‘విస్తారా’, గోఎయిర్ డిస్కౌంట్ ఆఫర్లు | Vistara looks to compete with Spicejet, GoAir, launches Rs 999 sale offer | Sakshi
Sakshi News home page

‘విస్తారా’, గోఎయిర్ డిస్కౌంట్ ఆఫర్లు

Published Thu, Nov 24 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

‘విస్తారా’, గోఎయిర్ డిస్కౌంట్ ఆఫర్లు

‘విస్తారా’, గోఎయిర్ డిస్కౌంట్ ఆఫర్లు

న్యూఢిల్లీ: విస్తారా, గోఎయిర్ విమానయాన సంస్థలు తక్కువ ధరలకు విమానయానాన్ని ఆఫర్  చేస్తున్నాయి. విస్తారా రూ.999కు, గోఎయిర్ రూ.736కు విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. ‘సెలెబ్రేషన్ సేల్’’ పేరుతో అందిస్తున్న తమ ఆఫర్ కోసం బుధవారం నుంచి శుక్రవారం అర్థరాత్రి (ఈ నెల 25) వరకూ టికెట్లు బుక్ చేసుకోవచ్చని విస్తారా  వెల్లడించింది. వచ్చే నెల 5 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 1 లోపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని, ఎకానమీ క్లాస్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

గోఎరుుర్ విమానయాన సంస్థ తక్కువ ధరకే,  రూ.736 ధరకు విమాన సర్వీసులను ఆఫర్ చేస్తోంది. అన్ని రూట్లలో వర్తించే ఈ ఆఫర్‌కు నేటి వరకూ (ఈ నెల 24న) టికెట్లు బుక్  చేసుకోవచ్చని గో ఎరుుర్ సంస్థ తెలిపింది. ఈ ఆఫర్‌తో  వచ్చే ఏడాది జనవరి 9 నుంచి మార్చి 31 వరకూ ప్రయాణించవచ్చని పేర్కొంది.  రూ.500, రూ.1,000  నోట్లు నేటి అర్థరాత్రి వరకూ తమ టికెట్ కౌంటర్లలో చెల్లుతాయని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement