పాడేరు: విశాఖ జిల్లా పాడేరులో దారుణం చోటు చేసుకుంది. వర్మ అనే వ్యక్తి ఆదివారం ఉదయం తన భార్య జ్యోతి, అత్త సుజాతలపై కత్తులతో దాడికి తెగబడ్డాడు.
ఈ ఘటనలో జ్యోతి, సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరీ పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. వర్మ, జ్యోతిలది ప్రేమ వివాహం కావడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.
పాడేరులో దారుణం..
Published Sun, May 29 2016 7:49 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
Advertisement
Advertisement