నెలాఖరు వరకు మోస్తరు వర్షాలే! | Normal rains to be raised end of this month | Sakshi
Sakshi News home page

నెలాఖరు వరకు మోస్తరు వర్షాలే!

Published Mon, Jul 18 2016 2:49 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

నెలాఖరు వరకు మోస్తరు వర్షాలే!

నెలాఖరు వరకు మోస్తరు వర్షాలే!

- పలుచోట్ల గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
- వచ్చే నెల నుంచి బలపడనున్న రుతుపవనాలు

 
 సాక్షి, హైదరాబాద్/ విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయన్నారు. ఫలితంగా పలుచోట్ల గాలులతో కూడిన వానలు, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వచ్చే నెల నుంచి మళ్లీ రుతుపవనాలు పుంజుకుంటాయని, దీంతో మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందన్నారు. తమ అంచనా ప్రకారం ఈసారి సీజన్ ఆశాజనకంగానే ఉందని చెప్పారు.
 
 రుతుపవనాలు ప్రస్తుతం ఉత్తర భారతం వైపు వెళ్లాయని, అది సాధారణంగా సీజన్‌లో జరిగే ప్రక్రియేనన్నారు. కాగా, రాష్ట్రంలో గత 24 గంటల్లో హన్మకొండలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అక్కడ సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా నమోదైంది. హైదరాబాద్, రామగుండంలలో సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం పంజాబ్ నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి చురుగ్గా ఉందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement