వ్యవసాయ మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన వ్యక్తి పాము కాటుకు గురై మృతిచెందాడు.
వ్యవసాయ మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన వ్యక్తి పాము కాటుకు గురై మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ కడపజిల్లా పోరుమామిళ్ల మండలం తోకలపల్లెలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోర భాస్కర్(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున విద్యుత్ సరఫరా కానుండటంతో.. మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి పాముకాటుకు గురై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.