స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు.. రంగంలోకి పోలీసులు | Bomb Threat Warning To 2 Delhi Schools Through Emails, Students Sent Back Home | Sakshi
Sakshi News home page

స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు.. రంగంలోకి పోలీసులు

Published Mon, Dec 9 2024 7:57 AM | Last Updated on Mon, Dec 9 2024 10:37 AM

Bomb Threat Warning To Delhi Schools

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు వార్త తీవ్ర కలకలం సృష్టించింది. ఢిల్లీలో పలు స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు, బాంబ్‌ తనిఖీ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. తనిఖీలు చేపట్టారు.

వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఆర్కేపురంలో రెండు పాఠశాలలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. డీపీఎస్‌ ఆర్కేపురం, జీడీ గోయింకా పబ్లిక్‌ స్కూల్స్‌కు సోమవారం ఉదయం ఏడు గంటలకు ఈ-మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు, బాంబ్‌ తనిఖీ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. సదరు పాఠశాల వద్ద తనిఖీలు జరుగుతున్నాయి. బాంబు బెదిరింపుల నేపథ్యంలో పాఠశాలకు వస్తున్న విద్యార్థులను వెనక్కి పంపించారు స్కూల్స్‌ యాజమాన్యం, సిబ్బంది. దీంతో, విద్యార్థులు,  పేరెంట్స్‌లో భయాందోళన నెలకొంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement