సాక్షి, ఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం కలకలం రేపుతున్నాయి. తాజాగా విస్తారా విమానానికి మరో బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న విమానానికి బెదిరింపు మెయిల్ రావడంతో జైపూర్‌లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
కాగా, గురువారం మొత్తం 95 విమానాల సర్వీసుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ వట్టివేనని తేలింది. ఇందులో ఆకాశ ఎయిర్‌కు చెందిన 25, ఎయిరిండియా, ఇండిగో, విస్తారలకు చెందిన 20 చొప్పున, స్పైస్ జెట్, అలయెన్స్ ఎయిర్‌లకు చెందిన ఐదేసి విమానాలు ఉన్నాయి.
దీంతో గడిచిన 11 రోజుల్లో 250కు పైగా సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆగంతకులు చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగం, రక్షణ బలగాలు, విమా నాశ్రయాల సిబ్బందితోపాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు, అసౌకర్యానికి లోనయ్యారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది.
ఇండిగోకు చెందిన హైదరాబాద్– గోవా, కోల్‌కతా–హైదరాబాద్, కోల్‌కతా–బెంగళూరు, బెంగళూరు–కోల్‌కతా, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, బెంగళూరు– ఝర్సుగూడ, హైదరాబాద్–బగ్దోరా, కోచి– హైదరాబాద్ తదితర సర్వీసులున్నాయి. బుధవారం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఉన్న దుమ్నా విమానాశ్రయాన్ని పేల్చి వేస్తానంటూ ఆ ఆగంతకుడు ఫోన్‌లో చేసిన బెదిరింపు వట్టిదేనని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment