చాదర్‌ఘాట్ (హైదరాబాద్) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త భార్యపై కత్తితో దాడి చేసి గాయపరచిన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షాహీన్‌నగర్‌కు చెందిన నహిమా(21)కు ఉస్మాన్‌పూర్‌కు చెందిన వాజిద్ అలీ(25)తో 2014లో వివాహం జరిగింది. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
పండుగకు పుట్టింటికి వెళ్లిన నహీమాకు శుక్రవారం సాయంత్రం వాజిద్ అలీ ఫోన్ చేసి ఇంటికి రమ్మని కోరాడు. ఈ మేరకు ఆమె అత్తింటికి చేరుకుంది. చిన్న విషయమై ఆమెకు అత్తతో వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో ఇంటికి చేరుకున్న వాజిద్ అలీ భార్యను కత్తితో పొడిచాడు. భుజంపై నహిమాకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్తయ్య తెలిపారు.
భార్యపై కత్తితో దాడి
Published Sat, Jul 9 2016 6:01 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement
Advertisement