వాషింగ్టన్: విమానాల నుంచి వచ్చే శబ్దంతో చెవులు చిల్లులు పడుతుంటాయి. ఎయిర్‌పోర్టుల వద్ద నివసించే వారి పరిస్థితి చెప్పక్కర్లేదు. కానీ ఆ రణగొణ ధ్వని ఇకపై వినిపించదు. ఎందుకంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇందుకోసం నూతన సాంకేతికతను అభివృద్ధి పరిచింది. ఆర్మ్‌స్ట్రాంగ్ ఫ్లైట్ రీసెర్చ్ సెంటర్‌లో శబ్దం తక్కువగా వచ్చే సాంకేతికతలను విజయవంతంగా పరీక్షించారు. దీంతో నిశ్శబ్దంగా నడిచే విమానాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం వస్తున్న శబ్దంలో 70 శాతానికి పైగా తగ్గేందుకు చాలా సాంకేతికతలను వినియోగించాల్సి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విమానాశ్రయాల వద్ద నివసించే వారి ఆరోగ్యంపై ప్రభావం పడకుండా విమానాల ల్యాండింగ్ సమయంలో వచ్చే శబ్దాలను తగ్గించడమే నాసా లక్ష్యం అని లాంగ్‌లీ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్త మెహదీ ఖొర్రామీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment