ఆస్ట్రేలియా(Australia) పర్యటనలో ఉన్న భారత జట్టుకు మరోసారి చుక్కెదురైంది. మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో భారత్(India) ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-2 వెనకంజలోకి వెళ్లింది. మరోసారి బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆసీస్ బౌలర్ల దాటికి 155 పరుగులకే కుప్పకూలింది.
ఈ మ్యాచ్‌లో యశస్వి జైశ్వాల్, నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ జైశ్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు బౌలర్లలో స్కాట్ బోలాండ్, కమ్మిన్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, హెడ్ చెరో వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి.
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే..
డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ బెర్త్‌ను ఇప్పటికే దక్షిణాఫ్రికా ఖారారు చేసుకుంది. మరో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్ మధ్య పోటీ నెలకొంది. మెల్‌బోర్న్ టెస్టు ఓటమితో భారత్ తమ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్ధానంలో కొనసాగుతోంది. ఈ ఓటమితో టీమిండియా విన్నింగ్ శాతం 55.89 నుంచి 52.77కి పడిపోయింది.
మరోవైపు ఆసీస్ మాత్రం ఈ విజయంతో తమ విన్నింగ్ శాతాన్ని 58.89 నుంచి 61.46కు మెరుగుపరుచుకుంది. ఈ క్రమంలో భారత్ ఫైనల్‌కు చేరడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి. ప్రస్తుత సైకిల్‌లో భారత్‌కు ఇంకా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కానీ ఆసీస్ మాత్రం ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడనుంది. భారత్‌తో ఓ మ్యాచ్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారులు తలపడనున్నారు.
అయితే భారత్‌కు ఇంకా దారులు మూసుకుపోలేదు. రోహిత్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే సిడ్నీ వేదికగా జరగనున్న ఆఖరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిందే. అదే సమయంలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో ఆసీస్ కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడిపోవాలి. అప్పుడే భారత్‌కు ఫైనల్‌కు చేరే అవకాశముంటుంది. లేదా రెండు మ్యాచ్‌ల 0-0 డ్రాగా ముగిసిన భారత్‌కు ఫైనల్ చేరే ఛాన్స్ ఉంటుంది.
చదవండి: అద్భుతమైన టెస్టు.. ఆఖరికి మాదే పైచేయి.. వాళ్లిద్దరు సూపర్: కమిన్స్
Comments
Please login to add a commentAdd a comment