అనంతపురం సెంట్రల్ :
అనంతపురం అల్లూరిసీతరామరాజు(ఏఎస్‌ఆర్)నగర్‌లో నివాసముంటున్న మంజునాథ్(26) సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు నాల్గో పట్టణ పోలీసులు తెలిపారు. కదిరి రూరల్ మండలం గాజువారిపల్లి తండాకు చెందిన ఆయన కొంతకాలంగా ఏఎస్‌ఆర్ నగర్‌లో నివాసముంటున్నారు. కుటుంబ కలహాలు నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆయన పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక పెద్దాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందాడన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.