
ఈ నెల 26న పాఠశాలల బంద్
అనంతగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.