శామీర్‌పేట్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిమహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్రానికి చెందిన రాజేశ్వరి (30), దయానంద్ దంపతులు మూడు నెలల క్రితం మండలంలోని అలియాబాద్‌కు వలస వచ్చారు. స్థానిక హెచ్‌బీఎల్ కంపెనీలో రోజువారి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, దయానంద్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈనేపథ్యంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం మద్యం తాగి ఇంటికి వచ్చిన అతడు చేపలు తీసుకువచ్చి వండమని రాజేశ్వరికి చెప్పాడు. ఈనేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేశ్వరి దయానంద్ ఇంట్లో నుంచి వెళ్లిపోగానే ఒటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించచుకుంది. విషయం గమనించిన స్థానికులు, కుటుంబీకులు మంటలు ఆర్పి ఆమెను చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
Published Sun, Jul 17 2016 11:28 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement