pallamaru
-
సంక్షామమే
పాలమూరు : సంక్షేమ వసతిగృహాల్లో చేరిన విద్యార్థులకు క్షేమం లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని హాస్టళ్లలో మౌలిక సదుపాయాల్లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. జిల్లా కేంద్రం, ముఖ్య పట్టణాల్లోని కొన్ని హాస్టళ్లలో తప్ప ఇతరచోట్ల తగిన సౌకర్యాలు లేవు. అపరిశుభ్ర వాతావరణం.., దోమల బెడద.., నిద్రపోదామంటే బెడ్షీట్లు లేవు.. ఇదీ.. జిల్లాలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల అవస్థ. జిల్లాలోని హాస్టళ్లలో విద్యార్థుల ఇబ్బందులపై బుధవారం ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. దీనిలో అనేక విషయాలు బయటపడ్డాయి. 80 శా తం హాస్టళ్లలో రాత్రి 7 గంటలు దాటితే వా ర్డెన్లు, సిబ్బంది ఉండడం లేదు. దీంతో విద్యార్థులు రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. మండలాల్లోని హాస్టళ్లకు కాంపౌండ్ నిర్మాణాల్లేవు. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, స్నానాల గదులు, ఫ్యాన్లు లేవు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా కరువే. అక్కడక్కడా ఏర్పాటు చేసిన బోర్లలో వస్తున్న ఉప్పునీటితోనే కాలం గడుపుతున్నారు. విద్యార్థులకు సరిపోను మూత్రశాలలు, స్నానాల గదులు లేక ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో మెనూ పాటించడం లేదు. హాస్టళ్లలో చోటుచేసుకుంటున్న అవినీతిపై ఏసీబీ దాడులు చేస్తున్నా పెద్దగా మార్పేమీ రావడం లేదు. అనేక హాస్టళ్లలో రికార్డుల్లో ఎక్కువమంది పేర్లు రాసి తక్కువమందికి భోజనం పెడుతున్నారు. అది కూడా అరకొరగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఊరికి పేరు తేవాలని !
తెలుగు మీడియం చదువుతున్న ఆ విద్యార్థికి డాక్టర్ కావాలన్న కాంక్ష ఏనాడూ కలుగలేదు. పెద్ద చదువులు చదివి ఉన్నతోద్యోగం చేసి తన ఊరికి మంచిపేరు తీసుకురావాలని సంకల్పించారు.. అయితే అనుకోని ఓ సంఘటన ఆయన లో డాక్టర్ కావాలనే కాంక్షను పెంచింది. అనుకోకుండానే వైద్యవృత్తిలోకి ప్రవేశించి... ఎంతోమంది పేదలకు వైద్యసేవలు అందించగలుగుతున్నారు జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శామ్యూల్ జీవితాన్ని మలుపుతిప్పిన క్షణాలు ఆయన మాటల్లోనే.. పాలమూరు : మాది సామాన్య వ్యవసాయ కుటుం బం. మా నాన్న దేవదానం, అమ్మ అ య్యమ్మ. అమ్మ ఇంట్లోనే ఉండేది. మా నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పో షించేవా రు. కర్నూలు మండలం మునగాలపాడు మా గ్రామం. కష్టపడి చదివి ఊరికి పేరు తీసుకురావాలని భావిం చాను. చిన్నప్పటినుంచి వైద్యుడిని అవుతానన్న భావన నాలో ఉండేది కాదు. అనుకోకుండా ఆ వృత్తిపై మమకా రం పెరగడంతో ఇటువైపు వచ్చాను. మా కుటుంబంలో నేనొక్కడినే వైద్యుడిని కావడం విశేషం. మా శ్రీమతి సుహాసినితోపాటు ఇప్పుడు మా పిల్లలు జి.ప్రణయ్, జి.నితీషా ఇద్దరూ వైద్యులే. నా సతీమణి సుహాసిని కూడా వైద్యవృత్తిలో ఉండటంతో ఈ రంగంలో విశ్రాంతి లేకుండా పనిచేయగలుగుతున్నాను. మలుపుతిప్పిన క్షణాలు మా గ్రామం మునగాలపాడులోని ఏబీఎం స్కూల్లో 5 తరగతుల వరకు, కర్నూల్ మునిసిపల్ స్కూల్లో 6, 7 తరగతులు, కోల్స్ మెమోరియల్ హైస్కూల్ 8, 9, 10 తరగతులు, ఇంటర్ కూడా పూర్తిచేశాను. పదోతరగతి పూర్తయిన సందర్భంలో మా అన్న రాజు ఎడ్లబండి బోల్తాపడటంతో వెన్నెముక విరిగింది. అప్పుడు కర్నూలులోని జనరల్ ఆస్పత్రికి రోజూ వెళ్లాల్సి వచ్చేది. దీంతో అక్కడి వైద్యులు, వైద్యసిబ్బంది పేదలకు అందిస్తున్న సేవలు నన్ను ఆలోచింపచేశాయి. ఆ క్షణాలే నన్ను వైద్యవృత్తిపై మమకారం పెంచాయి. ఇంటర్ సెకండ్ ఇయర్లో మెడిసిన్ కోర్సులో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాశాను. తెలుగు మాధ్యమంలో చదవడంతో.. ఆంగ్ల భాషపై అంతగా పట్టు ఉండేది కాదు. దీంతో మొదటిసారి పరీక్షలో ఆంగ్లంలో ఫెయిలయ్యాను. ఆ తర్వాత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూనే మెడిసిన్ పరీక్షకు సిద్ధమై ఎంబీబీఎస్ ర్యాంకు సాధించగలిగాను. 1976లో కర్నూలు మెడికల్ కళాశాలలో నేను ఎంబీబీఎస్‌లో చేరాను. ఆ తరువాత ఎంబీబీఎస్ యూజీ, పీజీ(ఎండీ) కోర్సు పూర్తయ్యేవరకు క ష్టపడి చదువగలిగాను. 1987లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసేందుకు నేను మహబూబ్‌నగర్‌కు వచ్చాను. 28ఏళ్లుగా ఇక్కడే సేవలందించడంతో పాలమూరు జిల్లాతో నాకు ఎనలేని బంధం ఏర్పడింది. ఆనంద క్షణాలు 1987లో గుండెపోటు వచ్చిన వారికి ఎస్టీకే ఇంజెక్షన్‌ను మహబూబ్‌నగర్‌లోని వైద్యులు ఎవరూ ఇచ్చేవారు కాదు. కానీ గుద్దేటి లక్ష్మణ్‌కుమార్ అనే ఓ రోగికి గుండెపోటుకు వచ్చినప్పుడు ఎస్టీకే ఇంజెక్షన్‌ను ఇచ్చి ప్రా ణాలు కాపాడగలిగాను. స్థానిక వైద్యులు నన్ను ప్రశంసించినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. ఆ త ర్వాత వట్టెంలో పనిచేసే ఓ కానిస్టేబుల్‌కు కూడా ఎస్టీకే ఇంజెక్షన్‌ను ఇచ్చి ప్రాణాలు కాపాడగలిగాను. పీపీహెచ్లో చేరిన ఓ గర్భిణికి ప్రసవం చేసేందుకు ఆస్పత్రుల వారు భయపడిన సందర్భంలో ఆమెకు దా దాపు ఎనిమిది బాటిళ్ల రక్తం ఎక్కించి ఆమెకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించేందుకు వైద్య బృందంతోనే ఉన్నాను. తర్వాత ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇంటికి వెళ్లే సమయంలో ఆమెతో పాటు కుటుంబ స భ్యులు కూడా డాక్టర్ల బృందానికి సాష్టాంగనమస్కారం చేశారు. అంటే నిస్వార్థంగా పనిచేసే వైద్యునికి సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో గుర్తించగలిగాను. తీరని కోరిక..! వెనుకబడిన పాలమూరు జిల్లాకు మెడికల్ కళాశాల కావాలన్నది నా చిరకాల కోరిక. ఎప్పటికైనా వస్తుందని కాంక్షిస్తున్నాను. ఇందుకోసం గత కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు కూడా చేశాం. తెలంగాణ రాష్ర్ట వైద్యశాఖ మంత్రి రాజయ్య, ఎంపీ జితేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ దీనిపై స్పందించి మెడికల్ కళాశాలను నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. నేటి వైద్యులకు నా సలహా దేవుని తర్వాత తమ ప్రాణాలు కాపాడే వైద్యుణ్ణి కూడా ప్రజలు దైవంగా భా విస్తారు. అటువంటి ఉన్నతమైన వృత్తిలో కి వచ్చే కొత్తవారు.. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా పేద ప్రజలకు సేవలందిం చేందుకు ముందుకు రావాలి. నిస్వార్థ వైద్యసేవతో ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతామని వైద్య వృత్తిలోకి వచ్చే ప్రతిఒక్కరూ గుర్తించాలి. -
పాలమూరుపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక దృష్టి
పాలమూరు : పాలమూరు జిల్లాపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక దృష్టి ఉందని పరి శ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యు త్ శాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి, పార్లమెంటరీ కా ర్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో ఎం తో ఖనిజ సంపద ఉందని, రెండు నదులు ప్రవహిస్తున్నాయని, వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి జిల్లాలో 6లక్షల ఎకరాల కు సాగునీటిరందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో తలపెట్టిన అన్ని ప్రా జెక్టులను పూర్తి చేసేందుకు శక్తి వంచన లేకుం డా కృషి చేస్తామన్నారు. జాతీయ ప్లానింగ్ కమిషన్ జరిపిన అధ్యయనంలో దేశవ్యాప్తంగా 10 జిల్లాలు వెనుకబాటుకు గురయ్యాయని గుర్తిం చగా.. అందులో 8 జిల్లాలు తెలంగాణలోనే ఉ న్నట్లు వెల్లడైందన్నారు. గత ప్రభుత్వాలు చేసిన పాపాల కారణంగా ఈ ప్రాంతం వెనుకబడిం దని, దానిని కడిగేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పాటుడపతుందన్నారు. పాలమూ రు జిల్లాలో వ్యవసాయ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని, ఇక్కడి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత విద్యుత్ కేటాయింపును పెంచేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో అవసరమైన చోట విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, విద్యుత్ కనెక్షన్లకోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు అవసరాన్ని బట్టి వ్యవసాయ కనెక్షన్లు ఇప్పిస్తామన్నారు. జిల్లాలోని వనరులను సద్వినియోగం చేసుకొని చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థాపనకు కృషిచేస్తామని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి తెలంగాణ సర్కారు అమలు చేసే మొదటి ఎత్తిపోతల పథకమన్నారు. దీని నిర్మాణానికి శిలాఫలకం వేసేం దుకు త్వరలోనే కేసీఆర్ జిల్లాకు వస్తారన్నారు. జిల్లాలో దాదాపు 18.50 లక్షల ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా ఉందని, ప్రతి నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలలో సాగు చేపట్టి వ్యవసాయ హబ్‌గా ఏర్పాటు చేయనున్నట్లు తె లిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరి షత్ ఛైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బెక్కెం జనార్దన్, పెద్దిరెడ్డి సా యిరెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
జెడ్పీలో జగడం !
పాలమూరు: జిల్లా అభివృద్ధి పనులను విస్మరిస్తూ.. రాజకీయ విభేదాలకు వేదికగా.. పరస్పర విమర్శలకు తావిస్తూ ఆదివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ర సాభాసగా మారింది. ప్రజాసమస్యలను గాలికొదిలి వాదనలు, వాదోపవాదోలతో సభ పక్కదారి పట్టింది. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని, కాంగ్రెస్, ఇతర పార్టీల జెడ్పీటీసీ సభ్యులకు అభివృద్ధి పనులకోసం నిధులు మంజూరు చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎజెండాలోని అంశాలపై చర్చ మొదలుపెట్టారు. అంతకుముందు ఉదయం 11.30 గంటలకు సభ ప్రారంభం కాగానే మల్దకల్ జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్ తన మండలంలో అభివృద్ధి పనులకోసం నిర్ణయించిన రూ.5లక్షల నిధులు మంజూరు చేయడంలేదని, కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీల పట్ల వివక్ష చూపుతున్నారని ఆక్షేపించారు. దీంతో కొద్దిసేపు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. నిధులు మంజూరు చేయించడం తన బాధ్యత అని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పేర్కొనడంతో గొడవ సద్దుమణిగింది. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎజెండాలో లేని అంశాలు మాత్రమే మాట్లాడుతుండటంతో అందరు జెడ్పీటీసీ, ఎంపీపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే శా రు. ప్రతి మూడు నెలలకోసారి చేపట్టే సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడటానికే సరిపోతోందని, తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇది జెడ్పీచైర్మన్‌కు తగదు తనపేరు చెబితే పింఛన్ కట్ చేస్తానని లబ్ధిదారులను హెచ్చరించడం జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్‌కు తగదని, ప్రజాప్రతినిధుల పట్ల ఆయన నిర్లక్ష్యంగా నడుచుకోవడం సమంజసం కాదని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. తాను కూడా గద్వాల నియోజకవర్గం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రనిధిని అన్న విషయాన్ని జెడ్పీ చైర్మన్ గుర్తించాలని పేర్కొన్నారు. పింఛన్ డబ్బులు టీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం లేదని, ప్రజల సొమ్మునే ప్రభుత్వ ఖజానాలోనుంచి పేదలకు అందజేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. తనపేరు చెప్పిన వారి పింఛన్ కట్ చేస్తామనడం, ప్రజల్లో తన గౌరవానికి భంగం కలిగేవిధంగా ఆయన మాట్లాడటం సరికాదని డీకే అరుణ హెచ్చరించడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. దళిత ప్రజాప్రతినిధులను అడ్డుపెట్టుకుని ఆయా పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, మల్దకల్ జెడ్పీటీసీ సభ్యుడికి నిధులు మంజూరు చేయకుండా వివక్షం చూపడం తగదని పేర్కొనడంతోపాటు టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడంతో ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమావేశమందిరంలోని మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లాలని జెడ్పీ చైర్మ న్ బండారి భాస్కర్, కలెక్టర్ జీడీ ప్రియదర్శిని పేర్కొనడంతో పత్రికలు, టీవీ చానళ్లకు సంబంధించిన విలేకరులు పలువురు తమను రమ్మని కబురు పంపి.. ఇప్పుడు వెళ్లమనడం అవమానకరమన్నారు. వీరజవాన్ మృతికి సంతాపం కోయిలకొండ మండలం సంగినోనిపల్లి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రెడ్డిగారి గోవర్ధన్‌రెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ ఆదివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శినితో పాటు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన జవాన్ మృతిచెందడం బాధాకరమని, వారి కుటుంబానికి తమ తరఫున సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరం గా ఆదుకుంటామని, పోలీసు శాఖ తరఫున లాంఛనంగా అంత్యక్రియలు జరిపేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. -
నాయకా.. మీదే.. భారమిక
పాలమూరు : ప్రత్యేక పాలనతో జనం మూడేళ్లుగా విసిగి వేసారిపోయారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించే నాథుడు ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. 2011లో జెడ్పీ చైర్మన్ పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు చేపట్టని కారణంగా ప్రత్యేక అధికారులతో సమస్యలు తీరకపోగా.. నిధులు వినియోగం కూడా సక్రమంగా జరుగలేదు. ఎట్టకేలకు ఎన్నికలు చేపట్టి జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. మన ఊరు-మన ప్రణాళిక అమలు నేపథ్యంలో కొత్త చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన జెడ్పీ సభ్యులతో సమావేశం జరుగుతుంది. ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు సంబంధించి నిధులు సకాలంలో విడుదల కాలేక పనులు పడకేసిన మాట మనం తరచూ వింటుంటాం.. కానీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్) పనుల విషయానికొస్తే.. ఇందుకు పూర్తి విరుద్ధమనే చెప్పొచ్చు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల ప్రహరీలు, ఆస్పత్రి భవనాలు, సామూహిక భవనాలు, రోడ్లు, మురుగు కాలువలు ఇలా వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు కేంద్రం ద్వారా నిధులు పుష్కలంగా మండలాలకు సమకూరినా.. అధికారులు మాత్రం మొద్దు నిద్రవీడడం లేదు. రూ.కోట్లల్లో నిధులు మంజూరయినా తగిన అభివృద్ధి పనులు జరగలేదు. జిల్లాలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు జెడ్పీ ైచైర్మన్ భాస్కర్ ప్రత్యేక దృష్టి గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. తమ బాగోగులు చూసుకోవాల్సిన భారం చైర్మన్‌పైనే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
నీ కీర్తి.. సదా స్ఫూర్తి
పాలమూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకలను మంగళవారం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పలుచోట్ల జయంతి కార్యక్రమాలు జరిగాయి. ‘వైఎస్ఆర్ అమర్హ్రే.. రైతుబంధువు జోహార్’ అంటూ అంజలి ఘటించారు. రైతుల కోసం నిరంతరం తపించి వ్యవసాయానికి వన్నె తెచ్చిన వైఎస్ జన్మదినాన్ని ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించాలని పలువురు నేతలు డిమాం డ్ చేశారు. నీకీర్తి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి పార్టీ జిల్లా కార్యాల యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి మెట్టుగడ్డ సమీపంలో ఉన్న అంధుల ఆశ్రమ పాఠశాల, ఏనుగొండలో ఉన్న రెడ్‌క్రాస్ అనాథ ఆశ్రమంలో విద్యార్థులకు పండ్లు పంచిపెట్టారు. జిల్లావ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి భగవంతురెడ్డి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కల్వకుర్తిలో నగర పంచాయతీ వైస్‌చైర్మన్ షాషెద్ ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. జడ్చర్లలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ నాయకుడు పాండునాయక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీచేశారు. అచ్చంపేట మండలంలో పార్టీ మండల కన్వీనర్ కొండూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. బొమ్మన్‌పల్లిలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం అక్కడి లెనిటి ఫౌండేషన్ అనాథవృద్ధుల ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్డు పంపిణీచేశారు. షాద్‌నగర్‌లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బొబ్బిలి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ముఖ్య కూడలిలో ఉన్న వైఎస్ విగ్రహనికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోన దేవయ్యతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మక్తల్ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి అంజలి ఘటించి..వేడుకలు జరుపుకున్నారు. నర్వ మండలంలోని నర్వ, లంకాల, జిన్నారం, కన్మనూర్, జంగంరెడ్డిపల్లి, కల్వాల, యాంకి గ్రామాల్లో జయంతి కార్యక్రమాలు జరిగాయి. నారాయణపేటలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి జమీర్‌పాషా, పట్టణ అధ్యక్షులు యూసుఫ్‌తాజ్ ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొత్తకోట మండలం అజ్జకొల్లు గ్రామంలో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. గోపాల్పేట మండలకేంద్రంలో వైఎస్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నేతలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. మహబూబ్‌నగర్ అర్బన్: జడ్చర్లలో కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి నిత్యానందం ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గద్వాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మునిసిపల్ చైర్పర్సన్ బండల పద్మావతి, మార్కెట్‌యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి ఇతర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని స్థానిక మునిసిపల్ చైర్పర్సన్ సి.రాధాఅమర్ కొనియాడారు. వైఎస్ జయంతిని పురస్కరించుకుని ఆమె మహబూబ్‌నగర్ పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఆయన సంక్షేమ పథకాలలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని కొనియాడారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు ముత్యాలప్రకాశ్ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. ఆయన ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా జిల్లా నుంచే ప్రారంభించే వారని గుర్తుచేశారు. -
తగ్గని ఎండ
జూలై నెలలో వాతావరణం అంటే మబ్బులతో నిండిన ఆకాశం.. నిరంతరం కురిసే వర్షాలు.. చల్లటి గాలులు.. పచ్చటి పంట పొలాలు. కానీ, ఈ యేడాది పరిస్థితి మారింది. ఇప్పుడు మబ్బులు లేవు. చినుకు జాడ కానరావడం లేదు. పైగా భానుడు తన ప్రతాపాన్ని ఏ మాత్రం తగ్గించడం లేదు. చుర్రుమనిపించే ఎండలతో జనం అష్టకష్టాలు పడుతున్నారు. పాలమూరు: వాతావరణం చల్లబడి వర్షాలు.. చల్లని గాలులు వీచాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ జనాలకు ఎండ బాధ తప్పడం లేదు. జూలై నెల వచ్చినా వాతావరణం ఇంకా ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఇంకా వడగాలులతో పాటు భానుడు విశ్వరూపం చూపిస్తుండటంతో ఉక్కపోత తప్పడం లేదు. గతేడాది జూలై నాలుగో తేదీన గరిష్ట ఉష్ణోగ్రత 30.1 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. శుక్రవారం 35.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయింది. కనిష్ట ఉష్ణోగ్రత సైతం గతేడాది జూలై నాలుగున 23.1 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. ఈ సారి 25.0 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. గత సంవత్సరంతో పోల్చి చూస్తే గరిష్ట ఉష్ణోగ్రత 5డిగ్రీల వరకు వరకు పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం వేసవిని తలపిస్తున్నాయి. దీంతో బయటకు రావాలంటే జనం ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలు కురిసి, చల్లగాలులతో ఆహ్లాదకరంగా ఉండాల్సిన వాతావరణం ఎల్‌నినో ప్రభావంతో పూర్తిగా మారిపోయింది. ఇది వానాకాలమా.. ఎండాకాలమా అని సందేహించే పరిస్థితులు తలెత్తాయి. దీనికి తోడు విద్యుత్ కోత తీవ్రంగా ఉంది. వేడికి ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు లేకుండా ఉండాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతతో అల్లాడుతున్నారు. -
‘పాఠం’.. చెప్పేదెవరు ?
కార్పొరేట్ చదువుల ప్రపంచంలో సర్కారు స్కూళ్లను టీచర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అందరికీ ఉచిత నిర్బంధవిద్యను అందిస్తామన్న ప్రభుత్వం ఆశయం నెరవే రడం లేదు. పుస్తకాలు, డ్రెస్సులు అందించలేకపోయారు. జిల్లాలో 203 పాఠశాలల్లో పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు బడివైపు మొహం చూపడం లేదు. వారిని పర్యవేక్షించేందుకు ఎంఈఓలు కూడా అందుబాటులో లేరు. విద్యావలంటీర్ల నియామకం ఊసేలేకుండాపోయింది. డీఎడ్ విద్యార్థుల చేత ఎలాగోలా స్కూళ్లను తెరిపిస్తున్నారు. ఇకనైనా మేల్కొనకపోతే విద్యార్థులు రాక ప్రభుత్వ బడులు మూతబడే అవకాశాలు లేకపోలేదని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. పాలమూరు: సర్కారు బడులను బలోపేతం చేసి అందరికీ విద్యను అందుబాటులోకి తెస్తామని చెబుతున్న పాలకులు, అధికారుల మాటలు నీటిమీది రాతలవుతున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఉపాధ్యాయుల కొరతను తీర్చడంతో పాటు పాఠ్యపుస్తకాల కొరత తీర్చలేకపోయారు. జిల్లాలో అసలు ఉపాధ్యాయులే లేని ప్రభుత్వ పాఠశాలలు 230కి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. సింగిల్ టీచర్‌తో కొనసాగుతున్న స్కూలు 700 వరకు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక స్థా యిలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించే అవకాశమే లేకుండాపోతోంది. జిల్లాలోని సర్కారు స్కూళ్లలో దాదాపు 1600 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉ న్నాయి. వీటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో పేదవర్గాల పిల్లలకు ప్రాథమిక విద్య అందని ద్రాక్షగా మారింది. ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు గణితం, సా మాన్య శాస్త్రం, ఆంగ్లం పాఠ్యాంశాలను బోధించేందుకు కూడా ఉపాధ్యాయులు లేరు. ఇక ఏకోపాధ్యాయులు ఉన్న బడుల్లో సదరు ఉపాధ్యాయుడు వస్తేనే బడి తలుపులు తెరుచుకుంటాయి. లేదంటే పాఠశాలకు ఆరోజు సెలవే.. ఇదీ జిల్లాలో పరిస్థితి అనేక ృపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఈ ఏడాది నాణ్యమైన విద్య అందించలేమని అప్పుడే అధికారులు చేతులెత్తేస్తున్నారు. పర్యవేక్షణకూ ఇబ్బందే..! మండల విద్యాధికారుల నియామకానికి పాలనాపరమైన ఇబ్బందులు ఉండటంతో ఈ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఫలితంగా జిల్లాలో మొత్తం 64 మండలాలకు 14 మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నాయి. మిగిలిన 50 మండలాల పరిధిలో సీనియర్ ప్రధానోపాధ్యాయుడికి ఎంఈఓగా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో ఈ పాఠశాలల్లో హెచ్ఎంల కొరత సమస్య ఉత్పన్నమవుతోంది. ఇక డిప్యూటీ ఈఓల విషయానికి వస్తే జిల్లాలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్ విద్యాశాఖ డివిజన్ల పరిధిలోని ఉపవిద్యాశాఖ అధికారులంతా ఇన్‌చార్జీలే కావడం గమనార్హం. డైట్ లెక్చరర్లను ఇన్‌చార్జీలుగా నియమించి వారి ద్వారా ఏళ్ల కాలం గడుపుతున్నారు. వలంటీర్ల నియామకం ఆలస్యమే ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో ఉంచుకుని గతేడాది 1100 మంది వరకు విద్యావలంటీర్లను నియమించుకోవాలని ఉత్తర్వులుఇచ్చారు. అయితే ఈ ఏడాది వలంటీర్ల నియామకాలకు సంబంధించి ఎలాంటి సంకేతాలు రాలేదు. కొత్తగా నియమిస్తారా? లేక విద్యా వలంటీర్ల నియామకాన్ని పూర్తిగా పక్కక పెట్టేస్తారా? అన్న విషయమై స్పష్టత కనిపించడం లేదు. ‘పది’ విద్యార్థుల్లో ఆందోళన ఈ ఏడాది నుంచి పదో తరగతి పుస్తకాల్లోని పాఠ్యంశాలు మారాయి. కానీ వాటిని బోధించే 200 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన గణితం, సామాన్యశాస్త్రం వంటివాటిని బోధించేవారు లేరు. గతేడాది కొన్ని సర్దుబాట్లు చేశారు. ఓచోట ఒక సబ్జెక్టును బోధించేందుకు ఇద్దరు ఉపాధ్యాయులుంటే వారిలో ఒకరిని పక్కన ఉన్న పాఠశాలలో సర్దుబాటు చేయాలని ఉత్తర్వులు వచ్చాయి. ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగపరిచారు. తమకున్న పలుకుబడితో మహబూబ్‌నగర్, షాద్‌నగర్, హైదరాబాద్, జాతీయ రహదారికి సమీపంలో ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్‌పై వస్తుండటంతో గ్రామీణ ప్రాంత పాఠశాలలకు నష్టం జరిగింది. -
సవాళ్ల..సాగు షురూ..!
ఏరువాక సాగరోరన్నా..రైతన్నా అంటూ పాడుకునే రోజులు పోయి...ఈ పోరు బతుకు ఎన్నాళ్లోరన్నా...పుట్టెడు కష్టం తీర్చేదెవరన్నా అని అన్నదాతలు గగ్గోలు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాంప్రదాయ బద్ధంగా ఏరువాక పున్నమినాడు పొలంపనులకు చలోచలో అంటూ అరకలతో వారు ఉరకలు పెడుతున్నా పంట చేతికొచ్చే నాటికి ఎలా ఉంటుందోననే బెంగే రైతులను వెన్నాడుతోంది. అయినా వ్యవసాయి..శ్రమసాయి కాబట్టి బాధలను దిగమింగుకొని మరో సాగు ఉద్యమానికి సిద్దపడుతున్నాడు. ఆశల పంటకు ఉపక్రమిస్తున్నాడు. పాలమూరు : ఏరువాక పౌర్ణమి వచ్చిందంటే పల్లెల్లో ఏటా అన్నదాతలు ఆనందంగా పండుగ జరుపుకునే వా రు.. పంటల పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ఎంతో ఘనంగా నిర్వహించే ఏరువాక ఆనందం ఎక్కడా కనిపించడం లేదు. ప్రతికూల పరిస్థితులతో సతమతమవుతున్న అన్నదాతలను పెనుసవాళ్లతో సమీపిస్తున్న ఖరీఫ్ భయపెడుతోంది. రైతుల ఆశలు అన్ని విధాలా ఆవిరవుతున్నాయి... వారి పట్ల అండగా ఉండాల్సిన పాలకులు.. రైతు సంక్షేమాన్ని విస్మరిస్తుండటంతో ఏరువాక కాస్తా... పోరు వాకగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. పెరిగిన పంటసాగు వ్యయం.. వాతావరణ ప్రతికూల పరిస్థితులు.. పూర్తికాని సాగునీటి ప్రాజెక్టులు వెరసి.. వ్యవసాయానికి ఈ ఏడాది సంకట పరిస్థితులు తెచ్చిపెట్టేలా ఉన్నా యి. పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలే కాకుండా పంటల సాగు వ్యయం కూడా పెరగడంతో పంటల సాగుపై జిల్లా వ్యాప్తంగా రూ.400 కోట్లు అదనపు భా రం పడనుంది. ఇందులో కేవలం ఎరువుల ధరలపైనే రూ.250 కోట్ల వరకు ఖర్చు కానుంది. సాగు వ్యయంతోపా టు, విత్తనాల ధరలు కూడా పెరగడం వల్ల వీటికోసం రూ.150 కోట్ల వరకు వెచ్చించక తప్పదు. పస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏరువాకకు ముందే జిల్లాలోని రైతులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అలా అని ఎండలకు కాదు.. పెరిగిన ఎరువుల ధరలను, సాగు నీటి వనరులు కల్పించకపోవడంతో... గతేడాదితో పోల్చితే ప్రస్తుతం ఎరువుల ధరలు రెట్టింపు కాగా సాగునీటిని ఖరీఫ్ నాటికి అందిస్తామని ప్రకంటిచినప్పటికీ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం పనులు వేగవంతం చేయడంలేదు. వెరసి ఖరీఫ్‌ను రైతులు కన్నీటితోనే ప్రారంభించనున్నారనేది స్పష్టమవుతోంది. సాగునీరు అనుమానమే..? జిల్లాలో సాగునీరందకపోవడం, వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోత కారణంగా పంటసాగుపై రైతాంగం దృష్టి నిలపడంలేదు. రైతులకు మేలు చేస్తామని, వచ్చే ఖరీఫ్ సీజన్‌కల్లా సాగునీటి ని అందిస్తామని పాలకులు ప్రకటించినప్పటికీ అది మూడేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టుల పనులు ఎక్కడా పూర్తికాలేదు. దీంతో ఖరీఫ్‌సాగుకు నీరందే పరిస్థితులు కనబడటంలేదు. మరోవైపు ఇప్పటికే ఎరువుల ధర లు రెట్టింపు కాగా సీజన్ ముగిసే నాటికి ఎంతమేరకు పెరుగుతాయో చెప్పలేమని వ్యవసాయ శాఖ చెబుతోంది. రైతు కష్టం వృథా...! రైతు కష్టం వృథా అవుతోంది. పెట్టిన పెట్టుబడి, తినేందుకు గింజలు దక్కితే చాలని మాత్రమే భావించాల్సి వస్తోంది. పంట పూర్తయ్యే నాలుగు నెలల పాటు రైతుతో పాటు వారి కుటుంబ సభ్యులు పడే శ్రమ ఖర్చు నెలకు రూ.12వేల వంతున పంటకాలంపూర్తయ్యే వరకు రూ.48వేలవుతుంది. ఆ మొత్తం కూడా అందక రైతులు నష్టపోవాల్సి వస్తోంది. పంటల సాగు ఖర్చు ఇలా.. వరిసాగు చేసే రైతు ఎకరాకు పొలాన్ని దున్నుకునేందుకు, ట్రాక్టర్, కూలీ ఖర్చు రూ.4500, ఎరువులు, రసాయనిక మందులకు రూ.4వేలు, విత్తనాలకు రూ.1600 నాట్లు, కలుపులు, ఇతర అవసరాలకు రూ.4వేలు, కోతకు, నూర్పిడి, ఇతర అవసరాలకు రూ.రెండువేలు ఖర్చవుతుంది. వరిపంట దిగుబడి ఎకరాకు 18 క్వింటాళ్లు రావాల్సి ఉండగా, సరాసరిన 10 నుంచి 14 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. ఈ లెక్కన ఎకరాలకు రూ.10 నుంచి రూ.14వేల వరకు ఆదాయం వస్తోంది. పత్తి పంట సాగుకోసం.. ఎకరా భూమిని చదును చేసేందుకు రూ. 3000,విత్తనాల ఖర్చు రూ.వెయ్యి, కూలీ లు, కలుపు తీసేందుకు, పత్తిగింజలు తీసేందుకు,ఇతర అవసరాల కోసం పం ట మొత్తానికి రూ.17 నుంచి రూ.20 వేలు వరకు ఖర్చవుతుంది. ఖర్చులు పోను ఎకరాకు ఆదాయం రూ.45 నుంచి రూ.55వేల వరకు వస్తోంది. వేరుశనగ.. ఎకరా పంటసాగుకు విత్తనాలకు రూ.ఐదువేలు, దున్నేందుకు రూ.3వేలు, కలుపు తీసేందుకు రూ.3వే లు, ఎరువులకు రూ.4వేలు, కోతకు రూ.3వేలు ఖర్చవుతుంది. ఎకరాకు 18 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా, జిల్లా పరిస్థితుల దృష్ట్యా.. సరాసరిన 10 నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది, ఎకరా వేరుశనగ పంటకు వచ్చే ఆదాయం రూ.35వేల నుంచి రూ.42వేల వరకు ఉంటుంది. మొక్కజొన్న సాగుకోసం.. ఎకరా పొలాన్ని దున్నేందుకు రూ.3వేలు, విత్తనాలు రూ.2500, విత్తేందుకు రూ. మూడు వేలు ఖర్చవుతుంది. ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. మొక్కజొన్న పంటకు ఎకరా ఆదాయం రూ.15వేల వరకు వస్తోంది. -
గుండె గు‘బెల్’..!
పేద, మధ్యతరగతి వర్గాలకు గుబులు పుట్టించే నెల జూన్. పిల్లల స్కూళ్లకు బెల్ మోగుతోందంటే చాలు తల్లిదండ్రులకు ఖర్చుల చిట్టా కళ్లుముందు పడగ విప్పుతుంది. గుండె గుభేల్ మంటుంది. ముందస్తు ప్రణాళిక ఉంటే ఓకే. లేకుంటే...ఫీజుల భారాన్ని, పుస్తకాల తదితరాలకయ్యే వ్యయాలను గట్టెక్కడం కష్టమే. ఏటా పెరుగుతున్న ఈ బడ్జెట్‌పై అందరిలోనూ టెన్షన్ మొదలవుతోంది. పాలమూరు : ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకొని కుటుంబాన్ని నడుపుతున్న మధ్యతరగతి, వేతన జీవులకు జూన్ నెల చదువుల సీజన్ వచ్చిందంటే చాలు.. గుండెల్లో గుబులు మొదలవుతుంది. నేటి నుంచి బడి గంటలు మోగనుండటంతో చదువుల భారాన్ని తట్టుకునేదెలా అని గాభరా పడుతున్నారు పుస్తకాల భారం మోయడం విద్యార్థులకు ఒక ఎత్తయితే వాటి ఖర్చు భరించడం సామాన్యులకు రెండింతల బరువవుతోంది. ఏటా పెరుగుతున్న పుస్తకాల ధరలు, ఫీజులు, డ్రస్సులు, ఇతరత్రా సామాగ్రి ధరలే ఇందుకు కారణమవుతున్నాయి. అసలే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇటు వ్యవసాయానికి.. అటు విద్యార్థులపై పెట్టు ‘బడి’ భారం తడిసి మోపెడవుతోంది. జూన్ నెల వచ్చిందంటే ఎంతటి వారికైనా కష్టాలు తప్పవు. ఉన్నత వర్గాల వారి మాట అటుంచి మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారికి మాత్రం ఈ మాసమంటేనే హడల్. పిల్లలను బడుల్లో చేర్పించాలి.. పుస్తకాలు కొనాలి.. దుస్తులు, షూస్ కొనాలంటే కనీసం రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. ఇంత డబ్బు ఒక్కసారిగా కావాలంటే వేతన జీవులు కష్టాలు పడాల్సిందే. పిల్లల చదువులకోసం ఎంత ఖర్చయినా పెట్టేందుకు చేతిలో డబ్బుల్లేని వారంతా అప్పులపాలు కావాల్సిందే. మేం పడ్డ కష్టం మా పిల్లలు కూడా పడకూడదు. వాళ్లు బాగా చదవాలని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనే ఆలోచన ప్రతి సాధారణంగా అందరు తల్లి తండ్రుల్లోనూ ఉంటుంది. తగినంత ఆర్థిక స్థోమత లేకున్నా తమ పిల్లలను చదించేందుకు పలువురు ఆస్తులను సైతం తాకట్టు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. నేడు పాఠశాలల పునఃప్రారంభం కానుండటంతో పిల్లల చదువుల కోసం తల్లి తండ్రులు స్కూల్ బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. తమ పిల్లలను సంతృప్తి పర్చేందుకు వారి తల్లి తండ్రులు నానాయాతన పడాల్సి వస్తోంది. -
సంబుర’ సన్నాహం...!
అరవై ఏళ్ల కల ఆచరణ రూపు దాల్చిన శుభఘడియలు చేరువవుతుండడంతో వేడుకల కోసం జిల్లా ముస్తాబవుతోంది. పోరు బిడ్డల త్యాగాన్ని స్మరించుకుంటూ నవరాష్ట్ర ఆవిర్భావ వేల పులకితమవ్వాలనుకుంటోంది. ఇందుకు ప్రభుత్వ కార్యాలయాలు కొత్త విద్యుత్తు కాంతులతో మెరిసిపోయేలా అలంకరించారు. అన్ని వర్గాల్లో ఉత్సవ జోష్‌ను నింపేందుకు కళాకారులు గజ్జెకడుతున్నారు. కవులూ కలాలకు పదును పెట్టి ‘తెలంగాణం’ వినిపించేందుకు సిద్ధపడుతున్నారు. పాలమూరు, న్యూస్‌లైన్: అరవై ఏళ్ల కల సాకారమైన వేళ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పలువురి ప్రాణత్యాగాలకు పాల్పడ్డారు.. ఎందరో ఉద్యమాల ఫలితంగా వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సంబురాలు.. జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. గతేడాది జులై 30వతేదీన ప్రకటించిన నాటినుంచి ఇక్కడి ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. జూన్ రెండోతేది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకునేందుకు జిల్లా కేంద్రంతోపాటు అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ పరంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లా అంతటా పండుగ వాతావరణం నెలకొల్పేందుకు అన్ని స్థాయిల్లోనూ ప్రత్యేక దృష్టి నిలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే పెద్ద ఎత్తున తెలంగాణ సంబురాలు ప్రారంభం కానున్నాయి. వారం రోజులపాటు చేపట్టనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు ముమ్మరంగా చేపట్టనున్నారు. కొత్త అందాలు.. రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం, జిల్లాపరిషత్ కాార్యాలయం, అన్ని డివిజన్ల పరిధిలోని ఆర్డీఓ కార్యాలయాలు, తహశీల్దారు, మండల పరిషత్ కార్యాలయాలు ముస్తాబయ్యాయి. చారిత్రక ప్రాంతాలు, దేవాలయాల ప్రాంగణాలను సైతం అలంకరణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేపట్టారు. వీటితోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో రెండోతేదిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, తెలంగాణ వాదుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మన జిల్లా సరిహద్దు ప్రాంతాలు, ముఖ్యమైన కూడళ్లలో అవసరమైన ఫ్లెక్సీలతోపాటు స్వాగత తోరణాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వ పరంగా చేపట్టనున్న వేడుకల్లో అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సిబ్బంది, యువతీ, యువకులు, జిల్లా వాసులు అధిక సంఖ్యలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 2న.. కాప్స్ కవాతు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం ఉదయం 8.45 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం చేపట్టనున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నేటి సాయంత్ర నుంచే జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా సాంసృ్కతిక కార్యక్రమాలను చేపట్టనున్నారు. స్ఫూర్తినిచ్చే కళారూపాలు... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత- చారిత్రక నేపథ్యం ఆధారంగా జిల్లా వ్యాప్తంగా కళాప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నారు. అంతేకాకుండా వారం రోజులపాటు జరుగనున్న ఉత్సవాల్లో తెలంగాణ సాధనలో అమర వీరుల త్యాగం, ఉద్యమ నేపథ్యం వంటి అంశాలపై కూడా రూపకాలు, కళా రూపాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని సాంసృ్కతిక సంస్థలు, జానపద కళాకారులు, సాహితీ వేత్తలు, కవులు, కళాకారులు, గాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆఫీసులకు టీజీ బోర్డులు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆంధ్రప్రదేశ్ అన్న పేరున్న బోర్డులను తొలగించి వాటి స్థానంలో తెలంగాణ ప్రభుత్వం పేరిట కొత్త బోర్డులను ఏర్పాటు చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఆదివారం సాయంత్ర వరకు బోర్డులను మార్పు చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో ఏర్పాట్లు చేశారు. సమీక్షించిన ఇన్చార్జ్ కలెక్టర్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వ పరంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టేందుకు ఆయా శాఖల అధికారులతో ఇన్చార్జ్ కలెక్టర్ ఎల్.శర్మణ్ ఆదివారం రెవిన్యూ సమావేశ మందిరంలో సమీక్షించారు. జిల్లా నలుమూలల ఆవిర్భావ వేడుకలు ఉట్టిపడే విధంగా పూలతోరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలను జరుపుకోవాలని ఆయన సూచించారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం చేస్తామని, జిల్లాలోని ప్రముఖులను కూడా సత్కరించడం జరుగుతుందన్నారు. ముఖ్యమైన ఆస్తుల పంపిణీ వివరాలను తయారు చేయాలని సంబంధిత అధికారులకు శర్మణ్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా మానవహారాలు, ర్యాలీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని, ప్రతి కార్యక్రమంలో తెలంగాణ వాదం కనపడాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించిన విధంగానే ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని తెలిపారు. పతి కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. వారం రోజుల పాటు విసృ్తతంగా సాంసృ్కతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించి కళాకారులు, కవులు, రచయితలు, వీటిపై ఆసక్తి ఉన్నవారు జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఎల్.శర్మణ్ సూచించారు. -
మా వివరాలేవీ!
పాలమూరు, న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వం ఉన్నతాశయంతో.. పశుసంవర్థక శాఖలో ప్రవేశపెట్టిన జాతీయ జంతు రోగ నిరోధక కార్యక్రమం ప్రణాళికా లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పక్కదారి పట్టింది. పశు పక్ష్యాదుల సంక్షేమం కోసం రూ. కోట్లు వెచ్చించి రెండేళ్ల కిందట ఈ పథకం ప్రారంభించారు. నేటికీ జిల్లాలో ఇది పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఇందుకు కేటాయించిన కంప్యూటర్లు నాణ్యతా లోపంతో మూలనపడ్డాయి. గ్రామస్థాయిలో అంది స్తున్న పశు వైద్యంపై సమగ్ర సమాచారా న్ని పొందుపరిచే విధానంపై ఆ సిబ్బందికి సరైన శిక్షణ లేదు. జాతీయ జంతు రోగ నిరోధక విధానం (నేషనల్ యానిమల్ డిసీజ్ రిపోర్టింగ్ సిస్టం- ఎన్ఏడీఆర్ఎస్) ద్వారా దేశంలోని అన్ని మండలాల పశు వైద్యశాలల కంప్యూటరీకరణ కార్యక్రమాన్ని రెండేళ్ల కిందట చేపట్టారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సిస్టం (ఎన్ఐఎస్) ద్వారా క లెక్టరేట్‌లో ఉండే కంప్యూటర్‌కు వీటిని అ నుసంధానం చేసి ఉంచుతారు. ఈ పథకం ద్వారా మండల పశు వైద్య కేంద్రాలకు కం ప్యూటర్, ప్రింటర్‌తోపాటు నిరంతర వి ద్యుత్తు అందించేందుకు ఇన్వర్టర్, బీఎస్ఎన్ఎల్ నెట్ కనెక్షన్‌ను అందజేశారు. ఒక్కో కేంద్రానికి రూ.లక్షకు పైగా విలువైన సామగ్రి సరఫరా చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. జిల్లాలో రూ.50 లక్షలు ఇందుకోసం వెచ్చిం చారు. దీంతోపాటు ఏటా బీఎస్ఎన్ఎల్ నెట్ సేవల వినియోగానికి ఖర్చు చేస్తున్నారు. అసలే అరకొర వసతులతో పశువైద్యశాల సిబ్బందికొట్టుమిట్టాడుతున్నారు. వీ టి పరిరక్షణ వైద్య సిబ్బందికి కత్తిమీద సామవుతోంది. రాత్రి పర్యవేక్షణ లేకపోవడం, భవనాలు సరిగా లేక వర్షాలతో వాటి భద్రతకు ముప్పు ఏర్పడుతోంది. దీనికితోడు సా కేంతిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లా వ్యాప్తంగా 342 పశువైద్య కేంద్రాలుండగా.. ఇక్కడ పనిచేసేందుకు 865 మంది సిబ్బంది అవసరం. కాగా ప్రస్తుతం 505 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 360 పోస్టులు ఖాళీలున్నాయి. అందులో వెటర్నరీ డాక్టర్ పోస్టులు 68, పారాస్టాఫ్ 198, అటెండర్లు 69 ఖాళీలుండటం వల్లే పశువైద్యం ప్రహసనంగా మారింది. దీంతో ఎన్ఏడీఆర్ఎస్ కార్యక్రమం అమలు ఇబ్బందికరంగా మారింది. ఈ కార్యక్రమ నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 65 చోట్ల కంప్యూటర్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అందులో కేవలం 34 మాత్రమే పనిచేస్తున్నాయి.. వాటి నుంచి కూడా అరకొరగా సమాచారం అందుతున్నట్లు తెలుస్తోంది. ఉన్న సిబ్బందికి వారంపాటు అందించిన శిక్షణ ఏమాత్రం చాలడం లేదని తెలుస్తోంది. అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టినట్లు ఎలాంటి అవగాహన లేని సిబ్బంది చేత వివరాల నమోదుకు ప్రయత్నించడం గమనార్హం. ఉద్దేశం మంచిదే అయినా... మండల పరిధిలో సమస్త జంతు సంపద వివరాలను పశువైద్య సిబ్బంది నమోదు చేయాలి. ఒక్కో రైతు, అతనికి ఉన్న పశుపక్ష్యాదుల వివరాలను పూర్తిస్థాయిలో పేర్కొనాలి. వాటికి వస్తున్న వ్యాధులు, అందించిన వైద్య సేవల వివరాలను పొందుపర్చాలి. మండల పరిధిలో ఉన్న అన్ని ఉప కేంద్రాల ద్వారా అందించిన వైద్య సేవల వివరాలు సైతం నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు కంప్యూటర్ల ద్వారా జాతీయ వెబ్‌సైట్‌కు పంపి నమోదు చేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా నమోదైనం ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణ, పోలికలు, సంబంధిత మందులు, టీకాల సరఫరాకు అనుగుణంగా రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ల రూపకల్పనకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా పశు సంవర్థక శాఖకు సంబంధించి అన్ని వివరాలను అందరూ చూసుకునే వీలు ఉంటుంది. తద్వారా జంతువులకు మెరుగైన వైద్యం అందుతుంది. ఈ పథకంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు చాలా చోట్ల పనిచేయడం లేదు. ఇంటర్నెట్ వినియోగంలో లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఏడాది కిందట ఇవి జిల్లాకు వచ్చినా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. -
నిప్పుల కొలిమి..!
పాలమూరు, న్యూస్‌లైన్ : జిల్లా మొత్తంలో ఎం డ తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారిపోయిం ది. గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో జనం అల్లాడి పోతున్నారు. శనివారం 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటంతో అన్ని వయసుల వారు వేడిని తట్టుకోలేక అవస్థ పడాల్సి వచ్చింది. భానుడు భగ్గుమంటుండటం తో జిల్లా అగ్ని గుండంలా మారింది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దాదా పు వారం రోజుల నుంచి గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక జిల్లాలో శనివారం 43.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావడానికే జంకుతున్నారు. ఉపాధి కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనులపై వెళ్లేవారు ఉదయాన్నే వెళ్తున్నా రు. ఉదయం 10 గంటల తర్వాత రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మళ్లీ సాయంత్రం తర్వాత రహదారులు ప్రజలతో క్రిక్కిరిసిపోతున్నాయి. వడదెబ్బతో జిల్లాలో పలుచోట్ల మృత్యువాత పడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాం తాల్లో విద్యుత్ కోతలు అధికం కావడంతో జనం సతమతం అవుతున్నారు. మూడు రోజుల నుం చి పెరిగిన ఉష్ణోగ్రతలతోపాటు వడగాలులు వీస్తుండటంతో చిన్నపిల్లలు, వయో వృద్ధులు తట్టుకోలేక అవస్థ పడుతున్నారు. -
భానుడి భగభగ..!
పాలమూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా ఉష్ణోగ్రతల పరిణామ క్రమంలో భారీ మార్పులు చోటుచేసుకొనడంతో పాలమూరు ఉడికిపోతోంది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు కాలు బయట పెట్టేందుకు భయపడుతున్నారు. మ ధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నారుు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అధికం కావడంతో జనం సతమతం అవుతున్నారు.