vistara
-
హైదరాబాద్ నుంచి విస్తారా విమానాలు!
ఎయిర్ ఇండియాలో విలీనమైనప్పటికీ విస్తారా ఎయిర్వేస్కు చెందిన ఏ320 విమానాల సేవలు కొనసాగనున్నాయి. వీటిని దేశంలోని ఐదు కీలకమైన మెట్రో-టు-మెట్రో రూట్లలో నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ముంబైకి ఈ విమానాలు నడుస్తాయి.ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్, ముంబై-బెంగళూరు, ముంబై-హైదరాబాద్ మార్గాల్లో ఏ320 విమానాల సేవలు ఉంటాయని, బిజినెస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ క్లాస్‌లలో ప్రయాణం చేయొచ్చని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. ఈ విమాన సర్వీసులు ఏ12 కోడ్‌తో ప్రారంభమవుతాయని, టికెట్ల బుకింగ్ సమయంలో గమనించాలని సూచించింది.టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో విస్తారా విలీన ప్రక్రియ ఈనెల ప్రారంభంలోనే పూర్తయింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 208 విమానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 67 వైడ్ బాడీ విమానాలు ఉన్నాయి. -
విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు
ఢిల్లీ: విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. లండన్-ఢిల్లీ విస్తారా విమానానికి శనివారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రత్తమైన అధికారలు ఆ విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్ఫర్టకు పైలట్లు దారి మళ్లించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని విస్తారా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. STORY | Vistara's Delhi-London flight diverted to Frankfurt after bomb threatREAD : https://t.co/d6PLa4w0GV pic.twitter.com/R1BzJcO2rW— Press Trust of India (@PTI_News) October 19, 2024విమానం మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశాక.. ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తేలిపారు. అనంతరం విమానం లండన్‌కు బయలుదేరింది. ఇటీవల కాలంలో విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. కేవలం ఒక వారంలో 15 విమానాలకు ఇలాంటి బెదిరింపులు గమనార్హం. విమానాల టేకాఫ్‌కు ముందు ఇటువంటి బెదిరింపులు రావటంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి దారి మళ్లించారు. -
ఎయిర్ ఇండియాలోకి విస్తారా: ఆ రోజే చివరి ఫ్లైట్
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా (Vistara).. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలోకి విలీనం కానుంది. 2024 నవంబర్ 11న విస్తారా తన చివరి విమానం నడపనుంది. అంతకంటే ముందు (సెప్టెంబర్ 3) సంస్థ టికెట్ రిజర్వేషన్లను కూడా ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌కు మళ్ళించనున్నట్లు సమాచారం. అయితే విమాన ప్రయాణాలు మాత్రం నవంబర్ 11వరకు కొనసాగుతాయి.విస్తారా సంస్థ.. ఎయిర్ ఇండియాలో విలీనం కావడానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంటే ఎయిర్ ఇండియాలో విలీనం కానున్న విస్తారాలో.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ 25.1 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ & ఏఐ ప్రిఫిక్స్‌తో విస్తారా నెట్వర్క్.. విమానాలు కొనసాగుతాయి. విస్తారా సిబ్బంది.. విస్తారా విమానాలను 2025 ప్రారంభం వరకు ఎయిర్ ఇండియా కింద నిర్వహిస్తారు. అయితే సర్వీస్ లెవల్స్, భోజనం, ఇతరత్రా కార్యకలాపాలు ఎయిర్ ఇండియా పాలసీ ప్రకారం ఉంటాయి.ఇప్పటికే విస్తారా ఫ్లైట్ టికెట్ నవంబర్ 11 తరువాతకు బుక్ చేసుకుని ఉంటే.. ఎయిర్ ఇండియాలో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రయాణానికి ఏ లోటు లేదు. కానీ మీరు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవచ్చు. -
‘ఫ్రీడమ్’ ఆఫర్.. బస్ టికెట్ ధరతో ఫ్లైట్ జర్నీ
తక్కువ ధరకు విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అది కూడా బస్ టికెట్ ధరకే. ఈ సూపర్ ఆఫర్‌ను టాటా గ్రూప్ ఎయిర్‌లైన్ కంపెనీ 'విస్తారా' తీసుకొచ్చింది. ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకుంటే రూ.1,578లకే ఎంచక్కా ఫ్లైట్ ఎక్కేయచ్చు.ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా నవరాత్రి, దసరా వరకు ప్రయాణించవచ్చు. అయితే దీని కోసం ఆగస్టు 15లోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌లైన్ విస్తారా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్లో అక్టోబర్ 31 నుంచి ఆగస్టు 15 వరకు చౌకగా విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు.ఈ మార్గంలో రూ.1578విస్తారా సేల్‌లో బాగ్డోగ్రా నుంచి డిబ్రూగఢ్‌కు ప్రయాణించడానికి ఎకానమీ క్లాస్‌లో ఒకవైపు దేశీయ ఛార్జీ రూ.1,578 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో ముంబై నుంచి అహ్మదాబాద్‌కి ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రారంభ ధర రూ.2,678. ఇక ముంబై నుంచి అహ్మదాబాద్‌కి బిజినెస్ క్లాస్ ధర రూ.9,978 నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ నుంచి ఖాట్మండుకు అంతర్జాతీయ విమానానికి ఎకానమీ క్లాస్ ధర రూ.11,978 నుంచి ప్రారంభమవుతుంది. అదే ప్రీమియం ఎకానమీ విభాగంలో ఢిల్లీ నుంచి ఖాట్మండుకు ప్రారంభ ధర రూ.13,978. -
విస్తార కీలక ప్రకటన.. 20 నిమిషాలు ఫ్రీ వై-ఫై
అంతర్జాతీయ విమానాల్లో 20 నిమిషాల ఫ్రీ వై-ఫై అందజేస్తామని విస్తారా ప్రకటించింది. ఈ సర్వీస్ అందిస్తున్న మొదటి భారతీయ విమానయాన సంస్థగా విస్తారా రికార్డ్ క్రియేట్ చేసింది. టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ ఎయిర్‌లైన్ అన్ని క్యాబిన్లలో ప్రయాణీకులకు 20 నిమిషాల వై-ఫై యాక్సెస్ అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.ఈ ఫ్రీ వై-ఫై సర్వీస్ బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ ఏ321 నియో విమానాల్లో మాత్రమే లభించనున్నాయి. ఈ వై-ఫై మరింత సమయం కావాలనుకున్నప్పుడు ప్లాన్స్ పొందాల్సి ఉంటుంది. విస్టారా ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఈ సర్వీస్ అందిస్తున్నట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, దీపక్ రజావత్ వెల్లడించారు.బిజినెస్ క్లాస్, ప్లాటినం క్లబ్ విస్తార సభ్యులకు మరో 50 ఎంబీ డేటాను పొందవచ్చు. అన్లిమిటెడ్ వాట్సప్, ఫేస్బుక్ సేవల కోసం రూ. 372.74 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా రూ.1577.54 + జీఎస్టీ చెల్లిస్తే వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లలో అన్లిమిటెడ్ డేటా యాక్సెస్ లభిస్తుంది. రూ.2707.05 + జీఎస్టీ చెల్లిస్తే అన్లిమిటెడ్ డేటా పొందవచ్చు.Don’t miss out on important updates even at 35000 ft. ! Get 20 minutes of complimentary in-flight Wi-Fi, a first in Indian Aviation. Now you can purchase the selected plans using Indian credit/debit card in addition to internationally issued credit cards. pic.twitter.com/NTYCOJFY5N— Vistara (@airvistara) July 27, 2024 -
వీఆర్ఎస్, వీఎస్ఎస్ ప్రకటించిన ఎయిరిండియా
ఎయిరిండియా స్వచ్ఛంద విభజన పథకం(వాలెంటరీ సెపరేషన్ స్కీమ్)తో పాటు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) రూపొందించింది. కంపెనీలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమ్ అందుబాటులో ఉంటుందని, ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నవారికి వీఎస్ఎస్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ పథకాలను నాన్ ఫ్లైయింగ్ పర్మనెంట్ స్టాఫ్ కోసం తయారుచేసినట్లు చెప్పింది. అయితే వీటికి సంబంధించిన నిర్దిష్ట వివరాలను మాత్రం వెల్లడించలేదు.ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేసిన తర్వాత శాశ్వత ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టడం ఇది మూడోసారి. విస్తారా ఎయిర్‌లైన్స్ టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాలో విలీనానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి పథకాలు రావడం గమనార్హం. ఈ నెల ప్రారంభంలో రెండు ఎయిర్‌లైన్స్‌లోని దాదాపు 600 మంది ఉద్యోగులపై ఈ విలీనం ప్రభావం చూపుతుందని కొన్ని సంస్థలు నివేదికలు తెలిపాయి. ఎయిరిండియా, విస్తారాలో కలిపి సుమారు 23,000 మంది ఉద్యోగులు ఉన్నారు.ఇదీ చదవండి: కంపెనీలు వెళ్లిపోతాయ్..!విలీన ప్రక్రియలో భాగంగా ఫిట్మెంట్ విధానాలు, ఉద్యోగ స్థానాల కేటాయింపు పూర్తయిన తర్వాత విస్తారా కూడా ఇలాంటి స్కీమ్‌లను ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విస్తారా సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్ మధ్య జాయింట్ వెంచర్‌గా ఉంది. రెండు సంస్థల విలీనం పూర్తయితే ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా దక్కుతుంది. -
ఎయిర్‌లైన్స్ విలీనం.. 700 మంది తొలగింపు!!
ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ త్వరలో కలిసిపోతున్నాయి. ఈ రెండు విమానయాన సంస్థల విలీనం వందలాది మంది ఉద్యోగాలపై మీదకు వచ్చింది. ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ రెండింటిలో కనీసం 700 మంది ఉద్యోగులను తొలగించబోతున్నారు. ఇద్దరు అధికారుల ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దీని అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.అయితే రిటైర్మెంట్కు చేరుకుంటున్న ఉద్యోగులు, నిర్ణీత కాల ఒప్పందాలు ఉన్న ఉద్యోగులు ఇందులో ఉండరని ఆ ఇద్దరు అధికారులు తెలిపారు. హెచ్‌టీ లైవ్ నివేదిక ప్రకారం.. సుమారు 18,000 మంది ఉద్యోగులున్న ఎయిర్ ఇండియా విస్తారాతో విలీనం కానుంది. ఇందుకోసం దాదాపు 6000 మంది విస్తారా ఉద్యోగులను విలీన యూనిట్లో చేయాల్సి ఉంటుంది.“అంతర్గత ఫిట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. త్వరలో తొలగింపుల ప్రకటన ఉంటుంది. స్థిర-కాల ఒప్పందాలు ఉన్న ఉద్యోగులు, త్వరలో పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు మినహా ఎయిర్ ఇండియా, విస్తారా రెండింటిలో దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది" ఒక అధికారి తెలిపారు.అదే సమయంలో పనితీరు ఆధారంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు మరో అధికారి తెలిపారు. "నాన్-ఫ్లైయింగ్ ఫంక్షన్లలోని ఉద్యోగులకు సంస్థాగత అవసరాలు, వ్యక్తిగత యోగ్యత ఆధారంగా ఉద్యోగాల కేటాయింపు ఉంటుంది" అని మూడో అధికారి చెప్పారు. -
పైలెట్ల కొరత.. ఎయిర్ విస్తారా కీలక నిర్ణయం
ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఎయిర్ విస్తారా కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది కొరత కారణంగా విమాన కార్యకలాపాల్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. విస్తారా రోజుకు దాదాపు 350 విమానాలను నడుపుతోంది. వాటిల్లో 25-30 విమానాల వరకు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. విస్తారా విమానాల రద్దు కారణంగా ముఖ్యంగా మెట్రో మార్గాల్లో ఛార్జీలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ-ముంబై రూట్లో విస్తారా రోజుకు దాదాపు 18 విమానాలను నడుపుతుండగా..ఇండిగో 19 విమానాలను నడుపుతోంది. ‘మేము మా కార్యకలాపాలను రోజుకు సుమారు 25-30 విమానాలు, అంటే 10శాతం సేవల్ని నిలిపివేస్తున్నాం. ఫిబ్రవరి 2024 చివరి వరకు ఎన్ని విమానాలు నడిపామో.. ఇక నుంచి అన్నే విమానాల్లో ప్రయాణికులకు సేవలందించాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో ఎయిర్ విస్తారా తెలిపింది. ఈ సందర్భంగా విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ మాట్లాడుతూ..మా సంస్థ పైలట్లను ఎక్కువగా వినియోగించుకుంటోందని, అంతరాయం కారణంగా సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు. ఇకపై ఎక్కువ మంది పైలట్లను నియమించుకోవడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. -
పైలట్ల కొరత.. సమస్య పరిష్కారానికి చర్చలు!
పైలట్ల సమస్యల పరిష్కారానికి ఇటీవల విస్తారా ఉన్నతాధికారులు సమావేశమై కొత్త కాంట్రాక్టులు, రోస్టరింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన వేతన విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కొంత మంది పైలట్లు రాజీనామాలకు తెరతీసిన సంగతి తెలిసిందే. తగినంత సంఖ్యలో పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గత 2-3 రోజుల్లోనే 100కి పైగా విమానాలను విస్తారా రద్దు చేసింది. బుధవారం సుమారు 26 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. తాజా పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదికను సమర్పించాల్సిందిగా విస్తారాకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సూచించింది. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే.. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి పైలట్లతో విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ సహా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశంలో మానవ వనరుల విభాగం, ఇతర విభాగం అధికారులు పాల్గొన్నారని కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే సమావేశ వివరాలకు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విమాన సర్వీసుల నిర్వహణ తిరిగి సాధారణ స్థితికి వస్తోందని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
పైలట్ల కొరత.. సమస్య పరిష్కారానికి చర్చలు!
పైలట్ల సమస్యల పరిష్కారానికి ఇటీవల విస్తారా ఉన్నతాధికారులు సమావేశమై కొత్త కాంట్రాక్టులు, రోస్టరింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన వేతన విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కొంత మంది పైలట్లు రాజీనామాలకు తెరతీసిన సంగతి తెలిసిందే.తగినంత సంఖ్యలో పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గత 2-3 రోజుల్లోనే 100కి పైగా విమానాలను విస్తారా రద్దు చేసింది. బుధవారం సుమారు 26 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. తాజా పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదికను సమర్పించాల్సిందిగా విస్తారాకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సూచించింది.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే..ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి పైలట్లతో విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ సహా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశంలో మానవ వనరుల విభాగం, ఇతర విభాగం అధికారులు పాల్గొన్నారని కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే సమావేశ వివరాలకు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విమాన సర్వీసుల నిర్వహణ తిరిగి సాధారణ స్థితికి వస్తోందని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ప్రముఖ సంస్థ
విస్తారా ఎయిర్‌లైన్స్ తాత్కాలికంగా తన విమాన కార్యకలాపాలను తగ్గించుకోనుంది. పైలెట్లు, ఫస్ట్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడం ఇందుకు కారణమని తెలుస్తుంది. వేతన సవరణకు వ్యతిరేకంగా వీరంతా అనారోగ్య సెలవులో ఉండడంతో, సోమవారం దాదాపు 50 సర్వీసులు రద్దు అయినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం ఈ సంఖ్య 70కి చేరొచ్చని అంచనా. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో పాటు పలు కారణాల వల్ల విమానాల రద్దు, ప్రయాణాల్లో ఆలస్యం చోటు చేసుకుంటోందని విస్తారా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. విమాన సర్వీసుల రద్దుపై ప్రయాణికులకు సంస్థ క్షమాపణలు తెలిపింది. సర్వీసుల రద్దుకు కారణాలను వెల్లడించలేదు. త్వరలోనే సాధారణ స్థాయిలో కార్యకలాపాలను చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. రద్దు అయిన సర్వీసులకు చెందిన ప్రయాణికులకు ఛార్జీలు రీఫండ్ చేస్తామని చెప్పారు. విస్తారా ఎయిర్ ఇండియాతో విలీనానికి ముందు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుండడం గమనార్హం. విస్తారా 300 కంటే ఎక్కువ దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతుంది. ప్రయాణాల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్న ప్యాసింజర్లను తమ గమ్యస్థానం చేర్చడానికి వైడ్-బాడీ డ్రీమ్లైనర్లు, ఎయిర్‌బస్ A321లను వాడుతున్న కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: యాపిల్ కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలా..? గత 2-3 రోజులుగా ప్యాసింజర్ల ప్రయాణాల్లో మరింత ఆలస్యం అవుతుందని, సోషల్ మీడియాలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. దానికితోడు సోమవారం ప్రధాని మోదీ ముంబై నగర పర్యటన ఉండడంతో వీవీఐపీలు రాకపోకలు సాగించారు. దాంతో విస్తారాతోపాటు ఇతర సంస్థల విమానాలు కూడా సోమవారం 30-40 నిమిషాలు ఆలస్యం అయ్యాయి. -
ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన ప్రముఖ సంస్థ
విస్తారా ఎయిర్‌లైన్స్ తాత్కాలికంగా తన విమాన కార్యకలాపాలను తగ్గించుకోనుంది. పైలెట్లు, ఫస్ట్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడం ఇందుకు కారణమని తెలుస్తుంది. వేతన సవరణకు వ్యతిరేకంగా వీరంతా అనారోగ్య సెలవులో ఉండడంతో, సోమవారం దాదాపు 50 సర్వీసులు రద్దు అయినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం ఈ సంఖ్య 70కి చేరొచ్చని అంచనా. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో పాటు పలు కారణాల వల్ల విమానాల రద్దు, ప్రయాణాల్లో ఆలస్యం చోటు చేసుకుంటోందని విస్తారా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. విమాన సర్వీసుల రద్దుపై ప్రయాణికులకు సంస్థ క్షమాపణలు తెలిపింది. సర్వీసుల రద్దుకు కారణాలను వెల్లడించలేదు. త్వరలోనే సాధారణ స్థాయిలో కార్యకలాపాలను చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. రద్దు అయిన సర్వీసులకు చెందిన ప్రయాణికులకు ఛార్జీలు రీఫండ్ చేస్తామని చెప్పారు. విస్తారా ఎయిర్ ఇండియాతో విలీనానికి ముందు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుండడం గమనార్హం. విస్తారా 300 కంటే ఎక్కువ దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతుంది. ప్రయాణాల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్న ప్యాసింజర్లను తమ గమ్యస్థానం చేర్చడానికి వైడ్-బాడీ డ్రీమ్లైనర్లు, ఎయిర్‌బస్ A321లను వాడుతున్న కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: యాపిల్ కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలా..?గత 2-3 రోజులుగా ప్యాసింజర్ల ప్రయాణాల్లో మరింత ఆలస్యం అవుతుందని, సోషల్ మీడియాలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. దానికితోడు సోమవారం ప్రధాని మోదీ ముంబై నగర పర్యటన ఉండడంతో వీవీఐపీలు రాకపోకలు సాగించారు. దాంతో విస్తారాతోపాటు ఇతర సంస్థల విమానాలు కూడా సోమవారం 30-40 నిమిషాలు ఆలస్యం అయ్యాయి. -
ఇదేమైనా బావుందా? కేంద్రమంత్రి సంచలన ట్వీట్: విస్తారా రియాక్షన్
విస్తారా ఎయిర్‌లైన్స్‌లో తన కెదురైన అనుభవంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఒక సంచలన ట్వీట్ చేశారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ సర్వీసు, క్యాబిన్ పరిస్థితి నచ్చలేదు అంటూ సంస్థ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఇండియా అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడుతున్న తరుణంలో ప్రయాణీకులకు ఇలా స్వాగతం చెప్పడం ఏమీ బాగాలేదు అంటూ విచారాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. యూకేలో జరిగిన ఏఐ సేఫ్టీ సమ్మిట్ తర్వాత ఢిల్లీకి తిరుగి వస్తుండగా కేంద్ర మంత్రికి ఈ అనుభవం ఎదురైంది. లండన్ నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణానికి ఆయన విస్తారా విమానాన్ని ఎంచుకున్నారు.ప్రయణా సాఫీగా సాగినప్పటికీ, కానీ ఇదే బాలేదు అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. (ఎల్విష్ రేవ్ పార్టీ కలకలం: మేనకా గాంధీ ఫైర్, అసలీ ట్రాప్ ఎవరిది?) ఈ క్రమంలో విస్తారా ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్లో పడివున్న వాటర్ బాటిల్స్, మిగిలిపోయిన ఆహార పదార్థాల ఫోటోను ఎక్స్ (ట్విటర్) లో షేర్ చేశారు. ప్రయాణికులకు స్వాగతం చెప్పే తీరు బాలేదు అంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారు. దీనికి డిస్ అప్పాయింటెడ్ హ్యాష్‌ట్యాగ్ కూడా చేశారు. దీంతో ఇది వైరల్‌గామారింది. ఒక్కో యూజర్ తమకెదురైనా అనుభవాలను ఒక్కొక్కటిగా షేర్ చేశారు. ఇది వైరల్ కావడంతో స్పందించిన విస్తారా ఒక ప్రకటన జారీ చేసింది. (పెళ్లైన మూడు రోజులకే దారుణం.. సొంత తండ్రే కిరాతకం) విస్తారా ప్రకటన: పోస్ట్ వైరల్ కావడంతో విస్తారా స్పందించింది. హాయ్ రాజీవ్ జీ మీ కెదురైన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ట్వీట్ చేసింది. ప్రతి టచ్ పాయింట్ వద్ద కస్టమర్లకు చక్కటి అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. జరిగిన ఘటన తమ ప్రామాణిక శుభ్రతా విధానాలకు అనుగుణంగా లేదనేది అర్థ మైందనీ, దీనిని సీరియస్‌గా పరిగణించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. భవిష్యత్తులో మెరుగైన అనుభవాన్ని అందించడానికి బద్ధులై ఉన్నామంటూ వివరణ ఇచ్చింది. So decided to fly @airvistara from London to Delhi last nite. Nice new clean 787 aircraft and very smooth flight - but saddened by service & state of cabin -food & litter not the best way to welcome visitors to India or compete wth other global carriers 😥😥🤷🏻♂️#Disappointed… pic.twitter.com/LSsVDPOym5 — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) November 3, 2023 -
ఎయిరిండియా-విస్తారా విలీనం: సీసీఐ షోకాజ్ నోటీసులు!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా–విస్తారా విలీన ప్రతిపాదనపై కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది. దీనిపై సంబంధిత పార్టీలకు సీసీఐ షోకాజ్ నోటీసులు పంపినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు సంస్థల విలీన ప్రతిపాదన భారత్ విమానయాన రంగానికి ప్రతికూలంగా ఉంటుందని, ఈ రంగంపై వీటికి గుత్తాధిపత్యం లభిస్తుందని వస్తున్న విమర్శలపై ఎందుకు విచారణ చేపట్టకూడదో తెలియజేయాలని ఎయిర్ ఇండియాకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఫెయిర్–ట్రేడ్ రెగ్యులేటర్ పేర్కొన్నట్లు సమాచారం. ఒప్పందం తీరిది... విస్తారా, ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న రెండు వేర్వేరు విమానయాన సంస్థలు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు విస్తారాలో 49 శాతం వాటా ఉంటే, టాటా సన్స్ వాటా 51 శాతంగా ఉంది. ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేయనున్న ఒప్పందం ప్రకారం విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేస్తున్నట్లు గత ఏడాది నవంబర్‌లో టాటా గ్రూప్ ప్రకటించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ విమానయాన రంగంలో ఈ ఒప్పందం అతిపెద్ద ఏకీకరణ ఒప్పందంగా సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. ఈ ఒప్పందం సాకారమైతే, దేశంలో అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్‌గా అలాగే ఇండిగో తర్వాత రెండవ అతిపెద్ద దేశీయ క్యారియర్‌గా ఎయిర్ ఇండియా రూపాంతరం చెందుతుంది. విలీనానికి సంబంధిత సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్‌లో సీసీఐ అనుమతి కోరాయి. వీటిలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీస్పీఎల్), ఎయిర్ ఇండియా లిమిటెడ్, టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్‌లు ఉన్నాయి. కాగా, తాజా పరిణామంపై ఎయిర్ ఇండియా ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. సీసీఐ సంతృప్తి చెందకపోతే.. తాజా నోటీసులకు సంబంధిత సంస్థలు పంపిన ప్రతిస్పందనలకు సీసీఐ సంతృప్తిపడకపోతే... ఈ విషయంలో కమిషన్ రెండవ దశ చర్యలు చేపడుతుంది. దీనిలో ప్రతిపాదిత ఒప్పందం వివరాలను బహిరంగ పరచాలని పార్టీలకు సూచిస్తుంది. దీనిపై సంబంధిత వర్గాల అభిప్రాయాలనూ ఆహ్వానించి వాటిని పరిశీలిస్తుంది. ఒప్పందంపై తన తుది నిర్ణయం తీసుకునే ముందు సంస్థల నుండి సీసీఐ అదనపు సమాచారాన్ని పొందవచ్చు. పోటీ సంబంధ ఆందోళనలను పరిష్కరించడానికి గత సందర్భాల్లో సంస్థలు సీసీఐకి స్వయంగా పరిష్కార చర్యలను సమర్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని సీసీఐ ఆమోదించడం, షరతులతో కూడిన ఆమోదాలను ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
వరల్డ్ టాప్ 100 ఎయిర్‌లైన్స్: మళ్లీ అదరగొట్టిన సంస్థ ఇదే!
ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 ఎయిర్‌లైన్స్ జాబితాలో రెండు భారతీయ విమానయాన సంస్థలు చోటు సంపాదించు కున్నాయి. విమానయాన సంస్థలు విస్తారా, ఇండిగో మాత్రమే ఈ లిస్ట్‌లో ఉండటం విశేషం. టాప్ 100లో 49వ ర్యాంకు సాధించిన ఇండిగో మూడవ ఉత్తమ తక్కువ-ధర విమానయాన సంస్థగా ఎంపికైంది. టాటా గ్రూపు నేతృత్వంలోని ఎయిరిండియా 10 అత్యంత మెరుగైన విమానయాన సంస్థల జాబితాలో 9వ స్థానంలో ఉంది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డుల ప్రకారం 2022లోని 20వ ప్లేస్నుంచి నాలుగు స్థానాలు ఎగబాకి మరీ విస్తారా 16వ స్థానానికి చేరింది.అటు ఇండిగో గత సంవత్సరం 45వ స్థానం నుండి రెండు స్థానాలు పెరిగి 43వ ర్యాంక్‌కు చేరుకుంది. టాప్ 100 ఎయిర్‌లైన్స్‌కు స్కైట్రాక్స్ ఈ అవార్డులను ఇచ్చింది. అలాగే 20 ‘ప్రపంచపు అత్యుత్తమ ఎయిర్‌లైన్ క్యాబిన్ క్రూ 2023’ జాబితాలో కూడా విస్తారా 19వ ప్లేస్ కొట్టేసింది. అంతేనా ఆసియాలోని టాప్ 10 ఎయిర్‌లైన్స్ జాబితాలో విస్తారా 8వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. (రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ) ఎయిర్‌లైన్ స్కైట్రాక్స్ టాప్ 20 ఎయిర్‌లైన్స్ జాబితాలో వరుసగా రెండవ సారి స్థానం పొందింది విస్తారా.అలాగే వరుసగా మూడో ఏడాది కూడా 'బెస్ట్ ఎయిర్‌లైన్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా' అవార్డును, ఇండియా దక్షిణాసియాలో ఉత్తమ క్యాబిన్ క్రూ' గా వరుసగా ఐదవసారి, 'భారతదేశం, దక్షిణాసియాలో ఉత్తమ క్యాబిన్ క్రూ' మూడవసారి గెలుచుకుంది. దీంతోపాటు 'వరల్డ్స్ బెస్ట్ ఇన్‌ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ 2023' విభాగంలో 20వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 100 దేశీల నుంచి వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్‌లో ఓటు వేయగా, మొత్తం 20.23 మిలియన్ల ప్రయాణికుల నుండి ఓట్లు వచ్చాయి.విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ కణ్ణన్ మాట్లాడుతూ ఈ అవార్డులు తమ సేవలు, కస్టమర్ల నమ్మకంతో పాటు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో తమని మరింత ఉత్తేజితం చేస్తామన్నారు. తమ ఉద్యోగులు, ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ టీమ్‌లు, ఎనిమిదేళ్ల ప్రస్థానంలో విశేష కృషికి గుర్తింపుగా నిలిచాయని పేర్కొన్నారు. ఇండియా సౌత్ఏసియాలో ఉత్తమ విమానయాన సిబ్బంది అవార్డును ఐదోసారి గెలుచుకోవడం గొప్ప విషయమని స్కైట్రాక్స్ సీఈవో ఎడ్వర్డ్ ప్లాస్టెడ్ అన్నారు. (రిలయన్స్ గ్రూప్‌లో కీలక పరిణామం: ప్రెసిడెంట్‌గా పారుల్ శర్మ) విస్తారా విస్తారా టాటా సన్స్ , సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్. ప్రస్తుతం ఇది 61 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది, ఇందులో 46 ఎయిర్‌బస్ A320neo, 10 ఎయిర్‌బస్ A321, ఒక బోయింగ్ 737-800NG, నాలుగు బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ ఉన్నాయి. -
ఎయిరిండియాకు అపార అవకాశాలు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన దిగ్గజం ఎయిరిండియాకు అపార అవకాశాలున్నట్లు కంపెనీ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ తాజాగా పేర్కొన్నారు. వెరసి ఎయిరిండియా గ్రూప్‌ను అంతర్జాతీయ దిగ్గజంగా రూపుదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో విస్తారాను కంపెనీతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతున్నట్లు విలేకరుల వర్చువల్ సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు తెలియజేశారు. ఇదేవిధంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్(ఎయిరేషియా ఇండియా)లను సైతం కంపెనీలో విలీనం చేసే కార్యాచరణకు ఇప్పటికే తెరతీసినట్లు తెలియజేశారు. ఎయిరిండియా గతంలో ఎన్నడూచూడని భారీ వృద్ధిని అందుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ నెల 14న ఎయిరిండియా 70 వైడ్‌బాడీ మోడల్సహా 470 విమానాల కొనుగోలుకి ఆర్డర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు నిధులను వివిధ మార్గాల ద్వారా సమీకరించనున్నట్లు విల్సన్ తెలియజేశారు. వీటిలో ఎయిర్‌బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 విమానాలను పొందనుంది. ఎయిరిండియాను గతేడాది జనవరిలో టాటా గ్రూప్ సొంతం చేసుకున్న విషయం విదితమే. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మరో 370 విమానాలను కొనుగోలు చేసే ప్రణాళికలున్నట్లు వెల్లడించారు. -
టాటా దూకుడు: ఏవియేషన్ మార్కెట్లో సంచలనం
న్యూఢిల్లీ: దేశీ ఏవియేషన్ మార్కెట్లో భారీ కన్సాలిడేషన్‌కు తెర తీస్తూ ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయనున్నట్లు టాటా గ్రూప్ మంగళవారం ప్రకటించింది. ఒప్పందం ప్రకారం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా దక్కనుంది. ఈ డీల్ 2024 మార్చి నాటికి పూర్తి కాగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం విస్తారాలో టాటా గ్రూప్‌నకు 51 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు (ఎస్ఐఏ) 49 శాతం వాటాలు ఉన్నాయి. ఈ కన్సాలిడేషన్‌తో దేశ, విదేశ రూట్లలో అత్యధికంగా సర్వీసులు నడిపిస్తున్న భారీ ఎయిర్‌లైన్స్‌గా ఎయిరిండియా ఆవిర్భవిస్తుందని టాటా గ్రూప్ తెలిపింది. అంతర్జాతీయ రూట్లకు సంబంధించి దేశీయంగా అతి పెద్ద సంస్థగాను, దేశీ రూట్లలో రెండో పెద్ద సంస్థగాను ఎయిరిండియా ఉంటుందని వివరించింది. విలీనానంతరం సంస్థ చేతిలో 218 విమానాలు ఉంటాయి. విలీన ఒప్పందం కింద ఎయిరిండియాలో రూ. 2,058.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఎస్ఐఏ తెలిపింది. తద్వారా తమకు ఎయిరిండియాలో 25.1 శాతం వాటా లభిస్తుందని, అలాగే అన్ని కీలక మార్కెట్ విభాగాల్లోనూ తమకు గణనీయంగా చోటు దక్కుతుందని పేర్కొంది. కీలక మైలురాయి .. ఎయిరిండియాను ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా తీర్చిదిద్దే క్రమంలో రెండు సంస్థల విలీనం కీలక మైలురాయి వంటిదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. ‘ఎయిరిండియా ఇటు నెట్‌వర్క్‌ను, అటు విమానాలను పెంచు కోవడంపై, కస్టమర్లకు అందించే సర్వీసులు మెరుగుపర్చుకోవడంపై, భద్రత.. విశ్వసనీయత.. సమయ పాలనను మెరుగు పర్చుకోవడంపై ప్రధానంగా దృష్టి పెడుతోంది‘ అని ఆయన చెప్పారు. టాటా గ్రూప్‌తో సంబంధాలను మరింత పటిష్టపర్చుకునేందుకు, దేశీ ఏవియేషన్ మార్కెట్ వృద్ధిలో పాలుపంచుకునేందుకు ఈ విలీనం చక్కని అవకాశం కాగలదని ఎస్ఐఏ సీఈవో గోహ్ చూన్ ఫోంగ్ తెలిపారు. విలీన ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగుతాయని విస్తారా సీఈవో వినోద్ కణ్ణన్ చెప్పారు. ఎయిరిండియా రూపాంతరం చెందే ప్రయత్నాలకు విలీన ఒప్పందం మరింత ఊతమివ్వగలదని సంస్థ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. మరిన్ని పెట్టుబడులు .. ఎయిరిండియా భారీ విస్తరణ, కార్యకలాపాల నిర్వహణ కోసం అవసరమైతే 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఎస్ఐఏ, టాటా సన్స్ మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నాయి. ‘విలీనానంతరం మాకు ఉండే 25.1 శాతం వాటా ప్రకారం మేము అదనంగా రూ.5,020 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేయాల్సి రావచ్చు. విలీనం పూర్తయ్యాకే చెల్లించాల్సి ఉంటుంది‘ అని ఎస్ఐఏ తెలిపింది. టాటా గ్రూప్‌లో నాలుగు ఎయిర్‌లైన్స్.. టాటా గ్రూప్‌లో ప్రస్తుతం ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ఏషియా ఇండియా, విస్తారా అని నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను ఈ ఏడాది జనవరిలోనే కొనుగోలు చేసింది. ఎయిర్ఏషియా ఇండియా 2014లో, విస్తారా 2015లో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 2005లో కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రస్తుతం విస్తారా, ఎయిరిండియా దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్స్ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అక్టోబర్‌లో రెండింటి మార్కెట్ వాటా కలిపి 18.3 శాతంగా ఉంది. ఎయిర్‌ఏషియాతో కలిపితే 25.9 శాతంగా ఉంది. ఎయిరిండియాలో విలీనంతో విస్తారా బ్రాండ్ కనుమరుగు కానున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్ల విస్తారా.. తాము స్థాపించిన ఎయిరిండియా.. ప్రభుత్వం చేతికి చేరాక, టాటా గ్రూప్ దశాబ్దాల పాటు తిరిగి విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించేందుకు 1994లో ప్రయత్నించినా కుదరలేదు. ఆరేళ్ల తర్వాత ఎయిరిండియాలో వాటాలు కొనుగోలు చేసి ఏవియేషన్‌లోకి ప్రవేశిద్దామనుకున్నా సాధ్యపడలేదు. చివరికి 2012లో ఏవియేషన్‌లో విదేశీ పెట్టుబడులపై పరిమితులను సడలించడంతో మళ్లీ ఎస్‌ఐఏతోనే జత కట్టి ఎట్టకేలకు 2015లో విస్తారా విమానయాన సంస్థను ఏర్పాటు చేసింది. తద్వారా విమానయాన మార్కెట్లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం విస్తారా దేశీ, విదేశీ రూట్లలో 41 ప్రాంతాలకు రోజూ 260 పైగా ఫ్లైట్లు నడుపుతోంది. 54 విమానాలు, దాదాపు 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. -
ఎయిరిండియా చెంతకు రెండు ఎయిర్‌లైన్స్!
ముంబై: విమాన సర్వీసుల వ్యాపార విభాగాన్ని కన్సాలిడేట్ చేయడంపై టాటా గ్రూప్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఎయిరిండియా కిందికి ఎయిర్ఏషియా ఇండియా, విస్తారలను తీసుకురావడంపై కసరత్తు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికోసం ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ ఆర్ఎస్ సంధూ సారథ్యంలో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ఏషియా ఇండియా అలాగే ఎయిరిండియా, విస్తార కార్యకలాపాల మధ్య సారూప్యతలను ఈ టీమ్ మదింపు చేయనున్నట్లు తెలిపాయి. ఏడాది వ్యవధిలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఎయిర్ఏషియా ఇండియాను కన్సాలిడేట్ చేయాలని, 2024 నాటికి మొత్తం విమాన సేవల వ్యాపారాన్ని ఎయిరిండియా గొడుగు కిందికి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
మరో విమానం ఇంజన్ ఫెయిల్: వరుస ఘటనలతో ప్రయాణీకులు బెంబేలు
సాక్షి, న్యూఢిల్లీ: విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు ప్రయాణీకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్ జెట్ విమానంలో విండ్‌షీల్డ్ క్రాక్ కారణంగా బుధవారం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. దీనిపై డీజీసీఐ సంస్థకు నోటీసులు కూడా జారి చేసింది. తాజాగా మరో ప్రైవేటు విమానయాన సంస్థ విస్తారా విమానంలో ఇంజీన్ ఫెయిల్ అయిన ఘటన ఆందోళన రేపింది. అయితే విమానం సేఫ్టీగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి బయలుదేరి, ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే విస్తారా విమానం ఇంజిన్ ఫెయిల్ అయింది. దీంతో విమానాన్ని ట్యాక్సీవే నుంచి పార్కింగ్ ప్రాంతానికి లాగాల్సి వచ్చింది. బ్యాంకాక్-ఢిల్లీ విమానం UK-122 (సింగిల్ ఇంజన్) నిన్న (మంగళవారం) ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు ఈ సంఘటన జరిగిందని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఢిల్లీలో ల్యాండింగ్ తర్వాత, పార్కింగ్ బేకు వెళుతున్న క్రమంలో చిన్న విద్యుత్ సమస్య ఏర్పడిందని, అయితే ప్రయాణీకుల భద్రత రీత్యా అప్రమత్తమైన సిబ్బంది ట్యాక్సీవే నుంచి పార్కింగ్ విమానాన్ని తరలించారని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. -
మీ అంచనాల్ని అందుకోలేకపోయాం, ఏం చేస్తాం చెప్పండి..అంతాకరోనా ఎఫెక్ట్
ముంబై: కస్టమర్ల అంచనాలను గత కొన్ని నెలలుగా అందుకోలేకపోయినట్టు విస్తారా ఎయిర్‌లైన్స్ సీఈవో వినోద్ కన్నన్ అంగీకరించారు. అంతరాలను పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కస్టమర్లకు ఆయన ఒక లేఖ రాశారు. సేవల్లో ఇటీవలి నెలకొన్న అవాంతరాలతో ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి రావడాన్ని, ఎయిర్‌లైన్స్ కాల్ సెంటర్‌ను చేరుకునేందుకు ఎక్కువ సమయం పాటు వేచి ఉండాల్సి రావడాన్ని అంగీకరించారు. ‘‘విమాన ప్రయాణం అన్నది ఒక లావాదేవీ కాకుండా, సంతోషరమైన ఒక మరపురాని అనుభూతిగా మిగల్చాలని మేరు కోరుకుంటాము. ఈ విషయంలో గత కొన్ని నెలలుగా మేము అంచనాలను అందుకోలేని విషయం నిజమే. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు వెబ్సైట్ కానీ, యాప్ కానీ నిర్ధేశిత పరిష్కారాలను చూపించడం లేదని తెలుసు. విమానాశ్రయాల్లో ఆన్‌గ్రౌండ్ సేవల పరంగా కొన్ని సందర్భాల్లో మీ అంచనాలను అందుకోలేకపోతున్నట్టు అవగాహన ఉంది’’ అని లేఖలో పేర్కొన్నారు. కస్టమర్ల ఫిర్యాదులు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరోనా వల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో కొన్ని సేవలను తాత్కాలికంగా కుదించాల్సి వచ్చినట్టు వివరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
విస్తారా బంపరాఫర్: వారికి ఉచితంగా విమానయానం
ముంబై: కోవిడ్ విస్తరిస్తున్న వేళ వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి.. కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విమానాయన సంస్థ విస్తారా వైద్య సిబ్బందికి బంపరాఫర్ ప్రకటించింది. వైద్యులు, నర్సులు తమ విమానాల్లో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. విస్తారా ఎయిర్‌లైన్స్ ఆదివారం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పౌర విమానయాన శాఖకు ఈ విషయాన్ని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు చెందిన డాక్టర్లు, నర్సులు ఉచితంగా తమ విమానంలో ప్రయాణించొచ్చు అని విస్తారా ప్రకటించింది. ఈ మేరకు విస్తారా ఎయిర్‌లైన్స్ పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పఢీకి లేఖ రాసింది. ప్రభుత్వ సంస్థలు, హాస్పిటల్స్‌కు తక్షణ సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని విస్తారా తెలిపింది. ఎయిర్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా పొందొచ్చని పేర్కొంది. ఇక ఉచిత ప్రయాణం ఆఫర్లో విస్తారా ఒక కండీషన్ పెట్టింది. సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ముందు సీట్ల కేటాయింపు ఉంటుందని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఇక ఈ ఆఫర్ పొందాలనుకునే వైద్య సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను చూపించాలని తెలిపింది. చదవండి: యూఎస్‌కు నాన్‌స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను -
యూఎస్‌కు నాన్‌స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను
ముంబై, సాక్షి: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తారా.. యూఎస్‌కు నాన్‌స్టాప్ సర్వీసులను నిర్వహించాలని యోచిస్తోంది. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రసిద్ధ టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ఏర్పాటైన ఈ భాగస్వామ్య సంస్థ(జేవీ) త్వరలో యూఎస్‌కు డైరెక్ట్ సర్వీసులను ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ నేపథ్యంలో నాన్‌స్టాప్ సర్వీసులకు భారీ డిమాండ్ నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎప్పటిలోగా సర్వీసులను ప్రారంభించాలన్న అంశాన్ని నిర్ణయించుకోలేదని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినోద్ కన్నన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 20-30 శాతం వరకూ నాన్‌స్టాప్ విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి వివిధ ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు వినోద్ తెలియజేశారు. ఇందుకు విమానాలకున్న ఆవశ్యకత, తదితరాలపై కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2023కల్లా కంపెనీకున్న మొత్తం సీట్ల సామర్థ్యంలో 20-30 శాతం వరకూ అంతర్జాతీయ రూట్లకు కేటాయించాలని విస్తారా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇందుకు 10 శాతాన్నే వినియోగించింది. ఇదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) చివరికల్లా విమానాల సంఖ్యను 70కు పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం విస్తారా 48 విమానాలతో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేశాయి. -
ముంచుకొస్తున్న తుపాను : పలు విమానాలు రద్దు
సాక్షి, ముంబై: నిసర్గ తుపాను పెనువేగంతో ముంబై తీరంవైపు దూసుకొస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. బుధవారం దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రాకపోకలను సాగించే విమానాలను రద్దు చేశాయి. ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్ సంస్థలు పలు విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సమాచారాన్ని సంబంధిత ప్రయాణీకులకు అందించామనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని వారు అప్రమత్తంగా కావాలని సూచించాయి. (తీవ్ర తుఫానుగా ‘నిసర్గ’) ఇండిగో 17 విమానాలను రద్దు చేసింది. . ముంబై నుండి చండీగఢ్, రాంచీ పాట్నాకు కేవలం మూడు విమానాలను మాత్రమే నడుపుతున్నట్టు ఇండిగో పేర్కొంది. ప్రత్యామ్నాయ విమానంలో తిరిగి బుక్ చేసుకునే అవకాశం లేదా క్రెడిట్ సౌకర్యాన్ని అందివ్వనున్నామని ఇండిగో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. తుపాను కారణంగా తమ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని విస్తారా ప్రకటించింది. ప్రధానంగా ముంబై, గోవా మధ్య విమానాలను రద్దు చేసినట్టు తెలిపింది. మరిన్ని వివరాలకు విస్తారా అధికారిక వెబ్ సైట్ ను గానీ, 9289228888 నంబరుగానీ సంప్రదించాలని ట్వీట్ చేసింది. అలాగే ముంబై నుంచి , ఢిల్లీ కోల్‌కతాకు వెళ్లే విమానాలను కూడా బుధవారం రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎయిరిండియా ఉదయం విమానాలను రీషెడ్యూల్ చేస్తోంది. అలాగే విమాన షెడ్యూల్లో ఏదైనా రద్దు, మార్పులను ఇ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని స్పైస్‌జెట్ తెలిపింది. కాగా కరోనా వైరస్ , లాక్ డౌన్ కారణంగా పూర్తిగా నిలిచిపోయిన దేశీయ విమాన ప్రయాణాలకు ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఇటీవల అనుమతి లభించించి. మళ్లీ ఇంతలోనే నిసర్గ తుపాను రూపంలో అంతరాయం ఏర్పడింది. #6ETravelAdvisory : To know your flight status, click here https://t.co/Z25uUH5PWw #StaySafe #NisargaAlert pic.twitter.com/tkvwHX0OoA — IndiGo (@IndiGo6E) June 2, 2020 #TravelAdvisory : To check your flight status, please visit https://t.co/VkU7yLB2ny. pic.twitter.com/JYIW9ftpW3 — SpiceJet (@flyspicejet) June 2, 2020 #TravelUpdate Due to the movement of cyclonic storm "NISARGA" flights to/from Mumbai and Goa are likely to be impacted. Please visit https://t.co/IZ9taT0TOv or SMS UK to 9289228888 to check updated flight status before booking and leaving for the airport. Thank you. — Vistara (@airvistara) June 2, 2020 -
కోవిడ్: విస్తారా ఆ విమానాలు బంద్
సాక్షి, ముంబై: కోవిడ్-19 (కరోనా వైరస్ ) విజృంభిస్తున్న తరుణంలో విమానయాన సంస్థ విస్తారా కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 20 నుంచి మార్చి 31 వరకు తన అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా విమాన ప్రయాణికుల ద్వారా ఈ మహమ్మారి తేలికగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న రేపథ్యంలో విస్తారా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ పరిస్థితి కారణంగా 2020 మార్చి 20 నుండి 2020 మార్చి 31 వరకు అంతర్జాతీయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, జాయింట్ వెంచర్ సంస్థ విస్తారా బుధవారం తెలిపింది.ప్రభావిత విమానాలలో బుక్ చేసుకున్న వినియోగదారులకు పూర్తిగా చార్జీలను తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. కాగా ఇప్పటికే గ్లోబల్‌గా పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా బంద్ పెట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 వరకు అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేస్తున్నట్టు మార్చి17న గో ఎయిర్ ప్రకటించింది. చైనాలోని వుహాన్ నగరంలో వ్యాపించి ప్రపంచదేశాలను చుట్టేస్తున్న కరోనా మహమ్మారి, ఇటు మానవ జాతిని, ఇటు ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 8 వేలకు తాకింది. అలాగే ఈ వైరస్‌బారిన పడిన వారి సంఖ్య రెండు లక్షల మార్క్‌ను దాటేసింది. దేశీయంగా కరోనా సోకిన వారికి సంఖ్య 151కి చేరింది. -
కాలానికి పత్రం సమర్పయామి..!
సాక్షి, రాయపర్తి: కాలానికంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి కంప్యూటర్ యుగంలో మానవుడు ప్రకృతి ‘ప్రసాదా’లకు క్రమక్రమంగా దూరమైపోతున్నాడు. భూతల్లి అందించే సహజ వనరులను అందిపుచ్చుకునేందుకు అవకాశం లేక పర్యావరణం సమతుల్య తను దెబ్బతీసే ప్లాస్టిక్ భూతాన్ని ఆశ్రయిస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాడు. అభివృద్ధి పేరుతో బందీగా మారిన మానవుడు కాలగర్భంలో తనకు ఉన్న కళలు, అభిరుచులను ధారపోస్తూ ఉత్తిచేతులతో కాలం వెళ్లదీస్తున్నాడు. ప్రకృతిమాత అందించే విస్తరాకులను వదిలిపెట్టి డిస్పోజబుల్స్ కోసం పరుగులు తీస్తున్నాడు. దీంతో పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుండగా.. గ్రామాల ప్రజలకు ఉపాధిని దూరం చేస్తోంది. ఆనాటి రోజులే బాగున్నాయి... కాలానికనుగుణంగా నేటి స్పీడుయుగంలో మోదుగు చెట్టు ఆకులతో తయారు చేసిన విస్తరాకులను పక్కనబెట్టి రంగురంగుల కృత్రిమ రసాయనాలతో తయారు చేసిన ప్లాస్టిక్ ప్లేట్లవైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు ఆకర్షణీయమైన ప్లాస్టిక్‌తో తయారు చేసిన ప్లేట్లను వినియోగిస్తున్నారు. మోదుగుచెట్టు ఆకులతో తయారు చేసిన విస్తరాకులపై వేడివేడి అన్నం, కూరలతో వేడివేడిగా భోజనం చేస్తుంటే ఎంతో బాగుండేదని వృద్ధులు చెబుతుంటారు. మోదుగు ఆకు ప్రత్యేకం ఆయుర్వేదం ప్రకారం ఆకుపచ్చని ఆకులో భోజనం చేయడం వల్ల కళ్లు, మనసుకు ఇంపును ఇవ్వడంతోపాటు జీర్ణశక్తి పెరుగుతుందనేది పూర్వీకుల నమ్మకం. ఆకుపై ఎలాంటి రసాయన మైనపు పూతలు ఉండకపోవడం వల్ల వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. సహజసిద్ధంగా దొరికే మోదుగాకుకు ఎలాంటి రసాయనిక మైనపు పూతలు ఉండకపోవడం వల్ల ఆహారంలోకి ఎలాంటి రసాయనిక మార్పులు చేరవు. ఎక్కువ కాలం నిల్వ ఉండే విస్తరాకు మోదుగ. శుభ్రం చేయడానికి వీలుగా ఉంటుంది. అప్పటి రోజుల్లో మోదుగ, మర్రి, రావి, అరటిఆకు, పసుపు ఆకులను విస్తరులుగా చేసి భోజనం చేసేవారు. తెలంగాణలో విరివిగా దొరికే మోదుగ ఆకులను సేకరించి ఎండబెట్టి పనులు లేని సమయాల్లో ఇంటివద్ద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఆకులు కుట్టేవారు. అలాంటిది ఇప్పుడు యాంత్రిక జీవనంలోకి రెడీమేడ్‌గా రంగురంగులతో తయారు చేసిన ప్లాస్టిక్ విస్తర్లు పల్లెసీమల్లోకి సైతం చేరాయి. వ్యవసాయ పొలాల్లోకి వనభోజనాలకు వెళ్లిన క్రమంలో అప్పుడే తయారు చేసిన మోదుగ ఆకులను విస్తర్లుగా చేసి భోజనం చేసి వచ్చేవారు. కానీ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులనే తీసుకెళ్లి వినియోగిస్తున్నారు. ఇక మోదుగు ఆకులను కేవలం దైవపూజలో మాత్రం ఉపయోగిస్తుండడం గమనార్హం. ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనంతో అనర్థాలు ప్లాస్టిక్‌ప్లేట్లలో వేడివేడి మటన్, చికెన్ కర్రీలు వేసుకొని భోజనం చేయడం వల్ల అందులో రసాయనాలు కరిగి ప్రతీ వారానికి 5గ్రాముల పాలిథిన్ పదార్థం మనిషి శరీరంలోకి చేరుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. భోజనం చేసేప్పటి నుంచి ప్రతీ పనికి ప్లాస్టిక్‌ను వినియోగించడం మూలంగా పాలిథిన్ శరీరంలోకి చేరి వివిధ రకాల వ్యాధుల బారిన పడడంతో పాటు కేన్సర్‌కు దారితీస్తుందని చెబుతున్నారు. ఎండాకాలంలో ఆకులు తీసుకొస్తా.. ఎండాకాలంలో మోదుగ ఆకులను సేకరించి మధ్యాహ్న సమయంలో విస్తరాకులను కుడతాను. ఒక్కో విస్తరాకు కట్టకు రూ.55 చెల్లించి తీసుకెళ్తారు. ఆ డబ్బు కుటుంబ ఖర్చులకు తోడ్పడుతాయి. చిన్నప్పుడే ఆకులను అల్లడం నేర్చుకున్నా. అప్పటి నుంచి ఏటా వరకు ఎండాకాలంలో మోదుగ ఆకులను సేకరించి కుట్టి విక్రయిస్తాను. మోదుగ ఆకు విస్తరిల్లో అన్నం తింటుంటే ఆ రుచే వారు. అయితే, ప్లాస్టిక్ ప్లేట్లు రావడంతో మోదుగ ఆకులకు డిమాండ్ తగ్గింది. – బాషబోయిన గౌరమ్మ, తిర్మలాయపల్లి మోదుగ విస్తర్లను దూరప్రాంతాల్లో విక్రయిస్తా.. ప్రత్యేకంగా ఆటో ఏర్పాటు చేసుకొని మండలంలోని ఆరెగూడెం, కొత్తూరు, వర్ధన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో విస్తరాకులను ఒక్కో కట్టను రూ.55చొప్పున కొనుగోలు చేస్తాను. ఒక్క బెండలో 100 ఆకులు ఉంటాయి. ఇక్కడి నుంచి తీసుకెళ్లి వరంగల్, కాశిబుగ్గ, కొత్తవాడ, శివనగర్, రంగశాయిపేట, హన్మకొండ ప్రాంతాల్లో విక్రయిస్తాను. వీటిని ఎక్కువగా దేవాలయాల్లో పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తున్నారు. తద్దినాలకు, పొద్దులు, దేవాలయాల్లో జరిగే పండగలకు మాత్రమే వాడుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర కార్యాలయాల్లో అందరూ ప్లాస్టిక్ విస్తరాకులే వాడుతుండడంతో గిరాకీ అంతంత మాత్రంగా ఉంటోంది. – బరిగెల ఎల్లయ్య, తిర్మలాయపల్లి