ఢిల్లీ: విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. లండన్-ఢిల్లీ విస్తారా విమానానికి శనివారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రత్తమైన అధికారలు ఆ విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్టకు పైలట్లు దారి మళ్లించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని విస్తారా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
STORY | Vistara's Delhi-London flight diverted to Frankfurt after bomb threat
READ : https://t.co/d6PLa4w0GV pic.twitter.com/R1BzJcO2rW— Press Trust of India (@PTI_News) October 19, 2024
విమానం మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశాక.. ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తేలిపారు. అనంతరం విమానం లండన్‌కు బయలుదేరింది. ఇటీవల కాలంలో విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. కేవలం ఒక వారంలో 15 విమానాలకు ఇలాంటి బెదిరింపులు గమనార్హం. విమానాల టేకాఫ్‌కు ముందు ఇటువంటి బెదిరింపులు రావటంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి దారి మళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment