పాలమూరు : ప్రత్యేక పాలనతో జనం మూడేళ్లుగా విసిగి వేసారిపోయారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించే నాథుడు ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. 2011లో జెడ్పీ చైర్మన్ పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు చేపట్టని కారణంగా ప్రత్యేక అధికారులతో సమస్యలు తీరకపోగా.. నిధులు వినియోగం కూడా సక్రమంగా జరుగలేదు. ఎట్టకేలకు ఎన్నికలు చేపట్టి జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. మన ఊరు-మన ప్రణాళిక అమలు నేపథ్యంలో కొత్త చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన జెడ్పీ సభ్యులతో సమావేశం జరుగుతుంది. ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు సంబంధించి నిధులు సకాలంలో విడుదల కాలేక పనులు పడకేసిన మాట మనం తరచూ వింటుంటాం.. కానీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్‌జీఎఫ్) పనుల విషయానికొస్తే.. ఇందుకు పూర్తి విరుద్ధమనే చెప్పొచ్చు.
అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల ప్రహరీలు, ఆస్పత్రి భవనాలు, సామూహిక భవనాలు, రోడ్లు, మురుగు కాలువలు ఇలా వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు కేంద్రం ద్వారా నిధులు పుష్కలంగా మండలాలకు సమకూరినా.. అధికారులు మాత్రం మొద్దు నిద్రవీడడం లేదు. రూ.కోట్లల్లో నిధులు మంజూరయినా తగిన అభివృద్ధి పనులు జరగలేదు. జిల్లాలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు జెడ్పీ ైచైర్మన్ భాస్కర్ ప్రత్యేక దృష్టి గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. తమ బాగోగులు చూసుకోవాల్సిన భారం చైర్మన్‌పైనే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నాయకా.. మీదే.. భారమిక
Published Sun, Aug 3 2014 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM
Advertisement