Family strife
-
భార్య,కొడుకును కడతేర్చిన భర్త
-
చిన్నారి సహా తల్లి సజీవ దహనం
ఘట్కేసర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. సీఐ రఘవీర్‌రెడ్డి కథనం మేరకు.. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ ప్రాంతంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులను కాల్చివేసినట్లు స్థానికులు, వీఆర్ఏ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన మాచెల్ల రమేష్, గూడూరుకు చెందిన కందిగ శుశ్రుత 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరివీ వేర్వేరు సామాజిక వర్గాలు. ఈ దంపతులకు 4 నెలల బాబు ఉన్నాడు. భర్తతో గొడవపడిన శుశ్రుత కొద్ది రోజులుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. సమస్యను పరిష్కరించుకుందామని భార్యను ఉప్పల్‌కు రమేశ్ పిలిపించాడు. కుమారుడితో కలిసి శుశ్రుత ఓఆర్ఆర్ వద్దకు వచ్చింది. ఈ సందర్భంగా వారి మధ్య మళ్లీ వాగ్వాదం జరగడంతో మనస్తాపం చెందిన శుశ్రుత.. తాను నిద్రమాత్రలను మింగడమేగాక మరో మాత్రను పాలలో కలిíపి కుమారుడికి తాగించింది. ఆపస్మారక స్థితికి చేరుకున్న వారిని రాత్రి 9 గంటల ప్రాంతంలో రమేష్.. ప్రభాకర్ ఎన్క్లేవ్ ప్రాంతానికి తరలించి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం నేరుగా పాలకుర్తికి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఈ సందర్భంగా.. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడైందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
కుటుంబ కలహాల నేపథ్యంలో గురజాల మండలం మాడుగుల గ్రామంలో సోమవారం రాత్రి హత్య జరిగింది. తన తమ్ముడు గనిపల్లి అమ్మోసు, అతని భార్య ఏసమ్మ గొడవపడుతుండగా గనిపల్లి శ్యామేలు (35) సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. ఏసమ్మ కుటుంబ సభ్యులు కర్రతో మోదడంతో శ్యామేలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గుంటూరు జిల్లా /గురజాల : కుటుంబంలో చేలరేగిన కలహాలు వ్యక్తి హత్యకు దారి తీశాయి. ఈ ఘటన గురజాల మండలంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం.. మాడుగుల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న గనిపల్లి శ్యాయ్మేలు (35)హత్యకు గురయ్యాడు. తమ్ముడు గనిపల్లి అమ్మోసు అతని భార్య ఏసమ్మలు సోమవారం రాత్రి భోజనం సమయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో అమ్మోసు ఇంటి పక్కనే నివాసం ఉంటున్న అన్న శ్యాయ్మేలు తమ్ముడు, మరదల గొడవను చూసి సర్థిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఏసమ్మ భర్తతో పెద్దగా అరుస్తూ వాగ్వాదానికి దిగుతోంది. ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు టి.బాబు, రమేష్, యోహాన్, ఏసోబు, రాజేష్, సీతారావమ్మ, సీతమ్మ, ఆదాంలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే భార్యభర్తలకు సర్థి చెబుతున్న శ్యాయ్మేలును వస్తూ వస్తూనే తలపై కర్రతో గట్టిగా కొట్టారు. తీవ్ర గాయం కావడంతో క్షతగాత్రుడిని స్థానికులు ఆటోలో గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో శ్యాయ్మేలు మృతి చెందాడు. మృతుడు కుమారుడు చిన్నరాజు ఫిర్యాదు మేరకు సీఐ వై.రామారావు ఏసమ్మతో పాటు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎప్పుడూ గొడవలే.. మృతుడు శ్యామేలు తమ్ముడు అమ్మోసు అదే గ్రామానికి చెందిన ఏసమ్మను తొమ్మిదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. తమ్ముడు కుటుంబంలో ఎప్పుడూ గొడవలు వస్తుండేవి. మృతుడు శ్యాయ్మేలు సర్థి చెప్పేవాడు. గతంలో కూడా అమ్మోసుపై భార్య ఏసమ్మ రెండు సార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గర్భిణిగా ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన కొన్నాళ్లకు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నన్ను చంపేందుకు భర్త అమ్మోసు ప్రయత్నించాడని కేసు పెట్టింది. పెద్దలు రాజీ కుదర్చడంతో విషయం చల్లారింది. తర్వాత మరికొద్ది రోజులకు ఏసమ్మ కుటుంబ సభ్యులు బంగారు అభరణాలు దొంగతనం కేసును కూడా అమ్మోసుపై పెట్టారు. తన భార్య రెండు నెలల కిందటే పుట్టింటి నుంచి ఇక్కడికి వచ్చిందని మృతుడు తమ్ముడు అమ్మోసు తెలిపారు. పలువురి పరామర్శ.. శ్యాయ్యేలు మృతదేహన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నాయకుడు ఎనుముల మురళీధర్‌రెడ్డి, మండల కన్వీనర్ సిద్ధాడపు గాంధీ, పట్టణ కన్వీనర్ కె.అన్నారావులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి.. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్ : అనంతపురం అల్లూరిసీతరామరాజు(ఏఎస్ఆర్)నగర్లో నివాసముంటున్న మంజునాథ్(26) సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు నాల్గో పట్టణ పోలీసులు తెలిపారు. కదిరి రూరల్ మండలం గాజువారిపల్లి తండాకు చెందిన ఆయన కొంతకాలంగా ఏఎస్ఆర్ నగర్లో నివాసముంటున్నారు. కుటుంబ కలహాలు నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆయన పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక పెద్దాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందాడన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సిద్దిపేట జిల్లాలో విషాదం : దంపతుల ఆత్మహత్య
జగదేవ్‌పూర్ : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన సాయిలు(75), సరోజమ్మ(65)లు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నా ఒకరు హైదరాబాద్‌లో, మరొకరు జగదేవ్‌పూర్‌లోనే ఉంటున్నారు. వీరిద్దరు గ్రామంలోని వేరే ఇంట్లో జీవనం గడుపుతున్నారు. సరోజమ్మకు ఆస్పత్రిలో చూపించుకొచ్చారని, మూడు రోజుల క్రితం నుంచి ఆమె కనిపించడంలేదని చుట్టుపక్కలవారు తెలిపారు. సాయిలు ఇంట్లో ఉరివేసుకుని కనిపించగా సరోజమ్మ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వృద్ధ దంపతుల ఆత్మహత్యతో స్థానికంగా విషాదం నెలకొంది. -
ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
కుమారుడితో సహా తల్లి ఆత్మహత్య ఖిల్లాఘనపురం: కుటుంబ కలహాలు తల్లీ కొడుకు ప్రాణాలు తీశాయి. ముక్కుపచ్చలారని మూడేళ్ల కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజిపేటలో చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం మహదేవునిపేటకు చెందిన నందమోని కురుమయ్య కుమార్తె మాధవిని మూడేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం షాపురం గ్రామానికి చెందిన జుట్టు శ్రీనువాసులుకు ఇచ్చి వివాహం చేశారు. దంపతులిద్దరు మహదేవునిపేటలో ఉండి కూలీపనులు చేసుకుంటున్నారు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి తగాదా వచ్చింది. శ్రీనువాసులు తన పాత ఆటోను మరమ్మతు చేయించుకుంటానని స్వగ్రామానికి వెళ్లాడు. మాధవి తన అక్కగారి ఊరైన మానాజిపేటకు వెళ్లింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన మూడేళ్ల కొడుకు యశ్వంత్‌పై ముందు కిరోసిన్ పోసి తానూ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఇంటి ముందు ఉన్న సపారం (గడ్డితో ఉన్న కప్పు)కు అంటుకున్నాయి. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఇరుగుపొరుగు వచ్చి మంటలను ఆర్పివేసే సరికి తల్లి, కొడుకు మంటల్లో కాలిపోయారు. -
మేడ్చల్‌లో దారుణం
మేడ్చల్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం జరింగింది. ఇంట్లో నిద్రిస్తున్న ఏడేళ్ల చిన్నారిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కృష్ణమూర్తి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. దసరా సందర్భంగా బుధవారం మధ్యాహ్నం కృష్ణమూర్తి దంపతులు ఇద్దరు కూతుళ్లను ఇంట్లో వదిలేసి బంధువులను కలిసి రావడానికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇద్దరు పిల్లలు నిద్రిస్తుండగా.. ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు ప్రసన్న(7)ను బాత్రూమ్లోకి ఎత్తుకెళ్లి గొంతు, కాళ్లు కోసి అత్యంత దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
పాలమూరు జిల్లాలో దారుణం
మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లాలో దారుణం జరిగింది. భర్తపై భార్య కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన కోడూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భర్త రాము మృతిచెందాడు. గంగమ్మ బుధవారం ఉదయం భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో రాము అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గంగమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాముకు గంగమ్మతో కొంతకాలంగా కుటుంబ కలహాలు నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
తల్లీ కూతుళ్ల ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కులుంబ కలహాల నేపథ్యంలో తల్లీ కూతుళ్లు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని తాడ్వాయి మండలం కరాడ్పల్లిలో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తల్లీ కూతుళ్లు బుధవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాలను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళ ఆత్మహత్యాయత్నం
శామీర్‌పేట్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిమహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్రానికి చెందిన రాజేశ్వరి (30), దయానంద్ దంపతులు మూడు నెలల క్రితం మండలంలోని అలియాబాద్‌కు వలస వచ్చారు. స్థానిక హెచ్‌బీఎల్ కంపెనీలో రోజువారి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, దయానంద్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈనేపథ్యంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం మద్యం తాగి ఇంటికి వచ్చిన అతడు చేపలు తీసుకువచ్చి వండమని రాజేశ్వరికి చెప్పాడు. ఈనేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేశ్వరి దయానంద్ ఇంట్లో నుంచి వెళ్లిపోగానే ఒటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించచుకుంది. విషయం గమనించిన స్థానికులు, కుటుంబీకులు మంటలు ఆర్పి ఆమెను చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరేసుకుని హోంగార్డు ఆత్మహత్య
♦ కుటుంబ కలహాలే కారణం.. ♦ పెద్దదోర్నాలలో ఘటన.. పెద్దదోర్నాల: చెట్టుకు ఉరేసుకుని హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానిక వ్యవసాయ భూముల్లో శుక్రవారం జరిగింది. ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే గోనా మల్లికార్జున(34) పెద్దదోర్నాల పోలీసుస్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా విధులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇటీవల తన సొంత సోద రుడి భార్య.. మల్లికార్జునతో పాటు ఆయన భార్య, తమ్మునిపై వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం రోడ్డు కస్తూరిబా బాలికల పాఠశాల వెనుక భాగంలోని వ్యవసాయ భూమిలో ఓ చెట్టుకు మల్లికార్జున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఎస్సై నాగరాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న గంగమ్మ మృతి గుంటూరు ఈస్ట్: మేదరమెట్ల వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరాస్వామి భార్య గంగమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. దీంతో ప్రమాద మృతుల సంఖ్య ఆరుకు చేరింది. వీరాస్వామి, అతని కోడలు మాధవి, కూతురు లక్ష్మీప్రసన్నలు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
సుత్తితో మోది హత్య
కుటుంబ కలహాలతో భర్తను కడతేర్చిన భార్య బొల్లారం: కుటుంబ కలహాల నేపథ్యంలో సుత్తితో తలపై మోది భర్తను హత్య చేసిందో మహిళ. తిరుమలగిరి ఠాణా పరిధిలోని పెద్ద కమేళాలో గురువారం రాత్రి ఈ దారుణం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పెద్ద కమేళా నివాసి సత్యనారాయణ పెయింటర్. ఇతనికి భా ర్య సోనీ, పిల్లలు కీర్తన రాజు(11), నవ్యశ్రీ (8) ఉన్నారు. సోనీ ఇళ్లలో పని చేస్తోంది. భార్యాభర్తలు పలుసార్లు గొడవపడి పోలీసుస్టేషన్‌కు కూడా వెళ్లారు. సత్యనారాయణ గురువారం పనికి వెళ్లొచ్చి రాత్రి ఇంట్లో పడుకున్నాడు. గొడవల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న సోనీ రాత్రి 11 గంటలకు గాఢ నిద్రలో ఉన్న భర్త తలపై సుత్తెతో దాదాపు 18 సార్లు విచక్షణారహితంగా కొట్టింది. తల బద్దలై తీవ్రరక్తస్రావం కావడంలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులకు కట్టుకథ:తర్వాత సోనీ 100 నెంబర్‌కు ఫోన్ చేసి తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని చెప్పింది. వెం టనే తిరుమలగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రాజు, ఎస్ఐ శ్రీనునాయక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. భార్యను విచారించగా తాను బాత్రూమ్ లో ఉండగా నలుగురు దుండగులు వచ్చి.. తన నోరు మూసి తన భర్తపై సుత్తెతో దాడి చేసి చంపేశారని చెప్పింది. కుమారుడు కీర్తన రాజుతో కూడా అలాగే చెప్పించింది. అయితే, సోనీ తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. దీంతో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హతుడి తమ్ముడు మల్లేశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుమార్తె గొంతు నులిమి..ఆపై
ధారూర్: కుటుంబకలహాల నేపథ్యంలో ఓ తల్లి చిన్నారిని చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలం రాళ్లచిట్టెంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజు, లక్ష్మి దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమార్తె శ్రీజ(9 నెలలు) ఉంది. దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీజను గొంతు నులిమి చంపిన లక్ష్మి.. తర్వాత తాను ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
గుంటూరులో వివాహిత దారుణ హత్య
ముప్పాళ్ల: గుంటూరు జిల్లాలో కుటుంబకలహాల కారణంగా ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాంబిరెడ్డి, లక్ష్మి(35) దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం కూడా సాంబిరెడ్డి అతడి తండ్రి బక్కిరెడ్డి కలసి లక్ష్మితో గొడవపెట్టుకున్నారు. తండ్రి, కొడుకు కలసి లక్ష్మిని రోకలిబండతో కొట్టి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పాడేరులో దారుణం..
పాడేరు: విశాఖ జిల్లా పాడేరులో దారుణం చోటు చేసుకుంది. వర్మ అనే వ్యక్తి ఆదివారం ఉదయం తన భార్య జ్యోతి, అత్త సుజాతలపై కత్తులతో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో జ్యోతి, సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరీ పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. వర్మ, జ్యోతిలది ప్రేమ వివాహం కావడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. -
ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ మృతి
పాల్వంచ రూరల్: కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం చండ్రాలగూడెం పంచాయతీకి చెందిన గృహిణి కల్తీ నాగమణి (27) నాలుగు రోజుల క్రితం వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర కాలిన గాయాలతో ఉన్న ఆమెను చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమె ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. -
కోర్టు ఆవరణలోనే భార్యను గొడ్డలితో నరికాడు..
-
కోర్టు ఆవరణలోనే భార్యను గొడ్డలితో నరికాడు..
తన పై కేసు పెట్టిందనే కోపంతో ఓ భర్త .. భార్యను పట్టపగలు కోర్టు ఆవరణలో గొడ్డలితో నరికాడు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన భార్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే... వివరాలు.. పోడూరు మండలం వడ్లవానిపాలెం గ్రామానికి చెందిన వాసకూరి నాగ సత్యనారాయణ రాజు(42)కు పదిహేనేళ్ల క్రితం వసుంధర(38)తో వివాహమైంది. ఈ క్రమంలో భార్యా భర్తల మధ్య వివాదాలు నెలకొనడంతో భార్య భర్తపై కేసు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాలకొల్లు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందుంచారు. దీంతో బుధవారం కోర్టుకు రావాల్సిందిగా సమన్లు జారీ కావడంతో.. సత్యనారాయణ రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... భార్య న్యాయస్థానంలోకి ప్రవేశిస్తుండగా.. తనతో పాటు తెచ్చుకున్న గొడ్డలితో దాడి చేశాడు. దీంతో అమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కోర్టు ఆవరణలో భయోత్పాతం నెలకొంది. ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం సత్యనారాయణరాజు అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారిలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం వెంకటాపురంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(30)కి పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కృష్ణతో వివాహమైంది. ఈ క్రమంలో భార్యా భర్తల మధ్య గొడవలు పెరగడంతో కుటుంబ కలహాలు ఎక్కువై మనస్తాపానికి గురైన భాగ్యలక్ష్మి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
నవ దంపతుల ఆత్మహత్య
కుషాయిగూడ: కుటుంబ కలహాల కారణంగా నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... ఉత్తరాఖండ్, డెహ్రడూన్‌కు చెందిన దివాకర్‌కుమార్ (29) ఎన్ఎఫ్సీలో టెక్నీషీయన్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి గత ఫిబ్రవరిలో అదే రాష్ట్రానికి చెందిన హిమానీదేవి (27)తో వివాహం జరిగింది. కొన్ని నెలలు వారి కాపురం సజావుగా సాగినా..ఇటీవల మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో భార్యభర్తలు తరచూ గొడవ పడేవారు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఇటీవల వారికి సర్థిచెప్పారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో గత ఆదివారం కూడా వారి మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానికులు తెలిపారు. తరువాత ఏం జరిగిందో గాని ఇంట్లోని సీలింగ్‌ఫ్యాన్‌కు దంపతులిద్దరూ ఒకే చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం ఇంటి కిటీకిలోంచి గమనించిన ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటరమణ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశామని, వారిని విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగ గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో మృతదేహం తేలుతుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గ్రామానికి చెందిన శనిగారపు రాజిరెడ్డి(55)దిగా గుర్తించారు. కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకొని దసరా రోజు ఇంటి నుంచి వెళ్లి పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. -
కుటుంబ కలహాలతో..
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీ వాడి గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన పెద్ద నర్సయ్య(58) వ్యవ సాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కుటుంబ కలహాలతో సతమతమవుతున్న నర్సయ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు అందాల్సి ఉంది. -
గొడవ వద్దన్నందుకు గొడ్డలితోనరికేశాడు
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెలమపేటలో ఓ వ్యక్తి తనకు వరుసకు కొడుకైన వ్యక్తిని గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపాడు. శనివారం రాత్రి షేక్ అల్లాబాషా తన తల్లి అలీమాతో గొడవ పడ్డాడు. ఆ సమయంలో అల్లా బాషాకు వరుసకు కుమారుడైన షేక్ రజీ (25) గొడవ వద్దని వారికి సర్దిచెప్పాడు. దాంతో రాత్రి ఇంటి బయట పడుకున్న రజీని అల్లా బాషా గొడ్డలితో విచక్షణారహితంగా నరికేశాడు. ఈ ఘటనలో రజీ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. -
టెన్షన్ భరించలేకపోతున్న..
- భార్య, కూతురును చంపి.. తానూ చావాలని నిర్ణయం - కుటుంబకలహాలే కారణం? - తహశీల్దార్ శ్రీనివాస్ ఆత్మహత్య ఉదంతం భీమారం: వారిది అన్యోన్య దాంపత్యం.. ఓ సారి చిన్నగా గొడవ పడినా తర్వాత సర్దుకుపోతారు.. ఆ తర్వాత హ్యాపీగా ఉంటారు.. వారే మంచికట్ల శ్రీనివాస్- లావణ్య దంపతులు. మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు వైష్ణవి(ఇరవై నెలలు). శ్రీనివాస్(32) చిట్యాల తహశీల్దార్. శనివారం మధ్యాహ్నం వరకు హన్మకొండలో వినాయక నిమజ్జన విధినిర్వహణలో ఉన్నారు. ఆ తర్వాత నగరంలోని తన ఇంటికి చేరారు. కారణం ఏదో తెలియదుగానీ.. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాలతో మనస్తాపం చెందిన శ్రీనివాస్.. భార్యాకూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణరుుంచుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవజరిగింద, గాయప డ్డ భార్య చనిపోరుుందని షాక్‌తిన్న శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ‘భా ర్య వేధింపులు భరించలేకపోతున్న.. టెన్షన్ ఎక్కువైంది.. చావాలని నిర్ణయించుకున్న.. నా చావుకు భార్య మాత్రం కారణం కాదు.. అయినా నేను ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని శ్రీనివాస్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ యా దయ్య, హన్మకొండ ఏసీపీ శోభన్‌కుమార్, ఆర్డీవో మహేందర్‌జీ, సీఐ అలీ, ఎస్సై నాగబాబు, తహశీల్దార్ చెన్నయ్య తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. లావణ్య, వైష్ణవిని ఆస్పత్రికి తరలించారు. చిట్యాలలో విషాదం చిట్యాల : తహశీల్దార్ శ్రీనివాస్ ఆత్మహత్య చిట్యాలలో విషాదం నింపింది. కరీంనగర్ జి ల్లా రామడుగు మండలం వెదిరెకు చెందిన శ్రీనివాస్ 21 ఫిబ్రవరి 2014లో చిట్యాల తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10 నుంచి రాత్రి10గంటల వరకూ ఆఫీసులోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై నే దృష్టి సారించారు. ముక్కుసూటి స్వభావం గలవారు. ప్రజల్లో చెరగని ముద్రవేసుకున్నా రు. సీఐ, ఎస్సైతో ప్రతీవారం సమీక్ష జరుపు తూ ఇసుక అక్రమ రవాణాను నియంత్రిం చారు. పంచాయతీ కార్యదర్శుల అనుమతి తోనే ఇసుక పర్మిట్లు ఇచ్చేవారు. గుడుంబా నిర్ములన, ప్రజాపంపిణీ వ్యవస్థపై ప్రజల్ని చైతన్యవంతం చేశారు. 2014, 2015 జూన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రజల్ని భాగస్వాములను చేశారు. తెలంగాణ వంటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. శ్రీనివాస్ గాయకుడిగానూ రాణించారు. తహశీల్దార్ శ్రీనివాస్ మృతిని తాము జీర్ణించుకోలేకపోతున్నామని సీఐ రవీందర్, ఎస్సై వెంకట్రావు, ఎంపీడీఓ త్రివిక్రమరావు, ఏవో రఘుపతి, ఎంపీపీ బందెల స్నేహలత, జెడ్పీటీసీ కాట్రేవుల సాయిలు, రాజకీయపార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. -
రాంకోఠిలో ఒకరి దారుణ హత్య
కుటుంబ కలహాలు.. ఒక వ్యక్తి హత్యకు కారణమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంకోఠిలో ఆదివారం రాత్రి బొగ్గులకుంట ప్రాంతానికి చెందిన ఖాదర్‌పాషా(33)ని కొందరు దుండగులు అడ్డుకున్నారు. అతన్ని ఇనుప రాడ్‌తో కొట్టి, గొడ్డలితో నరకటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, పాషాకు మూడేళ్ల క్రితం నేహా ఫాతిమా అనే యువతితో వివాహమైంది. వారిద్దరికీ మనస్పర్థలు రావటంతో విడిపోయారు. ఈ నేపథ్యంలోనే నేహా బంధువైన సర్ఫరాజ్ అతని స్నేహితులు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
బుల్లితెర నటుడు బాజీ అరెస్టు
హైదరాబాద్ : కుటుంబ కలహాల నేపథ్యంలో బుల్లితెర నటుడు బాజీని విజయవాడ గన్నవరం పోలీసులు బుధవారం జూబ్లీహిల్స్‌లో అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-1లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ సమీపంలో బుధవారం బాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్వాతిచినుకులు సీరియల్ షూటింగ్ జరుగుతుండగా జూబ్లీహిల్స్ పోలీసుల సహకారంతో గన్నవరం పోలీసులు అక్కడికి చేరుకొని అరెస్టుచేశారు. బాజీ భార్య సోమ ఇటీవల భర్తపై గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై సెక్షన్ 380, 406 కింద అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గతంలో ఆడదే ఆధారం సీరియల్లోనూ ప్రధానపాత్ర పోషించడంతోపాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినట్లు పోలీసులు తెలిపారు. -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
♦ ఉసురు తీసిన కుటుంబ కలహాలు ♦ పాలల్లో విషం.. తండ్రి ఆరోపణ ♦ చిన్నారి అనుమానాస్పద మృతి వేల్పనూరు(వెలుగోడు) : కుటుంబ కలహాలు ఓ చిన్నారి ప్రాణం తీశాయి. వేల్పనూరు గ్రామానికి చెందిన రొడ్డా సుధాకర్, దేవీశ్వరి దేవి దంపతులకు 12 నెలల గురుసంపత్ సంతానం. సుధాకర్‌కు ఇద్దరు సోదరులు కాగా.. పెద్ద అన్న గడివేములలో ముఠాయిల దుకాణం నిర్వహిస్తున్నాడు. రెండో సోదరుడు నాగేశ్వరరావు అతని భార్య జయమ్మలు సుధాకర్‌తో కలిసి ఇకే ఇంట్లో ఉంటున్నారు. రెండు కుటుంబాలు వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాయి. కాగా మంగళవారం కుటుంబ సభ్యుల మధ్య పొలం విషయంలో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుధాకర్ తనయుడు గురుసంపత్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అయితే విష ప్రయోగం జరిగిన పాలు తాగడం వల్లే తన కుమారుడు మృతి చెందాడని తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ, సీఐ దివాకర్‌రెడ్డి, ఎస్ఐ మల్లికార్జునలు వేల్పనూరు చేరుకుని చిన్నారి మృతిపై విచారణ చేపట్టారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మా నువ్వు లేక.. నేను లేనమ్మా!
అమ్మా.. నవమాసాలు మోశావు.. కంటికి రెప్పలా పెంచావు.. చిరుప్రాయంలోనే తల్లిలేనివాడ్ని చేయాలనుకున్నావు.. నిను వీడి ఎలా బతికేదమ్మా.. అమ్మా.. నీ పొత్తిళ్లలో పెరిగేటోడ్ని.. నీ చేతి గోరు ముద్దలు తినేటోడ్ని.. నీవు లేకుండా ఎలా ఉంటాననుకున్నావు.. అమ్మా.. నాపై ఎన్నో ఆశలు పెంచుకున్నావు.. నాన్నపై భారం వేయాలనుకున్నావు.. కానీ నీ పేగు తెంచుకుని పుట్టానే.. కడదాకా నీవెంటే ఉంటా నమ్మా.. అంటూ..మంటల్లో కాలిపోతున్న తల్లి వద్దకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు ఓ చిన్నారి. ఆపై తల్లీబిడ్డ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన శుక్రవారం శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. ♦ కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య ♦ మంటల్లో గాయపడి రెండేళ్ల కుమారుడు కూడా మృతి శ్రీకాళహస్తి రూరల్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందగా, మంటల్లో గాయపడి రెండేళ్ల కుమారుడు కూడా మృతి చెందిన, సంఘటన శుక్రవారం మండలంలోని ఊరందూరు గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు, ఊరందూరు గ్రామానికి చెందిన శేషయ్య కుమారుడు శంకర్(28)కు అదే గ్రామానికి చెందిన ఆర్ముగం కుమార్తె అల్లీరాణి(24)తో మూడేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి రెండేళ్ల కుమారుడు హర్ష ఉన్నాడు. శంకర్ మండలంలోని ఓ కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మూడేళ్లపాటు ఆనందంగా సాగిన వీరి కాపురంలో వారం రోజులుగా విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో శంకర్ కర్మాగారంలో విధులకు వెళ్లగా, శంకర్ తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అల్లీరాణి వంటింట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కేకలు వేసింది. స్థానికులు వచ్చి ఆమెను రక్షించేలోపు మృతి చెందింది. కాగా అల్లీరాణి మంటల్లో కాలిపోతున్న సమయంలో తల్లికోసం వెళ్లిన కుమారుడు హర్ష(02) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు హర్షను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ హర్ష మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లీరాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం
కొయ్యలకుంట(వైఎస్సార్ జిల్లా): కుటుంబ కలహాలతో దంపతులు శనగమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం వైఎస్సార్ జిల్లా కొయ్యలకుంట మండలం అంకంపల్లె గ్రామంలో జరిగింది. వివరాలు.. అంకంపల్లె గ్రామానికి చెందిన వెంకటేష్, కల్యాణి దంపతులు గత కొంత కాలంగా కుటుంబకలహాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఇంటిలో ఉన్న శనగమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసిన స్థానికులు దంపతులను మెరుగైన వైద్యం కోసం కడప ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతానికి దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరుగురు పిల్లలకు విషమిచ్చిన తల్లి
-
ఆరుగురు పిల్లలకు విషమిచ్చిన తల్లి
తానూ తాగి ఆత్మహత్యాయత్నం మహబూబ్‌నగర్ క్రైం: ఓ తల్లి తన ఆరుగురు పిల్లలకు పురుగుల మందు తాగించి, తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్‌లో జరిగింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. ఖాసీం, ఖాజాబేగం దంపతులకు ఆరుగురు సంతానం. కొద్దిరోజులుగా కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. మనస్తాపానికి గురైన ఖాజాబేగం తన ఆరుగురు పిల్లలు మైమూదా, అభిదా, సబా, షాహీన్, మస్తాన్, నవాజ్‌లకు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగించింది. కొద్దిసేపటి తరువాత తాను కూడా తాగింది. ఇది గమనించిన స్థానికులు చికిత్సకోసం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో చిన్నారులు మస్తాన్(2), నవాజ్(7) ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
అనుమానం పెనుభూతమై..
- మాడుగులలో భార్యను చంపిన భర్త - జమ్మలమడకలో కొడవలితో భార్య గొంతు కోసిన భర్త - తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు అనుమానం రెండు సంసారాల్లో చిచ్చుపెట్టింది. భార్యను శంకించి ఒకరేమో కొడవలితో గొంతు కోశాడు. ఆమె తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరో ప్రబుద్ధుడు సుత్తితో భార్య తలపై మోది హత్య చేశాడు. ఈ రెండు ఘటనలు పల్నాడులోని మాచర్ల, గురజాల మండలాల్లో జరిగాయి. బాధితులు ఇద్దరూ గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన ఆడపడుచు, కోడలు కావడం విషాదకరం. గురజాల: అనుమానంతో భార్యను కడతేర్చిన ఘటన మండలంలోని మాడుగులలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురజాలకు చెందిన చిటిమాల మల్లమ్మ(38)కు మాడుగుల గ్రామానికి చెందిన పగిడిపల్లి సుందరరావుతో 17 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లమ్మ మాడుగుల గ్రామంలో అంగడీవాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. మల్లమ్మపై భర్త అనుమానం పెంచుకోవడంతో కుటుంబ కలహాలు పెరిగాయి. ఈ క్రమంలో ఏడాదిన్నరగా మల్లమ్మ పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటూ మాడుగులలో విధులు నిర్వర్తిస్తోంది. అనుమానంతో తన భర్త వేధిస్తున్నాడని గతంలో మల్లమ్మకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం సుందరరావు మాడుగులలోని అంగన్వాడీ కేంద్రం వద్దకు వెళ్లి.. మనస్పర్థలు మరిచి కలిసి ఉందామని మల్లమ్మకు నమ్మబలికాడు. అనంతరం ఇంటికి తీసుకువెళ్లి ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి చంపేశాడు. అనంతరం ఇంటిలోంచి మల్లమ్మ శవాన్ని బయట పడేసి, పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలాన్ని ఎస్‌హెచ్‌వో ఎం.రాజేష్‌కుమార్ సందర్శించి, వివరాలు సేకరించారు. మృతిరాలి తండ్రి చిటిమాల వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. జమ్మలమడకలో భార్య గొంతు కోసిన భర్త మాచర్ల టౌన్: అనుమానంతో భార్య గొంతు కోసి, హతమార్చేందుకు ఓ ప్రబుద్ధుడు ప్రయత్నించిన ఘటన మండలంలోని జమ్మలమడక గ్రామంలో గురువారం జరిగింది. ఆస్పత్రిలో బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆలేటి విక్రమ్‌కు గురజాల మండలం మాడుగులకు చెందిన సౌజన్యతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఇటీవల సౌజన్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న విక్రమ్ తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం భార్యతో గొడవపడ్డాడు. మాటమాట పెరగడంతో ఇంట్లో ఉన్న కొడవలితో సౌజన్య గొంతు కోసేందుకు విక్రమ్ యత్నించాడు. ఆమె ప్రతిఘటించి చేతులను అడ్డుపెట్టుకోవడంతో తెగాయి. చేతులు పక్కకు తీయగానే గొంతు కోశాడు. గొడవను గమనించి భయపడిన వారి కుమారుడు వినయ్‌కుమార్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. దీంతో విక్రమ్ అక్కడినుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న సౌజన్యను చికిత్స కోసం పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఎస్ఐ సోమేశ్వరరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి సౌజన్య నుంచి వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.