హైదరాబాద్: పెళ్లి చూపులు అయ్యాయి.. పూలు పండ్లు పంచుకున్నారు... ఇపుడు పెళ్లి చేసుకోనని మొండికేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఘనుడిపై పెళ్లి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని హాబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో వంశీకృష్ణ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
వరంగల్ రంగంపేటకు చెందిన యువతితో వంశీకి ఇటీవల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు. దీంతో ఆ యువతి వంశీపై వరంగల్ రంగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
నిశ్చితార్థం ఓకే... పెళ్లికి నో...
Published Sat, Apr 8 2017 4:22 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement