తెలుగు మీడియం చదువుతున్న ఆ విద్యార్థికి డాక్టర్ కావాలన్న కాంక్ష ఏనాడూ
కలుగలేదు. పెద్ద చదువులు చదివి ఉన్నతోద్యోగం చేసి తన ఊరికి మంచిపేరు తీసుకురావాలని సంకల్పించారు.. అయితే అనుకోని ఓ సంఘటన ఆయన లో డాక్టర్ కావాలనే కాంక్షను పెంచింది. అనుకోకుండానే వైద్యవృత్తిలోకి ప్రవేశించి... ఎంతోమంది పేదలకు వైద్యసేవలు అందించగలుగుతున్నారు జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శామ్యూల్ జీవితాన్ని మలుపుతిప్పిన క్షణాలు ఆయన మాటల్లోనే..
పాలమూరు : మాది సామాన్య వ్యవసాయ కుటుం బం. మా నాన్న దేవదానం, అమ్మ అ య్యమ్మ. అమ్మ ఇంట్లోనే ఉండేది. మా నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పో షించేవా రు. కర్నూలు మండలం మునగాలపాడు మా గ్రామం. కష్టపడి చదివి ఊరికి పేరు తీసుకురావాలని భావిం చాను. చిన్నప్పటినుంచి వైద్యుడిని అవుతానన్న భావన నాలో ఉండేది కాదు. అనుకోకుండా ఆ వృత్తిపై మమకా రం పెరగడంతో ఇటువైపు వచ్చాను. మా కుటుంబంలో నేనొక్కడినే వైద్యుడిని కావడం విశేషం. మా శ్రీమతి సుహాసినితోపాటు ఇప్పుడు మా పిల్లలు జి.ప్రణయ్, జి.నితీషా ఇద్దరూ వైద్యులే. నా సతీమణి సుహాసిని కూడా వైద్యవృత్తిలో ఉండటంతో ఈ రంగంలో విశ్రాంతి లేకుండా పనిచేయగలుగుతున్నాను.
మలుపుతిప్పిన క్షణాలు
మా గ్రామం మునగాలపాడులోని ఏబీఎం స్కూల్‌లో 5 తరగతుల వరకు, కర్నూల్ మునిసిపల్ స్కూల్‌లో 6, 7 తరగతులు, కోల్స్ మెమోరియల్ హైస్కూల్ 8, 9, 10 తరగతులు, ఇంటర్ కూడా పూర్తిచేశాను. పదోతరగతి పూర్తయిన సందర్భంలో మా అన్న రాజు ఎడ్లబండి బోల్తాపడటంతో వెన్నెముక విరిగింది. అప్పుడు కర్నూలులోని జనరల్ ఆస్పత్రికి రోజూ వెళ్లాల్సి వచ్చేది. దీంతో అక్కడి వైద్యులు, వైద్యసిబ్బంది పేదలకు అందిస్తున్న సేవలు నన్ను ఆలోచింపచేశాయి. ఆ క్షణాలే నన్ను వైద్యవృత్తిపై మమకారం పెంచాయి. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మెడిసిన్ కోర్సులో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాశాను. తెలుగు మాధ్యమంలో చదవడంతో.. ఆంగ్ల భాషపై అంతగా పట్టు ఉండేది కాదు. దీంతో మొదటిసారి పరీక్షలో ఆంగ్లంలో ఫెయిలయ్యాను. ఆ తర్వాత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూనే మెడిసిన్ పరీక్షకు సిద్ధమై ఎంబీబీఎస్ ర్యాంకు సాధించగలిగాను. 1976లో కర్నూలు మెడికల్ కళాశాలలో నేను ఎంబీబీఎస్‌లో చేరాను. ఆ తరువాత ఎంబీబీఎస్ యూజీ, పీజీ(ఎండీ) కోర్సు పూర్తయ్యేవరకు క ష్టపడి చదువగలిగాను. 1987లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసేందుకు నేను మహబూబ్‌నగర్‌కు వచ్చాను. 28ఏళ్లుగా ఇక్కడే సేవలందించడంతో పాలమూరు జిల్లాతో నాకు ఎనలేని బంధం ఏర్పడింది.
ఆనంద క్షణాలు
1987లో గుండెపోటు వచ్చిన వారికి ఎస్‌టీకే ఇంజెక్షన్‌ను మహబూబ్‌నగర్‌లోని వైద్యులు ఎవరూ ఇచ్చేవారు కాదు. కానీ గుద్దేటి లక్ష్మణ్‌కుమార్ అనే ఓ రోగికి గుండెపోటుకు వచ్చినప్పుడు ఎస్‌టీకే ఇంజెక్షన్‌ను ఇచ్చి ప్రా ణాలు కాపాడగలిగాను. స్థానిక వైద్యులు నన్ను ప్రశంసించినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. ఆ త ర్వాత వట్టెంలో పనిచేసే ఓ కానిస్టేబుల్‌కు కూడా ఎస్‌టీకే ఇంజెక్షన్‌ను ఇచ్చి ప్రాణాలు కాపాడగలిగాను.
పీపీహెచ్‌లో చేరిన ఓ గర్భిణికి ప్రసవం చేసేందుకు ఆస్పత్రుల వారు భయపడిన సందర్భంలో ఆమెకు దా దాపు ఎనిమిది బాటిళ్ల రక్తం ఎక్కించి ఆమెకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించేందుకు వైద్య బృందంతోనే ఉన్నాను. తర్వాత ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇంటికి వెళ్లే సమయంలో ఆమెతో పాటు కుటుంబ స భ్యులు కూడా డాక్టర్ల బృందానికి సాష్టాంగనమస్కారం చేశారు. అంటే నిస్వార్థంగా పనిచేసే వైద్యునికి సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో గుర్తించగలిగాను.
తీరని కోరిక..!
వెనుకబడిన పాలమూరు జిల్లాకు మెడికల్ కళాశాల కావాలన్నది నా చిరకాల కోరిక. ఎప్పటికైనా వస్తుందని కాంక్షిస్తున్నాను. ఇందుకోసం గత కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు కూడా చేశాం. తెలంగాణ రాష్ర్ట వైద్యశాఖ మంత్రి రాజయ్య, ఎంపీ జితేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ దీనిపై స్పందించి మెడికల్ కళాశాలను నెలకొల్పుతామని హామీ ఇచ్చారు.
నేటి వైద్యులకు నా సలహా
దేవుని తర్వాత తమ ప్రాణాలు కాపాడే వైద్యుణ్ణి కూడా ప్రజలు దైవంగా భా విస్తారు. అటువంటి ఉన్నతమైన వృత్తిలో కి వచ్చే కొత్తవారు.. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా పేద ప్రజలకు సేవలందిం చేందుకు ముందుకు రావాలి. నిస్వార్థ వైద్యసేవతో ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతామని వైద్య వృత్తిలోకి వచ్చే ప్రతిఒక్కరూ గుర్తించాలి.
ఊరికి పేరు తేవాలని !
Published Fri, Dec 19 2014 1:59 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement