సాక్షి, చెన్నై: విమానాశ్రయంలో సిబ్బంది కళ్లుకప్పి బయటకు వెళ్లాలనుకున్నారు. బోలెడు చాక్లెట్లలో బం గారాన్ని దాచి తీసుకొచ్చారు. అయినా, అడ్డంగా దొరి కిపోయారు. చెన్నై విమానాశ్రయంలో మంగళవా రం బహ్రెయిన్ నుంచి గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానం వచ్చింది. ప్రయాణికుల్లో ఇద్దరి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని అధికారులు తనిఖీ చేశారు. ఏమీ కనిపించలేదు.
లగేజీలో ఉన్న వస్తువులను బయటకు తీయించారు. అందులో భారీ సంఖ్యలో చాక్లెట్లు కనిపించాయి. అనుమానంతో ఒకటి రెండు నోట్లో వేసుకుని చూశారు. వాటిల్లోంచి బంగారం గుళికలు బయటపడ్డాయి. మొత్తం చాక్లెట్లను నీళ్లలో వేయగా.. 1.6కిలోల బంగారం గుళికలు తేలాయి. ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితులను వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన సిం ద్‌బాషా (33), మెహబూబ్ బాషా (30)గా గుర్తిం చారు. బంగారం విలువ సుమారు రూ.50 లక్షలు.
చాక్లెట్లలో రూ. 50లక్షల బంగారం
Published Wed, Feb 12 2014 5:27 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM
Advertisement