హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చార్టర్ ఆపరేటర్ క్లబ్ వన్ ఎయిర్ భారత్‌లో 240 విమానాశ్రయాలకు సేవలు అందిస్తోంది. ఎయిర్ స్ట్రిప్ ఉన్న చిన్న విమానాశ్రయాల్లోనూ అడుగుపెడుతున్నట్టు సంస్థ సీఈవో రాజన్ మెహ్రా తెలిపారు. మార్కెటింగ్ హెడ్ సంజీవ్ సేథితో కలిసి మీడియాతో మాట్లాడా రు. కొత్తగా కొనుగోలు చేసిన ఫాల్కన్ 2000 మోడల్‌తో కలిపి సంస్థ వద్ద 10 విమానాలు ఉన్నాయని చెప్పారు.
ఈ ఏడాది నాలుగైదు కొత్త విమానాలను కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. నడుస్తున్న తమ వద్ద 250 మంది ఉద్యోగులు ఉన్నారని వివరించారు. ‘ప్రపంచంలో ఎక్కడా లేనంతగా విమాన ఇంధనం ధర భారత్‌లోనే ఎక్కువ. ఇంధనంపై రాష్ట్రాన్ని బట్టి పన్నులు 4–40% దాకా ఉన్నాయి. ఫ్యూయల్ వ్యయాలు విదేశాల్లో 15 శాతమే. ఇక్కడ ఏకంగా 40% దాటాయి. విమాన దిగుమతి సుంకమూ ఎక్కువే. ఇవన్నీ పరిశ్రమ వృద్ధికి అడ్డంకులు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment