బ్లేడుతో గొంతు కోసుకున్న విద్యార్థి | Student cut his throat with blade | Sakshi
Sakshi News home page

బ్లేడుతో గొంతు కోసుకున్న విద్యార్థి

Jan 17 2017 12:23 AM | Updated on Apr 3 2019 3:50 PM

గుత్తి (గుంతకల్లు) : గుత్తి మండలం అబ్బేదొడ్డికి చెందిన పదో తరగతి విద్యార్థి భాస్కర్‌ (14) సోమవారం రాత్రి తోటలోకెళ్లి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

గుత్తి (గుంతకల్లు) : గుత్తి మండలం అబ్బేదొడ్డికి చెందిన పదో తరగతి విద్యార్థి భాస్కర్‌ (14) సోమవారం రాత్రి తోటలోకెళ్లి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బెల్టుషాపు నిర్వాహకుడు తనను చంపుతానని బెదిరించడం వల్లే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానంటూ బాధితుడు తన స్నేహితుడికి ఫో¯న్ చేసి తెలిపాడు. ఆ వ్యక్తి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు హుటాహుటిన వచ్చి భాస్కర్‌ను గుత్తి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చాంద్‌బాషా తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement