బెంగళూర్ : పొరుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసిన క్రమంలో కర్ణాటక ప్రభుత్వం బెంగళూర్‌లో ప్రాథమిక విద్యా పాఠశాలలకు సెలవలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక హెల్త్ కమిషనర్ పంకజ్ కుమార్ పాండే సూచనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యారోగ్య శాఖ సిఫార్సులకు అనుగుణంగా బెంగళూర్ నార్త్, సౌత్, గ్రామీణ జిల్లాల్లో కేఎజ్‌జీ, యూకేజీ తరగతులకు సెలవలు ప్రకటిస్తున్నామని కర్ణాటక ప్రాథమిక విద్యా శాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్ ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో బెంగళూర్ నగరంలో తక్షణమే ప్రీకేజీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను మూసివేయాలని హెల్త్ కమిషనర్ పాండే రాష్ట్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్‌ఆర్ ఉమాశంకర్‌కు లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment