కోర్టు ఆవరణలోనే భార్యను గొడ్డలితో నరికాడు..
తన పై కేసు పెట్టిందనే కోపంతో ఓ భర్త .. భార్యను పట్టపగలు కోర్టు ఆవరణలో గొడ్డలితో నరికాడు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన భార్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే... వివరాలు.. పోడూరు మండలం వడ్లవానిపాలెం గ్రామానికి చెందిన వాసకూరి నాగ సత్యనారాయణ రాజు(42)కు పదిహేనేళ్ల క్రితం వసుంధర(38)తో వివాహమైంది. ఈ క్రమంలో భార్యా భర్తల మధ్య వివాదాలు నెలకొనడంతో భార్య భర్తపై కేసు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాలకొల్లు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందుంచారు.
దీంతో బుధవారం కోర్టుకు రావాల్సిందిగా సమన్లు జారీ కావడంతో.. సత్యనారాయణ రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... భార్య న్యాయస్థానంలోకి ప్రవేశిస్తుండగా.. తనతో పాటు తెచ్చుకున్న గొడ్డలితో దాడి చేశాడు. దీంతో అమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనతో ఒక్కసారిగా కోర్టు ఆవరణలో భయోత్పాతం నెలకొంది. ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం సత్యనారాయణరాజు అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారిలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.