disappointed
-
సీఎం చేతుల మీదుగా చెక్కులిస్తామని పిలిచి..
వైరా: సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రూ.2 లక్షల రుణమాఫీ చెక్కులు అందుకుందామని వచ్చిన పలువురు రైతులకు నిరాశ ఎదురైంది. సీఎం రేవంత్ వైరా సభలో రుణమాఫీని ప్రకటించి రైతులకు చెక్కులు ఇస్తారని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.ఇందుకోసం కారేపల్లి మండలం చీమలపాడుకు చెందిన అజ్మీరా రాజేశ్వరి, వైరా మండలం స్నానాల లక్ష్మీపురానికి చెందిన అడుసుమిల్లి పురుషోత్తం, వైరాకు చెందిన దార్ల పూజ, ధీరావత్ బిచ్చా, రఘునాథపాలెం మండలం పరికలబోడు తండాకు చెందిన తేజావత్ వీరు, ఏన్కూరు మండలం జన్నారానికి చెందిన పి.నర్సయ్య, కల్లూరు మండలం బాలాజీనగర్‌కు చెందిన పిళ్లా నాగేశ్వరరావు, మధిర మండలం సిద్దినేనిగూడెంకు చెందిన కె.వీరస్వామి తదితరులను రెండు గంటల ముందుగానే సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. సీఎం ప్రసంగం ముగియగానే జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల ఆ రైతులను వేదికపైకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ సీఎం రేవంత్ పట్టించుకోకుండా మంత్రులతో కలిసి వెళ్లిపోవడంతో రైతులు నిరాశగా వెనుదిరిగారు. -
Paris Olympics: పతకం ఖాయం అనుకుంటే.. నిరాశే మిగిలింది! (ఫొటోలు)
-
రూపాయి కూడా ఉంచలే.. మీకో దండం!
సాక్షి, హైదరాబాద్: ఎంతో ఆశతో చోరీకి వస్తే ఏమీ దొరక్కపోవడంతో ఓ చోరుడు తెగ ఫీలయ్యాడు! ‘ఎంత వెతికినా కనీసం ఒక్క రూపాయి కూడా లేదు... మీకో దండం’ అంటూ యజమానులను ఉద్దేశించి అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ హావభావాలు ప్రదర్శించాడు. చివరకు ఓ వాటర్ బాటిల్ చోరీ చేసి తిరిగి వెళదామనుకున్నప్పటికీ వెనక్కు వచ్చి టేబుల్‌పై రూ. 20 నోటు పెట్టి మరీ వెళ్లాడు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న వినాయక మెస్‌లో గత బుధవారం జరిగిన ఈ విచిత్ర చోరీ యత్నం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆస్తి నష్టం లేకపోవడంతో మెస్ నిర్వాహ కులు పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ ఇందుకు సంబంధించిన సీసీటీవీ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సన్నివేశం ప్రపంచాన్ని చుట్టేసింది.మండల కేంద్రం కావడంతో..మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న మెస్ కావడంతో క్యాష్ కౌంటర్లో దండిగా కాసులు ఉంటాయనుకున్న దొంగ.. తలకు టోపీ, ముఖానికి టవల్‌తో ప్రధాన ద్వారానికి వేసిన తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. తొలుత క్యాష్ కౌంటర్ వద్ద, ఆ తర్వాత కిచెన్‌లో ఆరు నిమిషాలకుపైగా వెతికినా ఏమీ దొరక్కపోవడంతో నిరాశ చెందాడు. తన ఆవేదనను హావభావాల ద్వారా అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ ప్రదర్శించాడు.అనంతరం క్యాష్ కౌంటర్ వెనుక ఉన్న రెండు ఫ్రిజ్‌లలో వెతుకుతూ ఒక దాంట్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని రెండు అడుగులు ముందుకు వేశాడు. కానీ ఒక్క రూపాయి కూడా దొరకని మెస్లోంచి వాటర్ బాటిల్ చోరీ చేయడానికి మనస్కరించకలేదో ఏమో.. తన ప్యాంటు బ్యాక్ పాకెట్ నుంచి పర్సు బయటకు తీసి అందులో నుంచి రూ. 20 తీసి వాటర్ బాటిల్‌ను కొట్టేయలేదు కొనుక్కొని వెళ్తున్నా అన్నట్లుగా చూపుతూ అక్కడి నుంచి వెనుతిరిగాడు. -
ఇదేమైనా బావుందా? కేంద్రమంత్రి సంచలన ట్వీట్: విస్తారా రియాక్షన్
విస్తారా ఎయిర్‌లైన్స్‌లో తన కెదురైన అనుభవంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఒక సంచలన ట్వీట్ చేశారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ సర్వీసు, క్యాబిన్ పరిస్థితి నచ్చలేదు అంటూ సంస్థ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఇండియా అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడుతున్న తరుణంలో ప్రయాణీకులకు ఇలా స్వాగతం చెప్పడం ఏమీ బాగాలేదు అంటూ విచారాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. యూకేలో జరిగిన ఏఐ సేఫ్టీ సమ్మిట్ తర్వాత ఢిల్లీకి తిరుగి వస్తుండగా కేంద్ర మంత్రికి ఈ అనుభవం ఎదురైంది. లండన్ నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణానికి ఆయన విస్తారా విమానాన్ని ఎంచుకున్నారు.ప్రయణా సాఫీగా సాగినప్పటికీ, కానీ ఇదే బాలేదు అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. (ఎల్విష్ రేవ్ పార్టీ కలకలం: మేనకా గాంధీ ఫైర్, అసలీ ట్రాప్ ఎవరిది?) ఈ క్రమంలో విస్తారా ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్లో పడివున్న వాటర్ బాటిల్స్, మిగిలిపోయిన ఆహార పదార్థాల ఫోటోను ఎక్స్ (ట్విటర్) లో షేర్ చేశారు. ప్రయాణికులకు స్వాగతం చెప్పే తీరు బాలేదు అంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారు. దీనికి డిస్ అప్పాయింటెడ్ హ్యాష్‌ట్యాగ్ కూడా చేశారు. దీంతో ఇది వైరల్‌గామారింది. ఒక్కో యూజర్ తమకెదురైనా అనుభవాలను ఒక్కొక్కటిగా షేర్ చేశారు. ఇది వైరల్ కావడంతో స్పందించిన విస్తారా ఒక ప్రకటన జారీ చేసింది. (పెళ్లైన మూడు రోజులకే దారుణం.. సొంత తండ్రే కిరాతకం) విస్తారా ప్రకటన: పోస్ట్ వైరల్ కావడంతో విస్తారా స్పందించింది. హాయ్ రాజీవ్ జీ మీ కెదురైన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ట్వీట్ చేసింది. ప్రతి టచ్ పాయింట్ వద్ద కస్టమర్లకు చక్కటి అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. జరిగిన ఘటన తమ ప్రామాణిక శుభ్రతా విధానాలకు అనుగుణంగా లేదనేది అర్థ మైందనీ, దీనిని సీరియస్‌గా పరిగణించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. భవిష్యత్తులో మెరుగైన అనుభవాన్ని అందించడానికి బద్ధులై ఉన్నామంటూ వివరణ ఇచ్చింది. So decided to fly @airvistara from London to Delhi last nite. Nice new clean 787 aircraft and very smooth flight - but saddened by service & state of cabin -food & litter not the best way to welcome visitors to India or compete wth other global carriers 😥😥🤷🏻♂️#Disappointed… pic.twitter.com/LSsVDPOym5 — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) November 3, 2023 -
తమన్ ట్యూన్స్ ప్రిన్స్ కు నచ్చడం లేదా?
-
మునుగోడులో ఓటమితో సైలెంట్ మోడ్ లోకి వెళ్లిన కాంగ్రెస్
-
తోటి వాళ్లంతా పని చేస్తున్నారు.. నీవు మాత్రం !
సాక్షి, జైపూర్(ఆదిలాబాద్) : జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన సౌదాని రాజశేఖర్(21)అనే యువకుడు తండ్రి మందలించాడని మనస్తాపానికి గురై గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదనపు ఎస్సై గంగరాజాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..టేకుమట్లకు చెందిన లీల–మల్లేశ్ దంపతుల కుమారుడు రాజశేఖర్ డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. రాజశేఖర్‌కు దేవుడి పూనకం రావడం.. తోటి వాళ్లు పని చేస్తున్నారు నీవు పని లేకుండా ఖాళీగా ఉంటున్నావు అని తండ్రి మల్లేశ్ ఈనెల 6న ఇంట్లో మందలించాడు. (గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా) దీంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి టేకుమట్ల సమీపంలో గోదావరి నదిలో దూకాడు. మూడు రోజులకి మృతదేహం టేకుమట్ల గోదావరి ఒడ్డుకు చేరుకోవడం స్థానికులు గమనించి పోలీసులు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని అదనపు ఎస్సై గంగరాజాగౌడ్ పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. (దారుణం: ఆగిన లిఫ్టు.. ఆ సమయంలో..) -
రాష్ట్రానికి నిరాశ మిగిల్చింది
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2020–బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించిందని, అన్యాయం జరిగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టాక ఆయన శనివారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో మీడియాతో మాట్లా డారు. ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోందన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. స్థూల ఉత్పత్తి 10%అంటే ప్రశ్నార్థకం రాబడి అంతా స్థూల ఉత్పత్తిపైనే ఆధారపడి ఉంటుంది.. స్థూల ఉత్పత్తి 10 % అంటున్నారంటే అది ప్రశ్నార్థకంగా ఉందని తప్పుబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2 లక్షల కోట్ల ఆదా యం వస్తుందనడం అనుమానాస్పదమేనన్నారు. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం వాటా ఇవ్వాల్సిందేనని, ఏడెనిమిది రాష్ట్రాలకు తప్పితే మిగిలిన రాష్ట్రాలన్నింటికీ రీయింబర్స్ చేయాలన్నారు. 2018–19లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పన్నుల వాటాను రూ.2,500 కోట్లకు తగ్గించారని, ఇది రాష్ట్రానికి పెద్ద దెబ్బని బుగ్గని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బు ఆదా చేస్తే యనమలకు బాధ ఎందుకు? కేంద్ర బడ్జెట్‌పై యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ తమది అవినీతి, అసమర్థ పాలన అంటున్నారని, 7 నెలల్లోనే తమది అసమర్థ పాలనా? అని బుగ్గన ప్రశ్నించారు. ఐదేళ్లలో టీడీపీ చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ ప్రభుత్వ అవినీతిపై రివర్స్ టెండరింగ్ చేసి రూ.1,900 కోట్లు మిగల్చడం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పా? అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్లే వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం పడిందని.. ఆయన చేసిన పనికి ఇప్పుడు సింగపూర్‌లో అల్లకల్లోలం జరుగుతోందని, అక్కడ ఓ ఆర్థిక మంత్రి పదవి కూడా ఊడబోతోందన్నారు. -
కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం
-
‘బీసీ’ల నారాజ్..!
సాక్షి, జనగామ: జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లలో ఒక్కో స్థానం మాత్రమే బీసీలకు దక్కాయి. జిల్లావ్యాప్తంగా 12 జెడ్పీటీసీ స్థానాల్లో బచ్చన్నపేట మాత్ర మే బీసీ మహిళకు కేటాయిం చారు. 12 ఎంపీపీ స్థానాల్లో బచ్చన్నపేట మాత్రమే బీసీలకు కేటాయించారు. రెండు మండలాల్లో నిల్.. జిల్లా వ్యాప్తంగా 140 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 18 మాత్రమే దక్కాయి. నర్మెట, కొడకండ్ల మండలాల్లో బీసీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు. నర్మెటలో ఏడు, కొడకండ్లలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఒక్కటి కూడా బీసీలకు దక్కలేదు. దీంతో ఈ రెండు మండలాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేకుం డాపోయింది. చిల్పూర్, రఘునాథపల్లి, దేవరుప్పుల, తరిగొప్పుల మండలాల్లో ఒక్కో స్థానం మాత్రమే బీసీలకు రిజర్వయ్యాయి. బచ్చన్నపేట మండలంలో మాత్రం బీసీలకు ఎక్కువ స్థానాలు దక్కాయి. బచ్చన్నపేటలో జెడ్పీటీసీ, ఎంపీపీ రెండు బీసీలకే దక్కాయి. అత్యధికంగా నాలుగు ఎంపీటీసీ స్థానాలు బీసీలకు దక్కడం విశేషం. బీసీలకు కేటాయించిన స్థానాలు బచ్చన్నపేట జెడ్పీటీసీ బీసీ మహిళ బచ్చన్నపేట ఎంపీపీ బీసీ మహిళ బీసీలకు కేటాయించిన ఎంపీటీసీ స్థానాలు.. చిల్పూర్ (బీసీ మహిళ) బచ్చన్నపేట–1(చిల్పూర్) (బీసీ జనరల్) కేశిరెడ్డిపల్లి(చిల్పూర్) (బీసీ జనరల్) కొన్నె(చిల్పూర్) (బీసీ మహిళ) లింగంపల్లి (చిల్పూర్) (బీసీ మహిళ) కోలుకొండ(దేవరుప్పుల) (బీసీ మహిళ) స్టేషన్ ఘన్పూర్–1(దేవరుప్పుల) (బీసీ జనరల్), ఇప్పగూడెం(దేవరుప్పుల) (బీసీ మహిళ) గానుపహాడ్(జనగామ) (బీసీ మహిళ) పెంబర్తి(జనగామ) (బీసీ జనరల్) నవాబుపేట(జనగామ) (బీసీ జనరల్) మాణిక్యపురం(జనగామ) (బీసీ మహిళ) జఫర్‌గఢ్–1(జనగామ) (బీసీ మహిళ) తమ్మడపల్లి (జి)(జనగామ) (బీసీ జనరల్) అబ్ధుల్నాగారం(తరిగొప్పుల) (బీసీ మహిళ) గబ్బెట(రఘునాథపల్లి) (బీసీ మహిళ) పాలకుర్తి–1(రఘునాథపల్లి) (బీసీ మహిళ) లక్ష్మీనారాయణపురం(రఘునాథపల్లి) (బీసీ జనరల్) నిరాశలో బీసీ నేతలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు రిజర్వేషన్లలో తక్కువ స్థానాలు రిజర్వు కావడంతో బీసీ నాయకులను నిరాశ పర్చింది. ప్రధాన పార్టీల్లో బీసీలు ద్వితీయ శ్రేణి నాయకులుగా రాణిస్తున్నారు. గ్రామ, మండల స్థాయిల్లో ప్రజాప్రతినిధులు ఎన్నికై ప్రజలకు సేవ చేద్దామని ఆలోచించిన బీసీ నాయకులకు రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో ఆశ నిరాశగా మారింది. దీంతో మెజార్టీ బీసీ నాయకులు పోటీకి దూరం కావాల్సి రావడంతో నారాజ్ అవుతున్నారు. -
జడ్జీలు రాజకీయాలకు దూరంగా ఉండాలి
న్యూఢిల్లీ: రాజస్తాన్ హైకోర్టు సీజే జస్టిస్ ప్రదీప్ నంద్రజాగ్, ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ రాజేంద్ర మీనన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించకపోవడంపై సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ మదన్.బి.లోకూర్ స్పందించారు. జస్టిస్ ప్రదీప్, జస్టిస్ రాజేంద్ర మీనన్‌ల నియామకంపై 2018, డిసెంబర్ 12న కొలీజియం చేసిన సిఫార్సుల్ని ప్రజలకు అందుబాటులోకి తేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 10న సమావేశమైన కొత్త కొలీజియం జస్టిస్ ప్రదీప్, జస్టిస్ మీనన్‌ల పేర్లను తొలగించి జస్టిస్ ఖన్నా, జస్టిస్ మహేశ్వరిల పేర్లను సిఫార్సు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కొలీజియం సిఫార్సుకు కేంద్రం గత వారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బుధవారం ది లీఫెల్ట్ న్యూస్‌పోర్టల్ నిర్వహించిన స్టేట్ ఆఫ్ ఇండియన్ జ్యుడీషియరీ అనే కార్యక్రమంలో జస్టిస్ లోకూర్ మాట్లాడుతూ.. ‘2018, డిసెంబర్ 12న కొలీజియం సమావేశం జరిగింది. అందులో కొన్ని నిర్ణయాలను తీసుకున్నాం. కానీ డిసెంబర్ 12 నుంచి 2019, జనవరి 10 మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు. కాబట్టి నేనేం చెప్పలేను. కానీ మేము ఆమోదించిన తీర్మానాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం నన్ను నిరాశ పరిచింది. అయితే ఆ తీర్మానాన్ని వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయలేదో నాకు అనవసరం’ అని వ్యాఖ్యానించారు. విశ్వాసఘాతకానికి పాల్పడలేను.. కొలీజియం నిర్ణయాలపై స్పందిస్తూ.. ‘కొలీజియంలో నిర్ణయాలను పరస్పరం నమ్మకంతో రహస్యంగా తీసుకుంటారు. కాబట్టి ఆ సమావేశంలో చర్చించిన విషయాలను బయటపెట్టి విశ్వాసఘాతుకానికి పాల్పడలేను. కానీ ఈ సమావేశంలో మేం కొన్ని నిర్ణయాలను తీసుకున్నాం. వీటిని సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. కొలీజియం భేటీలో ఆరోగ్యకరమైన చర్చ సాగింది. అందులో సమ్మతి, అసమ్మతి రెండూ ఉన్నాయి’ అని జస్టిస్ లోకూర్ తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల సుప్రీంకోర్టు ప్రాంగణాన్ని సందర్శించడంపై మాట్లాడుతూ.. ‘జడ్జీలు రాజకీయాలకు దూరంగా ఉండాలి. అంతమాత్రాన రుషిలా, ఒంటరిగా గడపాల్సిన అవసరం లేదు. దూరం పాటించాలంటే అర్థం ఏంటి? ప్రధాని మోదీ ముఖాన్ని కూడా చూడకూడదంటున్నారా? సాధారణ కార్యక్రమాలకు ప్రధానిని ఆహ్వానించడం తప్పుకాదు. ఇలాంటి కార్యక్రమాలకు సుప్రీంకోర్టు తలుపులు తెరవడం మంచిదే‘ అని వెల్లడించారు. న్యాయవ్యవస్థలో బంధుప్రీతి ఉందన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. కొలీజియం వ్యవస్థ విఫలమైందని తాను భావించడం లేదని లోకూర్ అన్నారు. విధివిధానాలు రూపొందించాలి కొన్నిసార్లు న్యాయవ్యవస్థ కూడా తన పరిధి దాటి వ్యవహరించిందని జస్టిస్ లోకూర్ తెలిపారు. కొలీజియం తీసుకునే నిర్ణయాలను నిర్ణీత గడువులోగా అమలుచేసేలా ఓ వ్యవస్థ ఉండాలన్నారు. ఈ గడువులోగా కేంద్రం నుంచి జవాబు రాకుంటే ఆమోదం లభించాలని వ్యాఖ్యానించారు. ఇందుకోసం కొలీజియంలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గతంలో జస్టిస్ ఏఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి కల్పించే విషయంలో కేంద్రం ఫైలును కొన్నినెలల పాటు తనవద్దే అట్టిపెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థ, కేంద్రానికి ఇలా ఫైళ్లను తొక్కిపెట్టే అధికారం లేదన్నారు. భవిష్యత్‌లో కేంద్రం ఇచ్చే ఎలాంటి బాధ్యతలను తాను స్వీకరించబోనని చెప్పారు. జస్టిస్ ప్రదీప్, జస్టిస్ మీనన్‌ల పేర్లను ప్రతిపాదించిన కొలీజియంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ లోకూర్.. గత డిసెంబర్ 30న పదవీవిరమణ చేశారు. -
తీవ్రంగా కలతచెందిన సీఈఓ
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి అరెస్టు ఘటనను హైకోర్టుతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం సైతం తీవ్రంగా తప్పుబట్టడంతో సీఈఓ రజత్‌కుమార్ కలత చెందారు. సజావుగా సాగుతున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మరో వారంలో ముగుస్తాయన్న తరుణంలో ఈ ఘటనతో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనైయ్యారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రెండ్రోజులుగా సీఈఓను కలిసేందుకు ఆయన కార్యాలయ వర్గాలు సైతం భయపడుతున్నట్లు సమాచారం. రాష్ట్ర శాసనసభ రద్దయినప్పటి నుంచి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు గత నాలుగు నెలలుగా పడిన కష్టం ఈ ఒక్క ఘటనతో విలువ లేకుండా పోయిందని సీఈఓ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. రేవంత్ అరెస్టుపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా.. ఎన్నికల సంఘం పనితీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆయన కలత చెందారు. ‘అవసరమైన చర్యలకే’ ఆదేశం ఈ నెల 4న కొడంగల్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించడాన్ని వ్యతిరేకి స్తూ రేవంత్‌రెడ్డి బంద్‌కు పిలుపునివ్వడం, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిరసనలు తెలపాలని కోరిన విషయం తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయగా, సీఎం సభ రోజు శాంతిభద్రతల సమస్య రాకుండా ‘అవసరమైన చర్యలు’ తీసుకోవాలని మాత్రమే సీఈఓ పోలీసు శాఖకు ఆదేశించారని అధికారవర్గాలంటున్నాయి. రేవంత్ దుందుడుకు స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని ముందు జాగ్రత్త చర్యగా ఆయనను అరెస్టు చేయాలని ఎస్పీ అన్నపూర్ణ నిర్ణయం తీసుకున్నారని, ఆయన్ను అరెస్టు చేసి తరలించకుండా గృహ నిర్బంధంలో ఉంచితే వివాదానికి అవకాశముండేది కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్ అరెస్టు పట్ల ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతుండటంతో సీఈఓ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. గత రెండ్రోజులుగా ఆయన విలేకరులను సైతం కలవడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. -
ఒకటి కాదని మరొకటి
ఒకతను బావి తవ్వుదామనుకున్నాడు. మరొకతన్ని సలహా అడిగితే ఒకచోట తవ్వమని చెప్పాడు. పదిహేను అడుగుల లోతు తవ్వాక దానిలో నీళ్లు పడకపోయేసరికి అతడు నిరాశ చెందాడు. ఇంతలో అక్కడికి వేరొకతను వచ్చి, ఇతని తెలివితక్కువతనాన్ని హేళన చేసి తనకు తోచిన మరొకచోట తవ్వమని సలహా ఇచ్చాడు. ఇతను అక్కడకు వెళ్లి మళ్లీ తవ్వడం మొదలు పెట్టాడు. ఈసారి ఇరవై అడుగుల లోతు తవ్వాడు. కానీ నీరు పడలేదు. ఇంకొకతను వచ్చి మరొకచోట తవ్వమని చెప్పాడు. అక్కడ ముప్పై అడుగుల లోతు తవ్వాడు. కానీ నీరు పడలేదు. దాంతో నిరాశా నిస్పృహలతో ఆ పని వదిలేసి వస్తుండగా, నాల్గవ అతను వచ్చి నవ్వుతూ ఇలా అన్నాడు. ‘‘నువ్వు ఇప్పటిదాకా చాలా కష్టపడ్డావు. కానీ తప్పుదారి పట్టడం వల్ల నీకు నీళ్లు పడలేదు. నేను చెప్పిన చోట తవ్వితే తప్పకుండా నీళ్లు పడతాయి. అయితే, పలుగుతో కాదు, పారతో వెడల్పుగా తవ్వు’’ అని సలహా ఇచ్చాడు. అతను అలాగే చేశాడు. అలా 45 అడుగులలోతు తవ్వాడు. కానీ లాభం లేకపోయింది. దాంతో గట్టిగా నిట్టూర్పు విడిచి, పలుగు, పారా విసిరి అవతల పారేసి, ఇంటి దారి పట్టాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులకు ఈ కథ చెబుతూ, అతను అలా నాలుగైదు చోట్ల తవ్వడం వల్ల అనుకున్న ఫలితాన్ని పొందలేకపోయాడు. అదే ఒకేచోట లోతుగా తవ్వి వుంటే తప్పకుండా నీళ్లు పడి ఉండేవి. కొందరు ఇదేవిధంగా ఒకటి కాదని మరొకటి మారుస్తూ అనేక అంశాలను పట్టుకుని వదిలేస్తుంటారు. దాని మూలంగా దేనిలోనూ పట్టు సాధించలేకపోతారు. అలా కాకుండా ఒకేదానిని నిశితంగా అధ్యయనం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చునని చెప్పేవారు. – డి.వి.ఆర్ -
ఫాతిమా విద్యార్థులకు మరోసారి నిరాశ
-
టెలికాంకు షాకిచ్చిన జీఎస్టీ
ముంబై: టెలికాం సేవలపై 18శాతం పన్ను రేటు నిర్ణయించడంపై అపుడే దుమారం మొదలైంది. దీనిపై టెలికం పరిశ్రమ పెద్దలు నిరాశ వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ఇటు పరిశ్రమపైనా. అటు వినియోగదారులపైనా భారాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. దీంతో దేశీయంగా టెలికాం సేవలు మరింత ప్రియం కానున్నాయనే ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు పన్నుల రేట్లను ఖరారు చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. పన్ను విధానంపై ఈ నెల 18, 19 తేదీల్లో జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జీఎస్టీ కౌన్సిల్సమావేశంలో సర్వీసెస్ పన్నుల శ్లాబ్‌లను ఖరారు చేసింది. ముఖ్యంగా టెలికాం, బీమా, హోటళ్ళు, రెస్టారెంట్లుపై పన్ను రేట్లను ఫైనల్ చేసింది. జులై 1 నుంచి జీఎస్టీ ను అమలు చేయనున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం చెప్పారు. అయితే టెలికాం సేవలపై 18శాతం పన్ను నిర్ణయించడంపై మార్కెట్లో చర్చకు దారి తీసింది. ముఖ్యంగా టెలికాం పరిశ్రమం 18 శాతం పన్నురేటుపై నిరాశ వ్యక్తం చేసింది. జీఎస్టీ స్వాగతించినప్పటికీ,తమకు 18శాతం ప్రకటించిన రేటుతో తాము నిరాశకు గురయ్యామని తెలిపింది. ఇది ఇప్పటికే నష్టాల్లో టెలికాం పరిశ్రమపై మరింత భారాన్ని పెంచుతుందని సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 15 శాతం కాకుండా 18శాతంగా నిర్ణయించడంతో వినియోగదారులపై మరింత భారం పడనుందన్నారు. అలాగే దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన మందగించటం, డిజిటల్ ఇండియా, క్యాష్‌లెస్ ఇండియాలాంటి ఇతర ప్రధాన కార్యక్రమాలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. అత్యవసర సేవలుగా ఉన్న టెలికాం రంగానికి మరిన్ని పన్ను మినహాయింపులు, ప్రయోజాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.చివరి మైలువరకు ప్రతిఒక్కరికీ కనెక్టివిటీ అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు పరిశ్రమ నిర్వరామంగా కృషి చేసిందని మాథ్యూస్ పేర్కొన్నారు కాగా శ్రీనగర్‌లో నిర్వహించిన తాజా జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో నాలుగు అంచెల పన్నుల రేట్లను ఖరారు చేశారు. ముఖ్యంగా విద్య, వైద్య సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే. -
ముస్లింలకు దగా
మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీలకు చోటు కల్పించని చంద్రబాబు ► మేమేం పాపం చేశామంటున్న ముస్లింలు ► వక్ఫ్, హజ్ యాత్రికుల సమస్యలు ముస్లిమేతరులకు ఎలా తెలుస్తాయని నిలదీత ► వచ్చే ఎన్నికల్లో సత్తా చూపుతామని హెచ్చరిక కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లింలకు మరోసారి మొండిచేయిచూపించారు. తాజాగా చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో కూడా వారికి చోటు కల్పించలేదు. దీంతో జిల్లాలోని ముస్లింలు బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీ వ్యతిరేకిలా మారిందని విమర్శిస్తున్నారు. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు ఏర్పరుచుకున్న తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఎదగనివ్వకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖను ముస్లిమేతరులకు ఇస్తే మసీదులు, వక్ఫ్, హజ్ యాత్రికులు ఎదర్కొంటున్న సమస్యలు ఎలా తెలుస్తాయని, మైనారిటీల సంక్షేమం కోసం ఎలా పని చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కనీసం పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారిని కూడా చంద్రబాబు గుర్తించడం లేదని వాపోతున్నారు. నంద్యాలకు చెందిన సీనియర్ మైనారిటీ నేత ఎన్ఎండీ ఫరూక్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అందులోనే ఉన్నారు. పార్టీకి వీర విధేయుడిగా పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తిని గుర్తించకపోవడం, పదవులు ఇవ్వకపోవడం దారుణమని పేర్కొంటున్నారు. ముస్లింల వ్యతిరేకి చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ మతోన్మాదం వైపు నడుస్తోంది: తెలుగుదేశం పార్టీ క్రమంగా మతోన్మాదంవైపు అడుగులేస్తోంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఒక్క ముస్లింకి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అలా మైనారిటీలను అణిచివేయాలనే ధోరణి చంద్రబాబులో కూడా మొదలైంది. ముస్లింలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. చంద్రబాబు అసలు రూపం తెలుసుకోవాలి. ఆత్మాభిమానం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆపార్టీకి తగిన బుద్ధి చెప్పాలి.-ఎంఎ.గఫూర్, సీపీఎం మాజీ ఎమ్మెల్యే ముస్లింలను అవమానించిన చంద్రబాబు: కేబినెట్ విస్తరణలో మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముస్లింలను అవమానించారు. అన్ని వర్గాలకు సమాన హక్కులు, పదవులు కల్పించాలని రాజ్యాంగం చెబుతుంది. టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మైనారిటీలను విస్మరించడం దారుణం.-మౌలాన హాఫీజ్ ఖాజీ అబ్దుల్ మాజిద్, ముస్లిం జేఏసీ చైర్మన్, జామేతే ఉలమా జిల్లా అధ్యక్షుడు ప్రజల్లోకి ఎలా వెళ్లాలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించకుండా అన్యాయం చేశారు. జనాభాలో 12శాతం మంది ఉన్న ముస్లింలు ఆయనకు గుర్తుకు రాకపోవడం సరికాదు. త్వరలో నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల్లో ముస్లింల వద్దకు వెళ్లి ఓటు ఎలా అడగాలి. -ఎన్ఎండీ ఫిరోజ్, నంద్యాల టీడీపీ యువనేత హామీలతో మభ్యపెడుతున్నారు: చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లింలను అణచివేస్తూనే ఉన్నారు. పదవులు ఇవ్వకుండా హామీలతో మభ్యపెడుతున్నారు. ప్రస్తుతం మంత్రి వర్గంలో మళ్లీ ముస్లింలకు అన్యాయం జరిగింది. ముస్లింలందరూ సంఘటితమై బాబుకు గుణపాఠం చెప్పాలి.– ఖాద్రి, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం -
తెలుగుతమ్ముళ్లకు శృంగభంగం
► ఆదికి అమాత్య యోగం ► అడ్డుకునేందుకు యత్నించినా దక్కని ఫలితం కడప: ‘ముందొచ్చిన చెవుల కన్నా, వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్లు ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి అమాత్యయోగం దక్కింది. మొదటి నుంచి ఉన్నవారిని కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేకు మంత్రిపదవి ఇవ్వడంపై పార్టీ జిల్లా అధ్యక్షుడితో సహా జిల్లా నేతలంతా తీవ్రంగా వ్యతిరేకించినా పార్టీ అధిష్టానం వారి బెదిరింపులను ఖాతరు చేయలేదు. ముందే నిర్ణయించిన ప్రకారం ఆదితో మంత్రిగా ప్రమాణస్వీకారం తంతు పూర్తి చేయించారు. ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకొని క్లిష్టసమయాల్లో అండగా నిలిచిన జిల్లాలోని తెలుగుతమ్ముళ్లకు ఈ పరిణామం ఏమాత్రం మింగుడుపడటం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లానుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఎస్వీ సతీష్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చారు. అది కేబినెట్ ర్యాంకు పదవే అయినప్పటికీ, రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి స్వేచ్ఛగా వ్యవహరించడానికి వీలులేకుండా పోయిందన్న భావన ఉంది. అలాగే జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి విప్ పదవి మాత్రమే ఇచ్చారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో తనకు తప్పకుండా మంత్రిపదవి లభిస్తుందని భావించిన మేడా మల్లికార్జునరెడ్డికి తీవ్ర నిరాశే ఎదురైంది. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా తమ మాటకు కనీస విలువ కూడా ఇవ్వలేదని, ఇలాగైతే పార్టీలో చీలికలు తప్పవని జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, వీరశివారెడ్డి, రమేష్‌రెడ్డి, మాజీమంత్రి రామసుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి హెచ్చరికలు జారీ చేసినా పార్టీ అధిష్టానం వారి అభిప్రాయాలను ఖాతరు చేయనట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఆదికి మంత్రిపదవి ఇస్తే పార్టీని వీడేందుకు కూడా వెనుకాడనని హెచ్చరించిన రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీతోపాటు విప్ పదవి ఇస్తామనడంతో మిన్నకుండిపోవడంపట్ల కూడా జమ్మలమడుగు నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలే కొంపముంచాయా! స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడమే ఈ పరి ణామాలన్నింటికీ కారణమా...అంటే అవుననే సమాధానమిస్తున్నారు సగటు టీడీపీ అభిమానులు. అందరూ వ్యతిరేకించినా అధినేతను ఒప్పించి బీటెక్ రవికి టికెట్ ఇప్పించుకొని ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ పార్టీ వద్ద తమ పట్టును నిలుపుకున్నారని, ఇక ఎన్నికల సమయంలో నియోజకవర్గాల వారీగా నేతలందరిపై అధినేతకు ఫిర్యాదు చేసి పార్టీకి సహకరించక తప్పని పరిస్థితిని సృష్టించారని చెబుతున్నారు. లోలోన తీవ్ర వ్యతిరేకత ఉన్నా పార్టీ విజయం సాధిస్తే తమకు రాజకీయంగా తగిన గుర్తింపు లభిస్తుందనే ఆశతో ప్రతిఒక్కరూ నిజాయితీగా బీటెక్ రవి విజయానికి కృషి చేసినట్లు సమాచారం. జిల్లాలోని అగ్రనేతలతోపాటు చిన్న కార్యకర్తకు కూడా ఈ విజయంలో భాగస్వామ్యమున్నప్పటికీ ఆది మాత్రం తనవల్లే ఈ విజయం సాధ్యమైందని క్రెడిట్ కొట్టేసి మంత్రి పదవి ఎగురేసుకుపోయినట్లు తెలుస్తోంది. నమ్ముకున్నపార్టీ ఇలా నమ్మకద్రోహం చేసి నట్టేట ముంచుతుందనుకుంటే ముందే జాగ్రత్త పడేవారమని కొందరు నేతలు లోలోన రగిలిపోతున్నట్లు తెలిసింది. -
ఆదిత్యుని పాదాలను ‘తాకని’ సూర్యకిరణాలు
-
తెలుగు రాష్ట్రాలకు నిరాశ మిగిల్చిన బడ్జెట్
-
పింఛన్ రాలేదని ఆగిన వృద్ధుడి గుండె
-
బైక్ కొనివ్వలేదని...
దావణగెరె : బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం నగరంలోని శివకుమారస్వామి బడావణెలో జరిగింది. నగరానికి చెందిన మారుతి(17) అనే యువకుడికి గతంలో కుటుంబ సభ్యులు ఒక బైక్‌ని కొనివ్వగా, ఆ బైక్ నడుపుతూ ప్రమాదం బారిన పడటంతో వారు ఆ బైక్‌ను ఇటీవల అమ్మేశారు. అయితే తనకు మళ్లీ కొత్త బైక్ కొనివ్వాలని మారుతి పట్టుబట్టాడు. కుటుంబ సభ్యులు తన కోరికను పెడచెవిన పెట్టడంతో మనస్తాపం చెందిన మారుతి సోమవారం రాత్రి అందరూ నిద్రించిన తర్వాత తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై కేటీజే నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పెసర రైతులకు నిరాశ
కొనుగోళ్లపై నాఫెడ్ అధికారుల తాత్సారం వరంగల్‌సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పెసళ్ల కొనుగోలు విషయమై నాఫెడ్ అధికారులు తాత్సారం చేయడంతో ఎంతో ఆశతో ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలోని నాలుగు ప్రధాన మార్కెట్ల ల్లో గురువారం నుంచి నాఫెడ్‌తో కలసి ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.5225కు పెసళ్లు కొనుగోలు చేయనున్నట్లు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ వై.రంజిత్‌రెడ్డి ఈనెల 12న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు క్వాలిటీ కంట్రోలర్ రవీందర్‌రెడ్డి, నాఫెడ్ సర్వే అధికారి హుస్సేన్‌తో కలిసి గురువారం మార్కెట్ వచ్చిన రంజిత్‌రెడ్డి పెసళ్లు కొనుగోలు చేయడానికి చాలా సమయం వరకు తటపటాయించారు. అప్పటికే ప్రైవేట్ వ్యాపారు లు క్వింటాలుకు రూ.5071 ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సంస్థల అధికారులు మచ్చులు చూçస్తూ కాలయాపన చేయడం తో నిరాశ చెందిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు సరుకు అమ్ముకోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన వ్యాపారులు ధర తగ్గించి రూ.4900లతో కొనుగోలు చేసినట్లు చాలా మంది రైతులు తెలి పారు. అనంతరం మార్కెట్ కార్యదర్శి అజ్మీర రాజుతో సమావేశమైన నాఫెడ్, మార్క్‌ఫెడ్ అధికారులు శుక్రవారం నుంచి కొనుగోళ్లు చేపడతామని వెల్ల్లడించారు. పర్యవేక్షణలో మార్కెట్ గ్రేడ్–2 కార్యదర్శి జగన్మోçßæ ¯ŒS, సూపర్ వైజర్లు లకీ‡్ష్మనారాయణ, వేణు పాల్గొన్నారు. -
పచ్చ నేతల బరితెగింపు
బద్వేలు అర్బన్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అధికారమే ఆయుధంగా పచ్చనేతలు బరితెగిస్తున్నారు. ఏళ్ల తరబడి పేదలు సాగుచేసుకుంటున్న భూములను సైతం గుట్టుచప్పుడు కాకుండా పట్టాలు చేయించుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన రైతుపై దౌర్జన్యానికి దిగడంతో మనస్తాపానికి గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. బద్వేలు మండల పరిధిలోని కొంగళవీడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కొంగళవీడు గ్రామంలోని సర్వేనంబరు 54/2, 56/2 లలో ఉన్న సుమారు 10 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిని సుమారు 40 సంవత్సరాలుగా గ్రామానికి చెందిన కొందరు రైతులు సాగుచేసుకుంటున్నారు. ఈ భూములపై పట్టాలు ఇవ్వాలని గతంలో అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితంలేకపోవడంతో అలాగే సాగుచేసుకుంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలో 2014లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలు సర్పంచ్‌గా తమ అభ్యర్థిని గెలిపిస్తే సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు చేయిస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకుని గెలుపొందారు. ఆ తర్వాత కూడా రైతులు అనేక సార్లు పట్టాల విషయం ప్రస్తావించినప్పటికీ త్వరలోనే మంజూరవుతాయి అంటూ కాలం వెళ్లబుచ్చుతుండేవారు. ఈ క్రమంలో తమకు సంబంధిత భూములలో పాత పట్టాలు ఉన్నాయంటూ అధికార పార్టీ నేతలు సాకు చూపి అప్పటి రెవెన్యూ అధికారులను లోబరుచుకుని గుట్టుచప్పుడు కాకుండా తమ బంధువుల పేరుమీద పట్టాలు చేయించుకున్నారు. అయితే గత వారం రోజుల క్రితం ఆన్లైన్లో కూడా తమ పేర్లు నమోదు చేసుకున్నారని రైతులకు తెలియడంతో వారిని గట్టిగా నిలదీశారు. అయినప్పటికీ లెక్కచేయకుండా సాగులో ఉన్న భూములలో సర్వేయర్‌తో కొలతలు వేయించేందుకు రంగంసిద్ధం చేసుకుని మంగళవారం పొలాల వద్దకు తమ అనుచరులతో వచ్చారు. ఈ సమయంలో రైతులకు, అధికార పార్టీ నాయకులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో కొలతలు వేసేందుకు వచ్చిన సర్వేయర్ వెనుతిరిగారు. దీంతో కోపోద్రిక్తులైన అధికార పార్టీ నేతలు ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్న రైతులలో ఒకరైన కొత్తపు శ్రీనివాసులరెడ్డి (50) పై దౌర్జన్యం చేసి దుర్భాషలాడారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసుల రెడ్డి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అలాగే గ్రామానికి చెందిన కాకర్ల పాలక్కగారి చెన్నకేశవరెడ్డి సర్వే నంబరు 56/2లో సాగుచేసుకుంటున్న భూమిపై కూడా అధికార పార్టీ నాయకులు పట్టాలు పొందారని గ్రామస్తులు తెలిపారు. రైతు ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలుసుకున్న తహసీల్దార్ మాధవకృష్ణారెడ్డి ఆసుపత్రికి వెళ్లి రైతుతో మాట్లాడారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
శామీర్‌పేట్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిమహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్రానికి చెందిన రాజేశ్వరి (30), దయానంద్ దంపతులు మూడు నెలల క్రితం మండలంలోని అలియాబాద్‌కు వలస వచ్చారు. స్థానిక హెచ్‌బీఎల్ కంపెనీలో రోజువారి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, దయానంద్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈనేపథ్యంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం మద్యం తాగి ఇంటికి వచ్చిన అతడు చేపలు తీసుకువచ్చి వండమని రాజేశ్వరికి చెప్పాడు. ఈనేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేశ్వరి దయానంద్ ఇంట్లో నుంచి వెళ్లిపోగానే ఒటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించచుకుంది. విషయం గమనించిన స్థానికులు, కుటుంబీకులు మంటలు ఆర్పి ఆమెను చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మళ్లీ ఎంపీ మాగంటి బాబు అలక
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఏలూరు ఎంపీ మాగంటి బాబు బుధవారం అలకబూనారు. సీఎం కాన్వాయ్‌ను దాటి వెళుతున్న ఎంపీ మాగంటి వాహనాన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీపై మాగంటి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్‌ను పక్కన పెట్టి తానే స్వయంగా డ్రైవ్ చేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన చాలా సందర్భాల్లో అధికారులపై అలిగి మాగంటి బాబు మాట్లాడకుండా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చారు. అయితే సీఎం సభాస్థలికి రాకముందే ఎంపీ మాగంటి అక్కడకు చేరుకున్నారు. సభావేదికపైకి వెళ్లిన ఆయన ఎంపీపీలు, జెడ్పీటీసీలను వేదికపైకి రావాల్సిందిగా పిలిచారు. అక్కడే ఉన్న పోలీసు అధికారులు ఇందుకు అభ్యంతరం చెప్పారు. ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం వారిని వేదికపైకి అనుమతించలేమన్నారు. దీంతో మాగంటి బాబు ‘నేను చెబుతున్నాను. పంపించండి’ అని పదేపదే అడిగినా ఫలితం లేకపోయింది. దీంతో ఎంపీ మాగంటి చేతిలోని మైక్ కిందపడేసి విసురుగా వేదిక దిగి వెళ్లిపోయారు. -
ప్రాణం తీసిన ఫిర్యాదు..
* మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య * వల్లాల గ్రామంలో ఘటన * ఫిర్యాదుదారుడి ఇంటి ఎదుట బంధువుల ఆందోళన వల్లాల (శాలిగౌరారం) : చిన్న తగాద ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. మండలంలోని వల్లాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. వల్లాల గ్రామానికి చెందిన జాల మహేశ్ (20), అదే గ్రామపంచాయతీ పరిధిలోని జోలంవారిగూడెంకు చెందిన జోలం నరేందర్ మధ్య కొంత కాలంగా పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం ఇరువురు గొడవ పడటంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో రాజీపడ్డారు. అయితే ఈనెల 17న మరోమారు జాల మహేశ్ తన స్నేహితులతో కలిసి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించాడంటూ జోలం నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 18న పోలీసులు మహేశ్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. సాయంత్రం గ్రామానికి చెందిన ఓ పెద్దమనిషి జామీనుపై ఇంటికి పంపిస్తూ తిరిగి ఆదివారం మళ్లీ స్టేషన్‌కు రావాలని, తన స్నేహితులను కూడా తీసుకురావాలని ఆదేశించారు. దీంతో మనస్తాపానికి గురైన మహేశ్ ఆదివారం ఉదయం తమ వ్యవసాయ బావివద్దకు వెళ్లి పురుగులమందు తాగాడు. ఆ సమయంలో బావి వద్దకు వెళ్లిన తండ్రి సైదులు కుమారుడి గమనించి లబోదిబోమనడంతో చుట్టుపక్కల వారు వెంటనే నకిరేకల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంధువుల ఆందోళన... మహేశ్ మృతికి జోలం నరేందర్‌తో పాటు పోలీసులు కారణమంటూ మృతుడి తల్లిదండ్రులు, బంధువులు నరేందర్ ఇంటి ముందు, పోలీస్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సాయంత్రం వరకు నరేందర్ కుటింబీకులలో ఒక్కరు కూడా అందుబాటులోకి రాకపోవడంతో మహేశ్ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. అప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఉన్న శాలిగౌరారం, నకిరేకల్ సీఐలు ప్రవీణ్, సుబ్బిరామిరెడ్డి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి నచ్చజెప్పారు. పోలీసులకు సంబంధం లేదు : ఎస్ఐ ఇదిలా ఉండగా ఎస్ఐ శ్రీరాముల అయోధ్య మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు అందడంతోనే మహేశ్‌ను పిలిపించి తిరిగి పంపించామన్నారు. కావాలనే పోలీసులపై ఆరోపణలు చేయడం మంచిదికాదని, మహేశ్ మృతికి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పోలీస్ బందోబస్తులో నార్కట్‌పల్లి, కట్టంగూరు ఎస్ఐలు మోతీరాం, నరేందర్, సత్యనారాయణతో పాటు సిబ్బంది ఉన్నారు. -
మళ్లీ అలిగిన మాగంటి
ఏలూరు : ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన చాలా సందర్భాల్లో అధికారులపై అలిగి మాట్లాడకుండా వెళ్లిపోయిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఈసారి కూడా అలక వహించారు. సీఎం సభాస్థలికి రాకముందే ఎంపీ మాగంటి అక్కడకు చేరుకున్నారు. సభావేదికపైకి వెళ్లిన ఆయన ఎంపీపీలు, జెడ్పీటీసీలను వేదికపైకి రావాల్సిందిగా పిలిచారు. అక్కడే ఉన్న పోలీసు అధికారులు ఇందుకు అభ్యంతరం చెప్పారు. ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం వారిని వేదికపైకి అనుమతించలేమన్నారు. దీంతో మాగంటి బాబు ‘నేను చెబుతున్నాను. పంపించండి’ అని పదేపదే అడిగినా ఫలితం లేకపోయింది. దీంతో ఎంపీ మాగంటి చేతిలోని మైక్ కిందపడేసి విసురుగా వేదిక దిగి వెళ్లిపోయారు. గతంలోనూ ఇలాగే అలిగి వెళ్లినప్పుడు ఎమ్మెల్యేలు ఆయన్ను బతిమాలి తీసుకొచ్చేవారు. ఈసారి అలాంటి పరిస్థితి కనిపించలేదు. సీఎం వేదికపైకి వచ్చిన తర్వాత కూడా మాగంటి బాబు వేదికపైకి రాలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ తర్వాత ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. సభాధ్యక్ష బాధ్యతను పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు తీసుకుని కార్యక్రమాన్ని ముగించారు. సీఎంలో ఎందుకో నిస్తేజం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడల్లా ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపించేవారు. కానీ బుధవారం నాటి పర్యటనలో ఒకింత నిస్తేజంగా కనిపించడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పెద్దగా జనం లేకున్నా గంటకుపైగా మాట్లాడే చంద్రబాబు మండుటెండలో సైతం భారీగా జనాన్ని సమీకరించినప్పటికీ.. మొక్కుబడిగానే మాట్లాడి ముగించేయడం టీడీపీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ప్రభుత్వం!
న్యూ ఢిల్లీః ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ చర్యలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పార్టీ చర్యలు ఉంటున్నాయని, ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్త పరుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీకి మంచి అవకాశం ఉందని, ప్రజల్లో సానుకూల స్పందన ఉందని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వంగా ఉందంటూ అరుణ్ జైట్లీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. గత ఎన్నికట్లో ఢిల్లీలో బిజేపీ అతి తక్కువ శాతం ఓట్లతో అధికారాన్ని కోల్పోయి ఉండొచ్చుకానీ, ప్రస్తుతం తిరిగి ఆ మెజారిటీని సంపాదించుకున్నామని ఢిల్లీ బిజేపీ కార్యవర్గ సమావేశంలో జైట్లీ చెప్పారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చలేదని, ఒక్క పని కూడ పూర్తి చేయలేదని అన్న ఆర్థిక మంత్రి... ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించని కేజ్రీవాల్ తీరును ప్రజలు గుర్తించారని, కాంగ్రెస్ లెక్కల్లోనే లేకపోగా, బిజెపి తిరిగి రాజకీయ స్థానాన్ని సంపాదించేందుకు ఇదే మంచి అవకాశం అని తెలిపారు. ప్రజల దగ్గరకు వెళ్ళేందుకు ఇదే సరైన సమయమని, వారు చాలా నిరాశలో ఉన్నారని మంత్రి చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించి, ఢిల్లీ ప్రభుత్వ చర్యలను కూడ ఎత్తి చూపాలని ఆయన కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిరాశకు దారి తీసిందని, దేశంలో అన్ని మూలలా రాజకీయ ఉనికిని పెంచేందుకు పోరాడాలని సూచించారు. దేశ వ్యతిరేక నినాదాలను అన్ని విధాలా మౌఖికంగా ఖండించాల్సిన అవసరం ఉందని, జాతి వ్యతిరేక అంశాలను సమ్మతిస్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వంపై అసమ్మతి తెలపాల్సిన అవసరం ఉందని జైట్లీ అన్నారు. తాముకూడ ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నామని, అయితే పార్లమెంట్ లో ప్రస్తుత పరిస్థితులు అపూర్వంగా కనిపిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు జైట్లీ ఆరోపించారు. -
నిరాశలో టీఆర్ఎస్ నాయకులు
-
తెలంగాణ బీజెపీలో కలకలం
-
వై-ఫైకి బాలారిష్టాలు
సాక్షి, సిటీబ్యూరో:రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో ప్రారంభించిన వై-ఫై సర్వీసులకు బాలారిష్టాలు తప్పడం లేదు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, ఈట్‌స్ట్రీట్ ఫుడ్ కోర్ట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన వై-ఫై హాట్‌స్పాట్ పరికరాల వద్ద ఇంటర్నెట్ సర్వీసులను వినియోగించుకోవాలనుకున్న వారికి నిరాశ తప్పడం లేదు. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సేవలను వినియోగించుకునేందుకు కొన్ని గంటల పాటు ప్రయత్నించి విఫలమైనట్టు పలువురు వినియోగదారులు వాపోయారు. ఉదయం వ్యాహ్యాళికి వెళ్లేవారు... ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సేదదీరదామనుకున్న వారికి ఈ పరిణామం నిరాశపరుస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఐదు రోజులు పూర్తయినప్పటికీ బాలారిష్టాలు అధిగమించకపోవడం గమనార్హం. ఇదే విషయమై వై-ఫై సౌకర్యం ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ సంస్థ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈట్‌స్ట్రీట్, పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన హాట్‌స్పాట్ పరికరాల్లో స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తాయని తెలిపారు. దీనికి తోడు తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడంతో వీటి పరిధిలో నెట్ వినియోగించుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ అంశాన్ని హెచ్ఎండీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. వారి సహకారంతో పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటే హాట్‌స్పాట్ పరికరాల్లో సమస్యలు తలెత్తవని వెల్లడించారు. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ చుట్టూ 40 వై-ఫై హాట్ స్పాట్ పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో పది మినహా మిగతా చోట్ల ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం లేదని చెప్పారు. ఒక్కో హాట్‌స్పాట్ పరికరం వద్ద ఒకేసారి 500 మంది లాగిన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలా వినియోగించుకోవాలి.. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని సెట్టింగ్స్‌లో వై-ఫై ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే నెట్‌వర్క్‌లో క్యూ5 నెట్‌వర్క్‌పై క్లిక్ చేయాలి. బ్రౌజర్లో మీ వివరాలను, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ తదితర వివరాలు నమోదు చేసి... సబ్మిట్ చేయాలి. మీ సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అందే సందేశంలోని నాలుగు అంకెల పాస్‌వర్డ్‌ను టైప్ చేయాలి. ఆ తరవాత లాగిన్ కావాల్సి ఉంటుంది. తొలి అరగంట ఉచితంగా వై-ఫై సేవలు అందుతాయి. ఆ తరువాత వినియోగానికి చార్జీలు తప్పవు. అక్కడ నో ఫికర్.. సైబర్టవర్స్-మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్ - కొత్తగూడ జంక్షన్, సైబర్ టవర్స్-రహేజా మైండ్‌స్పేస్ సర్కిల్ పరిధిలో గత ఏడాది అక్టోబర్‌లో వైఫైని అందుబాటులోకి తెచ్చారు. 8 కి.మీ మార్గంలో 17 కేంద్రాల వద్ద వై-ఫై సిగ్నల్స్‌ను అందించే హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో సుమారు 20 వేల మంది నిత్యం 750 మెగాబైట్స్ నిడివిగల వై-ఫై సాంకేతిక సేవలను నిరంతరాయంగా వినియోగించుకుంటున్నారు. అప్పుడప్పుడూ స్వల్ప అంతరాయం ఎదురవుతున్నప్పటికీ సాంకేతిక సమస్యలను ఎయిర్టెల్ సంస్థ వెంటనే సరిదిద్దుతోంది. దీంతో వై-ఫై సేవలకు అంతరాయం కలగడంలేదని వినియోగదారులు చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువమంది లాగిన్ అయినపుడు మాత్రం అంతరాయం కలుగుతోందని తెలిపారు. -
ఎన్టీఆర్ అంటే అంత నిర్లక్ష్యమా!
-
కీలకనేతల ఆశలు గల్లంతు
సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లా టీడీపీలో కీలక నేతల ఆశలు గల్లంతయ్యాయి. అందరి కన్నా రేసులో తామే ముందున్నామని భావించిన వారికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. అందరి అంచనాలను తలకిందులు చేసి ఎస్టీ కోటాలో సంధ్యారాణి పేరు ఖరారు చేయడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా ఎన్నో ఆశలతో ఉన్న పార్వతీపురం డివిజన్ నేతలు మరింత నిరాశకు గురయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు టీడీపీ నేతలకు ఎమ్మెల్సీ దక్కే పరిస్థితి ఉండటంతో జిల్లాలోని ఆశావహులంతా వారం రోజులగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. ఎవరికివారు లాబీయింగ్ చేసుకుని అధినేత చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అరకు ఎంపీగా పోటీ చేసి నష్టపోయానన్న వాదనతో, ఎస్టీ కేటగిరీలో ప్రాధాన్యం కల్పించాలని గుమ్మడి సంధ్యారాణి కోరారు. పార్వతీపురం డివిజన్లో పార్టీ పటిష్టం కావాలంటే తమకే ఇవ్వాలని ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యేలు తెంటు లక్ష్ముంనాయుడు, భంజ్‌దేవ్ తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. అలాగే, విజయనగరం డివిజన్కొచ్చేసరికి మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి,గద్దే బాబూరావు, చీపురుపల్లికి చెందిన త్రిమూర్తులురాజు, విజయనగరానికి చెందిన ఐవీపీరాజు ఆశించారు. ఎవరికి వారు తమదైన శైలీలో ప్రయత్నాలు చేశారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అధిష్టానం గుమ్మడి సంధ్యారాణి పేరును ఖరారు చేసింది. దీంతో మిగతా ఆశావహులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, నిరాశ చెందారు. చేసేది లేక గవర్నర్ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల కోటాపైనే ఆశలు పెట్టుకోవల్సిన పరిస్థితి నెలకొంది. పార్వతీపురం డివిజన్ నేతలకు సంక్లిష్టం : తాజాగా తీసుకున్న నిర్ణయంతో పార్వతీ పురం డివిజన్ నేతల పరిస్థితిసంక్లిష్టంగా తయారైంది.ఇది కాకపోతే మరొకటి అనుకునే పరిస్థితి ఈ డివిజన్ నేతలకు లేకుం డాపోయింది. ఎమ్మెల్యేల కోటాలో పార్వతీపురం డివిజన్‌కు చెందిన సంధ్యారాణి పేరు ఖరారు చేయడంతో వచ్చే గవర్నర్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఆ డివి జన్‌కు దక్కే అవకాశం తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుతం అదే డివి జన్‌కు చెందిన నేత ఎమ్మెల్సీ కానుండడం తో వచ్చేసారి విజయనగరం డివిజన్‌కు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడీ విషయంపై టీడీపీలో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కనందున ఎమ్మెల్సీ తప్పకుండా వస్తుందని చివరి వరకు రేసులో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌కు అధిష్టానం నిర్ణయం మింగుడు ప డడం లేదు. ఇక,మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు, భంజ్‌దేవ్ పరిస్థితి కూ డా అంతే. చిరకాలంగా పార్టీకి పనిచేస్తున్న కారణంగా తమను గుర్తిస్తారని, డివిజన్లో పార్టీ పటిష్టతను దృష్టిలో ఉం చుకుని తమకే ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఆ ఆశలు ప్రస్తుత ఎమ్మెల్సీ కోటాలో నెరవేరకపోగా భవిష్యత్‌లో చా న్స్ వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. అదే డివిజన్‌కు చెందిన సంధ్యారాణిని ఇప్పటికే ఎంపిక చేయడమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీపైనే విజయనగరం డివిజన్ నేతల దృష్టి ఎలాగూ, ఎమ్మెల్యేల కోటాలో పార్వతీ పురం డివిజన్‌కు చెందిన గుమ్మడి సంధ్యారాణిని ఎంపిక చేయడంతో భవిష్యత్‌లో స్థానిక సంస్థల కోటాలో విజయనగరం డివిజన్‌కు చెందిన వారినే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆ దిశగా పార్టీలో చర్చ నడుస్తోంది.మళ్లీ పార్వతీపురం డివిజన్‌కు కేటాయిస్తే తప్పనిసరిగా వ్యతిరేకత వస్తుందన్న దృష్టితో ఆ దిశగా అధిష్టానం కూడా ముందుకెళ్లదనే ధృఢమైన నమ్మకంతో ఇక్కడి నేతలు ఉన్నారు. ఈ క్రమం లో గత ఎన్నికల్లో అధిష్టానం హామీతో పో టీకి దూరంగా ఉన్న చీపురుపల్లికి చెందిన త్రిమూర్తులరాజు, సీనియర్ నేతలగా ఐవీ పీ రాజు, గద్దే బాబూరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని శోభా హైమావతి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందు లో ఐవీపీ రాజు కేవలం ఆశోక్ గజపతి రాజుపైనే ఆశలు పెట్టుకోగా, మిగతా వా రు అశోక్ ఆశీస్సులతో పాటు తమకున్న పలుకుబడి, లాబీయింగ్‌తో ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. -
టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అలక
-
అమ్మను చూడాలని..
- బెంగళూరులో మంత్రుల మకాం - దర్శనం లభించక చెన్నైకి తిరిగొచ్చిన వైనం చెన్నై, సాక్షి ప్రతినిధి : ఆదాయూనికి మించి ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను దర్శించుకోవాలని, దుఃఖభారంలో కుంగిపోయి ఉన్న అమ్మను ఓదార్చాలని పదిరోజులుగా పడిగాపులు కాసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు నిరాశ ఎదురైంది. అమ్మ దర్శనం లభించకపోడంతో వారు వెనుదిరిగారు. అన్నాడీఎంకేలో అంతా తానై ఏకచత్రాధిపత్యం సాగిస్తున్న అమ్మ జైలు పాలుకావడం పార్టీ శ్రేణులను తీవ్రంగా కుంగదీసింది. పార్టీ జయాపజయాలకు బాధ్యత వహిస్తూ ఏకైక ప్రజాకర్షణ నేతగా కొనసాగుతున్న జయ ప్రతిష్టపై తీరని మచ్చేపడింది. నాలుగేళ్లు జయ జైలులోనే ఉంటే మరో ఏడాదిన్నర కాలంలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలనే మీమాంశలో పడిపోయారు. అనేక అనుమానాలు, అవమానాలు, ఆవేదనలు మెదళ్లను తొలుస్తుండగా...అమ్మను జైలులో కలుసుకుని ఒకింత ఉపశమనం పొందాలని మంత్రులు ఆశించారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఓ పన్నీర్‌సెల్వం పదవీ ప్రమాణం చేయగానే కొందరు మంత్రివర్గ సహచరులతో జైలుకు చేరుకున్నారు. రెండు రోజులు వేచిచూసినా అమ్మ అనుమతి లభించలేదు. బెయిల్ కోసం ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనూ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బెంగళూరులోనే తిష్టవేశారు. ప్రతిరోజూ జైలు వద్దకు వెళ్లడం, వారిని కలుసుకునేందుకు అమ్మ నిరాకరించడం పరిపాటిగా మారింది. మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలను విస్మరించి బెంగళూరులో ఉండిపోవడం అమ్మకు ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం. మంత్రుల తీరుతో పార్టీకి అప్రతిష్టవాటిల్లుతుందని, రానున్న ఎన్నికలపై దీని ప్రభావం పడితే ఫలితాలు తారుమారవుతాయని శశికళ ద్వారా అమ్మ హెచ్చరించినట్లు సమాచారం. పార్టీవారంతా వెంటనే బెంగళూరు విడిచి పోవాలని అమ్మ ఆదేశించడంతో పది రోజుల క్రితం చెన్నై వదిలి వెళ్లిన వారంతా గురు, శుక్రవారాల్లో నగరానికి చే రుకున్నారు. అమ్మకోసం 154 మంది మృతి అమ్మ అంటూ తాము అభిమానంగా పిలుచుకునే జయలలిత జైలు పాలైందన్న ఆవేదనతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 154 మంది అశువులు బాసినట్లు అన్నాడీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యాలయం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. 113 మంది గుండెపోటుతోనూ, 15 మంది ఉరివేసుకుని, 7 మంది విషం తాగి, ఒకరు బస్సు కిందపడి, 14 మంది కిరోసిన్ పోసుకుని, ఇద్దరు నీటి గుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొంది. -
ఎన్నికై ఏం లాభం?
యాచారం, న్యూస్‌లైన్: బాధ్యతలు చేపట్టిన సంతోషం సర్పంచ్‌లకు మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అధికారాలు, హక్కుల గురించి తెలుసుకుని ఉత్సాహంగా అభివృద్ధి పనులు చేపట్టడానికి సిద్ధమైతే... పంచాయతీ కార్యదర్శులు సహకరించడం లేదని వాపోతున్నారు. ఎన్నికై నెలరోజులు దాటినా పంచాయతీ రికార్డులు అందకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సర్పంచ్‌లతో పాటు కార్యదర్శులకూ జాయింట్ చెక్‌పవర్ కల్పించింది. దీంతో కార్యదర్శులు తమను చిన్నచూపు చూస్తున్నారని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డులు ఇవ్వడంలో కార్యదర్శులు జాప్యం చేస్తున్నారని, మరీ పట్టుబడితే అవసరమైన సమాచారం ఇస్తామని చెబుతున్నారని సర్పంచ్‌లు అంటున్నారు. పంచాయతీల వ్యయం, ఆదాయం, మిగులు నిధుల గురించి తెలియక.. ఏ పనీ చేపట్టలేక ఉత్సవ విగ్రహాల్లా మారాల్సి వస్తోందని వాపోతున్నారు. యాచారం మండలంలోని 20 గ్రామాల సర్పంచ్‌లు ఆగస్టు 2న బాధ్యతలు చేపట్టారు. వీరికి బాధ్యతలు, అధికారాలు, హక్కుల గురించి తెలియజేసిన అధికారులు... రికార్డులు అందజేయించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించారు. నిధులు ఎన్ని ఉన్నాయో తెలియక, ఉన్నా జాయింట్ చెక్‌పవర్‌తో వాటిని డ్రా చేసుకునే సొంత అధికారం లేక సర్పంచ్‌లు గింజుకుంటున్నారు. గ్రామాల్లో జోరుగా జరుగుతున్న బోనాల ఉత్సవాల కోసం పలువురు సర్పంచ్‌లు సొంత డబ్బులు వెచ్చించి వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. అలాగే పంచాయతీ కార్మికులకు జీతాలు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులకు కూడా సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇలా మండలంలోని 20 గ్రామాల్లో సర్పంచ్‌లు రూ.20 లక్షలకు పైగా సొంత నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఆడిట్ చేయించిన తర్వాతే ఇస్తాం.... రికార్డులు అప్పజెప్పడం లేదని సర్పంచ్‌లు ఓవైపు ఆందోళన చెందుతుంటే... పంచాయతీ కార్యదర్శులు మాత్రం పాలనా వ్యవహారాలు చూసేది తామేనని, పైగా జాయింట్ చెక్‌పవర్ కూడా ఉందనే ధీమాతో వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పంచాయతీ వ్యవహారాలకు సంబంధించి ఖర్చుల వివరాలను ఆడిట్ చేయించలేదని, రికార్డులను ఇస్తే తమకు ఇబ్బందులవుతాయని... ఆడిట్ చేయించిన తర్వాతే ఇస్తామంటూ పంచాయతీ కార్యదర్శులు తిప్పుకుంటున్నారని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. కార్యాలయ తాళంచెవి కూడా ఇవ్వలేదు సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు తీసుకొని నెలరోజులు దాటినా రికార్డులు ఇవ్వకపోవడమంటే మమ్మల్ని అవమానపర్చడమే. నాకు రికార్డులు కాదు కదా కనీసం కార్యాలయ తాళంచెవి కూడా ఇవ్వలేదు. పంచాయతీలో ఎన్ని నిధులున్నాయో తెలియడం లేదు. సొంత ఖర్చులతో వీధి లైట్లు బిగిస్తున్నా. - రామానుజమ్మ, సర్పంచ్. తమ్మలోనిగూడ రికార్డులు వెంటనే అందజేసేలా చూస్తా మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీల రికార్డులు సర్పంచ్‌లకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటా. సర్పంచ్ల ఆదేశాల మేరకే కార్యదర్శులు పనిచేయాల్సి ఉంటుంది. వెంటనే బదిలీపై వెళ్లిన కార్యదర్శులను పిలిపించి మాట్లాడుతా. రికార్డులను సర్పంచ్‌లకు అందజేయాలని ఆదేశిస్తా. - శంకర్‌నాయక్, ఈఓఆర్డీ, యాచారం -
ఎన్నికై ఏం లాభం?
యాచారం, న్యూస్‌లైన్: బాధ్యతలు చేపట్టిన సంతోషం సర్పంచ్‌లకు మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అధికారాలు, హక్కుల గురించి తెలుసుకుని ఉత్సాహంగా అభివృద్ధి పనులు చేపట్టడానికి సిద్ధమైతే... పంచాయతీ కార్యదర్శులు సహకరించడం లేదని వాపోతున్నారు. ఎన్నికై నెలరోజులు దాటినా పంచాయతీ రికార్డులు అందకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సర్పంచ్‌లతో పాటు కార్యదర్శులకూ జాయింట్ చెక్‌పవర్ కల్పించింది. దీంతో కార్యదర్శులు తమను చిన్నచూపు చూస్తున్నారని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డులు ఇవ్వడంలో కార్యదర్శులు జాప్యం చేస్తున్నారని, మరీ పట్టుబడితే అవసరమైన సమాచారం ఇస్తామని చెబుతున్నారని సర్పంచ్‌లు అంటున్నారు. పంచాయతీల వ్యయం, ఆదాయం, మిగులు నిధుల గురించి తెలియక.. ఏ పనీ చేపట్టలేక ఉత్సవ విగ్రహాల్లా మారాల్సి వస్తోందని వాపోతున్నారు. యాచారం మండలంలోని 20 గ్రామాల సర్పంచ్‌లు ఆగస్టు 2న బాధ్యతలు చేపట్టారు. వీరికి బాధ్యతలు, అధికారాలు, హక్కుల గురించి తెలియజేసిన అధికారులు... రికార్డులు అందజేయించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించారు. నిధులు ఎన్ని ఉన్నాయో తెలియక, ఉన్నా జాయింట్ చెక్‌పవర్‌తో వాటిని డ్రా చేసుకునే సొంత అధికారం లేక సర్పంచ్‌లు గింజుకుంటున్నారు. గ్రామాల్లో జోరుగా జరుగుతున్న బోనాల ఉత్సవాల కోసం పలువురు సర్పంచ్‌లు సొంత డబ్బులు వెచ్చించి వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. అలాగే పంచాయతీ కార్మికులకు జీతాలు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులకు కూడా సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇలా మండలంలోని 20 గ్రామాల్లో సర్పంచ్‌లు రూ.20 లక్షలకు పైగా సొంత నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఆడిట్ చేయించిన తర్వాతే ఇస్తాం.... రికార్డులు అప్పజెప్పడం లేదని సర్పంచ్‌లు ఓవైపు ఆందోళన చెందుతుంటే... పంచాయతీ కార్యదర్శులు మాత్రం పాలనా వ్యవహారాలు చూసేది తామేనని, పైగా జాయింట్ చెక్‌పవర్ కూడా ఉందనే ధీమాతో వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పంచాయతీ వ్యవహారాలకు సంబంధించి ఖర్చుల వివరాలను ఆడిట్ చేయించలేదని, రికార్డులను ఇస్తే తమకు ఇబ్బందులవుతాయని... ఆడిట్ చేయించిన తర్వాతే ఇస్తామంటూ పంచాయతీ కార్యదర్శులు తిప్పుకుంటున్నారని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. కార్యాలయ తాళంచెవి కూడా ఇవ్వలేదు సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు తీసుకొని నెలరోజులు దాటినా రికార్డులు ఇవ్వకపోవడమంటే మమ్మల్ని అవమానపర్చడమే. నాకు రికార్డులు కాదు కదా కనీసం కార్యాలయ తాళంచెవి కూడా ఇవ్వలేదు. పంచాయతీలో ఎన్ని నిధులున్నాయో తెలియడం లేదు. సొంత ఖర్చులతో వీధి లైట్లు బిగిస్తున్నా. - రామానుజమ్మ, సర్పంచ్. తమ్మలోనిగూడ రికార్డులు వెంటనే అందజేసేలా చూస్తా మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీల రికార్డులు సర్పంచ్‌లకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటా. సర్పంచ్ల ఆదేశాల మేరకే కార్యదర్శులు పనిచేయాల్సి ఉంటుంది. వెంటనే బదిలీపై వెళ్లిన కార్యదర్శులను పిలిపించి మాట్లాడుతా. రికార్డులను సర్పంచ్‌లకు అందజేయాలని ఆదేశిస్తా. - శంకర్‌నాయక్, ఈఓఆర్డీ, యాచారం -
ఇబీఎల్ వేలం పై జ్వాలా తీవ్ర అసంతృప్తి