సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాటు తుపాకీ పేలి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదం తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో మంగళవారం జరిగింది. నాలుగేళ్ల చిన్నారి ధన్యశ్రీ ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. అక్కడే కొందరు వ్యక్తులు నాటు తుపాకులతో పందుల్ని కాలుస్తున్నారు.
ఈ క్రమంలో నాటు తుపాకీతో పందులను కాల్చడానికి ప్రయత్నిస్తుండగా.. ఓ తుటా గురితప్పి చిన్నారికి తగిలింది. దీంతో ధన్య శ్రీ అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే స్నేహితులు బాలిక కుటుంబ సభ్యులకు చేరవేయగా.. వారు వచ్చి చిన్నారిని చూసేసరికి అప్పటికే మృతిచెందింది. కూతురు మరణంతో తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: ఒక్కగానొక్క కుమార్తె.. తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తుంటే
Comments
Please login to add a commentAdd a comment