
చెన్నై:తమిళనాడుని కుండపోత వర్షాలు అతలాకుతలం చేశాయి. ఉరుములు మెరుపులతో కూడిన ఎడతెరిపి లేని వర్షంతో కాలనీలన్నీ నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. చెన్నై దాని చుట్టు పక్కల జిల్లాల్లో విపరీతంగా వర్షం సంభవించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
కాంచీపురం, తిరువళ్లూరు, వెల్లూరు, చెంగళ్‌పట్టు, రాణిపెట్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. చెన్నైలో సోమవారం ఉదయం వరకే 14 సెంటీమీటర్ల వర్షం సంభవించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన మరిన్ని వర్షాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకూలాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెన్నై అంతర్జాతీయ విమానశ్రయంలో రన్‌వేపై నీరు చేరడంతో 10 విమానాలను బెంగళూరుకు మళ్లించారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:తమిళనాడులో ఘోర ప్రమాదం.. 70 మందికి గాయాలు.
Comments
Please login to add a commentAdd a comment