సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులకు సంబంధించి క్లాస్ 12 విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో పరీక్ష జరగకూడదనే కారణంగానే అతడు బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తేల్చారు. బాంబు బెదిరింపులకు సంబంధించి సదరు విద్యార్థే ఆరు సార్లు మెయిల్స్ పంపినట్టు గుర్తించారు.
ఇటీవలి కాలంలో ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం తనిఖీలు చేసింది. ఈ నేపథ్యంలో బెదిరింపు మెయిల్స్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఓ పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థినే పలుమార్లు బెదిరింపులకు కారణమని గుర్తించారు. దీంతో, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పాఠశాలలో పరీక్ష జరగకూడదనే అతడు బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తేల్చారు. ఈ విద్యార్థే ఆరుసార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్టు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. సదరు బాలుడు ఎంతో ప్లాన్ ప్రకారం ఇలా చేసినట్టు తెలుస్తోంది. ప్రతిసారీ అతడు.. తన సొంత పాఠశాలలను కాకుండా వేరే పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ పంపించాడు. అనుమానం రాకుండా ఉండటానికి ఇలా చేసినట్టు అధికారులు వెల్లడించారు. అతను ఒకసారి 23 పాఠశాలలకు మెయిల్ పంపాడని అధికారులు తెలిపారు.
మరోవైపు.. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయం సైతం వేడెక్కింది. శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి అతిషి.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను విమర్శించడంతో బాంబు బెదిరింపులు రాజకీయ వివాదానికి దారితీశాయి. ఈ క్రమంలో ఆప్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment