
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
కుటుంబ కలహాలు ఓ చిన్నారి ప్రాణం తీశాయి. వేల్పనూరు గ్రామానికి చెందిన రొడ్డా సుధాకర్, దేవీశ్వరి దేవి
♦ ఉసురు తీసిన కుటుంబ కలహాలు
♦ పాలల్లో విషం.. తండ్రి ఆరోపణ
♦ చిన్నారి అనుమానాస్పద మృతి
వేల్పనూరు(వెలుగోడు) : కుటుంబ కలహాలు ఓ చిన్నారి ప్రాణం తీశాయి. వేల్పనూరు గ్రామానికి చెందిన రొడ్డా సుధాకర్, దేవీశ్వరి దేవి దంపతులకు 12 నెలల గురుసంపత్ సంతానం. సుధాకర్‌కు ఇద్దరు సోదరులు కాగా.. పెద్ద అన్న గడివేములలో ముఠాయిల దుకాణం నిర్వహిస్తున్నాడు. రెండో సోదరుడు నాగేశ్వరరావు అతని భార్య జయమ్మలు సుధాకర్‌తో కలిసి ఇకే ఇంట్లో ఉంటున్నారు. రెండు కుటుంబాలు వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాయి. కాగా మంగళవారం కుటుంబ సభ్యుల మధ్య పొలం విషయంలో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుధాకర్ తనయుడు గురుసంపత్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అయితే విష ప్రయోగం జరిగిన పాలు తాగడం వల్లే తన కుమారుడు మృతి చెందాడని తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ, సీఐ దివాకర్‌రెడ్డి, ఎస్‌ఐ మల్లికార్జునలు వేల్పనూరు చేరుకుని చిన్నారి మృతిపై విచారణ చేపట్టారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.