
సాక్షి, హైదరాబాద్: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ట్రాన్సిట్ వారెంట్ అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, ఎస్కార్ట్ కంపెనీ మాజీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ నందా ఫిర్యాదుతో సంధ్యా శ్రీధర్‌పై కేసు నమోదైంది. ఢిల్లీ, లూథియానాలో ఉన్న భూములను ఫోర్జరీ సంతకాలతో శ్రీధర్ అమ్మినట్లు సమాచారం. సుమారు రూ. 200 కోట్ల రూపాయల విలువైన భూములను ఫోర్జరీ డాక్యుమెట్లతో మోసాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. రూ.180 కోట్లు చెల్లించినట్లు తన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని, అమితాబచ్చన్ బంధువులను మోసం చేయలేదన్న శ్రీధర్.. న్యాయ పోరాటం చేస్తానన్నారు.
చదవండి: అమ్మకానికి హెచ్‌ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్‌లైన్ వేలం ఎప్పుడంటే?
Comments
Please login to add a commentAdd a comment