Airplanes
-
విస్తారా విమానానికి మరో బాంబు బెదిరింపు
సాక్షి, ఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం కలకలం రేపుతున్నాయి. తాజాగా విస్తారా విమానానికి మరో బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న విమానానికి బెదిరింపు మెయిల్ రావడంతో జైపూర్‌లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.కాగా, గురువారం మొత్తం 95 విమానాల సర్వీసుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ వట్టివేనని తేలింది. ఇందులో ఆకాశ ఎయిర్‌కు చెందిన 25, ఎయిరిండియా, ఇండిగో, విస్తారలకు చెందిన 20 చొప్పున, స్పైస్ జెట్, అలయెన్స్ ఎయిర్‌లకు చెందిన ఐదేసి విమానాలు ఉన్నాయి.దీంతో గడిచిన 11 రోజుల్లో 250కు పైగా సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆగంతకులు చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగం, రక్షణ బలగాలు, విమా నాశ్రయాల సిబ్బందితోపాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు, అసౌకర్యానికి లోనయ్యారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది.ఇండిగోకు చెందిన హైదరాబాద్– గోవా, కోల్‌కతా–హైదరాబాద్, కోల్‌కతా–బెంగళూరు, బెంగళూరు–కోల్‌కతా, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, బెంగళూరు– ఝర్సుగూడ, హైదరాబాద్–బగ్దోరా, కోచి– హైదరాబాద్ తదితర సర్వీసులున్నాయి. బుధవారం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఉన్న దుమ్నా విమానాశ్రయాన్ని పేల్చి వేస్తానంటూ ఆ ఆగంతకుడు ఫోన్లో చేసిన బెదిరింపు వట్టిదేనని తేలింది. -
గల్ఫ్ విమానాలు రన్‌వే పైకి చేరేదెప్పుడో?
ప్రపంచ ప్రఖ్యాత అధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి అంతర్జాతీయ స్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నది కలగానే మిగిలిపోతోంది. రాష్త్ర ప్రభుత్వం దృష్టి సారించినా కేంద్ర ప్రభుత్వం కనికరించలేదు. దీంతో ఉభయ వైఎస్సార్ జిల్లా నుంచి ఎడారి దేశాలకు విమానాల్లో తిరగవచ్చుననే గల్ఫ్ వాసుల కల నెరవేరడంలేదు. రాజంపేట: రాయలసీమలో ప్రధానంగా ఉభయ జిల్లాల నుంచి ఎడారి దేశాలకు వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. రాజంపేట, రాయచోటి, కడప, బద్వేలు, రైల్వేకోడూరుతోపాటు ఉభయ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి 2 లక్షల మందికి పైగా ఎడారి దేశాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా కువైట్, ఖతార్, దుబాయ్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, అబుదాబీ, లెబనాన్, మస్కట్ దేశాలకు ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు. మరింతమంది ఉద్యోగం, విద్య రీత్యా అమెరికా, కెనడా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు వెళ్తున్నారు. వీరు విదేశీయానం చేయాల్సి వస్తే భాష రాని వివిధ రాష్ట్రాలలోని విమానాశ్రయాల వద్ద ఇబ్బంది పడుతున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిలో 60 శాతం మంది చదువు రాని వారు ఉండడంతో మోసాల పాలై జైళ్లలో మగ్గుతున్నారు. గల్ఫ్ దేశాలకు విమానాలు ఎప్పుడో? గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు నాలుగు దశాబ్ధాల కిందట వారాలకొద్దీ సముద్రయానం చేసి ఎడారి దేశాలకు చేరుకునేవారు. గల్ఫ్ దేశాలలో పనిచేస్తే ఖరీదైన జీవితం సాగించవచ్చునని, తమ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావచ్చునని తెలియడంతో అనంతరం ప్రయాణం చేసే వారి సంఖ్య పెరిగింది. వీరంతా విమానాలపై ఆధారపడుతున్నారు. ఇది గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) అంతర్జాతీయ సర్వీసులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేఉ్తన్నాయి. తిరుపతి, రాజంపేట లోక్‌సభ సభ్యులు తమ వంతుగా విమానాలను రన్‌వే మీదకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరుపతి నుంచి విదేశీయానంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కనికరించడం లేదు. వ్యయప్రయాసలతో ప్రయాణం చైన్నె, కర్ణాటక, ముంబయి, హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు వెళ్లే వారు వ్యయ ప్రయాసలతో దూర ప్రాంతాల నుంచి వెళ్లాల్సి వస్తోంది. అనేక మంది బాష రాక ఇబ్బందిపడుతున్నారు. కొందరైతే మోసపోతున్నారు. దూర ప్రయాణంతో అనేక అవాంతరాలు ఎదురై ప్రమాదాల బారిన పడుతున్నారు. అంతేగాక విమాన టికెట్‌తోపాటు ఎయిర్‌పోర్టుకు చేరుకునే ఖర్చులు భరించాలంటే కష్టపడుతున్నారు. 2015లో తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించారు. కానీ ఆ స్థాయిలో కేంద్రప్రభుత్వం విమానాలను తీసుకురాలేదనే అపవాదు ఉంది. విదేశీ విమాన సర్వీసులను ప్రవేశపెట్టాలి రాయలసీమ జిల్లా వాసులకు అందుబాటులో ఉండే తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి విదేశీ విమాన సర్వీసులను ప్రవేశపెట్టాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలి. ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎంపీలు తమ వంతు కృషి చేస్తున్నారు. ఉభయ జిల్లాల నుంచి విదేశాలకు వెళ్లాలంటే ఇతర రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది. త్వరలో విదేశీయానం సులభతరం చేసే బాధ్యత కేంద్రంపై ఉంది. – చొప్పా అభిషేక్‌రెడ్డి, ఈడీ, ఏఐటీఎస్, రాజంపేట గల్ఫ్ విమాన సర్వీసులు తీసుకురావాలి తిరుపతి నుంచే గల్ఫ్ విమానాల సర్వీసులు అందుబాటులోకి తీసుకు రావాల్సి ఉంది. నిత్యం వందలాది మంది ఇతర రాష్ట్రాలలోని ఎయిర్‌పోర్టుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజంపేట ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి తవిదేశీ విమానసర్వీసులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. – గోవిందనాగరాజు, గల్ఫ్‌కో–కన్వీనర్, రాజంపేట -
‘హై’.. రన్ వే!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని జాతీయ రహదారిపై గురువారం చేపట్టిన విమానాల తొలి ట్రయల్ రన్ వియవంతమైంది. పిచ్చకలగుడిపాడు–రేణింగవరం గ్రామాల వద్ద 16వ నంబర్ హైవేపై 4.1 కిలోమీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన రన్‌వే మీదుగా విమానాలు గాల్లోకి దూసుకువెళ్లాయి. నాలుగు ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఒక కార్గో విమానం ఐదు అడుగుల ఎత్తులో తిరుగుతుండగా.. రాడార్ సిగ్నల్స్‌తో పాటు రన్‌వే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనువుగా ఉందా.. లేదా.. అనే విషయాన్ని వైమానిక దళ అధికారులు పరిశీలించారు. సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి ఎప్పటికప్పుడు సూచనలందుకుంటూ ఈ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో రన్‌వే వద్దకు చేరుకున్నారు. విమానాల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఉదయం 10.51 గంటలకు ప్రారంభమైన ట్రయల్ రన్ ప్రక్రియ 45 నిమిషాలపాటు జరిగింది. బాపట్ల జిల్లా పిచ్చకలగుడిపాడు–రేణంగివరం మధ్య హైవేపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ దేశంలోనే మూడవది.. వైమానిక దళ అధికారి ఆర్ఎస్ చౌదరి మాట్లాడుతూ.. ట్రయల్ రన్లో ఎలాంటి సమస్య ఎదురుకాలేదని చెప్పారు. రన్‌వేకు ఇరువైపులా ఫెన్సింగ్, గేట్లు పెట్టిన తర్వాత విమానాల ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై బాపట్ల–నెల్లూరు జిల్లాల మధ్యలో రెండు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలు సిద్ధం చేస్తున్నామన్నారు. కొరిశపాడు మండలంలోని ఈ రన్‌వే.. దక్షిణ భారతదేశంలోనే మొదటిదని.. దేశంలోనే మూడవదని చెప్పారు. వచ్చే ఏడాది దీనిని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లో ఇప్పటికే రెండు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఏపీ, యూపీ, రాజస్తాన్‌తో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, జమ్మూ కశ్మీర్‌లలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. ట్రయల్ రన్లో ఎలాంటి లోపాలు కనిపించలేదని తెలిపారు. కార్యక్రమంలో వాయుసేన అధికారి వి.ఎం.రెడ్డి, ప్రకాశం జిల్లా కలెక్టర్ కె.ఎస్.దినేశ్‌కుమార్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, వాయుసేన అధికారులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ విమానాలూ వచ్చేస్తున్నాయ్!
బైక్‌లు.. కార్లు.. బస్సులే కాదు.. ఎలక్ట్రిక్ విమానాలూ వచ్చేస్తున్నాయి. విమానాల్లో వినియోగించే శిలాజ ఇంధన ధరలు రోజు రోజుకీ పెరుగుతుండటం.. ఇంధన వనరుల వినియోగం సైతం పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయాలపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఏవియేషన్ సంస్థ ‘అలైస్’ పేరిట ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్‌ను ఆవిష్కరించింది. ప్రపంచం చూపును తన వైపునకు తిప్పేసుకుంది. 2024 నాటికి గాలిలో చక్కర్లు కొట్టేందుకు ఎలక్ట్రిక్ విమానాలు సిద్ధమవుతుండగా.. జర్మనీకి చెందిన డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ తన వాణిజ్య కార్యకలాపాల కోసం ఎలక్ట్రికల్ విమానాలు నడిపే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికాకు చెందిన కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు అదే బాటలో పయనిస్తున్నాయి. (కె.జి.రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం): విమానాల్లో ఉపయోగించే సంప్రదాయ ఇంధనం స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాలు వస్తాయా అనే ప్రశ్నకు ఓ సమాధానం దొరికింది. గతంలో కార్బన్ డయాక్సైడ్ నుంచి ఇంధన తయారీ ప్రయోగాలు విజయవంతమైనప్పటికీ సంప్రదాయ ఇంధనం ధరతో పోలిస్తే.. దీని భారం రెట్టింపు అ య్యింది. దీంతో ఆ ప్రయత్నాల్ని వివిధ సంస్థలు విరమించుకున్నాయి. బయో ఇంధనాలు వినియోగంపై ఆలోచనలు చేసినా.. అవన్నీ ప్రయోగాల దశ దాటలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో విమానాలను సైతం విద్యుత్‌తో నడిపించేవిధంగా ప్రయోగాలు చేసిన ఇజ్రాయెల్‌కు చెందిన ఏవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ అనే సంస్థ సత్ఫలితాలు సాధించింది. ఆ సంస్థ ‘అలైస్’ పేరిట తయారు చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ గతేడాది పారిస్‌లో జరిగిన ఎయిర్‌షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. మొట్టమొదటి కమర్షియల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా చరిత్ర సృష్టించింది. దీనిని పౌర విమానయాన సేవలకూ వినియోగించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. 10 వేల అడుగుల ఎత్తులో చక్కర్లు ఇజ్రాయెల్ సంస్థ 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో 2018 నుంచి ఏడాది పాటు శ్రమించి దీనిని తయారు చేసింది. 2021లో ఈ విమానం గాలిలో చక్కర్లు కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అమెరికాలోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దీనికి టెస్ట్ ఫ్లైట్ చేపట్టగా.. 3,500 అడుగుల ఎత్తులో 8 నిమిషాల పాటు గగన విహారం చేసింది. సాధారణ విమానం ముందుకు వెళ్లడానికి రెండు రెక్కలకు రెండు ప్రొపెల్లర్స్ ఉంటాయి. కానీ.. అలైస్‌లో మాత్రం మూడు ప్రొపెల్లర్స్ ఉంటాయి. ఒక ప్రొపెల్లర్ విమానం వెనక భాగంలో ఉంటే, మిగతా రెంటిండినీ చెరో రెక్కకు అమర్చారు. ప్రమాదం తర్వాత.. ప్రయోగాల సమయంలో అలైస్ నమూనాలో 2020 జనవరి 22న అగ్ని ప్రమాదం సంభవించింది. పాసింజర్ ఏరియాలో ఉండే అండర్ ఫ్లోర్ బ్యాటరీ కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాదం తర్వాత విమానం నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వింగ్స్, ఎలక్ట్రికల్ వైరింగ్ ఇంటర్ కనెక్షన్ సిస్టమ్ తయారీ కోసం జీకేఎన్ ఏరోస్పేస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడంతో అలైస్ తయారీ విజయవంతమైంది. సీమెన్స్, మాగ్నిక్స్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ మోటార్లను అలైస్ విమానాల కోసం వినియోగిస్తున్నారు. 60 నుంచి 80 శాతం ఖర్చు ఆదా... ప్రస్తుతం వినియోగిస్తున్న సంప్రదాయ ఇంధనంతో పోలిస్తే విద్యుత్ ఆధారిత విమానం వినియోగంలో ఖర్చు చాలా తక్కువ. ‘సెస్నా కార్వాన్’ అనే ఒక చిన్న విమానం 160 కిలోమీటర్లు ప్రయాణించేందుకు దాదాపు రూ.27 వేల ఇంధనం ఖర్చవుతోంది. కానీ.. అలైస్ ఎలక్ట్రిక్ విమానంలో 160 కిలోమీటర్ల ప్రయాణానికి కేవలం రూ.8 వేల వరకు మాత్రమే ఖర్చవుతోంది. అంటే దాదాపు 60 నుంచి 80 శాతం వరకూ ఖర్చును ఆదా చేసుకోవచ్చు. అందరి చూపూ.. అలైస్ వైపే విమానయాన రంగంలో విప్లవం సృష్టిస్తున్న అలైస్‌ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి. జర్మనీకి చెందిన ప్రఖ్యాత కార్గో సంస్థ డీహెచ్ఎల్ తన సరకు రవాణా కోసం 12 విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చింది. అదేవిధంగా అమెరికాకు చెందిన కేప్ ఎయిర్, గ్లోబర్ క్రాసింగ్ ఎయిర్‌లైన్స్ సంస్థలు సైతం పదుల సంఖ్యలో ఆర్డర్లు బుక్ చేశాయి. 2024 నాటికి పూర్తిస్థాయిలో అలైస్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్‌లు గాలిలో దూసుకుపోతాయని అంచనా వేస్తున్నారు. విమానయాన రంగంలో కర్బన ఉద్గారాల నియంత్రణకు ఎయిర్‌లైన్స్ సంస్థలు అలైస్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. అయితే.. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను అలైస్ అధిగమించగలదా లేదా అనే సందేహాలూ ఉత్పన్నమవుతున్నాయి. -
ఎయిర్‌పోర్టులో విమానాలకు పక్షుల బెడద
కృష్ణా (గన్నవరం): అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు పక్షుల బెడద తప్పడం లేదు. విమానాశ్రయ పరిసరాల్లో డంప్ చేస్తున్న జంతు కళేబరాలు, మాంసం వ్యర్థాలు, చెత్తాచెదారం కారణంగా పక్షుల సంచారం విపరీతంగా పెరిగింది. ఫలితంగా తరచూ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో పక్షుల వల్ల తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గతంలో ఇక్కడ పలుమార్లు విమానాలను పక్షులు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయాల్లో విమానాలకు తృటిలో ప్రమాదాలు తప్పినా అధికారులు మాత్రం అప్రమత్తం కావడం లేదు. ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు విమానాశ్రయ పరిసరాల్లో ఆక్రమ చెత్త డంపింగ్ నివారణపై సమావేశాలు నిర్వహించి హడావుడి చేస్తున్న అధికారులు ఆచరణలో మాత్రం విస్మరిస్తున్నారు. విమానాశ్రయం చుట్టూ ఉన్న గ్రామాలు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలను డంపింగ్ యార్డులుగా ఉపయోగిస్తున్నాయి. విమానాశ్రయ రన్‌వేకు అతిసమీపంలో ఉన్న కొత్తపేట వద్ద పాటిగోతుల్లో మాంసం దుకాణదారులు వ్యర్థాలను మూటలు కట్టి తీసుకువచ్చి పడవేస్తున్నారు. దీనికితోడు జంతు కళేబరాలు, చెత్తా చెదారం యథేచ్ఛగా ఇక్కడ డంప్ చేస్తున్నారు. దీంతో వీటి కోసం వచ్చే గద్దలు పక్కనే ఉన్న రన్‌వేపైకి చేరుతున్నాయి. రాజీవ్‌నగర్‌తో పాటు ఎయిర్‌పోర్టు తూర్పు వైపు ఉన్న వాగు కూడా పక్షుల సంచారానికి కారణమైంది. ఇంకా రాజీవ్‌నగర్ కాలనీ, బుద్ధవరం వైపు విమానాశ్రయ పరిసరాల్లో పారిశుద్ధ్యం మరీ అధ్వానంగా ఉంది. దీనికితోడు విజయవాడ హోటళ్లలోని వ్యర్థాలను రాత్రి వేళల్లో ఆటోల్లో తీసుకువచ్చి కేసరపల్లి, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో డంప్ చేస్తున్నారు. వీటివల్ల పక్షుల సంచారం పెరిగి విమానాల రాకపోకల సమయంలో ఆటంకం ఏర్పడుతోంది. దీనితో పక్షులను బెదరకొట్టేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది బాణసంచా ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. గుణపాఠం నేర్వని అధికారులు గత పదేళ్ల వ్యవధిలో ఇక్కడ విమానాలను ఏడుసార్లకు పైగా పక్షులు ఢీకొన్నాయి. తరచూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పక్షుల వల్ల విమాన పైలెట్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పక్షులు ఢీకొనడం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఎయిర్కొస్తా, జెట్ ఎయిర్వేస్కు చెందిన విమానాలు సర్వీస్‌లు రద్దు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. పక్షులు ఢీకొన్నప్పుడు విమాన రెక్కలు, ఇంజన్ భాగాలు దెబ్బతిని సదరు విమాన సంస్థలకు రూ.కోట్లలో నష్టం కూడా వాటిల్లింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎయిర్‌పోర్టు అధికారులు సమావేశాలు నిర్వహించి పక్షుల నివారణ, అక్రమ డంపింగ్ అరికట్టేందుకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పంచాయతీ, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో అనధికార డంపింగ్ యథావిధిగా కొనసాగుతోంది. దీనితో విమానాలకు పక్షుల బెడద తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎయిర్‌పోర్టు పరిసరాల్లో మాంసం వ్యర్థాలు, జంతు కళేబరాలు, చెత్తాచెదారం డంప్ చేయకుండా చర్యలు తీసుకోవాలని విమాన ప్రయాణికులు కోరుతున్నారు. కొరవడిన ఎయిర్‌పోర్టు సహకారం విమానాశ్రయ పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు నుంచి సహకారం కొరవడింది. సామాజిక బాధ్యత పథకం కింద ఎయిర్‌పోర్టు అథారిటీ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన సామగ్రిని అందించే వెసులుబాటు ఉంది. దీనికోసం ఏటా జరిగే పర్యావరణ సమావేశంలో ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న బుద్ధవరం, కేసరపల్లి, అల్లాపురం, గన్నవరం గ్రామ పంచాయతీల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో చెత్త నిర్వహణకు రిక్షాలు, డస్ట్బిన్లు, ఎస్సీ, బీసీ ఏరియాల్లో డ్రైనేజీ నిర్మాణాలకు ఎయిర్‌పోర్టు అధికారులకు ప్రతిపాదనలు ఇస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహకారం అందించలేదని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు అథారిటీ గ్రామ పంచాయతీలకు తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నారు. -
ఈ విమానం మీరు ఎక్కడికే వెళ్తే అక్కడికి వస్తుంది..!
మగువల అందానికి అదనపు ఆకర్షణగా నిలిచేవి హ్యాండ్ బ్యాగ్స్. విదేశీ ప్రయాణాల్లో, పార్టీల్లోను, గెట్ టూ గెదర్ ఫంక్షన్లలో ఇతరులను ఆకట్టుకునేందుకు యువతులు రకరకాల డిజైన్లతో చేసిన హ్యాండ్ బ్యాగ్స్‌ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే వారి ఇష్టాన్ని క్యాష్ చేసుకునేందుకు పలు ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలు రకరకాల ఆకారాల్లో బ్యాగులను మార్కెట్లలో విడుదల చేస్తుంటాయి. వాటిలో ఎక్కువ శాతం బ్యాగులు ఆకట్టుకుంటే మరికొన్ని బ్యాగులు సహజత్వాన్ని కోల్పోయి నెటిజన్లకు మంచి ఎంటర్టైన్మెంట్ ను మిగుల్చుతాయి. ఇటీవల ప్రముఖ అమెరికన్ డిజైనర్ వర్జిల్ అబ్లో ఫాల్ వింటర్ 2021తో విమానం ఆకారంలో ఉండే ఓ బ్యాగ్‌ను డిజైన్ చేశాడు. ఆ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల రూ. 28 లక్షలు(రూ.28,61,235) ఈ బ్యాగులను లూయిస్ విట్టన్ అనే ఫ్యాషన్ సంస్థ మార్కెట్ లో విడుదల చేసింది. మోనోగ్రామ్ లోగోతో డిజైన్ చేసిన ఈ బ్యాగ్ ను లూయిస్ విట్టన్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ బ్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విమానం ఆకారంలో ఉన్న బ్యాగ్‌ను చూసి నెటిజన్లు బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. విమానం ఆకారంలో ఉండే బ్యాగ్‌ను డిజైన్ చేసే కంటే నువ్వే ఓ నిజమైన విమానం కొనుగోలు చేయోచ్చు కదా అని ఓ నెటిజన్ అంటుంటే.. మరో నెటిజన్ ఈ విమానాన్ని దొంగ తనం చేసి వీధుల్లో తిప్పుకుంటా! అందం లేదు, స్టైల్‌గానూ లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. Louis Vuitton Fall/Winter 2021 Airplane Bag by Virgil Abloh 💰$39,000 pic.twitter.com/GEUmoylYqD — SAINT (@saint) April 2, 2021 -
ఉత్తుత్తి ఫోన్‌కాల్‌తో ఉరుకులు, పరుగులు
శంషాబాద్: ఓ భగ్నప్రేమికుడి నిర్వాకానికి విమానాశ్రయ భద్రతాసిబ్బంది, పోలీసులు హైరానా పడ్డారు. విమానంలో బాంబులున్నాయంటూ ఫోన్ చేయడంతో హడలెత్తిపోయారు. పోలీసులు, భద్రతాసిబ్బంది ఉరుకులు, పరుగుల మీద విమానాల్లో తనిఖీలు చేపట్టారు. చివరికి అది ఉత్తుత్తిదేనని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన రోజే బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు టెన్షన్ పడ్డారు. వివరాలు... శంషాబాద్ విమానాశ్రయానికి శనివారం ఉదయం 7 గంటలకు ఓ యువకుడు ఫోన్ చేసి ఇండిగో 6ఈ–188 విమానంతోపాటు ట్రూజెట్ 2టీ 201 చెన్నై విమానంలో బాంబులున్నాయని చెప్పాడు. దీంతో సీఐఎస్ఎఫ్, ఆర్జీఐఏ పోలీసులు వెంటనే అప్రమత్తమై రెండు విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అణువణువూ గాలించారు. విమానాల్లో బాంబులేమీ లేవని నిర్ధారించారు. అనంతరం విమానాలు ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకున్నాయి. శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నకిలీ ఫోన్ కాల్ చేసినవ్యక్తి కె.విశ్వనాథన్(24)గా గుర్తించారు. తమిళనాడులోని చెన్నై తెయ్నంపేట్కు చెందిన విశ్వనాథన్ సికింద్రాబాద్‌లోని గ్లోబ్లింక్ డబ్ల్యూడబ్ల్యూ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ట్రూజెట్ 2టీ201 విమానంలో చెన్నై బయలుదేరడానికిగాను ఉదయం ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రేమ విఫలం కావడంతో తాను మానసికంగా ఇబ్బందిలో ఉన్నానని విశ్వనాథన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. భద్రతకు భగ్నం కలిగించినందుకుగాను అతడిపై పౌర విమానయాన చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి వచ్చే సమయంలోనే... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఉన్న సమయంలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు టెన్షన్ పడ్డారు. తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఫోన్‌కాల్ వచ్చిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది కేవలం బెదిరింపు కాల్ అని తేలడంతో పోలీసులు, భద్రతాసిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
పాప్‌కార్న్ అమ్ముతూ.. సొంతంగా విమానం..
-
హచ్ డాగ్‌లా వెంటే.. వెన్నంటే..
2014, మార్చి 8.. 239 మంది ప్రయాణికులతో బయల్దేరిన మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అంతుచిక్కని రీతిలో మాయమైంది... అన్ని రకాల టెక్నాలజీలను వాడి వెతికారు.. ఇదిగో తోక..అదిగో రెక్క అన్నారు.. మూడేళ్లకుపైగా వెతికారు..చివరికి ఎక్కడుందో కనుక్కోలేక చేతులెత్తేశారు.. విమానం ఎక్కడో కూలి ఉంటుందని..అందరూ చనిపోయిఉంటారని చెబుతూ కేస్ క్లోజ్ చేశారు.. ఇంతకీ అదెక్కడ కూలింది.. ఆ విమానానికి ఏమైంది అని అడిగితే ఏమో.. ఎవరిని అడిగినా ఇదే జవాబు.. అయితే, ఇకపై అలా ఉండదు..ఈ భూప్రపంచం మొత్తమ్మీద ఏ విమానం ఎటు వెళ్లినా.. ఎటు కదిలినా..అనుక్షణం పర్యవేక్షించే కొత్త వ్యవస్థ వచ్చేస్తోంది..విమానం తప్పిపోయినా.. దారి మళ్లినా..క్షణాల్లో గుర్తించి, అప్రమత్తం చేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేస్తోంది.. అదే ఇరిడియం నెక్ట్స్.. ఇరిడియం నెక్ట్స్.. ఇందులో భాగంగా మొత్తం 75 ఉపగ్రహాలను మోహరిస్తున్నారు. తాజాగా ఇందులోని చివరి 10 ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ మొత్తం ఉపగ్రహాల వ్యవస్థ భూమి చుట్టూ ఓ సాలిగూడులా ఏర్పడి.. విమానాల రాకపోకలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటాయి. దీని వల్ల తొలిసారిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థకు ప్రపంచంలోని ఏ విమానం ఎక్కడుందన్న విషయం క్షణాల్లో తెలుస్తుందని అమెరికాకు చెందిన ఇరిడియం సంస్థ తెలిపింది. 2020 సరికి ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ ఇలా.. ఇప్పటివరకూ విమానం రాకపోకలను రాడార్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గ్రౌండ్ సిస్టం ద్వారా ట్రాక్ చేస్తున్నారు. విమానం కాక్‌పిట్‌లో ఉండే బ్లాక్ బాక్స్ ద్వారా ప్రతి 10 నుంచి 15 నిమిషాలకొకసారి ఈ సిగ్నల్ అందుతుంది. ఎంహెచ్ 370 విషయానికొస్తే.. ఆ బ్లాక్ బాక్స్ అన్నది దొరకనే లేదు. దీని వల్ల అసలేం జరిగిందన్నది తెలియరాలేదు. అసలు.. ఆ 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఆ విమానం ఎక్కడుంది అన్న విషయాన్ని ట్రాక్ చేసే వ్యవస్థ ప్రస్తుతానికి లేదు. ఇరిడియం నెక్ట్స్ ప్రాజెక్టు అమల్లోకి వస్తే.. ఉపగ్రహాలు అన్ని విమానాలను కనిపెట్టుకుని ఉంటాయి. తేడా వస్తే. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సమాచారమందిస్తాయి. అంటే.. ఇక భవిష్యత్తులో ఎంహెచ్ 370లాంటి మిస్టరీలకు చోటు లేదన్నమాట.. ప్రమాదం జరిగినా.. ఎక్కడ జరిగిందన్న విషయం క్షణాల్లో తెలిసిపోతుంది కనుక.. సహాయక చర్యలను వెంటనే చేపట్టడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. ఈ ఇరిడియం.. ఇరగదీసే ఐడియా కదూ.. – సాక్షి సెంట్రల్ డెస్క్.. -
కూలిన మిగ్ 21
షిమ్లా: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్ 21 ఫైటర్ జెట్ విమానం హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే జవాలీకి సమీపంలోగల పట్టా జతియన్ గ్రామంలో మధ్యాహ్నం 1.21గంటలకు కుప్పకూలింది. విమానం కూలిన ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. సహాయక చర్యలకోసం రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలిక్యాప్టర్లు రంగంలోకి దిగాయి. జరిగిన ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనతో కలిపి.. ఈ ఏడాది ప్రమాదాలకు గురైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఅఊ) విమానాల సంఖ్య నాలుగుకు చేరుకుంది. జూన్ 27న మహారాష్ట్రలోని నాసిక్‌లో సుఖోయ్–30, జూన్ 5న గుజరాత్‌లోని కచ్‌లో జాగ్వర్ విమానాలు కుప్పకూలాయి. మే 27న జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో మిగ్–21 ఫైటర్ కూలిపోయింది. ఒకప్పుడు మిగ్ 21 ఫైటర్ జెట్ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అత్యంత కీలకమైనదిగా నిలిచింది. -
విమానాల శబ్దానికి ఇక చెల్లుచీటి!
వాషింగ్టన్: విమానాల నుంచి వచ్చే శబ్దంతో చెవులు చిల్లులు పడుతుంటాయి. ఎయిర్‌పోర్టుల వద్ద నివసించే వారి పరిస్థితి చెప్పక్కర్లేదు. కానీ ఆ రణగొణ ధ్వని ఇకపై వినిపించదు. ఎందుకంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇందుకోసం నూతన సాంకేతికతను అభివృద్ధి పరిచింది. ఆర్మ్‌స్ట్రాంగ్ ఫ్లైట్ రీసెర్చ్ సెంటర్లో శబ్దం తక్కువగా వచ్చే సాంకేతికతలను విజయవంతంగా పరీక్షించారు. దీంతో నిశ్శబ్దంగా నడిచే విమానాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం వస్తున్న శబ్దంలో 70 శాతానికి పైగా తగ్గేందుకు చాలా సాంకేతికతలను వినియోగించాల్సి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విమానాశ్రయాల వద్ద నివసించే వారి ఆరోగ్యంపై ప్రభావం పడకుండా విమానాల ల్యాండింగ్ సమయంలో వచ్చే శబ్దాలను తగ్గించడమే నాసా లక్ష్యం అని లాంగ్లీ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్త మెహదీ ఖొర్రామీ వివరించారు. -
నిలువుతో సులువు!
నిన్న.. చాన్నాళ్ల క్రితం సుదూర ప్రయాణం అంటే రోజుల తరబడి సాగేది. రకరకాల ప్రయాణ సాధనాలను దాటి.. రైలు వచ్చినా.. ఒక దేశం నుంచి మరొక దేశం పోవాలంటే.. వారాలు పట్టాల్సిందే.. నేడు.. విమానం వచ్చాక ఈ ప్రపంచం చాలా చిన్నదైపోయింది.. గంటల వ్యవధిలో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లిపోతున్నాం.. విమానం వచ్చి.. ఈ భూప్రపంచాన్ని చిన్నదిగా చేస్తే.. విమానాశ్రయాలు వచ్చి అదే భూప్రపంచంలోని చాలా భూమిని తమ వసతుల కోసం వినియోగించుకుంటున్నాయి. టెర్మినళ్లు, రన్వేలు, టాక్సీవేలు ఇలా ఎయిర్‌పోర్టు అంటే.. వేల ఎకరాల స్థలం సమర్పించాల్సిందే. మరి రేపు.. వీటన్నిటికీ పరిష్కారం ఈ నిట్టనిలువు ఎయిర్‌పోర్టు అట.. ఇలాంటిది మనమెప్పుడైనా చూశామా.. తక్కువ భూమి వినియోగంతో అన్ని సదుపాయాలున్న విమానాశ్రయం.. దీని వల్ల మిగిలి ఉన్న భూమిని వ్యవసాయ, వాణిజ్య, పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు వినియోగించుకోవచ్చు. నిట్టనిలువుగా అన్నది ఎయిర్‌పోర్టులకే కాదు.. విమానాలకూ వర్తిస్తుంది.. ఇప్పటికే ఆ టైపువి కొన్ని వచ్చాయి కూడా.. అంటే.. నిట్టనిలువుగా ల్యాండింగ్.. టేకాఫ్ అన్నమాట. దీని వల్ల భారీ రన్వేలు అవసరముండదు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులను చూస్తే.. అంతా వాణిజ్య సముదాయాలే కనిపిస్తాయి. అయితే.. ఈ ఎయిర్‌పోర్టులో విభిన్నమైన అంశాలకు, పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇక్కడే కొన్ని అంతస్తుల్లో పంటలు పండిస్తారు.. వాటిని అమ్మేందుకు కూడా మార్కెట్లు ఇక్కడే ఉంటాయి. మాల్స్, అగ్రికల్చర్ కాలేజీలు, చేపల పెంపకం, నిర్లవణీకరణ ప్లాంట్లు వంటివి కూడా ఏర్పాటు చేస్తారు. అంతేనా.. ముందున చెరువులా కనిపిస్తుంది చూశారు.. చుట్టుపక్కల ఉండే నీటి వనరులు అంటే కాలువలు కావచ్చు లేదా చెరువుల ద్వారా కావచ్చు.. వాటి నుంచి నీటిని ఇక్కడికి తరలిస్తారు.. ఈ నీటిని చేపల పెంపకంతోపాటు పంటల కోసం వినియోగిస్తారు.. దీంతోపాటు ఈ నీటిని శుద్ధి చేసి.. చుట్టుపక్కల ఉండే నివాస ప్రాంతాలకు తాగు నీటిని సరఫరా చేస్తారు. ఇక నగరంలోని రైలు వ్యవస్థను విమానాశ్రయానికి అనుసంధానం చేస్తారు. ప్రయాణికులు రైళ్ల ద్వారా ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. వాళ్ల లగేజీ వంటివి ఆటోమేటిక్‌గా వారు ప్రయాణిస్తున్న విమానాల్లోకి వెళ్లే వ్యవస్థ ఉంటుంది. టికెట్లు కొనుగోలు చేయడానికి చిన్నపాటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. తనిఖీల సమయాన్ని తగ్గించేందుకు ఆటోమేటిక్ స్క్రీనింగ్ వ్యవస్థ ఉంటుంది. విమానాలు ఇప్పటికంటే కాస్త చిన్నవిగా.. పర్యావరణ అనుకూల పునర్వినియోగ ఇంధనాన్ని వినియోగించేవిగా ఉంటాయి. ఈ ఎయిర్‌పోర్టులతో స్థల సమస్య తీరుతుందని.. పర్యావరణ అనుకూలమైనది కూడా కావడం వల్ల కాలుష్య ఉద్గారాలు తక్కువగా ఉంటాయని ఈ వర్టికల్ ఎయిర్‌పోర్టు డిజైనర్ జొనాథన్(అమెరికా) చెబుతున్నారు. కొత్త ఆలోచనలను, విప్లవాత్మకమైన, వినూత్నమైన డిజైన్లను ప్రోత్సహిస్తూ ‘ఇవాలో’ ఆర్కిటెక్చర్ మేగజైన్ ఏటా ఆకాశహర్మ్యాల పోటీని నిర్వహిస్తోంది. 2018కి సంబంధించిన పోటీలో ఈ డిజైన్ జ్యూరీ దృష్టిని ఆకర్షించింది. దీనికి జ్యూరీ ప్రత్యేక ప్రశంసా పురస్కారం దక్కింది. ..: సాక్షి, తెలంగాణ డెస్క్ -
ఆ రెండు విమానాలు..
సాక్షి, హైదరాబాద్: కొత్త పంథాలో బంగారం స్మగ్లింగ్ సాగుతోంది. విమానయానంలోని మార్పులనే స్మగ్లింగ్ ముఠా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఎయిర్ఇండియాకు చెందిన 952 విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖపట్నానికి అక్కడ నుంచి ఢిల్లీకి 1.224 కిలోల బంగారం అక్రమ రవాణాకు సహకరిస్తూ గత నెల 23న ఉత్తరప్రదేశ్వాసి కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. విచారణలో అతడు కీలకాంశాలను బయటపెట్టాడు. విదేశంలో అంతర్జాతీయ సర్వీసుగా ప్రారంభమైన విమానాలను దేశంలోకి ప్రవేశించిన తరువాత దానిని దేశవాళీ సర్వీసులుగా పలు విమానయాన సంస్థలు మార్పు చేస్తున్నాయి. డొమెస్టిక్ ట్రావెల్ కోసం టికెట్లు బుక్ చేసుకున్న, అప్పటికప్పుడు కొనుగోలు చేసిన ప్రయాణికులు అంతర్జాతీయ ప్రయాణికులతో కలిపి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీన్నే ఈ ముఠా తమకు అనువుగా మార్చుకుంది. యూపీకి చెందిన స్మగ్లర్ 1.224 కిలోల బంగారంతో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చా డు. బంగారం ఉన్న బ్యాగ్‌ను తన సీటు కిందే వదిలి అంతర్జాతీయ ప్రయాణికుడిగా విమా నం దిగి కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకునేందుకు వచ్చాడు. అదే విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లడానికి అదే ముఠాకు చెందిన మరోవ్యక్తి ముందే డొమెస్టిక్ టికెట్ బుక్ చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. అతడు దేశవాళీ ప్రయాణికుడిగా ఎక్కి అంతకు ముం దు యూపీ వ్యక్తి కూర్చున్న సీటులోనే కూర్చున్నాడు. అనుకున్న ప్రకారం ఇతడు విశాఖపట్నం చేరేసరికి దేశవాళీ ప్రయాణికుడే కావడంతో ఎలాంటి కస్టమ్స్ తనిఖీలు లేకుండా అక్కడి విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేయవచ్చు. అయితే యూపీవాసి శంషాబాద్ విమానాశ్రయంలోనే చిక్కడంతో స్మగ్లింగ్‌కు చెక్ పడింది. తాజాగా మరో ‘అడుగు’... యూపీవాసి స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో హైదరాబాద్‌కు చెందిన స్మగ్లింగ్ సూత్రధారులు ఈ పంథాలో కొన్ని మార్పులు చేశారు. తమ ముఠాకే చెందిన ఒక వ్యక్తిని గత నెల 27న ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ముంబైకి పంపారు. అక్కడ నుంచి అదేరోజు సాయంత్రం జిద్దా నుంచి వచ్చే ఏఐ 965 ఫ్లైట్‌లో ముంబై నుంచి హైదరాబాద్‌కు స్మగ్లర్‌తో కలసి ఆ వ్యక్తి డొమెస్టిక్ ప్యాసింజర్‌గా ప్రయాణించాడు. వీరిలో ఒకరికి ఇంకొకరితో పరిచయం ఉండదు. జిద్దా ప్రయాణికుడు హైదరాబాద్‌లో విమానం దిగిన తర్వాత టాయిలెట్లో 1.243 కేజీల బంగారం దాచి బయటకు వెళ్లిపోయాడు. అక్కడ నుంచి బంగారాన్ని ఈ ‘డొమెస్టిక్ ప్యాసింజర్’ తీసుకువెళ్లి బయట వేచి ఉండే వ్యక్తికి అప్పగించాల్సి ఉంది. అయితే, ఈ ‘డొమెస్టిక్ ప్యాసింజర్’టాయిలెట్ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడటంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టాయిలెట్లో దాచిన బంగారంతోపాటు పూర్తి వివరాలు విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారం వెనుక ఉన్న హైదరాబాద్‌కు చెందిన సూత్రధారిపై కస్టమ్స్ అధికారులు దృష్టి పెట్టారు. -
240 విమానాశ్రయాలకు క్లబ్ వన్ ఎయిర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చార్టర్ ఆపరేటర్ క్లబ్ వన్ ఎయిర్ భారత్‌లో 240 విమానాశ్రయాలకు సేవలు అందిస్తోంది. ఎయిర్ స్ట్రిప్ ఉన్న చిన్న విమానాశ్రయాల్లోనూ అడుగుపెడుతున్నట్టు సంస్థ సీఈవో రాజన్ మెహ్రా తెలిపారు. మార్కెటింగ్ హెడ్ సంజీవ్ సేథితో కలిసి మీడియాతో మాట్లాడా రు. కొత్తగా కొనుగోలు చేసిన ఫాల్కన్ 2000 మోడల్‌తో కలిపి సంస్థ వద్ద 10 విమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది నాలుగైదు కొత్త విమానాలను కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. నడుస్తున్న తమ వద్ద 250 మంది ఉద్యోగులు ఉన్నారని వివరించారు. ‘ప్రపంచంలో ఎక్కడా లేనంతగా విమాన ఇంధనం ధర భారత్‌లోనే ఎక్కువ. ఇంధనంపై రాష్ట్రాన్ని బట్టి పన్నులు 4–40% దాకా ఉన్నాయి. ఫ్యూయల్ వ్యయాలు విదేశాల్లో 15 శాతమే. ఇక్కడ ఏకంగా 40% దాటాయి. విమాన దిగుమతి సుంకమూ ఎక్కువే. ఇవన్నీ పరిశ్రమ వృద్ధికి అడ్డంకులు’ అని చెప్పారు. -
చెన్నైకి ఫ్లైట్‌లో వెళుతున్నారా...అయితే
సాక్షి, చెన్నై: దేశప్రజలంతా సంక్రాంతి ఉత్సాహంతో ఉరకలేస్తోంటే.. చెన్నై విమానాలు మాత్రం గాల్లోకి ఎగరలేక తెల్లబోవడంతోవిమాన ప్రయాణీకులు మాత్రం ఉసూరుమంటున్నారు. దట్టమైన పొగ కారణంగా దాదాపు 10 విమానాలు టేక్‌ఆఫ్‌లు, లాండింగ్‌లు నిలిచిపోయాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. చెన్నైనుంచి బయలు దేరాల్సిన కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 18 విమానాలను హైదరాబాద్, బెంగళూరు వైపు మళ్లించారు. చెన్నై నగరంలో ‘భోగి’ మంటల వల్ల వ్యాపించిన దట్టమైన పొగతో ఎయిర్‌క్వాలిటీ, రన్‌వే విజిబిలిటీ దారుణంగా పడిపోవడంతో ప్రయాణీకుల ఆందోళన నెలకొంది. విమానాశ్రయ సీనియర్ అధికారి మాట్లాడుతూ రన్‌వే దృశ్యమానత 50 మీటర్లకు పడిపోయిందనిచెప్పారు. ఉదయం మూడున్నరనుంచి తమకు విమాన కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరికొన్ని గంటల్లో పరిస్థితి చక్కబడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తనకు ముంబైలో చాలా ముఖ్యమైన బిజినెస్ మీట్ వుందంటూ భరత్ జైన్ వాపోయారు. చెన్నైకు భోగి మంటలు ఒక ఛాలెంజ్‌గా నిలుస్తున్నాయని మరో సీనియర్ అధికారి తెలిపారు. గతపదేళ్లుగా ఈ విషయంలో కాలుష్య నియంత్రణ బోర్డు తమిళనాడులో అవగాహన పెంచుతోందన్నారు. ఇది ఇలా ఉంటే.. చెన్నై, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భోగి సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తెల్లవారుఝామునుంచే సందడి మొదలైంది. పాత బట్టలు, వస్తువులను తగలబెట్టడం శుభాన్నిస్తుందని , అంతేకాదు భోగిమంటలు గాలిని శుభ్రం చేస్తాయని స్థానికుడు కరుప్పన్ సంతోషంగా చెప్పారు. తమిళ సంస్కృతిలో 'భోగీ' ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఈపొగ గాలిని కలుషితం చేస్తుందని తెలుసు.. అందుకే తాము ప్లాస్టిక్స్ , టైర్లను నివారిస్తామని చెన్నైవాసి శరవణన్ వివరించారు. -
మానవ రహిత విమానాలతో వంతెనల తనిఖీ..!
♦ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందిస్తున్న వేల్ టెక్ ♦ పరిశోధనకు ఏటా రూ.30 కోట్లు ♦ వేల్ టెక్ యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంతెనలు, చారిత్రక కట్టడాల నాణ్యతను పరీక్షించేందుకు కొద్ది రోజుల్లో భారత్‌లో మానవ రహిత విమానాలు (యూఏవీ), డ్రోన్లు రంగంలోకి దిగనున్నాయి. ఇండియా-కెనడా ఇంపాక్ట్స్ కార్యక్రమంలో భాగంగా చెన్నైకి చెందిన వేల్ టెక్ యూనివర్సిటీ, కెనడాలోని విక్టోరియా వర్సిటీలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. యూఏవీ, డ్రోన్ల సాయంతో వంతెనలకు పగుళ్లుంటే గుర్తిస్తారు. తరచూ పరీక్షలు జరపడం ద్వారా వంతెన గట్టిదనం, జీవిత కాలం ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటారు. తొలి పైలట్ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న వంతెన వేదిక కానుందని వేల్ టెక్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బీల సత్యనారాయణ గురువారమిక్కడ చెప్పారు. అరుదైన కట్టడాల నాణ్యతను తెలుసుకునేందుకూ ఈ టెక్నాలజీ ఉపయోగిస్తామని మీడియాతో చెప్పారు. ఏడాదిలో తొలి పైలట్ ప్రాజెక్ట్... ప్రాజెక్టుకు అవసరమైన యూఏవీ, డ్రోన్లను వేల్ టెక్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. సెన్సర్లను విక్టోరియా వర్సిటీ రూపొందించింది. సెన్సర్లను యూఏవీ, డ్రోన్లతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతున్నట్లు వేల్ టెక్ ప్రో-వీసీ యు.చంద్రశేఖర్ తెలిపారు. ఏడాదిలో తొలి పైలట్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని విక్టోరియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రిషి గుప్త ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ‘ఈ టెక్నాలజీతో ఫలితాల్లో కచ్చితత్వం ఉంటుంది. ఖర్చు తక్కువ. సమయమూ ఆదా అవుతుంది. వంతెనల కింది భాగంలోకి డ్రోన్లు సులువుగా వెళ్లి తనిఖీ చేస్తాయి. భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో 50,000కు పైగా పెద్ద వంతెనలున్నాయి. వీటిలో 100 ఏళ్లకు పైబడ్డవి చాలానే ఉన్నాయి’ అని తెలిపారు. టెక్నాలజీని కెనడాలోనూ వినియోగిస్తామన్నారు. కాగా పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఏటా రూ.30 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్టు వేల్ టెక్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కె.వి.డి.కిషోర్ కుమార్ చెప్పారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, అనుబంధ పరిశ్రమల కోసం రూ.8 కోట్లతో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌ను నెలకొల్పామని, ఇప్పటికే ఇందులో 20 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. -
చాక్లెట్లలో రూ. 50లక్షల బంగారం
సాక్షి, చెన్నై: విమానాశ్రయంలో సిబ్బంది కళ్లుకప్పి బయటకు వెళ్లాలనుకున్నారు. బోలెడు చాక్లెట్లలో బం గారాన్ని దాచి తీసుకొచ్చారు. అయినా, అడ్డంగా దొరి కిపోయారు. చెన్నై విమానాశ్రయంలో మంగళవా రం బహ్రెయిన్ నుంచి గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానం వచ్చింది. ప్రయాణికుల్లో ఇద్దరి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని అధికారులు తనిఖీ చేశారు. ఏమీ కనిపించలేదు. లగేజీలో ఉన్న వస్తువులను బయటకు తీయించారు. అందులో భారీ సంఖ్యలో చాక్లెట్లు కనిపించాయి. అనుమానంతో ఒకటి రెండు నోట్లో వేసుకుని చూశారు. వాటిల్లోంచి బంగారం గుళికలు బయటపడ్డాయి. మొత్తం చాక్లెట్లను నీళ్లలో వేయగా.. 1.6కిలోల బంగారం గుళికలు తేలాయి. ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితులను వైఎస్ఆర్ జిల్లాకు చెందిన సిం ద్‌బాషా (33), మెహబూబ్ బాషా (30)గా గుర్తిం చారు. బంగారం విలువ సుమారు రూ.50 లక్షలు. -
అన్వేషణం: కదిలే అలలపై... కదలని ఎయిర్పోర్ట్!
ఎక్కువ స్థలం అవసరమవుతుంది కాబట్టి, విమానాశ్రయాన్ని ఎప్పుడూ నగర శివార్లలోనే కడతారు. కానీ జపాన్‌వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కదా! అందుకే ఏకంగా సముద్రంలో కట్టారు. మరి సముద్రంలో విమానాలు ఎలా ల్యాండవుతాయి?! అది చెబితే అర్థం కాదు. స్వయంగా వెళ్లి చూడాల్సిందే. జపాన్‌లోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1994లో ప్రారంభించారు. ఇది సముద్రపు నీటిలో కట్టిన ఓ అద్భుతమైన ఎయిర్పోర్ట. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. భూంకంపాలను, సునామీలను కూడా ఇది తట్టుకోగలదు. కాన్సాయ్ విమానాశ్రయ నిర్మాణం 1987లో మొదలుపెట్టారు. దాదాపు పదివేల మంది, మూడేళ్ల పాటు కష్టపడితే పూర్తయ్యింది. మిగతా పనులన్నీ పూర్తి చేసేందుకు నాలుగేళ్లు పట్టింది. నిజానికి ఎయిర్పోర్ట ఇటామి ప్రాంతంలో ఉండేది. అయితే వ్యాపార లావాదేవీల నిమిత్తం విమానాల రాకపోకల్ని మరింత పెంచాలనుకుంది అక్కడి ప్రభుత్వం. మొదట కాన్సాయ్ రీజియన్‌లోని, కోబె దగ్గర కొత్త ఎయిర్పోర్ట కట్టేందుకు ప్లాన్ వేశారు. కానీ అక్కడివారు ఒప్పుకోలేదు. ఎయిర్పోర్టను నిర్మించేందుకు ఆల్రెడీ ఉన్న నిర్మాణాలను తొలగించడానికి వీల్లేదని, పైగా ఇళ్లు, ఆఫీసుల మధ్య విమానాశ్రయం ఉంటే విమానాల మోత భరించడం కష్టమని గొడవపెట్టారు. ఒకవేళ కట్టినా కూడా, దాన్ని ఎప్పటికీ విస్తరించడం వీలు కాదని కండిషన్ పెట్టారు. దాంతో సముద్రంలో కడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది అధికారులకి. వెంటనే మొదలు పెట్టేశారు. సముద్రజలాల్లో ఎయిర్పోర్టను నిర్మించారు. సముద్రపు ఒడ్డు నుంచి ఎయిర్‌పోర్టుకి వెళ్లడానికి మూడు కి.మీ.ల పొడవైన బ్రిడ్జిని కూడా నిర్మించారు. జలాల మీద నిర్మాణం అంత తేలిక కాదు. ఎయిర్పోర్ట అంటే మరీ కష్టం. అయినా వారు సాధించారు. ఇప్పుడది ప్రపంచం మొత్తాన్నీ ఆకర్షిస్తోంది. అమెరికన్ ఇంజినీరింగ్ సొసైటీ అయితే... ‘సివిల్ ఇంజినీరింగ్ మాన్యుమెంట్ ఆఫ్ ద మిలీనియం’ అంటూ దీన్ని కొనియాడింది కూడా! సరస్సుకెలా వచ్చెను గులాబీ సొగసు! తళతళలాడుతూ జలజల పారుతూ ఉండే సరస్సులు తెలుసు మనకి. కానీ గులాబిరంగులో వర్ణమయంగా ఉండే సరస్సు ఒకటి ఉందని తెలుసా? అసలు ఏ సరస్సయినా ఆ రంగులో ఉంటుందంటే నమ్మబుద్ధి వేస్తుందా? కానీ రెబ్టా లేక్‌ని చూస్తే నమ్మక తప్పదు మరి! ఆఫ్రికా ఖండంలోని సెనెగల్ ప్రాంతంలో ఉన్న రెబ్టా లేక్‌ని చూస్తే మొదట షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆశ్చర్యం వేస్తుంది. అందులోని నీళ్లు ముదురు గులాబిరంగులో ఉంటాయి. అందుకే దీన్ని అందరూ ముద్దుగా పింక్ లేక్ అని పిలుచుకుంటారు. వాతావరణంలోని మార్పు వల్ల రెబ్టా సరస్సులోని నీళ్లు అలా గులాబిరంగులోకి మారాయేమోనని మొదట్లో అనుకున్నారు. ఆ రంగు మెల్లగా పోతుందని వేచి చూశారు కూడా. కానీ అలా జరగలేదు. సరస్సులోని నీరు ఎప్పుడూ గులాబి రంగులోనే కనిపించసాగింది. దాంతో దాన్ని అలా మార్చిందేమిటో తెలుసుకోవాలని పరిశోధనలు మొదలు పెట్టారు. చివరకు తేలిందేమిటంటే... ఈ నీటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుందట. సరస్సు అడుగున ఉన్న మట్టిలో ఉండే కొన్ని రసాయనాలు ఉప్పుతో కలిసి ఈ రంగును ఏర్పరిచాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఏదేమైనా సరస్సు గులాబిరంగులో ఉండటం విచిత్రమే. అందుకే దీన్ని వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌గా ఎంపిక చేస్తామంటోంది యునెస్కో!