గాంధీ విధానాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
Published Sun, Oct 2 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
– జిల్లా జడ్జి తుకారాంజీ
ఏలూరు (సెంట్రల్) : ప్రతి ఒక్కరూ జాతిపిత గాంధీజీ విధానాలను స్ఫూర్తిగా తీసుకుని నడిచినప్పుడే దేశంలో ప్రగతి సాధ్యపడుతుందని జిల్లా జడ్జి తుకారాంజీ అన్నారు. స్థానిక జిల్లా జైలులో ఆదివారం ఖైదీల సంక్షేమ దినోత్సవ సభలో జిల్లా జడ్జి తుకారాంజీ, కలెక్టర్ కె.భాస్కర్, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ పాల్గొన్నారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల్పరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా జడ్జి మాట్లాడుతూ గాంధీజీ జయంతి సందర్భంగా ఖైదీల్లో మానసిక పరివర్తన తీసుకురావడానికి ఏటా ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని కూడా ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ జైలులో జీవనం సాగించే నిందితులు, ఖైదీలకు వివిధ వత్తుల్లో శిక్షణ అందిస్తే భవిష్యత్తులో తమ కాళ్లపై నిలబడి ఆర్థికంగా అభివద్ధి సాధించే అవకాశాలుంటాయని, అందుకు అనుగుణంగా జైలులో ఏయే వత్తులు అమలు చేయవచ్చునో ప్రణాళిక సిద్ధం చేసి తనకు సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ నరసింహమూర్తి, జిల్లా జైలర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement