Northwest monsoons
-
వర్షం కురిసే..పొలం పిలిచే..
సాక్షి, కర్నూలు : కొంత కాలంగా అలకబూనిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. రైతులు పంట సాగుకు పొలం బాట పడుతున్నారు. మూడు రోజుల నుంచి కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు, గూడూరు, బెళగల్, కోడుమూరు మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో వ్యవసాయ పనుల్లో రైతన్నలు నిమగ్నమయ్యారు. ఈఏడాది నియోజకవర్గంలో ఎక్కువగా పత్తి, వేరుశనగ, కందులు, ఉల్లి, శనగ, మొక్కజొన్న, పంటలను సాగు చేస్తున్నారు. నకిలీ విత్తనాలతో బెంబేలు .. పంటలు సాగు చేసుకోవడానికి అవపసరమైన విత్తనాల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని కంపెనీ యజమానులు ఆసరా చేసుకుని నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. గతంలో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అలాంటి విత్తనాలు అమ్మి రైతన్నలను మోసం చేశారు. ఈ ఏడాది మళ్లీ అలాంటి మోసం జరగకుండా వ్యవసాయ అధికారులు చర్యలు చేపటాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
నెలాఖరు వరకు మోస్తరు వర్షాలే!
- పలుచోట్ల గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం - వచ్చే నెల నుంచి బలపడనున్న రుతుపవనాలు సాక్షి, హైదరాబాద్/ విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయన్నారు. ఫలితంగా పలుచోట్ల గాలులతో కూడిన వానలు, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వచ్చే నెల నుంచి మళ్లీ రుతుపవనాలు పుంజుకుంటాయని, దీంతో మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సెప్టెంబర్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందన్నారు. తమ అంచనా ప్రకారం ఈసారి సీజన్ ఆశాజనకంగానే ఉందని చెప్పారు. రుతుపవనాలు ప్రస్తుతం ఉత్తర భారతం వైపు వెళ్లాయని, అది సాధారణంగా సీజన్లో జరిగే ప్రక్రియేనన్నారు. కాగా, రాష్ట్రంలో గత 24 గంటల్లో హన్మకొండలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అక్కడ సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా నమోదైంది. హైదరాబాద్, రామగుండంలలో సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం పంజాబ్ నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి చురుగ్గా ఉందని పేర్కొంది.