
సన్నీ లియోన్.. ఒకప్పుడు శృంగార తార. ఇప్పుడు నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చాన్నాళ్ల క్రితమే తన పాతవృత్తిని విడిచిపెట్టేసింది. ఆ తర్వాత ఓవైపు నటిస్తూనే మరోవైపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సెటిలైపోయింది. ఆడపాదడపా ఏదో ఓ సినిమాలో కనిపిస్తున్న ఈమె.. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంది. అదీ తన భర్తనే.
భారత మూలాలున్న సన్నీ లియోన్.. అమెరికాకు చెందిన డేనియల్ వెబర్‌ని 2011లో పెళ్లి చేసుకుంది. దీని తర్వాత నిషా అనే అనాథ అమ్మాయిని ఈ జంట దత్తత తీసుకున్నారు. అనంతరం కొన్నాళ్లకు ఆషెర్, నోవా అనే ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అలా కుటుంబంతో సన్నీ లియోన్ ఆనందంగా ఉంది. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ పిక్స్ పోస్ట్ చేస్తుండేది.
(ఇదీ చదవండి: గౌతమ్‌కి 'అమ్మతోడు' సవాలు.. ఈసారి బిగ్ బాస్ నామినేషన్స్‌లో ఎవరెవరు?)
పెళ్లయి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సన్నీ లియోన్.. కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఏదో సరదా కోసం అని కాకుండా పిల్లల సమక్షంలో భర్తని మరోసారి పెళ్లాడింది. తెల్లని పెళ్లి దుస్తుల్లో రెడీ అయిన సన్నీ-డేనియల్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హిందీలో నటిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులోనూ సన్నీ లియోన్ పలు సినిమాలు చేసింది. వీటిలో కరెంటు తీగ, జిన్నా, గరుడవేగ చిత్రాలు ఉన్నాయి. అలానే తమిళ, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లోనూ నటించింది. కొన్నిసార్లు ప్రత్యేక గీతాల్లోనే తనదైన అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)



Comments
Please login to add a commentAdd a comment