సాక్షి, కర్నూలు : కొంత కాలంగా అలకబూనిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. రైతులు పంట సాగుకు పొలం బాట పడుతున్నారు. మూడు రోజుల నుంచి కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు, గూడూరు, బెళగల్, కోడుమూరు మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో వ్యవసాయ పనుల్లో రైతన్నలు నిమగ్నమయ్యారు. ఈఏడాది నియోజకవర్గంలో ఎక్కువగా పత్తి, వేరుశనగ, కందులు, ఉల్లి, శనగ, మొక్కజొన్న, పంటలను సాగు చేస్తున్నారు.
నకిలీ విత్తనాలతో బెంబేలు ..
పంటలు సాగు చేసుకోవడానికి అవపసరమైన విత్తనాల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని కంపెనీ యజమానులు ఆసరా చేసుకుని నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. గతంలో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అలాంటి విత్తనాలు అమ్మి రైతన్నలను మోసం చేశారు. ఈ ఏడాది మళ్లీ అలాంటి మోసం జరగకుండా వ్యవసాయ అధికారులు చర్యలు చేపటాలని పలువురు రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment