schools bandh
-
వాయు కాలుష్యం.. పాఠశాలలు బంద్
-
Heavy Rains: రెడ్ అలర్ట్ జారీ.. విద్యాసంస్థలకు సెలవులు
కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్, ఎర్నాకులం, వాయనాడ్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వాతావరణం అనుకూలించే వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని అధికార యంత్రాంగం ఆదేశించింది.ఉత్తర మలప్పురం, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదే విధంగా ఎర్నాకుళం, త్రిసూర్, పాలక్కాడ్, ఇడుక్కి, కోజికోడ్, వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.కొట్టాయం జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలులతో చెట్లు కూలడంతో ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి.ఉత్తర కోజికోడ్‌లోని ఓంచియం, కొత్తూర్, పయ్యోలి తదితర గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.మూజియార్ డ్యామ్ షట్టర్లు పెంచినందున దాని పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పాతనంతిట్ట జిల్లా అధికారులు కోరారు. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడం, వాహనాలు సరిగా కనిపించకపోవడం వల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని తెలిపింది. -
ముంబైను వణికించిన భారీ వర్షాలు.. 6 గంటల్లో 300 మి. మీ వర్షం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో ముంబైతోపాటు పక్కనే ఉండే థానే, పాల్ఘర్, రాయ్ గడ్ ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. నడుములోతు నీళ్లలో పలువురు ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేవలం ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా 300 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. దీంతో భారత వాతావరణ శాఖ ముంబై,, థానే, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ము, న్సిపల్ పాఠశాలలతోపాటు కళాశాలలకు సెలవులు ప్రకటించారు.#WATCH | Maharashtra: The traffic slows down on Western Express Highway near Vile Parle as heavy rain lashes Mumbai city. pic.twitter.com/aAzQaayTqO— ANI (@ANI) July 8, 2024 భారీ వర్షాలు, వరదల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, కుర్లా–విక్రోలీ, బంధూప్ స్టేషన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. డోంబివిలీ స్టేషన్లో ప్రజలు నీట మునిగిన ట్రాక్‌లపై రైళ్ల కోసం వేచి ఉన్నారు. వర్లీ, బుంటారా భవన్, కుర్లా ఈస్ట్, ముంబైలోని కింగ్స్ సర్కిల్ ప్రాంతం, దాదర్, విద్యావిహార్ రైల్వే స్టేషన్లలో నీరు నిలిచిపోయింది. కాగా ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గడ్‌లలో ప్రతిరోజూ 30 లక్షల మంది ప్రయాణికులు సబర్బన్ లోకల్ రైలు సేవలను ఉపయోగిస్తుంటారు.'బెస్ట్' బస్ ట్రాన్స్ పోర్ట్ సైతం భారీ వర్షాల కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో బస్సులను దారిమళ్లించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక జాబితాను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇక థానే, వసాయ్ (పాల్ఘర్), మహద్ (రాయ్ గడ్), చిప్లున్ (రత్నగిరి), కొల్హాపూర్, సంగ్లీ, సటారా, ఘట్కోపర్, కుర్లా, సింధుదుర్గ్ లలో వరద సహాయ చర్యలను చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం మోహరించింది. ముంబైలోని అంధేరీలో మూడు బృందాలతోపాటు నాగ్ పూర్ లో అదనపు బృందాలను సిద్ధంగా ఉంచింది.ఒక్క రోజు వర్షానికే ముంబై వణికిపోగా.. వచ్చే మూడు రోజులపాటు ముంబైతోపాటు మహారాష్ర్టలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 4.4 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. -
కుండపోత వర్షాలు.. స్కూళ్లు బంద్
చెన్నై: తమిళనాడులోని చెన్నైతో సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. వరదనీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడ చూసిన వర్షపు నీరే దర్శనమిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై, చెంగల్పట్టు, రాణిపేట్, కంచిపురం జిల్లాలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు బుధవారం విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. అదే విధంగా తిరువళ్లూర్‌లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. చెన్నైతోపాటు పలు జిల్లాల్లో బుధవారం రాత్రి కూడా భారీ వర్షం నమోదైంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్‌లోని అనేక వీధులు దాదాపు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. వర్షానికి సంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డిసెంబర్ 2, 3 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆ తమిళనాడులోని 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణశాఖ జారీ చేసిన తుఫాను హెచ్చరికల నేపథ్యంతో అరక్కోణం పట్టణంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. Be alert and prepared! 🌧️ Tamil Nadu, Puducherry, and Karaikal are likely to get isolated heavy to very heavy rainfall (115.6 to 204.4 mm) between 2nd & 3rd December. Get ready and stay safe! pic.twitter.com/akUAcBKnsb — India Meteorological Department (@Indiametdept) November 29, 2023 వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అనేక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని, అత్యవసర సర్వీసుల సిబ్బంది హై అలర్ట్‌గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని తప్పనిసరి అయితే తప్ప బయటకు రావొద్దని చెప్పారు. -
ఢిల్లీ: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. స్కూల్స్ బంద్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. వరుసగా మూడోరోజు వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. ఆదివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 401కి చేరింది. మరోవైపు.. శనివారం జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618కి పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో, అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని ప్రైమరీ స్కూల్స్‌ను నవంబర్ 10వ తేదీ మూసివేస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, విద్యాశాఖ మంత్రి అతిషి తెలిపారు. అలాగే, 6-12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. "As pollution levels continue to remain high, primary schools in Delhi will stay closed till 10th November. For grade 6-12, schools are being given the option of shifting to online classes," tweets Delhi Education Minister Atishi pic.twitter.com/fNw8DeKgbP — ANI (@ANI) November 5, 2023 మరోవైపు.. ఢిల్లీలో గాలిలో విషవాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయిలో ఉండటం.. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) జారీ చేసిన ప్రమాణాల కంటే 80 రెట్లు అధికం. ఈ గాలిని పీల్చడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. రెండు వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యానికి కారణమయ్యాయి. #WATCH | Delhi: ANI drone camera footage from the Kalindi Kunj area shows a thick layer of haze in the air. Visuals shot at 9:15 am today. The air quality in Delhi continues to be in the 'Severe' category as per CPCB (Central Pollution Control Board). pic.twitter.com/6yfIjGq0kV — ANI (@ANI) November 5, 2023 #WATCH | The air quality in Delhi continues to be in the 'Severe' category as per CPCB (Central Pollution Control Board). (Visuals from Chanakyapuri area, shot at 8:40 am) pic.twitter.com/aWTVUauThG — ANI (@ANI) November 5, 2023 -
కర్ణాటక బంద్ ఎఫెక్ట్: స్కూల్స్ మూసివేత.. 44 విమానాలు రద్దు
సాక్షి, చెన్నై: కావేరి జలాల సమస్య కారణంగా కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం బంద్ కొనసాగుతోది. పొరుగున్న ఉన్న తమిళనాడుకు కావేరి నీటి విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అధారిటీ (CWMA) కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ ఒక్కూట రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందుకు దాదాపు 1900 కన్నడ సంఘాలు మద్దతు తెలిపాయి. వీటిలో హోటళ్లు, సినీరంగం, ప్రైవేటు క్యాబ్‌లు, ఆటో సంఘాలు, ప్రైవేటు విద్యాసంఘాలు ఉన్నాయి. బంద్‌లో భాగంగా నిరసనల్లో పాల్గొన్న వివిధ సంఘాలకు చెందిన 60 మంది ఆందోళనకారులను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని బెంగళూరు రూరల్ ఏఎస్పీ మల్లికారంరోజున బాలదండి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్ణాటక బంద్ ఎఫెక్ట్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై పడింది. బంద్ కారణంగా రవాణా సౌకర్యాలు దెబ్బతినడంతో శుక్రవారం ప్రయాణించాల్సిన ఏకంగా 44 విమానాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో 22 విమానాలు బెంగుళూరులో ల్యాండ్ అయ్యేవి కాగా మరో 22 విమానాలు ఇక్కడి నుంచి టేకాఫ్ కావాల్సినవి ఉన్నాయి. ప్రయాణికులకు సకాలంలో సమాచారం అందించడం ద్వారా వారు తమ టికెట్లను రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ ప్రభావం కొనసాగనుంది. బెంగళూరు నగరంలో పోలీసులు సెక్షన్ 144 విధించారు. ప్రజలు గుంపులుగా బయటకు వచ్చి ర్యాలీలు, నిరసనలు చేపట్టకూడదని, అయిదుగురు కంటే ఎక్కువ మంది సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. 1,900కు పైగా సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి. బెంగళూరుతో సహా రాష్ట్రంలో కిరాణా దుకాణాలు, ఇతర షాప్‌లను మూసేశారు. అయితే ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, ఫార్మసీలు వంటి అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. Karnataka Bandh: Section 144 Imposed in Mandya District; Schools, Colleges Closed#BNN #Newsupdate #Dailynews #Breakingnews #India #KarnatakaBandh #CauveryIssue #Bengaluru #Cauveryrow #Karnataka #WATCH pic.twitter.com/XxoBNFwLni — Rafia Tasleem (@rafia_tasleem) September 29, 2023 బెంగళూరులో మెట్రో సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. మెట్రో స్టేషన్ల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్ణాటక బంద్ దృష్ట్యా బెంగళూరులోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బెంగళూరు డిప్యూటీ కమిషనర్ దయానంద కేఏ సెలవు ప్రకటించారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పరీక్షలను వాయిదా వేశారు. కాగా బంద్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర రవాణ బస్సులు, బీఎంటీసీ బస్సులు నడవనున్నాయి. అయితే తమిళనాడు వైపు వెళ్లే బస్సులు నడవకపోవచ్చని, పరిస్థితిని బట్టి మారుతుంటాయని అధికారులు పేర్కొన్నారు. బెంగళూరులోని ప్రధాన రహదారులపై, ముఖ్యంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పాడే అవకాశం ఉందన్నారు. Actor #Siddharth was forced to leave a press conference he was attending of #Tamil movie "#Chiththa" on #September 28, due to angry #protestors over the #Cauverywater dispute. pic.twitter.com/qviXRWcgLM — Madhuri Adnal (@madhuriadnal) September 28, 2023 ఓలా ఉబర్ వంట క్యాబ్ యాజమాన్యాలు బంద్‌కు మద్దతునిచ్చాయి. ర్యాలీలో పాల్గొనాలని భావించాయి. ఆటో, రక్షా సంఘాలు కూడా సంఘీభావం తెలిపాయి. 32 ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కర్ణాటక బంద్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కర్ణాటక హోటల్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది. ఇక శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి సినిమాలను ప్రదర్శించబోమని కర్ణాటక ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
తెలంగాణలో రేపు పాఠశాలల బంద్
అనంతగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. -
కుండపోత వర్షాలు..ఆరు జిల్లాల్లో పాఠశాలలు బంద్..
చెన్నై:తమిళనాడుని కుండపోత వర్షాలు అతలాకుతలం చేశాయి. ఉరుములు మెరుపులతో కూడిన ఎడతెరిపి లేని వర్షంతో కాలనీలన్నీ నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. చెన్నై దాని చుట్టు పక్కల జిల్లాల్లో విపరీతంగా వర్షం సంభవించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కాంచీపురం, తిరువళ్లూరు, వెల్లూరు, చెంగళ్పట్టు, రాణిపెట్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. చెన్నైలో సోమవారం ఉదయం వరకే 14 సెంటీమీటర్ల వర్షం సంభవించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన మరిన్ని వర్షాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకూలాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెన్నై అంతర్జాతీయ విమానశ్రయంలో రన్‌వేపై నీరు చేరడంతో 10 విమానాలను బెంగళూరుకు మళ్లించారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి:తమిళనాడులో ఘోర ప్రమాదం.. 70 మందికి గాయాలు. -
సగం రాష్ట్రాలకు వడగాల్పుల వెతలు
న్యూఢిల్లీ: సూర్య ప్రతాపానికి దాదాపు సగం భారతదేశ రాష్ట్రాలు చెమటతో తడిసి ముద్దవుతున్నాయి. భానుడి భగభగలతో మొదలైన వడగాల్పులు మరో 3–4 రోజులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వేడి వేడి వార్తను పట్టుకొచ్చింది. మండే ఎండలను భరిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. రుతుపవనాలు తలుపుతట్టినా వడగాల్పులు మాత్రం వదిలిపోవట్లేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలుసహా విదర్భ ప్రాంతాల్లో తీవ్రస్థాయి నుంచి అతి తీవ్రస్థాయిలో వడగాల్పుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే బిహార్‌లో రెడ్అలర్ట్ను ప్రకటించారు. శనివారం(జూన్ 17)దాకా జార్ఖండ్‌లో స్కూళ్లు తెరుచుకోనేలేదు. ఛత్తీస్‌గఢ్, గోవాల్లోనూ ఇదే పరిస్థితి. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ► తెలంగాణ, రాయలసీమ, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం, తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఆదివారం(జూన్ 18న) కూడా వడగాల్పులను భరించాల్సిందే. ► ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, మధ్యప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాలు, తూర్పు యూపీ, బిహార్‌లో మరో రెండు రోజులు ఎండలు మరింత మండుతాయి. ► ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో మరో నాలుగు రోజులపాటు వడగాల్పులు కొనసాగుతాయి. ► పశ్చిమబెంగాల్లోని గంగా పరీవాహక ప్రాంతాలు, జార్ఖండ్‌లో మరో 3 రోజులు ఎండలు మరింత ముదురుతాయి. ► రాత్రిపూట సైతం ఉష్ణోగ్రతలు పైస్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. ► విదర్భ, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతాల్లో ఆదివారం ఈ పరిస్థితులు ఉంటాయి. ► మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లలో రెండు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువే ఉండనున్నాయి. ► మధ్య భారతం, తూర్పు భారతం, దక్షిణ భారతదేశంలో వచ్చే మూడు రోజులూ ఉష్ణోగ్రతల్లో మార్పేమీ ఉండదు. ► ఆ తర్వాత మాత్రం 2–4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గొచ్చు. -
ఏప్రిల్ 4 వరకు అక్కడ స్కూళ్లు బంద్.. కారణమిదే..!
పాట్నా: బిహార్ రోహ్తాస్ జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు 144 సెక్షన్ విధించారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 4వరకు సెలవులు ప్రకటించారు. కోచింగ్ ఇనిస్టిట్యూట్లను కూడా తెరవొద్దని నిర్వాహకులకు తెలిపారు. కేంద్రహోమంత్రి అమిత్‌షా పర్యటనకు ముందు మార్చి 31న నలంద జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఆ తర్వాత రోహ్తాస్ జిల్లాలోనూ గురువారం ఘర్షణలు చెలరేగాయి. శనివారం వరకు ఇవి కొనసాగాయి. ఈనేపథ్యంలోనే ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. పోలీసు బలగాలను రంగంలోకి దించి పటిష్టభద్రతా ఏర్పాట్లు చేశారు. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 50మందినిపైగా అరెస్టు చేశారు. పలుకేసులు నమోదు చేశారు. బిహార్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌షా కూడా శాంతిభద్రతల దృష్ట్యా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. చదవండి: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు..! -
International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ అక్షరాస్యతలో ఇంక వెనుకబడే ఉన్నాం. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. విద్యా రంగంలో నెలకొన్న సవాళ్లతో పాటు పులి మీద పుట్రలా కరోనా మహమ్మారి విసిరిన పంజాతో 100% అక్షరాస్యత సుదూర స్వప్నంగా మారింది. ప్రజల్లో విద్యపై అవగాహన పెంచడానికి యూనెస్కో ప్రతీ ఏడాది సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.1966 నుంచి విద్యపై విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రపంచ నిరక్షరాస్యుల్లో 34% మంది భారత్‌లోనే ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత 2.4 కోట్ల మంది తిరిగి బడిలో చేరలేదు. వారిలో 1.1 కోట్ల మంది అమ్మాయిలున్నారు. కరోనా ప్రభావం కరోనా లాక్డౌన్లతో దేశంలో 15లక్షల స్కూళ్లు మూత పడ్డాయని, 24.7 కోట్ల విద్యార్థులు ఏడాది పాటు చదువుకి దూరమయ్యారని యునెస్కో వెల్లడించింది. తర్వాత కూడా 30% విద్యార్థులు తిరిగి స్కూళ్లలో చేరలేదని చెబుతోంది. సాధించిన పురోగతి ఇదీ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు అక్షరాస్యతలో గణనీయమైన పురోగతి సాధించాం. ఏడేళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్న వారు ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వస్తే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. 1951లో 18.3% ఉన్న అక్షరాస్యత రేటు 2022 వచ్చేసరికి 77.7శాతానికి పెరిగింది. మొదట్లో అక్షరాస్యతలో లింగ వివక్ష అధికంగా ఉండేది. దానిని కూడా క్రమక్రమంగా దాటుకుంటూ వస్తున్నప్పటికీ అమ్మాయిల్లో అక్షరాస్యత ఇంకా సవాళ్లు విసురుతోంది. 1961లో కేవలం 15.4% మంది మహిళా జనాభా అక్షరాస్యులైతే ఆ తర్వాత పదేళ్లకి 1971లో 22% 2001 నాటికి 53.7% , 2022 నాటికి 70శాతం మహిళలు అక్షరాస్యులయ్యారు. అన్నింటికంటే మైనార్టీ విద్యార్థుల్లో డ్రాప్అవుట్ల నివారించడంలో భారత్ కొంతమేరకు విజయం సాధించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం 2015–16లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు దాదాపుగా 9% ఉన్న డ్రాపవుట్లు 2020–21కి 0.8శాతానికి తగ్గాయి. ప్రాథమిక పాఠశాలలు 10 రెట్లు పెరిగాయి. ఎదురవుతున్న సవాళ్లు సంపూర్ణ అక్షరాస్యత సాధనకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పేదరికం, తల్లిదండ్రుల అవగాహన లేమి, లింగ, కుల వివక్ష, సదుపాయాల లేమి, సాంకేతిక పరిజ్ఞానం అందకపోవడం వంటివన్నీ భారత్‌లో అనుకున్న స్థాయిలో అక్షరాస్యతను పెంచలేకపోతున్నాయి. గ్రామీణ నిరుపేదలకు స్కూళ్లు అందుబాటులో ఉండటం లేదు. పూట గడవని ఉండే కుటుంబాలు పిల్లల్ని పలక బలపం బదులు పలుగు పార పట్టిస్తున్నారు. దేశంలో ఏకంగా కోటి మంది చిన్నారులు బడికి వెళ్లడానికి బదులుగా బాలకార్మికులుగా మారారు. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత 87.7% ఉంటే గ్రామీణ భారతంలో 73.5% ఉన్నట్టుగా నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక చెబుతోంది. దీనికి కారణం గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులకే అక్షరజ్ఞానం లేకపోవడంతో వారికి చదువు ప్రాధాన్యం గురించి తెలియక పిల్లల్ని బడికి పంపించడం లేదు. అమ్మాయిల్లో అక్షరాస్యత తక్కువగా ఉండడానికి బాల్య వివాహాలు, పాఠశాలల్లో టాయిలెట్ సదుపాయం లేకపోవడమే ప్రధాన కారణాలని పలు సర్వేల్లో తేలింది. ఇప్పటికీ దేశంలో 40% పాఠశాలల్లో టాయిలెట్ సదుపాయం లేదు. జీడీపీలో 6% విద్యా రంగానికి ఖర్చు చేస్తేనే అక్షరాస్యత రేటు పెరుగుతుందని నిపుణులు సూచిస్తూ ఉంటే 3% కూడా పెట్టడం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నేడు(సోమవారం) దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థలు, రైల్వే స్టేషన్ల వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా.. అగ్నిపథ్ పథకానికి నిరసనగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) జార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జార్ఖండ్‌లోని అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్బంగా పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సంస్థలు పిలుపునిచ్చిన బంద్ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు సోమవారం మూసివేయాలని నిర్ణయించాము. పాఠశాల విద్యార్థులకు, ముఖ్యంగా బస్సులో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు తల్తెతకుండా ఉండేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీహార్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న కారణంగా 20జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. పంజాబ్‌లో కూడా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పోలీసుల అలర్ట్ ప్రకటించారు. యూపీలోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. జైపూర్, నోయిడాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. All schools in Jharkhand will remain closed today in view of the #BharatBandh protests. #AgnipathProtests #AgnipathScheme https://t.co/I2m9R2IM59 — India.com (@indiacom) June 20, 2022 ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే లవ్ ఎఫైర్.. సెక్స్ రాకెట్ బట్టబయలు -
భారీ వర్షాలు: 15 జిల్లాలకు రెడ్ అలెర్ట్..
చెన్నై(తమిళనాడు): తమిళనాడును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే.. అల్పపీడనం ప్రభావంతో చెన్నై లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రాష్ట్రప్రభుత్వం.. చెన్నై తో పాటు 15 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ను ప్రకటించింది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్ పట్టు, విల్లుపురం జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుకోట్టై, తిరువారురు,తేన్ కాశీ, తిరు నల్వేలి, కన్యాకుమారి, మధురై, రామనాధపురం, శివ గంగై జిల్లాలో వర్షం ముప్పు పొంచిఉన్నట్లు వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దీంతో.. చెన్నై నగరంలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా 12 జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అదే విధంగా.. కన్యాకుమారి, చెన్నై ప్రాంతాలలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. భారీ వర్షాలకు కావేరి నది, వైగై, థెన్- పెన్నై, భవానీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. -
1 నుంచి 9వ తరగతి వరకు అందరూ పాస్
సాక్షి, అమరావతి: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు స్కూల్స్ బంద్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2020–21) 1 నుంచి 9వ తరగతి వరకు అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్ని మంగళవారం నుంచి మూసివేశామని, ఈ తరగతుల వారికి సోమవారమే చివరి వర్కింగ్ డే అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులందరినీ ఎటువంటి పరీక్షలు లేకుండా పాస్ చేస్తూ పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నామని, వీరికి వేసవి సెలవులు ప్రకటించామని, డ్రై రేషన్‌ను పంపిణీ చేస్తామని వివరించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పదో తరగతి క్లాసులను, పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి బోధించే టీచర్లు హెడ్మాస్టర్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం స్కూల్స్‌కు హాజరుకావాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు స్కూల్స్‌లోనే పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. -
ఆంధ్రప్రదేశ్: 1 నుంచి 9 తరగతులకు స్కూళ్లు బంద్
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లను మూసివేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలను మాత్రం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యథావిధిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. జూనియర్ కాలేజీల హాస్టళ్లు కూడా వార్షిక పరీక్షల వరకే తెరిచి ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని, మాస్కు ధరించకుంటే రూ.100 ఫైన్ విధించాలని ఆదేశించారు. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లలో భౌతిక దూరం పాటించటాన్ని తప్పనిసరి చేయాలని సూచించారు. కోవిడ్ నియంత్రణ చర్యలపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 9వ తరగతి వరకు స్కూళ్లను మూసివేస్తున్నందున టెన్త్ విద్యార్థులను భౌతిక దూరం పాటించేలా దూర దూరంగా కూర్చోబెట్టి బోధన కొనసాగించవచ్చనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఇంటర్ ప్రాక్టికల్స్ కూడా పూర్తి కావస్తున్నందున ఈ దశలో ఆపాల్సిన అవసరం లేదని నిర్ణయించారు. సమావేశంలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. 104 కాల్ సెంటర్‌కు విస్తృత ప్రచారం.... – 104 కాల్ సెంటర్‌కు మరింత విస్తృత ప్రచారం కల్పించాలి. కోవిడ్ సమస్యలన్నిటికీ ఆ నెంబరు పరిష్కార కేంద్రంగా ఉండాలి. – కన్వెన్షన్ సెంటర్లలో జరిగే ఫంక్షన్లలో రెండు కుర్చీల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూడాలి. – సినిమా థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీగా ఉంచాలి. – ఆస్పత్రులలో మంచి వైద్య సదుపాయాలు, వైద్యులు, శానిటేషన్ పక్కాగా ఉండేలా చూడాలి. – గ్రామాలు, వార్డులలో ఇప్పటికే వలంటీర్ల ద్వారా సర్వే చేపట్టి ఎవరైనా జ్వరంతో బాధ పడుతున్నా, అలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు నిర్వహిస్తున్నాం. – అన్ని ఆస్పత్రులలో తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండాలి. విశాఖలోని ప్లాంట్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలి. అవసరమైతే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టండి. ఆక్సిజన్ సరఫరాకు ఒప్పందం రోజూ 310 టన్నుల ఆక్సిజన్ సరఫరాకు ఒప్పందాలు చేసుకున్నట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 146 ఆస్పత్రులలో 26,446 ఆక్సిజన్ సదుపాయాలున్న బెడ్లు ఉండగా పూర్తిస్థాయిలో సేవలకు రోజూ 347 కిలోలీటర్ల ఆక్సిజన్ అవసరం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో 577 కిలోలీటర్ల పూర్తి స్థాయి ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం ఉందని, అది అన్ని ఆస్పత్రులకు ఒకటిన్నర రోజులకు సరిపోతుందన్నారు. అన్ని కోణాల్లో చర్చించాకే నిర్ణయం: మంత్రి సురేష్ ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవని సమావేశం అనంతరం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అన్ని కోణాల్లో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయన్నారు. స్కూళ్లలో శానిటేషన్ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇంటర్ ప్రాక్టికల్స్ జరిగే చోట కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కరోనా అలర్ట్ : స్కూల్స్ మూసివేత
బెంగళూర్ : పొరుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసిన క్రమంలో కర్ణాటక ప్రభుత్వం బెంగళూర్‌లో ప్రాథమిక విద్యా పాఠశాలలకు సెలవలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక హెల్త్ కమిషనర్ పంకజ్ కుమార్ పాండే సూచనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యారోగ్య శాఖ సిఫార్సులకు అనుగుణంగా బెంగళూర్ నార్త్, సౌత్, గ్రామీణ జిల్లాల్లో కేఎజ్‌జీ, యూకేజీ తరగతులకు సెలవలు ప్రకటిస్తున్నామని కర్ణాటక ప్రాథమిక విద్యా శాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్ ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో బెంగళూర్ నగరంలో తక్షణమే ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను మూసివేయాలని హెల్త్ కమిషనర్ పాండే రాష్ట్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్ఆర్ ఉమాశంకర్‌కు లేఖ రాశారు. చదవండి : కరోనాను పాటతో వెళ్లగొడుతున్నారు.. -
114 స్కూళ్లకు మంగళం..?
కరీంనగర్‌ఎడ్యుకేషన్: అంతా ఊహించినట్లే జరుగుతోంది.. పాఠశాలలను హేతుబద్ధీకరణ చేయాలనే ప్రభుత్వం నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. తద్వారా గ్రామీణ పేద పిల్లలకు విద్య అందని ద్రాక్షగా మారనుంది. స్కూళ్లు మూతపడి మిగులుబాటుగా మారే ఉపాధ్యాయుల పరిస్థితి గందరగోళం కానుంది. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించాల్సిన విద్యాశాఖ అధికారులు ఆ దిశగా కృషి చేయకుండా విద్యార్థులు రావడం లేదన్న సాకుతో రేషనలైజేషన్‌లో పాఠశాలలను మూసి ప్రభుత్వ విద్యకు మంగళం పాడేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే విద్యార్థులు తక్కువ ఉన్న పాఠశాలలు కనుమరుగు కానుండగా, ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లోకి, వేరే ప్రభుత్వ శాఖల్లోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా జిల్లా విద్యాశాఖ అధికారులతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఈ నెల 11న డీఈవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ గురించి వివరిస్తూనే ఉన్న ఫలంగా సమాచారాన్ని పంపించాలని కోరడంతో మళ్లీ పాఠశాలల హేతుబద్ధీకరణ అంశం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు లేని పాఠశాలలను మూసివేస్తూ తక్కువగా ఉన్న పాఠశాలల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉంటాయో.. ఎన్ని మూతపడుతాయో తెలియని గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరుగా ఉత్తర్వులు జారీ అయితే జిల్లాలో 114 పాఠశాలలు మూతబడనున్నాయి. బడిబాట కార్యక్రమం ముగిసేలోగా పక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం భావించడంతో జూన్ 19లోగా పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తయి ఒకే గ్రామంలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, అదే గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 650 ఉన్నాయి. 37,773 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పదిలోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 60 వరకు ఉన్నట్లు యుడైస్ నివేదికలో వెల్లడయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 20లోపు విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు 16 వరకు ఉన్నాయి. 30లోపు విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలు 16 నుంచి 20 వరకు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు లెక్కలే చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వం హేతుబద్ధీకరణ ఉత్తర్వులు జారీచేస్తే జిల్లాలో 114 పాఠశాలలు మూతపడుతాయి. యూపీఎస్‌లలో సైతం 30మంది లోపు ఉన్న వాటిని సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలన్న నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యే ప్రమాదం ఉంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని బాలికలు సమీప ఉన్నత పాఠశాలల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపక చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. దీంతో బాలికల విద్యకు ఆటంకం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో వేసవి సెలవుల్లో రేషనలైజేషన్ పేరిట చేసిన సంస్కరణల్లో ఇప్పటికే జిల్లాలో 850 మంది ఎస్జీటీలు మిగులుగా ఉండి డీఈఓ ఆధీనంలో ఉండడంతో వారిని జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ సర్దుబాటు చేసి ఈ విద్యా సంవత్సరం మమ అనిపించారు. తాజాగా మళ్లీ 114 స్కూళ్లు మూతపడితే మిగులుబాటుగా ఉండే ఎస్జీటీలను ఎలా సర్దుబాటు చేస్తారో ప్రభుత్వమే తెల్చాల్సి ఉంది. నిరుద్యోగుల ఆశలు ఆడియాశలే... టీచర్ పోస్టు కొట్టాలనుకుంటున్న నిరుద్యోగుల్లో బడుల హేతుబద్ధీకరణ నిర్ణయం నిరాశ వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకొని టీచర్ జాబ్‌కొట్టాలనే టీఆర్టీ అభ్యర్థుల భవిష్యుత్ ప్రశ్నార్థకమైంది. రేషనలేజేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత చాలామంది ఉపాధ్యాయులు మిగులే పరిస్థితి ఉంటుందనే భావన అందరిలో ఉండడంతో టీఆర్టీ అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఉత్తర్వులు అందలేదు... ఇటీవల జరిగిన వీడియో కాన్పరేన్స్లో పాఠశాలల హేతుబద్ధీకరణ విషయంపై చర్చ జరిగిన మాట వాస్తవమే. ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధివిధానాలు అందాల్సి ఉంది. గతంలో సూచించిన విధంగా జిల్లాలో విద్యార్థుల, పాఠశాలల పరిస్థితిని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు అందజేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామనే భరోసాను తల్లిదండ్రులకు కల్పించాల్సి ఉంది. అందుకు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా సహకరిస్తే సాధ్యమవుతుంది. రేషనలైజేషన్ జీవో అందాక ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. – వెంకటేశ్వర్లు, డీఈవో ప్రభుత్వ నిర్ణయం గర్హనీయం సంస్కరణల పేరిట విద్యారంగాన్ని అథోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగం నుంచి తప్పుకునేందుకే తహతహలాడుతోంది. గ్రామీణ పేద విద్యార్థుల కోసం విద్యాహక్కు చట్టంలో ఉన్న నిబంధనలను తప్పకుండా పాటించాల్సిన ప్రభుత్వం చట్టానికి తూట్లు పొడుస్తోంది. తరగతి గదికో ఉపాధ్యాయుని నియమించి, బోధన, బోధనేతర, పర్యవేక్షణ సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం విద్యార్థులు లేరని సాకుతో బడులను మూసివేయడం మంచి పరిణామం కాదు – గవ్వ వంశీధర్‌రెడ్డి, ఏఐఎస్బీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకం ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ఎస్టీయూ వ్యతిరేకం. విద్యాహక్కు చట్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. బడుల మూసివేత వల్ల పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకోంది. రేషనలైజేషన్ ప్రక్రియను నిలిపివేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసి ప్రభుత్వ బడులను సంస్కరించాల్సిందిపోయి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా వ్యవహరించడం బాధాకరం. – కటుకం రమేశ్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పేద విద్యార్థులకు పెనుశాపం... పాఠశాలల మూసివేత పేద విద్యార్థులకు పెనుశాపంగా మారనుంది. స్వరాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంగా ఉన్నామని ప్రకటించిన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం. తక్షణమే రేషనలైజేషన్ ప్రక్రియను ఉపసంహరించుకోవాలి. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. – కరివేద మహిపాల్‌రెడ్డి, ఎస్జీటీయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి -
చంద్రబాబు పర్యటన.. స్కూళ్లకు సెలవు
సాక్షి, ప్రకాశం : సీఎం చంద్రబాబు నాయుడు చీరాల పర్యటనకు స్కూల్ బస్సులన్నీ తరలించడంతో విద్యార్ధులకు పాఠశాల యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. చంద్రబాబు మంగళవారం దూబగుంట్ల గ్రామం వద్ద ట్రిపుల్ ఐటీ కళాశాల భూమిపూజ కార్యక్రమానికి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలను భారీ ఎత్తున తరలించేందుకు ప్రైవేటు పాఠశాలల బస్సులను తరలిస్తున్నారు. దీంతో విద్యార్థులకు అనధికారికంగా సెలవు ప్రకటించారు. సీఎం పర్యటన కారణంగా పాఠశాలలకు సెలవు ఇవ్వడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఎక్కువ భాగం నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యలకు సంబంధించిన పాఠశాలలే ఉన్నందున అనధికారికంగా సెలవు ప్రకటించారు. మధ్యాహ్నం 12.30కు సీఎం రామన్నపేట హెలిప్యాడ్‌కు చేరుకుని పందిళ్లపల్లి గ్రామంలో చేనేతలతో ముచ్చటించి ఎంపీపీ స్కూలులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సెయింటాన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బహిరంగసభ జరుగుతుంది. -
నేడు పాఠశాలల బంద్: ఏబీవీపీ
సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ ఉచిత విద్య విధివిధానాలు తక్షణమే ప్రకటించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ మాట్లాడుతూ.. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలన్నారు. కేజీ టు పీజీ విధివిధానాలను ప్రభుత్వం తక్షణమే వెల్లడించాలన్నారు. నేడు జరిగే ఈ పాఠశాలల బంద్‌కు పరీక్షలు రాసే విద్యార్థులకు ఆటంకాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఏబీవీపీ నేతలు శ్రీధర్, రాజేంద్ర ప్రసాద్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. -
రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్
హైదరాబాద్: రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు రాష్ట్ర బాలల హక్కుల సంఘం పిలుపు ఇచ్చింది. నల్లగొండ జిల్లా పెద్దపూర మండలం తుంగతుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని ఏనేమీది తండాలో వీఆర్వో సంస్థ ఆశ్రమంలోని 12 మంది విద్యార్థినులపై అక్కడ పనిచేస్తున్న ట్యూటర్ హరీష్ అత్యాచారాలు చేసిన విషయం తెలిసిందే. ఈ అత్యాచారాలకు నిరసనగా బాలల హక్కుల సంఘం ఆందోళనకు దిగింది. రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చింది. ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ సంస్థ శనివారం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి, ఈ నెల 21వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా ఎస్పీలను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.