Delhi Cops
-
HYD: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ట్రాన్సిట్ వారెంట్ అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఎస్కార్ట్ కంపెనీ మాజీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ నందా ఫిర్యాదుతో సంధ్యా శ్రీధర్‌పై కేసు నమోదైంది. ఢిల్లీ, లూథియానాలో ఉన్న భూములను ఫోర్జరీ సంతకాలతో శ్రీధర్ అమ్మినట్లు సమాచారం. సుమారు రూ. 200 కోట్ల రూపాయల విలువైన భూములను ఫోర్జరీ డాక్యుమెట్లతో మోసాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. రూ.180 కోట్లు చెల్లించినట్లు తన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని, అమితాబచ్చన్ బంధువులను మోసం చేయలేదన్న శ్రీధర్.. న్యాయ పోరాటం చేస్తానన్నారు. చదవండి: అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే? -
అర్థరాత్రి దినకరన్‌కు షాక్
-
అర్థరాత్రి దినకరన్‌కు షాక్
న్యూఢిల్లీ : అన్నాడీఎంకే పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి గెంటివేయబడ్డ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బుధవారం అర్థరాత్రి దినకరన్‌కు ఢిల్లీ పోలీసు టీమ్ సమన్లు జారీచేసింది. ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్, ఆయన క్రైమ్ బ్రాంచు టీమ్, చెన్నై నివాసంలో ఉన్న దినకరన్‌కు సమన్లు జారీచేసినట్టు తెలిసింది. 'రెండాకుల' గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపాడనే కేసు విచారణ నిమిత్తం సోమవారం తమ ముందు హాజరుకావాలని ఆయన్ను క్రైమ్ బ్రాంచు టీమ్ ఆదేశించింది. ఎన్ఆర్ఐ అయిన దినకరన్ దేశం విడిచి ఎక్కడికీ ఎగిరిపోకుండా ఉండేందుకు ఇప్పటికే ప్రధాన విమాశ్రయాలన్నింటికీ లుక్అవుట్ నోటీసు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే 20 ఏళ్లుగా తన పాస్‌పోర్టు కోర్టులోనే ఉందని, తానెలా విదేశాలకు వెళ్తానని దినకరన్ ప్రశ్నిస్తున్నారు. అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడంతో కోల్పోయిన పార్టీకి చెందిన 'రెండాకుల' గుర్తు తమకే వచ్చేలా సుకేశ్ చంద్రశేఖర్‌తో కలిసి ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపాడనే బండారం బట్టబయలైంది. సుకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, దినకరన్‌ను కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
'మమ్మల్ని క్షమించండి.. మేము మీతోనే'
న్యూఢిల్లీ: 'మమ్మల్ని క్షమించండి.. మీ పట్ల మాకు ద్వేషం లేదు. మీరంటే గౌరవం. మేము మీతోనే ఉంటాం. మీపై మా చర్యలకు చింతిస్తున్నాం' అని మాజీ సైనికోద్యోగులపై ఢిల్లీ పోలీస్ అధికారి ఎంకే మీనా ప్రేమ కురిపించారు. గత శుక్రవారం(ఆగస్టు14)నాడు వన్ ర్యాంక్-వన్ పెన్షన్(ఒకే హోదా-ఒకే పింఛను) పథకాన్ని తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ మాజీ సైనిక ఉద్యోగులు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసు బలగాలను ప్రయోగించి బలవంతంగా భగ్నం చేయడంపై మీనా ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సైనిక వ్యవస్థ అంటే విపరీతమైన గౌరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్మీలో ఉన్న వారైనా.. రిటైర్మెంట్ తీసుకుని విధులకు దూరంగా ఉన్న వారైనా తమకు అమితమైన భక్తి భావముందని తెలిపారు. కేవలం కొన్ని అనివార్య పరిస్థితుల్లో వారిపై బలప్రయోగం చే్యాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. వన్ ర్యాంక్- వన్ పెన్షన్ పై రక్షణ మంత్రి మనోహర్ పరికర్ స్సష్టమైనా హామీ ఇచ్చినా.. వారు తమ నిరసనను తీవ్రం చేయడంతోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ఆగస్టు 24 వరకూ మాజీ సైనికోద్యోగులను తమ నిరసనను వాయిదా వేయమని పారికర్ తెలిపారన్నారు.ఈ స్కీమ్ పై ఆగస్టు 23 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నందున అప్పటి వరకూ నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని మాజీ సైనికోద్యుగులకు పారికర్ భరోసా ఇచ్చిన సంగతిని మీనా ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
యాసిడ్ దాడుల బాధితులపై పోలీసుల దౌర్జన్యం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎదుట శాంతియుతంగా ఆందోళన చేయడానికి వచ్చిన యాసిడ్ దాడుల బాధితులు, వారి మద్దతుదారులపై గురువారం పోలీసులు విరుచుకుపడ్డారు. వారిని బలవంతంగా అక్కడ నుంచి ఈడ్చుకుపోయి జీపుల్లోకి ఎక్కించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కొందరు యాసిడ్ బాధితులతోపాటు పలువురికి గాయాలయ్యాయి. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ షా వేసిన పిల్‌పై స్పందించిన సుప్రీంకోర్టు దేశంలో యాసిడ్ అమ్మకాలను నిషేధించాలని ఆదేశించింది. కాగా, ఈ ఆదేశాలను అమలుచేయాలంటూ గత వారం రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద యాసిడ్ దాడి బాధితులు, వారి మద్దతుదారులు నిరాహారదీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల నష్టపరిహారం ఇంతవరకు అందలేదని వారు ఆరోపించారు. అలాగే తమ కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. అయితే వారం రోజులుగా తమ ఆందోళనను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆందోళనకారులు గురువారం పార్లమెంట్ ఎదుట ఆందోళనకు సిద్ధమయ్యారు. కాగా, పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని యాసిడ్ బాధితురాలు రూప, లక్ష్మి తదితరులు తెలిపారు. తమను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి హింసించారని ఆరోపించారు. కొందరు మగవారిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని రూప, లక్ష్మి తెలిపారు. కాగా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పార్లమెంట్ భవనం ముందు వారు ఆందోళనకు దిగడంతో అడ్డుకున్నామని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ అధికారులు తెలిపారు. -
నకిలీ బుల్లెట్‌తో ఇరకాటం
అది నకిలీ బుల్లెట్. కానీ, చుక్కలు చూపించింది. రకుల్ ప్రీత్‌సింగ్‌ని ఇరకాటంలో పడేసింది. పోలీసుల ముందు దోషిలా నిలబెట్టింది. ఆ బుల్లెట్ తన బ్యాగులో ఉన్నట్లు కూడా రకుల్‌కి తెలియదు పాపం. అసలు విషయానికొస్తే... ముంబయ్ వెళ్లే ఫ్లయిట్ ఎక్కడం కోసం ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లింది రకుల్. చెకిన్ అయ్యి, ఇక హాయిగా విమానంలో కూర్చోవడమే ఆలస్యం. ఈలోపు రకుల్ బ్యాగులో ఉండకూడని వస్తువేదో ఉన్నట్లు స్కానింగ్ మిషన్ కనిపెట్టేసింది. అంతే.. ‘అసలు అదెక్కణ్ణుంచి వచ్చింది? దాంతో ఏం చేయాలనుకుంటున్నావ్’ అంటూ ప్రత్యేక గదికి తీసుకెళ్లి రకుల్‌ని పోలీసులు ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టారు. బిక్క చచ్చిపోయిన రకుల్ ఏడ్చుకుంటూ తన తండ్రికి ఫోన్ చేసి, విషయం చెప్పింది. ఆయన ఆర్మీలో పని చేశారు. ఒకవేళ ఆయన బుల్లెట్ అయ్యుంటుందేమో అనుకుంది. కానీ, ఆయనదీ కాదు. ఈలోపు బుల్లెట్‌ని పరిశీలించిన పోలీసులు అది నకిలీదని కనుగొన్నారు. అయినా వదిలిపెట్టలేదు. నకిలీదే అయినా నీకెలా వచ్చిందని రకుల్‌ని ప్రశ్నలతో విసిగించారు. ఎనిమిది నెలల క్రితం ఓ తమిళ సినిమా షూటింగ్ కోసం వాడిన బుల్లెట్ అని ఆలస్యంగా గుర్తొచ్చి, హమయ్య అని ఊపిరి పీల్చుకుంది రకుల్. విషయం పోలీసుల దగ్గర చెప్పడంతో ఆమెను వదిలిపెట్టారు. కానీ, ఆ సినిమా డీవీడీ తమకు పంపించాలని షరతు పెట్టారట.