సినీ పరిశ్రమలో మతాంతర వివాహాలు ఆపై వాటి నుంచి వచ్చే సమస్యలు వంటి కథలతో చాలా చిత్రాలు వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని నిజ జీవితంలోనూ ఈ విధానం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. చాలామంది ప్రముఖులు మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు. కోలీవుడ్‌కు చెందిన నటి రెజీనా కుటుంబంలో కూడా ఇలాంటి ఘటనే ఉంది. టాలీవుడ్‌లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,పిల్ల నువ్వు లెని జీవితం,సౌఖ్యం వంటి చిత్రాల్లో ఆమెకు గుర్తింపు వచ్చింది.
రెజీనా తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పలు చిత్రాల్లో ఐటమ్స్ సాంగ్స్‌లో నటించిన ఆమె ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులు వేసింది. ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్‌ల్లోనూ ఆమె నటించారు. తాజాగా నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన విడాముయర్చి చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. కాగా తన మతం గురించి ప్రస్తావన వస్తే ఆమె ఇలా పేర్కొన్నారు.
పుట్టినప్పుడు ఇస్లాం మతస్తురాలుగా ఉన్న ఈమె ఆ తరువాత క్రిస్టియన్ మతానికి మారినట్లు చెప్పారు. దీని గురించి నటి రెజీనా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తన తల్లి క్రిస్టియన్ మతానికి చెందిన వారిని తండ్రి ఇస్లాం మతస్తుడని పేర్కొన్నారు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తాను పుట్టినప్పుడు ఇస్లాం మతస్తురాలిగా పెరిగానన్నారు.
(సంధ్య థియేటర్: పవన్ కల్యాణ్ 23 ఏళ్ల రికార్డ్‌ను బీట్ చేసిన 'పుష్ప'రాజ్)
అయితే, తను ఆరేళ్ల వయసులో ఉండగా అమ్మానాన్న విడిపోయారని గుర్తుచేసుకుంది. అప్పుడు తన అమ్మగారు తిరిగి క్రిస్టియన్‌గా కన్వర్ట్ అయ్యి రెజీనా పేరుకు ‘కసాండ్రా’ జత చేశారట. దీంతో తాను బాప్తిజం పొంది బైబిల్ చదివినట్లు చెప్పారు. అలా ఆమె రెజీనా కసాండ్రాగా అందరికీ పరిచయం అయింది. వాస్తవానికి తన అసలు పేరు రెజీనా మాత్రమేనని చెప్పింది. మతం విషయంలో తనకు ఎలాంటి పట్టింపులు లేవని ఆమె పేర్కొన్నారు. చర్చి, మసీద్, గుడి.. ఇలా ఎక్కడికైనా వెళ్తానని కూడా పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment