ చేసింది. ఈ సందర్భంగా 11 ఏళ్ల క్రితం జరిగిన తన వివాహ వేడుక తాలూకు జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. 'ఈ రోజుతో నాకు పెళ్లై 11 ఏళ్లు. ఆ సమయంలో చేతిలో డబ్బులు కూడా లేవు. 50 మంది కంటే తక్కువమంది అతిథుల సమక్షంలో మా వివాహం జరిగింది. వాళ్లు మా చేతిలో పెట్టిన ఎన్విలాప్ కవర్లు గబగబా తీసి అందులో ఉన్న డబ్బుతో రిసెప్షన్ ఫీజులు కట్టాము. కొందరు తాగిన మత్తులో ఏదేదో వాగారు.
ఇద్దరం కలిసి ఎంతోదూరం ప్రయాణించాము. ప్రేమతోనే అది సాధ్యమైంది. మా పెళ్లి స్టోరీ అంటే నాకెంతో ఇష్టం. మేము ఎంతో దూరం వచ్చేశాం. హ్యాపీ యానివర్సరీ బేబీ' అని రాసుకొచ్చింది. అటు సన్నీలియోన్ భర్త డేనియల్ కూడా వారిద్దరి ఫొటో షేర్ చేస్తూ భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా సన్నీ, డేనియల్ వివాహం జరిగింది. వీరు 2017లో నిషా అనే ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాతి ఏడాది సరోగసి ద్వారా ఆశర్, నోవా అనే కవలలకు జన్మనిచ్చారు. ఇటీవలే సన్నీలియోన్ ఫ్యామిలీ మాల్దీవులకు కూడా వెళ్లివచ్చింది.
చదవండి: ఆమెతో కమెడియన్ లవ్ ట్రాక్.. ఒక్క ఫొటోతో బండారం బయటపెట్టిన కంగనా
Comments
Please login to add a commentAdd a comment