విస్తారా ఎయిర్‌లైన్స్‌లో తన కెదురైన అనుభవంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఒక సంచలన ట్వీట్ చేశారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ సర్వీసు, క్యాబిన్ పరిస్థితి నచ్చలేదు అంటూ సంస్థ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఇండియా అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడుతున్న తరుణంలో ప్రయాణీకులకు ఇలా స్వాగతం చెప్పడం ఏమీ బాగాలేదు అంటూ విచారాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
యూకేలో జరిగిన ఏఐ సేఫ్టీ సమ్మిట్ తర్వాత ఢిల్లీకి తిరుగి వస్తుండగా కేంద్ర మంత్రికి ఈ అనుభవం ఎదురైంది. లండన్ నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణానికి ఆయన విస్తారా విమానాన్ని ఎంచుకున్నారు.ప్రయణా సాఫీగా సాగినప్పటికీ, కానీ ఇదే బాలేదు అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. (ఎల్విష్ రేవ్ పార్టీ కలకలం: మేనకా గాంధీ ఫైర్, అసలీ ట్రాప్ ఎవరిది?)
ఈ క్రమంలో విస్తారా ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్‌లో పడివున్న వాటర్ బాటిల్స్, మిగిలిపోయిన ఆహార పదార్థాల ఫోటోను ఎక్స్ (ట్విటర్) లో షేర్ చేశారు. ప్రయాణికులకు స్వాగతం చెప్పే తీరు బాలేదు అంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారు. దీనికి డిస్ అప్పాయింటెడ్ హ్యాష్‌ట్యాగ్ కూడా చేశారు. దీంతో ఇది వైరల్‌గామారింది. ఒక్కో యూజర్ తమకెదురైనా అనుభవాలను ఒక్కొక్కటిగా షేర్ చేశారు. ఇది వైరల్ కావడంతో స్పందించిన విస్తారా ఒక ప్రకటన జారీ చేసింది. (పెళ్లైన మూడు రోజులకే దారుణం.. సొంత తండ్రే కిరాతకం)
విస్తారా ప్రకటన:
పోస్ట్ వైరల్ కావడంతో విస్తారా స్పందించింది. హాయ్ రాజీవ్ జీ మీ కెదురైన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ట్వీట్ చేసింది. ప్రతి టచ్ పాయింట్ వద్ద కస్టమర్లకు చక్కటి అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. జరిగిన ఘటన తమ ప్రామాణిక శుభ్రతా విధానాలకు అనుగుణంగా లేదనేది అర్థ మైందనీ, దీనిని సీరియస్‌గా పరిగణించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. భవిష్యత్తులో మెరుగైన అనుభవాన్ని అందించడానికి బద్ధులై ఉన్నామంటూ వివరణ ఇచ్చింది.
So decided to fly @airvistara from London to Delhi last nite.
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) November 3, 2023
Nice new clean 787 aircraft and very smooth flight - but saddened by service & state of cabin -food & litter not the best way to welcome visitors to India or compete wth other global carriers 😥😥🤷🏻♂️#Disappointed… pic.twitter.com/LSsVDPOym5
Comments
Please login to add a commentAdd a comment