నటి సన్నీ లియోన్ కొత్త వ్యాపారం.. వీడియో వైరల్ | Sunny Leone Opens New Restaurant ChicaLoca With Husband Daniel Weber In Noida, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Sunny Leone New Restaurant: భర్తతో కలిసి వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ

Published Tue, Jan 23 2024 2:02 PM | Last Updated on Tue, Jan 23 2024 4:17 PM

Sunny Leone New Restaurant Business With Husband Daniel Weber - Sakshi

సన్నీ లియోన్ గురించి సినిమా ప్రేమికులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే పోర్న్‌స్టార్‌గా ఉన్న ఈమె.. ఆ తర్వాత నటిగా బాలీవుడ్‌లోకి ఎంటరైంది. స్పెషల్ సాంగ్స్‌తో పాటు పలు పాత్రల్లోనూ నటించి ఆకట్టుకుంది. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు భర్తతో కలిసి కొత్తగా ఓ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

(ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

మారిపోయిన సన్నీ లియోనీ
సన్నీ లియోన్ పేరు చెప్పగానే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒకప్పుడు పోర్న్ చిత్రాల్లో నటించడమే దీనికి కారణం. ఆ ఇండస్ట్రీని వదిలి ఏళ్లకు ఏళ్లకు గడిచిపోయినా సరే ఇప్పటికీ చాలామంది.. ఈమెని ఆ ఉద్దేశంతోనే చూస్తుంటారు. కానీ సన్నీ లియోనీ.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వ్యాంప్ క్యారెక్టర్స్ చేసినా సరే.. బయట మాత్రం కొన్ని మంచి పనులు చేసింది. ఓ అనాథ బాలికని కూడా దత్తత తీసుకుని పెంచుకుంటోంది.

ఏంటా బిజినెస్?
గత కొన్నేళ్ల నుంచి సినిమాల పరంగా ఈమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. దీంతో రూట్ మార్చేసింది. భర్త డేనియల్ వెబర్‌తో రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టింది. ఢిల్లీలోని నోయిడాలో 'చికలోక' పేరుతో ఓ రెస్టారెంట్ ఈ మధ్య ఓపెన్ చేసింది. ఇందులో కుక్ చేస్తున్న ఓ వీడియో తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో వ్యాపారంలోకి సన్నీ లియోన్ అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసింది.

(ఇదీ చదవండి: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న మహేశ్ కూతురు సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement